Anudinam naa baram bariyinche అనుదినము నా భారం భరియుంచే యేసయ్యానీ


అనుదినము నా భారం భరియుంచే యేసయ్యానీ
మేలులతో సంతృప్తిపరచే
అ.ప: ఆశ్చర్యకరుడవయ్యా - ఐశ్వర్యము నీవయ్యా
నీలో దొరకనిది లేదుగా - ఎంత తీసుకున్నా తరగదుగా
నింపెదవు గిన్నె పొర్లునట్టుగా
నాకు కలిగినవి నీవెగా - ఏమీ పొందలేను
నీకు వేరుగా ఇచ్చెదవు నిద్రించుచుండగా
నీపై నమ్మికతో స్తుతియుంచగా - అన్ని అక్కరలు తీరిపొవుగా పూడ్చెదవు లోటు లేకుండా       

Dinamulu cheddaviga దినములు చెడ్డవిగా అజ్ఞానం విడిచెదవా


దినములు చెడ్డవిగా  అజ్ఞానం విడిచెదవా
జ్ఞానంతో బతికెదవా క్రీస్తు  సాక్షిగా నిలిచెదవా(2)
మేలుకోఓ .....సోదరా  మేలుకో ఓ.... సోదరీ(2)

అన్ని పనులకు సమయము  ఉన్నా
క్రీస్తు సేవకు సమయం లేదా(2)

ప్రయాసపడుటకు సమయం నీకున్న
ప్రార్థించుటకు సమయము లేదా(2)
ప్రశ్నించుకో సోదరా పరీక్షించుకో సోదరి

అన్ని వినుటకు సమయము  ఉన్నా
యేసు మాటకు సమయము లేదా(2)

మందితో గడిపే సమయము నీకున్నా
మందిరమునకు సమయము లేదా(2)
ప్రశ్నించుకో సోదరా పరీక్షించుకో సోదరి

adavi vrukshamulo jaldaru అడవి వృక్షములో జల్దరు వృక్షమెట్లున్నదో


అడవి వృక్షములో జల్దరు వృక్షమెట్లున్నదో
పరిశుద్దల మధ్యలో అతి శ్రేష్ఠుడైన ప్రభువి
అ.ప.పాడెదన్ నాదు ప్రియుని జీవికాలమెల్ల
అరణ్య యాత్రలో కృతజ్ఞతతో పాడెదను

నింద దూషణ ఇరుకులలో నను సుగంధముగ
మార్చెన్ నీ కృపలో నన్ను నడిపి నూతన జీవమిచ్చితివే
||పాడెదా||

నా కష్ట తరంగములలో దుఖ సాగరములో యుండగా
నీ కుడి హస్తము చాపి భయపడకని పలికితివే
||పాడెదా||

ఆనంద భరితమైన నేను నీ ప్రేమలో నుండుటకు
నీ స్వరము నాకతి మధురం
-నీ ముఖము మనోహరము ||పాడెదా||

నీ చిత్తము చేయుటకు నన్ను నీకు సమర్పించెదన్
నా పరుగును తుదముట్టించి
నీ సన్నిధిలో నుండెదన్ ||పాడెదా||

ankitham prabhu naa jeevitham అంకితం ప్రభూ నా జీవితం - నీ చరణాల సేవకే అంకితమయ్యా


అంకితం ప్రభూ నా జీవితం - నీ చరణాల సేవకే అంకితమయ్యా - 2
నీ సేవకై ఈ సమర్పణా - అంగీకరించుము నాదు రక్షకా
మోడుబారిన నా జీవితం - చిగురింపజేసావు దేవా
నిష్ఫలమైన నా జీవితం - ఫలియింపజేసావు ప్రభువా
నీ కృపలో బహుగా ఫలించుటకు-ఫలింపని వారికి
ప్రకటించుటకు - 2
అంగీకరించుము నా సమర్పణ (అంకితం)
కారు చీకటి కాఠిన్య కడలిలో - నీ కాంతినిచ్చావు దేవా
చీకటిలోనున్న నా జీవితం - చిరుదివ్వెగా చేసావు ప్రభువా
నీ సన్నిధిలో ప్రకాశించుటకు
-అంధకార ఛాయలను తొలగించుటకు-2
అంగీకరించుము నా సమర్పణ (అంకితం)

Andala tara arudinche nakai అందాలతార అరుదెంచె నాకై అంబర వీధిలో


అందాలతార అరుదెంచె నాకై అంబర వీధిలో
అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్
ఆనందసంద్ర ముప్పొంగె నాలో అమరకాంతిలో
ఆది దేవుని జూడ ఆశింప మనసు
 పయనమైతిని               ||అందాల తార||

విశ్వాసయాత్ర దూరమెంతైన విందుగా దోచెను
వింతైన శాంతి వర్షించె నాలో విజయపథమున
విశ్వాలనేలెడి దేవకుమారుని వీక్షించు దీక్షలో
విరజిమ్మె బలము ప్రవహించె ప్రేమ విశ్రాంతి నొసగుచున్
        ||అందాల తార||

యెరూషలేము రాజనగరిలో యేసును వెదకుచు
ఎరిగిన దారి తొలగిన వేళ ఎదలో కృంగితి
                        
యేసయ్యతార ఎప్పటివోలె ఎదురాయె త్రోవలో
ఎంతో యబ్బురపడుచు విస్మయ మొందుచు ఏగితి స్వామి కడకు
||అందాల తార||

ప్రభుజన్మస్ధలము పాకయేగాని పరలోక సౌధమే
బాలునిజూడ జీవితమెంత పావనమాయెను
ప్రభుపాదపూజ దీవెనకాగా ప్రసరించె పుణ్యము
బ్రతుకే మందిరమాయె అర్పణలే సిరులాయె ఫలియించె ప్రార్ధన.
     ||అందాల తార||

Andala udyana vanama అందాల ఉద్యానవనమా ఓ క్రైస్తవ సంఘమా


అందాల ఉద్యానవనమా ఓ క్రైస్తవ సంఘమా (2)
పుష్పించలేక ఫలియింపలేక (2)
మోడై మిగిలావ నీవు (2)
||అందాల||

ప్రభు ప్రేమలో బాగు చేసి శ్రేష్టము ద్రాక్షాగ నాటాడుగా (2)
కాచావు నీవు కారు ద్రాక్షాలు (2)
యోచించు ఇది న్యాయమేనా (2)
  ||అందాల||

ప్రభు యేసులో నీవు నిలచి పరిశుద్ధాత్మతో నీవు పయనించుమా (2)
పెరిగావు నీవు ఫలియింపలేక (2)
యోచించు ఇది న్యాయమేనా (2)    ||అందాల||

ఆకలిగొని నీవైపు చూడ ఆశ నిరాశాయే ప్రభు యేసుకు (2)
ఇకనైన నీవు నిజమైన ఫలముల్ (2)
ప్రభు కొరకై ఫలియింపలేవా (2)
  ||అందాల||

alpamaina vadanani ee matramu bayapadaku అల్పమైనవాడవని ఏమాత్రం భయపడకు


అల్పమైనవాడవని ఏమాత్రం భయపడకు  
నిరాశకు తావీయకు పురుగునైనా 
మ్రానులాగా మార్చగలడు-నా యేసయ్యా
ఓడిపోయుయున్న నిను చూస్తాడు యేసు
వాడి రాలుచున్న సరిచేస్తాడు కార్యం నీ ద్వారా జరిగిస్తాడు
శ్రేష్టమగు  దీవెనగా మార్చగలడు నా యేసయ్యా
పగిలిపోయుయున్న నిను చూస్తాను యేసు
చితికి బ్రతుకుతున్నా  సరిచేస్తాడు యేసు  
స్తుతులు నీ ద్వారా పలికిస్తాడు యేసు
యోగ్యమగు పాత్రనుగా మార్చగలడు నా యేసయ్యా
శ్రమతో నలిగియున్న నిను చూస్తాడు యేసు భ్రమలో బ్రతుకుతున్నా సరిచేస్తాడు  యేసు
ధరణి నీ ద్వారా వెలిగిస్తాడు  యేసు దివ్యమగు రూపముగా మార్చగలడు  నా  యేసయ్యా