Chitti potti papanu yesayya చిట్టి పొట్టి పాపను నేను యేసయ్యా


చిట్టి పొట్టి పాపను నేను యేసయ్యా
చిన్న గొరియపిల్లను నేను యేసయ్యా (2)
1.పాపమంటే తెలియదు కాని యేసయ్యా
పాప లోకంలో నున్నానట యేసయ్యా (2) చిట్టి॥
2.జీవమంటే తెలియదు కాని యేసయ్యా
నిత్య జీవం నీవేనట యేసయ్యా (2) చిట్టి॥

Chatimchudi manushyajathi చాటించుఁడి మనుష్యజాతి


చాటించుఁడి మనుష్యజాతి కేసు నామముచాటించుఁడి యవశ్వ మేసు ఁపేమ సారముజనాదులు విశేష రక్షణసునాదము విను పర్యంతము\\ చాటుదము- చాటుదముచాటుదము -చాటుదముచాటుదము- చాటుదముఁశీ యేసు నామము \\
1. కన్నిళ్లతో వితైడువార లానందంబుతోనెన్నఁడు గోయుదు రనెడి వాగ్దతంబుతోమన్నన గోరు భక్తులారా నిండు మైఁతితోమానావ ఁపేమతో\\ చాటుదము -చాటుదముచాటుదము- చాటుదముచాటుదము -చాటుదముచక్కని మార్గము \\
2.సమపమందు నుండు నేమె చావుకాలముసదా నశించిపోవువారి కీసుభాగ్యమువిధంబుఁ జుపఁగోరి యాశతోడ నిత్యమువిన్పించుచుందము\\ చాటుదము- చాటుదముచాటుదము -చాటుదముచాటుదము -చాటుదముసత్య సువార్తను \\-

Chalunayya nee krupa naa jivithaniki చాలునయ్య నీ కృప నా జీవితానికి


చాలునయ్య నీ కృప నా జీవితానికి (2)
సాగిపోదు యేసయ్యా సాగరాలే ఎదురైనా చాలునయ్య॥
1.మేఘాలలోన మెరుపుంచినావు (2)
త్యాగాల యందె మా అనురాగాలుంచినావు (2)
సాగలేని జీవిత సమరములో (2)
వేగమే దూతనంపి బాగుగ నిలిపావు చాలునయ్య॥
2.పృథ్విలోన ముళ్ళ పొదలు మోలిపించినావు (2)
ప్రతి నరుని జీవితాన ముళ్లుంచినావు (2)
వెరుకగ ప్రభువుకే ముళ్ళ కిరీటమా (2)
లేదు మాకు నీ కృప ముళ్ళకు వేరుగా చాలునయ్య॥
3.చాలునయ్యా చాలునయ్యానీ కృప నాకు చాలునయ్యా (2)
ప్రేమామయుడివై ప్రేమించావుకరుణామయుడివై కరుణించావు (2)
తల్లిగ లాలించి తండ్రిగ ప్రేమించే (2)
ప్రేమా కరుణా నీ కృప చాలు (2)      చాలునయ్యా॥
4.జిగటగల ఊభిలో పడియుండగా
నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా (2)
హిస్సోపుతో నన్ను కడుగుము యేసయ్యాహిమము కంటెను తెల్లగ మార్చయ్యా
నీకేమి చెల్లింతు నా మంచి మేస్సీయానా జీవితమంతా అర్పింతు నీకయ్యా
ప్రేమా కరుణా నీ కృప చాలు (2)    చాలునయ్యా॥
5.బంధువులు స్నేహితులు త్రోసేసినా
తల్లిదండ్రులే నన్ను వెలివేసినా (2)
నన్ను నీవు విడువనే లేదయ్యామిన్నగ ప్రేమించి రక్షించినావయ్యా
నీకేమి చెల్లింతు నా మంచి మెస్సీయనీ సాక్షిగా నేను ఇలా జీవింతునయ్యా
ప్రేమా కరుణా నీ కృప చాలు (2)     చాలునయ్యా॥

Bangaram kante yentho srestamainadhi బంగారంకంటెఎంతోష్టమైనది


బంగారంకంటెఎంతోష్టమైనది
పరిశుద్ధమైనబైబిలుగ్రంధము
1.గ్రంధాలలోఅదిరాజగ్రంధము
వేదాలలోఅదిసత్యవేదము
నిజమైనమార్గంచూపుదీపముహల్లెలుయా.. (4)
2.నీపాపజీవితమునుమార్చివేమును
ఏపాపంచేయకుండాకాడును
నీమార్గములనువెల్లుగించునుహల్లెలుయా.. (4)

Bangaram aduga ledhu vajralnni aduga ledhu బంగారం అడుగలేదు వజ్రాల్ని అడుగలేదు


బంగారం అడుగలేదు వజ్రాల్ని అడుగలేదు
హృదయాన్ని అడిగాడయ్యా
ఆస్తులను అడుగలేదు అంతస్తులు అడుగలేదు
హృదయాన్ని అడిగాడయ్యా 2
మనుషులను చేసాడయ్యాఈ లోకాన్ని ఇచ్చాడయ్యా 2
నా యేసయ్యా.. నా యేసయ్యానా యేసయ్యా.. నా యేసయ్యా… బంగారం॥

1.పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయభూలోకం వచ్చాడయ్యామానవుని రక్షించి పరలోకమున చేర్చసిలువను మోసాడయ్యా 2
కన్నీటిని తుడిచాడయ్యాసంతోషం పంచాడయ్యా 2||     నా యేసయ్యా॥

2.రక్షణను అందించి రక్తాన్ని చిందించిమోక్షాన్ని ఇచ్చాడయ్యాధనవంతులనుగా మనలను చేయదారిద్ర్యమొందాడయ్యా 2కన్నీటిని తుడిచాడయ్యాసంతోషం పంచాడయ్యా 2||     నా యేసయ్యా॥

Devuni Prema Idigo Janulara దేవుని ప్రేమ ఇదిగో జనులార

Song no: 149

    దేవుని ప్రేమ ఇదిగో – జనులార– భావంబునం దెలియరే
    కేవలము నమ్ముకొనిన – పరలోక – జీవంబు మనకబ్బును
    పరలోక – జీవంబు మనకబ్బును } 2 || దేవుని ||

  1. సర్వలోకము మనలను – తన వాక్య – సత్యంబుతో జేసెను } 2
    సర్వోపకారుడుండే – మన మీద – జాలిపరుడై యుండెను } 2 || దేవుని ||

  2. మానవుల రక్షింపను – దేవుండు – తన కుమారుని బంపెను } 2
    మన శరీరము దాల్చెను – ఆ ప్రభువు – మన పాపమునకు దూరుడే } 2 || దేవుని ||

  3. యేసు క్రీస్తను పేరున – రక్షకుడు – వెలసి నాడిలలోపల } 2
    దోసకారి జనులతో – నెంతో సు – భాషలను బల్కినాడు } 2 || దేవుని ||

  4. పాప భారంబు తోడ – నే ప్రొద్దు – ప్రయాసముల బొందెడి } 2
    పాపులందరు నమ్మిన – విశ్రాంతి – పరిపూర్ణమిత్తు ననెను } 2 || దేవుని ||

  5. సతులైన పురుషులైనన్ – యా కర్త – సర్వ జనుల యెడలను } 2
    సత్ప్రేమగా నడిచెను – పరలోక – సద్బోధలిక జేసెను } 2 || దేవుని ||

  6. చావు నొందిన కొందరిన్ – యేసుండు – చక్కగా బ్రతికించెను } 2
    సకల వ్యాధుల రోగులు – ప్రభు నంటి – స్వస్థంబు తా మొందిరి } 2 || దేవుని ||

  7. గాలి సంద్రపు పొంగులన్ – సద్దణిపి – నీళ్లపై నడచినాడే } 2
    మేలు గల యద్భుతములు – ఈలాగు – వేల కొలదిగ జేసెను } 2 || దేవుని ||

  8. చేతుల కాళ్లలోను – రా రాజు – చేర మేకులు బొందెను } 2
    పాతకులు గొట్టినారే – పరిశుద్ధ – నీతి తా మోర్వలేకన్ } 2 || దేవుని ||

  9. ఒడలు రక్తము గారగ – దెబ్బలు – చెడుగు లందరు గొట్టిరి } 2
    వడిముళ్లు తల మీదను – బెట్టిరి – ఓర్చెనో రక్షకుండు } 2 || దేవుని ||

  10. ఇన్ని బాధలు బెట్టుచు – దను జంపు – చున్న పాప నరులను } 2
    మన్నించు మని తండ్రిని – యేసుండు – సన్నుతితో వేడెను } 2 || దేవుని ||

  11. రక్షకుడు శ్రమ బొందగా – దేశంబు – తక్షణము చీకటయ్యెన్ } 2
    రక్షకుడు మృతి నొందగ – తెర చినిగి – రాతి కొండలు పగిలెను } 2 || దేవుని ||

  12. రాతి సమాధిలోను – రక్షకుని – నీతిగల దేహంబును } 2
    పాతి పెట్టిరి భక్తులు – నమ్మిన – నాతు లందరు జూడగా } 2 || దేవుని ||

  13. మూడవ దినమందున – యేసుండు – మృతి గెల్చి లేచినాడు } 2
    నాడు నమ్మిన మనుజులు – చూచిరి – నలువది దినములందున్ } 2 || దేవుని ||

  14. పదునొకండు మారులు – వారలకు – బ్రత్యక్షు డాయె నేసు } 2
    పరలోకమున కేగెను – తన వార్త – బ్రకటించు మని పల్కెను } 2 || దేవుని ||

  15. నమ్మి బాప్తిస్మమొందు – నరులకు – రక్షణ మరి కల్గును } 2
    నమ్మ నొల్లక పోయెడు – నరులకు – నరకంబు సిద్ధమనెను } 2 || దేవుని ||




    Devuni Prema Idigo – Janulaara – Bhaavambunam Deliyare
    Kevalamu Nammukonina – Paraloka – Jeevambu Manakabbunu      ||Devuni||

    Sarvalokamu Manalanu – Thana Vaakya – Sathyambutho Jesenu
    Sarvopakaarudunde – Mana Meeda – Jaaliparudai Yundenu      ||Devuni||

    Maanavula Rakshimpanu – Devundu – Thana Kumaaruni Bampenu
    Mana Shareeramu Daalchenu – Aa Prabhuvu – Mana Paapamunaku Doorude      ||Devuni||

    Yesu Kreesthanu Peruna – Rakshakudu – Velasi Naadilalopala
    Dosakaari Janulatho – Nentho -Su Bhaashalanu Balkinaadu      ||Devuni||

    Paapa Bhaarambu Thoda – Ne Proddu – Prayaasamula Bondedi
    Paapulandaru Nammina – Vishraanthi – Paripoornamitthu Nanenu      ||Devuni||

    Sathulaina Purushulainan – Yaa Kartha – Sarva Janula Yedalanu
    Sathpremaga Nadichenu – Paraloka – Sadhbodhalika Jesenu      ||Devuni||

    Chaavu Nondina Kondarin – Yesundu – Chakkagaa Brathikinchenu
    Sakala Vyaadhula Rogulu – Prabhu Nanti – Swasthambu Thaa Mondiri      ||Devuni||

    Gaali Sandrapu Pongulan – Saddanipi – Neellapai Nadachinaade
    Melu Gala Yadbhuthamulu – Eelaagu – Vela Koladiga Jesenu      ||Devuni||

    Chethula Kaallalonu – Raa Raaju – Chera Mekulu Bondenu
    Paathakulu Gottinaare – Parishuddha – Neethi Thaa Morvalekan      ||Devuni||

    Odulu Rakthamu Gaaraga – Debbalu – Chedugu Landaru Gottiri
    Vadimullu Thala Meedanu – Bettiri – Orcheno Rakshakundu      ||Devuni||

    Inni Baadhalu Bettuchu – Danu Jampu – Chunna Paapa Narulanu
    Manninchu Mani Thandrini – Yesundu – Sannuthitho Vedenu      ||Devuni||

    Rakshakudu Shrama Bondagaa – Deshambu – Thakshanamu Cheekatayyen
    Rakshakudu Mruthi Nondaga – Thera Chinigi – Raathi Kondalu Pagilenu      ||Devuni||

    Raathi Samaadhilonu – Rakshakuni – Neethigala Dehambunu
    Paathi Pettiri Bhakthulu – Nammina – Naathu Landaru Joodagaa      ||Devuni||

    Moodava Dinamanduna – Yesundu – Mruthi Gelchi Lechinaadu
    Naadu Nammina Manujulu – Choochiri – Naluvadi Dinamulandun     ||Devuni||

    Padunokandu Maarulu – Vaaralaku – Brathyakshu Daaye Nesu
    Paralokamuna Kegenu – Thana Vaartha – Brakatinchu Mani Palkenu      ||Devuni||

    Nammi Baapthismamondu – Narulaku – Rakshana Mari Kalgunu
    Namma Nollaka Poyedu – Narulaku – Narakambu Siddhamanenu     ||Devuni||


Thipi asala mandharalu virabusina e vela తీపి ఆశల మందారాలు విరబూసిన ఈ వేళ

Song no: 175

    తీపి ఆశల మందారాలు విరబూసిన ఈ వేళ
    చిలిపి ఊసులు సింధూరాలు కలబోసిన శుభవేళ
    అనురాగంతో ఒకటవ్వాలని
    అనుకున్నవన్నీ నిజమవ్వాలని
    ఆశిస్తూ పాడుతున్నా సుస్వాగతం
    దీవిస్తూ శుభముగ మీ పరిణయం {తీపి ఆశల}

  1. ఇన్నినాళ్లుగా వేచిన సమయం ఎదురుga నిలచింది
    చిగురులు తొడిగిన కొత్త వసంతం రమ్మని పిలిచింది } 2
    కలకాలం మీరు కలసి ఉండాలని
    చిరజీవం మీపై నిలిచి ఉండాలని
    ఆశిస్తూ పాడుతున్నా సుస్వాగతం
    దీవిస్తూ శుభముగ మీ పరిణయం {తీపి ఆశల}

  2. త్రియేక దేవుని ఘన సంకల్పం ఇల నెరవేరింది
    ఇరు హృదయాల సుందర స్వప్నం నిజముగ మారింది } 2
    అరమరికలు లేక ఒకటి కావాలని
    పరలోక తండ్రికి మహిమ తేవాలని
    ఆశిస్తూ పాడుతున్నా సుస్వాగతం
    దీవిస్తూ శుభముగ మీ పరిణయం {తీపి ఆశల}