Vandhanalu yesu neeke vandhanalu వందనాలు యేసు నీకే వందనాలు యేసు

వందనాలు యేసు నీకే వందనాలు యేసు
కాంటిపాపలా కాచినందుకు వందనాలు యేసు కన్నతండ్రిలా సాకినందుకు వందనాలు యేసు/2/

1.నిన్న నేడు ఎన్నడు మారని
మా మంచివాడా యేసు నీకే వందనం/2/
మంచివాడా మంచి చేయువాడా
నీ హస్తాలతో నన్ను చెక్కుకుంటివి/2/
    /వందనాలు/

2.దీనా దశలో నేను ఉన్నప్పుడు
నా నీడ నన్ను విడిచి పోయినప్పుడు/2/
చెంత చేరి నా చింత తీర్చి
నీ వింతైన ప్రేమలో ముంచెత్తితివి/2/
     /వందనాలు యేసు/

Bosi navvula chinnari yesayya peavalinchinava pasula salalo బోసి నవ్వుల చిన్నారి యేసయ్యా

బోసి నవ్వుల చిన్నారి యేసయ్యా
ప్రవళించినావా పశుల శాలలో    || 2 ||
రారాజువు నీవే  మమ్మనేలు వాడనీవే  || 2 ||
రక్షించువాడవు పరముకుచేర్చు వాడవు   || 2 ||
చింత లేదు నీవు ఉండగా  || బోసి నవ్వుల ||

వేదన లేదు దుఃఖము లేదు
దీనుల కన్నీరు తుడిచావయ్యా   || 2 ||
కన్య మరియ ఒడిలో పసిపాపల
చిరునవ్వు చల్లగా వినిపించగా   || 2 ||
దూత సైన్యమే  స్తోత్రములు చేసిరి-
యుదులరాజు వచ్చేనని చాటిరి    || 2 ||
శ్రమలన్నీ తీరేను రక్షణ దొరికేను
మా హృదయాలు పరవశించెను
                   / బోసినవ్వుల/

సర్వోన్నతుడవు సర్వశక్తిమంతుడవు
దోషము లేని ప్రేమనీదయ్యా    || 2 ||
దివిని వీడి భువికి నరావతారిగా
పరమతండ్రి తనయుడై అవతరించగా    || 2 ||
జ్ఞానులు గొల్లలు నిన్ను పూజించిరి
కానుకలర్పించి నిన్ను స్తుతించారు     || 2 ||
శ్రమలన్నీ తీరేను రక్షణ దొరికేను
మా హృదయాలు పరవశించెను/ బోసి/

Thurupu dhikkuna chukka butte dhutalu pataalu pada vacche తూరుపు దిక్కున చుక్క బుట్టేదూతలు పాటలు

Song no:
HD
    తూరుపు దిక్కున చుక్క బుట్టే
    దూతలు పాటలు పాడ వచ్చే } 2
    చలిమంట లేకుండా వెలుగే బుట్టే } 2
    చల్లని రాతిరి కబురే దెచ్చే } 2
    పుట్టినాడంట యేసు నాధుడు
    మన పాపములు దీసే పరమాత్ముడు } 2

  1. గొల్లలు జ్ఞానులు వేగిర వచ్చి
    కొలిచినారు తనకు కానుకలిచ్చి
    పశువుల పాక మనము చేరుదాము
    కాపరిని కలిసి వేడుదాము } 2
    పుట్టినాడంట యేసు నాధుడు
    మన పాపములు దీసే పరమాత్ముడు/2/

  2. చిన్నా పెద్దా తనకు తేడా లేదు
    పేదా ధనికా ఎపుడు చూడబోడు
    తానొక్కడే అందరికి రక్షకుడు
    మొదలు నుండి ఎపుడు వున్నవాడు } 2
    పుట్టినాడంట యేసు నాధుడు
    మన పాపములు దీసే పరమాత్ముడు } 2

  3. మంచి చెడ్డ ఎన్నడూ ఎంచబోడు-
    చెడ్డవాళ్లకు కూడా బహు మంచోడు
    నమ్మి నీవు యేసును ఆడిగిచూడు-
    తన ప్రేమను నీకు అందిస్తాడు } 2
    పుట్టినాడంట యేసు నాధుడు
    మన పాపములు దీసే పరమాత్ముడు } 2 || తూరుపు దిక్కున ||

Yentha peddha poratamo antha peddha vijaymo ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయమో 

ఎంత పెద్ద పోరాటమో
అంత పెద్ద విజయమో (2)
పోరాడతాను నిత్యము
విజయమనేది తథ్యము (2)
వాక్యమనే ఖడ్గమును ఎత్తి పట్టి
విశ్వాసమనే డాలుని చేత పట్టి (2)
ముందుకే దూసుకెళ్లెదన్
యెహోవాదే యుద్ధమనుచు (2)          ||ఎంత||

ప్రార్థన యుద్ధములో కనిపెట్టి
సాతాను తంత్రములు తొక్కి పెట్టి (2)
ముందుకే దూసుకెళ్లెదన్
యెహోవా నిస్సీ అనుచు (2)          ||ఎంత||

యేసు కాడిని భుజమున పెట్టి
వాగ్ధాన తలుపు విసుగక తట్టి (2)
ముందుకే దూసుకెళ్లెదన్
సిలువలో సమాప్తమైనదనుచు (2)          ||ఎంత||

Entha Pedda Poraatamo
Antha Pedda Vijayamo (2)
Poraadathaanu Nithyamu
Vijayamanedi Thathyamu (2)
Vaakyamane Khadgamunu Etthi Patti
Vishwaasamane Daaluni Chetha Patti (2)
Munduke Doosukelledan

Yehovaade Yuddhamanuchu (2)       ||Entha||
Praarthana Yuddhamulo Kanipetti
Saathaanu Thanthramulu Thokki Petti (2)
Munduke Doosukelledan

Yehovaa Nissi Anuchu (2)       ||Entha||
Yesu Kaadini Bhujamuna Petti
Vaagdhaana Thalupu Visugaka Thatti (2)
Munduke Doosukelledan
Siluvalo Samaapthamainadanuchu (2)       ||Entha||

Viluvainadhi nee krupa napai chupi kachavu gatha kalamu విలువైన నీ కృప నాపై చూపి కాచావు గత కాలము

విలువైన నీ కృప నాపై చూపి – కాచావు గత కాలము
ఎనలేని నీ కృప నాపై ఉంచి – ఇచ్చావు ఈ వత్సరం
దినములు సంవత్సరాలు గడచిపోయెను ఎన్నో
ప్రతి దినము ప్రతి క్షణము కాపాడినావు నీ దయలో
నా జీవిత కాలమంతా నను నడుపుము యేసయ్యా
నిను పాడి స్తుతియించి ఘనపరతును నేనయ్యా (2) ||విలువైన||

గడచినా కాలమంతా తోడైయున్నావు
అద్భుతాలు ఎన్నో చేసి చూపావు (2)
లెక్కించ లేని మేలులతో తృప్తి పరిచావు (2)
నీ కరుణా కటాక్షములు నాపై ఉంచావు (2) ||నా జీవిత||

సంవత్సరాలు ఎన్నో జరుగుచుండగా
నూతన కార్యాలు ఎన్నో చేశావు (2)
సంవత్సరమను నీ దయా కిరీటం ధరింప చేశావు (2)
నా దినములు పొడిగించి నీ కృపలో దాచావు
మా దినములు పొడిగించి నీ కృపలో దాచావు ||నా జీవిత||

Yese janminchera thammuda dhevudavatharinchera యేసే జన్మించెర తమ్ముడ – దేవుడవతారించెర

యేసే జన్మించెర తమ్ముడ – దేవుడవతారించెర /2/
ఓరె తమ్ముడ – ఒరె ఒరె తమ్ముడ/2/
ఓరె తమ్ముడ – ఒరె ఒరె తమ్ముడ/2/యేసే/

1. పెద్ద పెద్ద రాజులంత – నిద్దురాలు పోవంగ /2/
అర్ధరాత్రి వేళ మనకు ముద్దుగ జన్మించెనయ్య /2/యేసే/

2. బెత్లెహేము గ్రామమందు – బీదకన్య గర్భమందు /2/
నాధుడు జన్మించెనయ్య – మెలుగ మనందరికి /2/యేసే /

Naa hrudayamu vinthaga marenu నా హృదయము వింతగ మారెను

సంతోషమే సమాధానమే (3)
చెప్ప నశక్యమైన సంతోషం (2)

నా హృదయము వింతగ మారెను (3)
నాలో యేసు వచ్చినందునా (2)              ||సంతోషమే||

తెరువబడెను నా మనోనేత్రము (3)
క్రీస్తు నన్ను ముట్టినందునా (2)              ||సంతోషమే||

ఈ సంతోషము నీకు కావలెనా (3)
నేడే యేసు నొద్దకు రమ్ము (2)              ||సంతోషమే||

సత్య సమాధానం నీకు కావలెనా (3)
సత్యుడేసునొద్దకు రమ్ము (2)              ||సంతోషమే||

నిత్యజీవము నీకు కావలెనా (3)
నిత్యుడేసునొద్దకు రమ్ము (2)              ||సంతోషమే||

మొక్ష్యభాగ్యము నీకు కావలెనా (3)
మోక్ష రాజునొద్దకు రమ్ము (2)              ||సంతోషమే||

యేసు క్రీస్తును నేడే చేర్చుకో (3)
ప్రవేశించు నీ హృదయమందు (2)              ||సంతోషమే||


Santhoshame Samaadhaaname (3)
Cheppa Nashakyamaina Santhosham (2)

Naa Hrudayamu Vinthaga Maarenu (3)
Naalo Yesu Vachchinandunaa (2)          ||Santhoshame||

Theruvabadenu Naa Manonethramu (3)
Kreesthu Nannu Muttinandunaa (2)          ||Santhoshame||

Ee Santhoshamu Neeku Kaavalenaa (3)
Nede Yesu Noddaku Rammu (2)          ||Santhoshame||

Sathya Samaadhanam Neeku Kaavalenaa (3)
Sathyudesunoddaku Rammu (2)          ||Santhoshame||

Nithyajeevamu Neeku Kaavalenaa (3)
Nithyudesunoddaku Rammu (2)          ||Santhoshame||

Mokshyabhaagyamu Neeku Kaavalenaa (3)
Moksha Raajunoddaku Rammu (2)          ||Santhoshame||

Yesu Kreesthunu Nede Cherchuko (3)
Praveshinchu Nee Hrudayamandu (2)          ||Santhoshame||