Swardham lenidhi niswardhamainadhi maranamu kante balamainadhi స్వార్థము లేనిది నిస్వార్థమైనది

స్వార్థము లేనిది నిస్వార్థమైనది
మరణము కంటే బలమైనది ఆ ప్రేమ ||2||
డంభము లేనిది నను ఏడాబాయనిది
లోకం వీడినా నను విడువని ఆ ప్రేమ

నా యేసుని ప్రేమ
నిత్యము నిలిచే ప్రేమా
నను విడువక ఏడబాయనిది
నా క్రీస్తుని ప్రేమ  ||2||

ఒకని తల్లి మరచినా మరువనన్న ప్రేమా
కల్వరిలో తన ప్రాణం అర్పించిన ప్రేమ "||2||
నన్ను మారువని ఆ ప్రేమ
ప్రాణం ఇచ్చిన ఆ ప్రేమ
             ||నా యేసుని ప్రేమ||

తల్లిదండ్రుల ప్రేమలో పక్షపాతముండును
సహోదరుల ప్రేమలో స్వార్థమే ఉండును ||2||
నన్ను ఏడాబాయని ప్రేమ
స్వార్థం లేని నిజ ప్రేమ  ||2||
      || నా యేసుని ప్రేమ||

పర్వతాలు తొలగిన తొలగిపోని ప్రేమ
మెట్టలు గతితప్పిన కృప వీడని ప్రేమ  ||2||
కృపలో దాచిన ప్రేమ
రెక్కలతో దాచిన ప్రేమ ||2||
       ||నా యేసుని ప్రేమ"||

Yese na pari haari priya yese naa parihari యేసే నా పరి హారి - ప్రియ యేసే నా పరిహారి

యేసే నా పరి హారి - ప్రియ యేసే నా పరిహారి
నా జీవిత కాలమెల్లా - ప్రియ ప్రభువే నా పరిహారి

1. ఎన్ని కష్టాలు కలిగినను - నన్ను కృంగించే భాదలెన్నో
ఎన్ని నష్టాలు శోభిల్లినా - ప్రియ ప్రభువే నా పరిహారి

2. నన్ను శాతాను వెంబడించినా - నన్ను శత్రువు ఎదిరించినా
పలు నిందలు నను చుట్టినా - ప్రియ ప్రభువే నాపరిహారి

3. మణిమాణ్యాలు లేకున్నా - మనో వేధనలు వేదించినా
నరులెల్లరు నను విడచినా - ప్రియ ప్రభువే నాపరిహారి

4. బహు వ్యాదులు నను సోకినా - నాకు శాంతి కరువైనా
శోధకుడు శోదించినా - ప్రియ ప్రభువే నాపరిహారి

5. దేవా నీవే నా ఆధారం - నీ ప్రేమకు సాటెవ్వరు 
నా జీవిత కాలమంతా - నిను పాడి స్తుతించెదను

Ye patidho naa jeevitham ye lantidho aa naa gatham ఏ పాటిదో నా జీవితం ఏ లాంటిదో ఆ నా గతం



Gadichina kalamantha nanu nadipina devaa గడిచిన కాలమంతా నను నడిపైన దేవా

గడిచిన కాలమంతా...........
నను నడిపైన దేవా...........
నీకంటి పాపలాగా.............
కాపాడిన నా ప్రభువా......... "2"
మరో ఏడు నాకొసగినందుకు
నీకేమి నే చెల్లింతును.........
నీ ప్రేమను పంచినందుకు....
నిన్నేమని కీర్తింతును.......... "2
                          " గడిచిన "
  (1)
ఇచ్చిన వాగ్ధానం మరువక........
నిలుపు దేవుడువు..................
శూన్యమందయిన..................
నీకలం సాధ్యపరచెదవు........... "2"
నా మేలు కోరి నీ ప్రేమతో..........
నను దండించితివి...................
చేలరేగుతున్న డంబములు.......
నిర్మూల పరిచితివి................... "2"
                             " మరో ఏడు "
  (2)
నాదు కష్ట కాలములోన............
కంట నీరు రాకుండా.................
నాదు ఇరుకు దారుల్లోన...........
నేను అలసిపోకుండా................ "2"
నా సిలువ భారం తగ్గించి..........
నీవేగా మోసితివి......................
నీ ప్రేమలో నను పోషించి...........
సత్తువ నింపితివి...................... "2"
                            " మరో ఏడు "

Uhinchalenayya vivarinchalenayya yenaleni nee premanu ఊహించలేనయ్య వివరించలేనయ్యా ఎనలేన

ఊహించలేనయ్య వివరించలేనయ్యా ఎనలేని నీ ప్రేమను
నా జీవితాంతం ఆ ప్రేమలోనే
తరియించు వరమే దొరికెను ||ఊహించ||

1. నా మనసు వేదనలో – నాకున్న శోధనలో
ఉల్లాసమే పంచెను
ఓ మధుర భావనలో – తుదిలేని లాలనలో
మధురామృతమునే నింపెను (2)
అనాథయిన నను వెదకెను
ప్రధానులలో ఉంచెను
         ||ఊహించ||

2. నీ మరణ వేదనలో – నీ సిలువ శోధనలో
నీ ప్రేమ రుజువై నిలిచెను
వెలలేని త్యాగముతో – అనురాగ బోధలతో
నా హృదయమే కరిగెను
ఇది నీ ప్రేమకే సాధ్యము
వివరించుట నాకసాధ్యము
         ||ఊహించ||

Yesayya vandhanalu neeku sathakoti stothralu యేసయ్య వందనాలు నీకు శతకోటి స్తోత్రాలు

యేసయ్య వందనాలు నీకు
శతకోటి స్తోత్రాలు      " 2 "
మంచి నాలో లేకున్నా
మాకు రక్షణ ఇచ్చావయ్య
నూతన వత్సరమిచ్చి
మమ్ము దీవించినావయ్య
ఆరాధన స్తుతి ఆరాధన
నీకేనయ్య యేసయ్య  " 2 "

నాకష్ట దినములలో నాతోడై
నిలచిన యేసయ్య నీకే స్తోత్రం
శోధన వేదనలో తోడుగా నిలిచావే " 2 "
నీవంటి దేవుడు ఇలలో లేనే లేడు
వేయి నోళ్ళతో స్తుతియించిన
తీర్చగలన నీ ఋణమును
ఆరాధన స్తుతి ఆరాధన
నీకేనయ్య యేసయ్య " 2 "

నే వెళ్లే ప్రతి మార్గమందు నీవు
నాముందుగా నిలచి నడిపించితివి
కంటికి రెప్పవలే నను కాపాడితివి " 2 "
గొప్ప భాగ్యము నాకొసగి
నీ పాత్రగ నను మలచితివే
నీదు సాక్షిగా నను నిలిపి
నీ సొత్తుగ నను చేసితివే
ఆరాధన స్తుతి ఆరాధన
నీకేనయ్య యేసయ్య" 2 " యేసయ్య

           

Na prana priyudavu na prana nadhudavu నాప్రాణ ప్రియుడవు నాప్రాణ నాదుడవు

నాప్రాణ ప్రియుడవు
నాప్రాణ నాదుడవు
నాప్రాణ దాతవు యేసయ్య
ప్రాణప్రదముగ ప్రేమించినావు
ఆరాధనా స్తుతి ఆరాధన
ఆరాధన నీకే ఆరాధన    ||2||

అందములలో ప్రదముడను
ప్రభువా నీకృపకు పాత్రుడ కాను ||2||
అయినా నన్ను ప్రేమించినావు
ప్రియముగ నాతో మాట్లాడినావు ||2||
||ఆరాధనా||

అందరిలో అల్పుడను
అందరూ ఉన్నా ఆనాదను||2||
అయినా నీకృప నాపై చూపి
ఆప్తుడవై నన్ను ఆడుకుంటివే ||2||
||ఆరాధనా||