O prabhunda nin nuthinchuchunnamu vinayamuthoda ఓ ప్రభుండా నిన్ నుతీంచుచున్నాము వినయముతోడ

Song no: #31

    ఓ ప్రభుండా నిన్ నుతీంచుచున్నాము వినయముతోడ మా ప్రభుండ వంచు నిన్ను మానక మేమొప్పుకొందు ||మో||

  1. నిత్యుఁడవౌ తండ్రి లోకము నిన్నారాధించుచు నుండు సత్యదూతల్ మోక్షమందు సర్వ ప్రధానుల్ సుభక్తిన్ నిత్య మేక కంఠముతోడ నిన్ గొనియాడుచున్నారు ||ఓ||

  2. పరిశుద్ధ, పరిశుద్ధ పరిశుద్ధ,సేనల దేవా ధరపరలోకంబులు నీ వర మహిమతో నోప్పునటంచు ||నో||

  3. కెరూబుల్ సెరూపుల్ నిన్నుఁ గీర్తించుచున్నారహహా సారెకున్ నిన్నపొస్తలుల సంఘము స్తోత్రించుచుండు కూరిమిన్ బ్రవక్తల సంఘము కొనియాడుచు నిన్ నుతియించు ||నో||

  4. మా మహా జనకా నిను మాన్యుఁడౌ పుత్రున్ బహు ప్రేమగల మా పరిశుద్ధాత్మను బ్రీతితో సంఘము భువి నొప్పుకొనున్ ||ఓ||

  5. నీవే క్రీస్తు రాజవు నిత్య కుమారుడవు నీ విలలో మానవులను గావఁగఁ బూనినయపుడు పావన కన్యా గర్భంబున బుట్టుట బహుదీనంబనక చావు శ్రమ నోడించి సజ్జనులకు దివిఁ దెరచితివే ||ఓ||

  6. నీవు దేవుని కుడి పార్శ్వంబున నిత్యము మహిమాసీనుఁడవు నీవు మా న్యాయాధిపతివై రావలయునని నమ్ముచుందుము పావనంబౌ నీ రక్తంబున సేవకులకుఁ దోడ్పడు మిపుడే ||ఓ||

  7. నిత్య మహిమములో నిఁక నీదు భక్తులతోన గత్యముగ లెక్కించుము వారలఁ గని రక్షించుమి నీ సుజనంబున్ ||ఓ|

  8. నీవు దీవించి నీ నిత్య స్వాస్థ్యంబు సుజీవమిడి వారలఁ బాలించి లేవఁగ నెత్తుము సతతము ప్రీతిన్ ||ఓ||

  9. ఓ ప్రభువా పాపములో నుండ కుండఁగఁ దోడ్పడుము మా ప్రభువా కరుణించు మముఁ గరుణించుము దయతోడన్ ||ఓ||

  10. ఓ ప్రభుండా నిన్ను నమ్మి యున్న మాకుఁ బ్రేమఁ జూపు శ్రీ ప్రభుండా నిన్నే నమ్మితి సిగ్గునొంద నీయకుము ||ఓ||

Neeve yani nammika yesu naku niveyani nammika నీవేయని నమ్మక యేసునాకు నీవేయని నమ్మిక

Song no: 145

నీవేయని నమ్మక యేసునాకు నీవేయని నమ్మిక నీవే మార్గంబు నీవే సత్యంబు నీవే జీవంబు నీవే సర్వంబు ||నీవే||

పెడదారిని బోవగ నామీదికి ఇడుమలెన్నియొరాగ అడవిలోబడి నేను ఆడలుచు నుండగ తడవకుండ దొరుకు ధన్యుమౌ మార్గంబు ||నీవే||

కారుమేఘముపట్టగ నా మనస్సులో కటిక చీకటిపుట్టగ ఘోరాపదలుచేరి దారియని భ్రమపడగ తేరిచూడగల్గు తేజోమయ మార్గంబు ||నీవే||

లేనిపోని మార్గంబు లెన్నోయుండ జ్ఞానోపదేశంబు మానుగజేయుచు వానినిఖండించి నేనే మార్గంబన్న నిజమైన మార్గంబు ||నీవే||

నరలోకమునుండి పరలోకంబు వరకు నిచ్చెనగా నుండి నరులకు ముందుగా నడుచుచు ముక్తికి సరిగా కొనిపోవు సు స్థిరమైన మార్గంబు ||నీవే||

Neevu na dhevumdavai yu nnavu yesu nadha నీవు నా దేవుండవై యు న్నావు యేసు నాధ

Song no: #71

    నీవు నా దేవుండవై యు న్నావు యేసు నాధ నీవిలఁ బ్రోవవే నన్నుఁ గావవే ||నీవు||

  1. పాప మానవ శాప భారము నోపి సిల్వను బడిన క్షేమా ధిపతి సర్వ భూపతి ||నీవు||
  2. శ్రేయమౌ కా యంబు భక్తుల కీయ సిద్ధముఁ జేయు యేసు నాయకా మోక్ష దాయకా ||నీవు||
  3. జీవ మారెడి త్రోవ నేఁబడి చావనై యున్నాను పతిత పావనా యాత్మ జీవనా ||నీవు||
  4. జాగుసేయక బాగుసేయను రాఁగదె నే ఘోర పాప రోగిని దఃఖ భాగిని ||నీవు||
  5. పాపమున నా రూపు మాపితి ప్రాపు నీవని నమ్మితిని నను లేపనా కృపను జూపవా ||నీవు||

Yevaru kreesthu vaipu nunnaru yeva resuni varu ఎవరు క్రీస్తు వైపు నున్నారు ఎవ రేసుని వారు

Song no: 459

ఎవరు క్రీస్తు వైపు నున్నారు ఎవ రేసుని వారు రాజౌ దివ్య యేసు ప్రభుని కొరకై యెవరు సేవ చేయుచు నుందు ||రెవరు||

నాశనం బగు నాత్మల కెల్ల నాశ్రయ రక్షకుఁడౌ క్రీస్తు యేసును దెల్ప లోకమును విసర్జించి సేవఁజేయ ||నెవరు||

లయము గాని యేసు శక్తియే జయము పొందును ఆయన ప్రియమౌ సైన్యమందుఁ జేగి సయితాను నెదిరించి గెలువ ||నెవరు||

మరణమందు గూడ మాకుఁ గరుణఁ జూపిన యేసు నీ కొ మరులమై మేమందఱము నీ దరికిఁ జేరి యున్నాము ||ఎవరు||

Deva dhasa palaka raja rave jeevamula pradhathavai దేవ దాసపాలక రాజా రావే జీవముల ప్రదాతవై

Song no: 396

దేవ దాసపాలక రాజా రావే జీవముల ప్రదాతవై ప్రకాశ మొందఁగా దేవా దేవా దీన పోషకా ||దేవ||

లోకబాధ యిరుకు శోధన నుండి స్వీకరించినావు త్ర్యేకదేవుఁడా స్తోత్రం స్తోత్రం స్తోత్ర మర్పణ ||దేవ||

దిక్కు లేని పాపికొరకు నీ దేహం మిక్కుటంపు బాధ కొప్పితివి యక్కటా జయం జయం జయము నొందఁగా ||దేవ||

కఠిను లంత కుటిలముజేసి నిన్నుఁ గట్టి కొట్టి నెట్టి నీకుఁ గొయ్య నెత్తిరా యిదే నా యెడఁ బ్రేమఁ జూపితి ||దేవ||

ఇంత యోర్పు యింత శాంతమా నాకై పంతముతోఁ బాపికొరకుఁ బ్రాణ మియ్యఁగా పాపిన్ నీదగు దాపుఁ జేర్చవే ||దేవ||

కలువరి గిరి వరంబున నాకై తులువను నా కొరకు నిలను సిల్వమోయఁగా హలెలూయా హలెలూయ హలెలూయ ఆమేన్ ||దేవ||

Nee dhanamu ni ghanamu prabhu yesudhey నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే

Song no: 578

నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమ భాగము నీయ వెనుదీతువా||

ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోక నాధుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా||

పాడిపంటలు ప్రభువు నీకీయగా కూడు గుడ్డలు నీకు దయచేయగా వేడంగా ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయ మో క్రైస్తవా ||

వెలుగు నీడలు గాలి వర్షంబులు కలిగించె ప్రభు నీకు ఉచితంబుగా! వెలిగించ ధరపైని ప్రభు కలిమికొలది ప్రభున కర్పింపవా ||

కలిగించె సకలంబు సమృద్ధిగా తొలగించె పలుబాధ భరితంబులు బలియాయె నీ పాపముల కేసువే చెలువంగ ప్రభుకీయ చింతింతువా ||

Na yanna ragadhe o yesu thandri na yanna ragadhe నా యన్న రాఁగదే ఓ యేసు తండ్రి నా యన్న రాఁగదే

Song no: 179

నా యన్న రాఁగదే ఓ యేసు తండ్రి నా యన్న రాఁగదే నా ప్రాణ ధనమా నా పట్టుకొమ్మా నా ముద్దు మూట నా ముక్తిబాట నా యన్న రాఁగదే నా యన్న సిలువలో నీ వాయాసపడిన నాఁటి నీ యంఘ్రియుగమునిపుడు నా యాసఁదీరఁజూతు ||నా యన్న||

ఒక తోఁట లోపట నాఁడు పడిన సకల శ్రమ లిచ్చోట నికటమై యున్నట్లుగా నిట్టూర్పులతోఁ దలంతు నకట నా రాతి గుండె శకలంబై పోవునట్లుగా ||నా యన్న||

పరమాశ్చర్యము గాదా యీలాటి ప్రేమ ధరణిలో నున్నదా చురుకౌ ముల్లుల పోట్లకు నీ శిరము నా వంటి నీచపు పురుగు కొరకం దిచ్చెడు నీ కరుణన్ దర్శింతు నేఁడు ||నా యన్న||

ఇచ్చక మిది గాదు మిగులఁ దలపోయ ముచ్చట దీరదు అచ్చి వచ్చిన నా యవతారుఁడ నీ ప్రక్క గ్రుచ్చు గాయము లోపల నేఁ జొచ్చి నీ ప్రేమఁ జూతు ||నా యన్న||

తల వంచి సిగ్గున నేఁ జేయు నేర ముల నెంతు నాలోనఁ బలు మారు నీ గాయములఁ గెలికి నిన్ శ్రమపరచు నా ఖల దోషములకై యిపుడు పిలిపించి వేఁడుకొందు ||నా యన్న||