అపవాది క్రియలను లయపరచను
దైవ పుత్రుడు భువిపై " 2 "
కన్య మరియ గర్భమున
ఇమ్మానుయేలను నామమున" 2 "
పాప శాప రోగములపై
మనకు విజయము నిచ్చుటకై " 2 "
" జన్మించెను "
దావీదు పురము నందు
నేడు రక్షణ వచ్చేనంటూ " 2 "
దూత తెల్పెను గొల్లలకు ప్రభు
వార్త జనులకు చాట మనుచూ " 2 "
కన్య మరియ గర్భమునా
ఇమ్మానుయేలను నామమునా"2"
పాప శాప రోగములపై
మనకు విజయము నిచ్చుటకై "2"
" జన్మించెను "
తూర్పు జ్ఞానులు ప్రభుని కనుగొని
హృదయమార ప్రస్తుతించగా" 2 "
మరణచ్చాయల నుండి విడుదల
పొందిరి నిజ జ్ఞానులైరి " 2 "
కన్య మరియ గర్భమునా
ఇమ్మానుయేలను నామమునా "2"
పాప శాప రోగములపై
మనకు విజయము నిచ్చుటకై " 2 "
" జన్మించెను "