Yerimgi yerigi chedi pothivi manasa ieka ఎఱింగి యెఱిఁగి చెడిపోతివి మనసా యిఁక

Song no: 319

ఎఱింగి యెఱిఁగి చెడిపోతివి మనసా యిఁక నీ దిక్కెవ్వరు చెపుమా దురితం బిది స చ్ఛరితం బిది యని యెరుక సరకు గొన కేమియు నీ ||యెఱిఁగి||

ఇది దేవుని దయ యిది క్రీస్తుని ప్రియ మిది విమలాత్ముని గుణ మనుచు ఎదలో ననుభవ మెఱింగి మరల దు ర్మదమున దుష్కృత పదమున బడితివి ||యెఱిఁగి||

సకలముఁ జూచెడు దేవుని కంటికిఁ జాటుగ జరిగెడి పని యేది ఇఁక జెవి గుసగుస లెల్లను దిక్కులఁ బ్రకటముఁ జేసెడు ప్రభు వున్నాఁడని ||యెఱిఁగి||

ఎన్నిమార్లు సిలువను వేయుచుఁ ప్రభు యేసుని వెతబడఁ జేసెదవు తిన్నని మార్గము తెలిసియుండి నీ కన్నుల గంతలు గట్టితి వయ్యో ||యెఱిఁగి||

గద్దించెడు మనస్సాక్షికి గడ లాడక పోతివి నీవు హద్దుమీరి దై వాజ్ఞలు ద్రోయుచు నెద్దు లాగు పరు గెత్తితి వయ్యో ||యెఱిఁగి||

పలువిధ శోధన బాధలలో ఘన ప్రభు క్రీస్తుడై నీ దిక్కునుకో తాళుచు బశ్చాత్తాపముపడి యిక జాలించుము కలు షపు యత్నంబు ||యెఱిఁగి||

అపరిమిత దయా శాంతులు గల ప్రభు వనిశము కోపింపఁడు నీపై కృపా వాగ్దద్తము లెపుడు దలఁచి నీ యపవిత్రతఁ గని హా యని యేడ్వుము ||యెఱిఁగి||

Devudicchina Divya vakya mi dhenu దేవుఁ డిచ్చిన దివ్యవాక్య మి దేను

Song no: 252

దేవుఁ డిచ్చిన దివ్యవాక్య మి దేను మన కో యన్నలారా భావ శుద్ధిని జేయు ఘన శుభ వర్తమానము దీని పేరు ||దేవుఁ డిచ్చిన||

భయముతో భక్తితోఁ జదివినఁ ప్రాపు క్రీస్తుఁ డటంచుఁ దెల్పును దయా మయుఁడగు దేవుఁడే మన తండ్రి యని బోధించు నెల్లెడ ||దేవుఁ డిచ్చిన||

సత్యశాంతము లంకురించును సత్క్రియా ఫలములును బొడమును నిత్యజీవము గలుగు దానన్ నిస్సందేహముగ నుండును ||దేవుఁ డిచ్చిన||

ఈ సుమంగళ దివ్యవాక్యము నిప్పుడే మీ రనుసరించుఁడు దోసములు నెడబాసి మోక్షపుఁ ద్రోవఁ గోరిన వారలెల్లరు ||దేవుఁ డిచ్చిన||

పాపములలో నుండి విడుదలఁ పరమ సుఖ మని దలఁతు రేనియుఁ తాప మార్పును లేచి రండి త్వరగఁ క్రీస్తుని శరణు బొందను ||దేవుఁ డిచ్చిన||

దురిత ఋణములు దీర్చు మధ్య స్థుండు గావలె నన్న వారలు త్వరగ రండీ త్వరగ రండీ వరదుడౌ క్రీస్తు కడ కిపుడె ||దేవుఁ డిచ్చిన||

మరణమునకై భయము నొందెడి మానసము గల వార లెల్లరు పరమ శాంతి యొసంగు క్రీస్తుని పజ్జ డాయఁగ రండి వేగము ||దేవుఁ డిచ్చిన||

నిర్మలాంతఃకరణ సౌఖ్యము నిజముగా నిలవెదకువారు ధర్మచిత్తుండైన క్రీస్తుని దరికి రండి రండి వేగము ||దేవుఁ డిచ్చిన||

మోక్ష రాజ్యముఁ జేరఁ గోరెడు బుద్ధి గలిగిన వార లెల్లరు రక్ష కుండగు యేసు నొద్దకు రండి రండి విశ్వసించుచు ||దేవుఁ డిచ్చిన||

Manasanandhamu bondhuta kannanu mari ye మనసానందముఁ బొందుట కన్నను మరి యే

Song no: 489

 మనసానందముఁ బొందుట కన్నను మరి యే భాగ్యము గల దన్న అనుమానము లిఁక సఖిల సుఖంబులు దిన మొక గడికొక తీరై యుండును ||మన||

దిటముగఁ ప్రార్థన యను ఖడ్గముఁ గని తిరుగు పిశాచము వెఱ చన్న పటుదీప్తులు గల ప్రభు శాస్త్రోక్తులు బహు సంశయ పం కము నింకించును ||మన||

సాధు జనోత్తమ క్రైస్తవ సంగతి సమకూడిన మేలౌ నన్న శోధన లన్నిటి స్థిరముగ నోర్చెడి శుభమతి కన్నను సుఖమే మున్నది ||మన||

తనువున దానను వానికి దురితము దగిలెడు విధిఁ గనవలె నన్న యొనర గ క్రీస్తుని వధ్యాస్తంభముఁ గని విశ్వాసముఁ గట్టిగఁ బెంచిన ||మన||

క్షమయును స్నేహము ప్రభుకడ నేర్చిన శత్రువు లిఁక భువి లేరన్న సమదృష్టి జగ జ్జనుల గనుంగొను సత్క్రైస్తవులకు సాధన మనఁ దగు ||మన||

పరమదయానిధి క్రీస్తుని బలమునఁ బాప భరంబులు విడు నన్న పరిశుద్ధాత్ముని బంధుత్వంబున అరమర చీఁకటు లన్నియుఁ దొలఁ గును ||మన||

Paapula Yedala Kreesthuni priya mettidho పాపులయెడ క్రీ స్తుని ప్రియ మెట్టిదో


Song no: 187 

పాపులయెడ క్రీ స్తుని ప్రియ మెట్టిదో పరికింపరె ల్వరిగిరిపై నాపదలను దన కీగతిఁ బెట్టెడు కాపురుషుల దెసఁ గనుగొను కృపతో ||బాపుల||
యెరుషలేము న్యలు కొందరు తన యెదుట వచ్చి యేడ్చుచు సిలువన్ వరుస నప్పురికి వచ్చు నాశన గతు లెరుఁగఁ బలికి వా రల నోదార్చెను ||బాపుల||
శత్రువు లటు తనుఁ జంపుచు నుండఁగ మైత్రిఁ జూపె సమ్మతి తోడన్ స్తోత్రముఁ జేసెను దండ్రీ వీరల దురిత మెల్ల క్షమి యింపవె యనుచును ||బాపుల||
తన ప్రక్కను సిలు వను వేసిన యొక తస్కరుఁ డించుక వేఁడు కొనన్ కనికరము మన మునఁ బెనగొన ని చ్చెను మోక్షము తన తో యుండుటగున్ ||బాపుల||
మితిలేని దురిత జీవుల లోపల మించి యున్న పతితుల కైనన్ హితముగ మోక్షం బిచ్చుటకై శో ణిత మిచ్చెను నా మతి కది సాక్షిగఁ ||బాపుల||

Sakalendriyamulaaraa chala mee pani dhire సకలేంద్రియములారా చాల మీ పని దీరె


Song no: 485 

సకలేంద్రియములారాచాల మీ పనిదీరె నిఁక నన్ను విడిచిపోవు టకు వేళయ్యెన్ చకిత మృగ శాబకము పోలిక నకట మీచేఁ జిక్కి తిని మీ రి దొలంగుఁడు యేసు నా క్షకుఁడు వచ్చెను నన్ను గావను ||సకలేంద్రియములారా||
పంచేంద్రియములారా బల ముడిగె మీ కిపుడు వంచన సేయ మీ వశముగా దిఁకను మించి మీ రెదిరింపలేరు లఁచి చూడుఁడు దేవ కృపలో నుంచి ననుఁ గదలింప మీకది కొంచెమగు పని కాదు నుండి ||సకలేంద్రియములారా||
శ్రవణేంద్రియము నీదు శక్తి తగ్గుచు వచ్చె వివిధవార్తలు దవిలి విను చుంటి వెంతో చెవుడు నీకిపు డనుసరించెను చేవ తణిగెను జరిగి పొమ్మిఁక సవినయంబుగ యేసు క్రీస్తుని శబ్ద మాలించెదను సుఖ మది ||సకలేంద్రియములారా||
కనులారా మీ వెల్గు క్రమముగ క్షీణించె మును జూచు చూడ్కిలో ముసు కయ్యె నిఁకను ఘనముగల దేవుని కుమారుఁడు తన కృపాసన మిపుడు జూపను మనసులోపలి కన్ను విప్పెడి దినము లివె చనుదెంచెఁ జూడుఁడు ||సకలేంద్రియములారా||
రసనేంద్రియము నీ నీ రసకాల మిదె వచ్చె విసుకని మాటలనువెదజల్లి నావు పసఁ దరిగి ముది వైతి విపు డో రసనమా యిఁకఁ దీరె నీ పని వెసను నే నిపు డేసుకరుణా రసముఁ గ్రోలుచుఁ బ్రొద్దుఁ బుచ్చెద ||సకలేంద్రియములారా||
తను వాద్యంతము మూయఁ దగిన త్వగింద్రియమా నిను సోకునట్టి న్నియు గ్రహించితివి మునుపుగల నీ జిగిబిగియు నణం గెను గదా వ్రేలాడెఁ దిత్తులు చనుము నీ వెందైన నేనే సుని స్వరూపముఁ దాల్ప బోయెద ||సకలేంద్రియములారా||
ఘ్రాణేంద్రియమ నీవు కడు వాసనలఁ దగిలి ప్రాణానిలము చేతఁ బ్రబలితి విఁకను నాణెమైనవి విడును దుర్గం ధముల బాల్పడఁ బోదు విఁక నా త్రాణపతి యగు క్రీస్తుచేతను బ్రాణ మర్పింతును సుఖింతును ||సకలేంద్రియములారా||
కడు దవ్వు పయనంబు నడిచి వచ్చితి నింక నిడుపు లే దా త్రోవ నికటమై వచ్చెన్ నడుమ నడుమ నడ్డుపడియెడ నిడుమ లన్నియు గడిచిపోయెను జడుతు నా మృతి నదికి నా నా వికుఁడు వచ్చెను నన్నుఁ గావను ||సకలేంద్రియములారా||
వెనుకఁ దీరిన మార్గ మున కంటె ముందుండి కనుపించు నా త్రోవ కఠినమైన యుండు ఘన తరంగ ధ్వనుతో భీ కర మరణ నది పాఱు చున్నది క్షణము మాత్రమె దాని పని యా వెనుక నావలి యొడ్డు జేరెద ||సకలేంద్రియములారా||
సంపారంబునం దేమి సౌఖ్యము గలదు ఆశ మాత్రమె గాని యది చిరము గాదు యేసు క్రీస్తుఁడు తండ్రి దేవుఁడు భాసురం బగు నిర్మలాత్మయు దాసులకు దమ దివ్య మగు కృప జేసి నిత్య నివాస మిత్తురు ||సకలేంద్రియములారా||

Akari skhanamokati nee brathukulo agunu ఆఖరి క్షణమొకటి నీబ్రతుకులో ఆగును


ఆఖరి క్షణమొకటి నీబ్రతుకులో ఆగును నీకొరకు ఏదినమో
ఆఖరి శ్వాసొకటి  యాత్రలో – ఆగును ఒకక్షణము  గడియో
ఇది చెప్పలేనిదిచెప్పిరానిది (4)

1)ఒంటరిగా వచ్చావుఅందరితో బ్రతికావు
 నిన్ను కన్నవారే నీకుప్రాణదాతలన్నావు (2)
 తల్లిదండ్రులు ఇద్దరు కనినా- (నినుఆపలేరు  క్షణము(2)
.గుండెచప్పుడు ఆగకముందే తెలుసుకో నిజాన్ని
        ఆఖరిగడియే రాకముందే తెలుసుకో సత్యాన్ని(2) (ఆఖరి)

2)అన్నదమ్ములు అందరూ నీకుఅండదండలన్నావు
 తోడబుట్టినవారే నీకు – తోడునీడ అన్నావు (2)
అభిమానులే ఎందరు ఉన్నా- (నినుఆపలేరు  క్షణము(2) (గుండెచప్పుడు)

3)  కట్టుకొన్నవారితో నీవు – కలిసి విడువనన్నావు
నీవు కన్నవారే నీకుకంటిపాపలన్నావు (2)
నీవారే ఎందరు ఉన్నా- (నినుఆపలేరు  క్షణము (2) (గుండెచప్పుడు)

4)  ఆత్మవైన నీవువిడవాలి మట్టి దేహమును
ఆత్మయైన  దేవుడు – చేసాడు నీకు  పరమును (2)
చేరాలి నీవు  లోకముప్రభుయేసే దానికి మార్గము (2) (గుండెచప్పుడు)


Yesayyaa naa hrudayaabhilaasha neevenayyaa యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా


యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా
మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా (2)
పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై
నా పితరులను ఆవరించి ఆదరించిన మహనీయుడవు (2)
పూజనీయుడా నీతి సూర్యుడా
నిత్యము నా కనుల మెదలుచున్నవాడా        ||యేసయ్యా||
ఆత్మీయ పోరాటాలలో శత్రువు తంత్రాలన్నిటిలో
మెలకువ కలిగి ఎదిరించుటకు శక్తితో నింపిన షాలేము రాజా (2)
విజయశీలుడా పరిశుద్ధాత్ముడా
నిత్యము నాలోనే నిలచియున్నవాడా         ||యేసయ్యా||


Yesayyaa naa hrudayaabhilaasha neevenayyaa
messayyaa naa theeyani thalampulu neevenayyaa (2)
Pagalu megha sthambhamai raathri agni sthambhamai
naa pitharulanu aavarinchi aadarinchina mahaneeyudavu (2)
poojaneeyudaa neethi sooryudaa
nithyamu naa kanula medaluchunnavaadaa        ||yesayyaa||
Aathmeeya poraataalalo shathruvu thanthraalannitilo
melakuva kaligi edirinchutaku shakthitho nimpina shaalemu raajaa (2)
vijaysheeludaa parishuddhaathmudaa
nithyamu naalone nilachiyunnavaadaa         ||yesayyaa||