Yekkadekkado putti yekadekkado perigi ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి


చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో 
.. దేవుని సంకల్పం (ఇది) సృష్టిలో విచిత్రం /2/

ఒంటరి బ్రతుకులు విడిచెదరు
ఒకరికొరకు ఒకరు బ్రతికెదరు /2/
పెళ్లినాటినుండి తల్లిదండ్రుల వదలి 
భార్యాభర్తలు హత్తుకొనుటేమిటో /దేవుని/

గతకాల కీడంతా మరిచెదరు
మేలులతో సంతసించెదరు /2/
పెళ్లినాటినుండి ఒకరి కష్టం ఒకరు 
ఇష్టముతో పంచుకొనుటేమిటో /దేవుని/

ఫలియించి భూమిని నింపెదరు
విస్తరించి వృద్ధిపొందెదరు /2/
పెళ్ళి నాటినుండి మా కుటుంబం అంటూ 
ప్రత్యేకముగా ఎంచుకొనుటేమిటో /దేవుని/


Vinaya vidheyatha bakthi sthri ki alakaram వినయ విధేయత భక్తి స్త్రీకి అలంకారం


యోగ్యత కలిగిన భార్య భర్తకే కిరీటం 
. . సంఘానికి ప్రతిరూపంసంతోషానికి మూలం /2/

పురుషుని పక్కనుండి తీయబడిన నారి
సరియగు సహాయమై వుండాలని కోరి /2/
స్త్రీనిగ నిర్మించి పురుషునితో కలిపెను /2/
మేలు కలుగునట్లు జంటగా నిలిపెను/2/వినయ

సృష్టిని కలిగించి మనుష్యుని నిర్మించి
సంతోషించుమని సర్వమనుగ్రహించి /2/
వివాహబంధముతో కుటుంబమును కట్టెను/2/ 
ఇంటికి దీపముగా ఇల్లాలిని నిలబెట్టెను /2/వినయ


Dhaiva nirnayam e parinayam దైవ నిర్ణయం ఈ పరిణయం


యేసులో ఏకమైన ఇరువురి అనుబంధం – నిలిచియుండును ఇలలో కలకాలం 
1. అన్నిటిలో వివాహం ఘనమైనదని – పానుపు కల్మషము లేనిదని
యెహోవాయే కలిగించిన కార్యమని – మహోన్నతుని వాక్యమే తెలిపెను 
2.పురుషునిలో సగభాగం తన భార్యయని – ప్రేమించుట అతనికున్న బాధ్యతని 
విధేయత చూపించుట స్త్రీ ధర్మమని – సజీవుడైన దేవుడే తెలిపెను 

Lyrics in English
Daiva Nirnayam ee parinayam – ramaneeyam atimadhuram
Yesulo yekamaina iruvuri anubandham – Nilachiyundunu ilalo Kalakaalam
1. Annitilo vivaaham ghanamainadani – paanupu ye kalmashamu lenidani
Yehovaye kaliginchina kaaryamani – mahonnatuni vaakyame telipenu
2.Purushunilo sagabhaagam tana bhaaryayani – preminchuta atanikunna baadhyatani 
vidheyata choopinchuta stree dharmamani – sajeevudaina devude telipenu


Kanapurambulo gadu vinthaga neeru కానాపురంబులో గడు వింతగా నీరు

కానాపురంబులోఁ

Song no: 562
    కానాపురంబులోఁ గడు వింతగా నీరు జానుగా ద్రాక్షరసమును జేసి పానముగఁ బెండ్లిలో బాగుగా నిచ్చిన దీన రక్షక బెండ్లి దీవించుమీ ||కానా||

  1. రావయ్య పెండ్లికి రయముగా నో యేసు ఈవు లియ్యఁగ వచ్చు హితుని బోలి కావు మీద్వంద్వమును ఘనమైన కృపచేత భావమాలిన్యంబుఁ బాపి యిపుడు ||కానా||

  2. దయ నుంచు మయ్య యీ దంపతులమీఁద స దయుఁడవై కాపాడు తండ్రి వలెను నియమంబుగా వీరు నీ చిత్తమును జరిపి భయము లేకుండ గ బ్రతుక నిమ్ము ||కానా||

  3. ఒప్పు మీరఁగఁ జేయు నొప్పందము వీర లెప్పుడును మదిలోన నిడికొనుచును దప్పకుండఁగ దాని నిప్పుడమిలో నెపుడు గొప్పగా నెరవేర్పు గూడ నుండు ||కానా||

  4. చక్కఁగా నెగడింప సంసార భారంబు నెక్కు వగు నీ యాత్మ నిపు డొసంగి నిక్క మగు సరణిలో నెక్కువగ నడిపించి క్రక్కు నను దీవించు కరుణానిధీ ||కానా||

  5. పిల్లలను నీవొసఁగఁ బ్రియముతో నో దేవ పెల్లుగా బోధింప వెరవు జూపు మెల్ల వేళలలోన నిరుకు మార్గము నందు జల్లఁగా నడిపింప శక్తి నిమ్ము ||కానా||

Song no: 171
    కానాపురంబులోఁ గడు వింతగా నీరు
    జానుగా ద్రాక్షరసమును జేసి
    పానముగఁ బెండ్లిలో బాగుగా నిచ్చిన
    దీన రక్షక బెండ్లి దీవించుమీ ||కానా||

  1. రావయ్య పెండ్లికి రయముగా నో యేసు } 2
    ఈవు లియ్యఁగ వచ్చు హితుని బోలి } 2
    కావు మీద్వంద్వమును ఘనమైన కృపచేత
    భావమాలిన్యంబుఁ బాపి యిపుడు
    జయజయమంగళం - నిత్యశుభమంగళం } 2
    ||కానా||

  2. దయ నుంచు మయ్య యీ దంపతులమీఁద } 2
    స దయుఁడవై కాపాడు తండ్రి వలెను } 2
    నియమంబుగా వీరు నీ చిత్తమును జరిపి
    భయము లేకుండ గ బ్రతుక నిమ్ము
    జయజయమంగళం - నిత్యశుభమంగళం } 2
    ||కానా||

  3. ఒప్పు మీరఁగఁ జేయు నొప్పందము వీర } 2
    లెప్పుడును మదిలోన నిడికొనుచును } 2
    దప్పకుండఁగ దాని నిప్పుడమిలో నెపుడు
    గొప్పగా నెరవేర్పు గూడ నుండు
    జయజయమంగళం - నిత్యశుభమంగళం } 2
    ||కానా||

  4. చక్కఁగా నెగడింప సంసార భారంబు } 2
    నెక్కు వగు నీ యాత్మ నిపు డొసంగి } 2
    నిక్క మగు సరణిలో నెక్కువగ నడిపించి
    క్రక్కు నను దీవించు కరుణానిధీ
    జయజయమంగళం - నిత్యశుభమంగళం } 2
    ||కానా||

  5. పిల్లలను నీవొసఁగఁ బ్రియముతో నో దేవ } 2
    పెల్లుగా బోధింప వెరవు జూపు } 2
    మెల్ల వేళలలోన నిరుకు మార్గము నందు
    జల్లఁగా నడిపింప శక్తి నిమ్ము
    జయజయమంగళం - నిత్యశుభమంగళం } 2
    ||కానా||

Muddha banthi pusene koyilamma kusene ముద్ద బంతి పూసెనే కోయిలమ్మ కూసెనే


ఆనందం వెల్లివిరిసెనే – ( బంధం నిత్యం నిలిచెనే)(2) /2/

పెళ్లనే బంధంఅనురాగపు అనుబంధం
తీయనైన మకరందం –  ఇగిరిపోని సుమగంధం /2/
తోడుగా ఈడు జోడుగాజంటగా కనుల పంటగా /2/
పండాలి బ్రతుకు నిండాలిదాంపత్యమే వెలుగుతుండాలి /2/ముద్ద/

దేవుడే ఏర్పరచిన దివ్యమైనదీబంధం
క్రీస్తుయేసు సంఘమునకు పోల్చబడిన సంబంధం /2/ 
దేవుడే జత చేయగా సాధ్యమా వేరు చేయగా /2/ 
కలతలే లేక సాగాలి కలలన్ని నిజము కావాలి /2/ముద్ద/

Lyrics in English
Muda banti poosene – Koyilamma Koosene
Aanandam vellivirisene – (Ee bandham nityam nilichene)(2)/2/

Prellane ee bandham – Anuraagapu anubandham
Teeyanaina makarandam – igiriponi sumagandham /2/
Todugaa eedu joduga – jantaga kanula pantaga /2/
Pandaali bratuku nindaali – daampatyame velugutundaali /2/mudda/

Devude yerparachina divyamaina deebandham
Kreestu Yesu sanghamunaku polchabadina sambandham /2/
Devude jata cheyagaa – saadhyama veru cheyagaa /2/
Kalatale leka saagaali – kalalanni nijamu kaavaali /2/mudda/


Kalyaname vaibhogame kamaneeya కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం


శ్రుతిలయల సుమధుర గీతం /2/
దైవ రచిత సుందర కావ్యం /కళ్యాణమే/
1
పరమ దైవమె ప్ర్రారంభించిన పరిశుద్ధమైన కార్యం /2/
నరుని మంచికై తన చేతులతో 
ప్రభు రాసిచ్చిన పత్రం /కళ్యాణమే/
2
కీడు తొలగించి మేలుతో నింపు ఆశీర్వాదాల వర్షం
మోడుగానున్న జీవితాలు /2/  
చిగురింపజేసే వసంతం  /కళ్యాణమే/
3
దేవదూతలే తొంగిచూసేటి దృశ్యం
భావమధురిమలు పొంగజేసేటి /2/ 
కమనీయమైన చిత్రం /కళ్యాణమే/



Alpha omega aina mahimanvithudaa అల్ఫా ఒమేగా అయినా మహిమాన్వితుడా


అల్ఫా ఒమేగా అయినా మహిమాన్వితుడా
అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రర్హుడా(2)
రాత్రిలో కాంతి కిరణమా పగటిలో కృపానిలయమా
ముదిమి వరకు నన్నాదరించె సత్యవాక్యామా
నాతో స్నేహామై నా సౌక్య మై  నను నదిపించె నా ఏసయ్యా 
కనికర పూర్ణుడా నీ కృపబాహుల్యమే ఉన్నతముగా నిను ఆరాదించుటకు   
అనుక్షనమున నీ ముఖ కాంతిలో నిలిపి నూతన వసంత ములో చేర్చెను   
జీవించెద నీ కొరకే హర్షించెద నీ లోనె
తేజోమాయుడా నీదివ్య  సంకల్పమే ఆర్చర్యకమైన వెలుగు లో నడుపుటకు   
ఆశ నిరాశ ల వలయాలు తప్పించి అగ్నిజ్వాలగా ననుచేసెను   
నా స్తుతి కీర్తన నీవె స్తుతి ఆరాదన నీకె 
నిజ స్నేహితుడా నీ స్నేహ మాదుర్యమే శుభ సూచనగా నను నిలుపుటకు   
అంతు లేని ఆగాదాలు దాటింఛి అందని శిఖరాలు ఎక్కించెను   
నా చెలిమి నీ తోనే నా కలిమి నీ లోనే