Bethlehemu puramunandhu chithramayenanta బెత్లెహేము పురమునందు చిత్రమాయెనంట

బెత్లెహేము పురమునందు చిత్రమాయెనంట
కర్తయేసు బాలుడుగా జననమాయెనంట
అంధాకారమైన - ఆకస వీధులలో
ఆనందపు మహిమ చోద్యామేమిటోనంట
పరమ పురమే వదలి పావనుండు యేసు
నరజాతిని ప్రేమించి ఇలకు దిగెనంట
ఇమ్మానుయేలుగా - నెమ్మది నీయగా
కన్నె మరియ గర్బాన పుట్టెనంట చూడరండి
గొల్లలేమో వార్త విని గొర్రెలనే వదలి
మెల్లగా అందారికి చాటి చెప్పిరంట
దావీదాు పురములో - లోకరక్షకుడుగా
యేసయ్య జనియించిన సంబరమే కనరండి
సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ
ఇష్టులైన మనుష్యులకు సమాధానమంట
రెక్కలు చాచి - చక్కనైన దూతలు
మధురమైన పాటలెన్నో పాడుచుండ వినరండి

Bethlehemu nagarilo puri paka nedalo బెత్లెహేము నగరిలో పూరిపాక నీడలో

బెత్లెహేము నగరిలో –పూరిపాక నీడలో
పాప నవ్వు విరిసేను – పాపి గుండె కరిగెను
కన్నె మరియ కన్నతలిరా- ఎన్నటికి మరువలేని కల్పవల్లిరా
లాలి లాలి లాలని యేసు బాల జోలని –లోకమంతా ఊయలగా
ఊపినట్టి దేవతరా – లాలిజో జో లాలిజో (బెత్లెహేము
లేమి ఇంటవున్నవాడుగా – వెలసినావు ప్రేమ జ్యోతిగా
నీవు లేని హృదయము – ఏమి లేని సదనము (బెత్లెహేము
ఏమి సుఖము పొందుటకొ  పుట్టినావు మట్టిలో – లాలిజో
పల్లెలోని గొల్లవారలు వెల్లిరిగా ప్రభుని చూడ తెల్లవారులు
మంచి గొర్రెల కాపరి – మనకు వెలుగునిచ్చురా
మందలన్నీ  మునుపటికే – కన్నె మరియ కన్నదిరా( బెత్లెహేము)

Bethlehemulo pashula pakalo బెత్లెహేములో పశుల పాకలో

బెత్లెహేములో పశుల పాకలో
మరియు ఒడిలో దైవతనయుడు
మానవునిగా పుడమి అవతరించెను ఓ రక్షకునిగ
హల్లెలూయా - హల్లెలూయా (2)
వెలుగుకోసం వెతుకులాడుచు
పరితపించె ప్రాణికోటికి
ఒకతార కదలివచ్చును
దివ్యతేజం అనుగ్రహించెను(2)
పాపమంతయు పరిహరించును
శాపమంతయు సంహరించును
శాంతి నీకు అనుగ్రహించును
పరమునకు నిన్ను చేర్చును (2)

Bethlehemu nagarilo a pashula salalo బేత్లెహేము నగరిలో-ఆ పశుల శాలలో

బేత్లెహేము నగరిలో-ఆ పశుల శాలలో
రక్షకుడు జన్మించె ఇలలో
రాజుని దర్శించెదం-రారాజుని పొగడెదం
దీవెనలతో మనలను నింపును
Hallelujah king of kings
Hallelujah he is holy (2)
Oh...oh..Oh..Happy happy Christmas
గగనాన తారను చూచిన ఆ జ్ఞానులు
అర్పించిరి విలువైన అర్పణల్
సంతసించి గొల్లలు సన్నుతింపజేరిరి
ప్రభుని దర్శించి వెళ్ళిరి-ఈ దినమున నీవు నేను
ఈ రక్షకుని అంగీకరింతుము (ho...oh...oh)

Bethlehemulo nanta sandhadi pashuvula బెత్లేహేములోనంట సందడి పశువుల పాకలో సందడి

బెత్లేహేములోనంట  సందడి పశువుల పాకలో సందడిదూతలు వచ్చేనంట సందడి పాటలు పాడేనంటరారాజు బుట్టేనని సందడి మారాజు బుట్టేనని సందడిచేసారంట సందడే సందడి చేయబోదాము సందడే సందడిHappy happy Christmas Christmas Wish you a happy ChristmasMerry merry Christmas Christmas Wish you a merry Christmas
అర్థరాత్రి వేళలో సందడి దూతాలు వచ్చెనంట సందడి
రక్షకుడు బుట్టేనని సందడి  వార్తను  తెలిపేనంట  ‘’ రారాజు బుట్టేనని’’
గొల్లలు వచ్చిరంట సందడి మనసార మ్రొక్కిరంట సందడి
అందాల బాలుడంట సందడి అందరి అందరి దేవుడని సందడి‘’ రారాజు బుట్టేనని’’
తారను చూచుకుంటూ సందడి జ్ఞానులు వచ్చారంట సందడి
పెట్టెలు తెచ్చారంట సందడి కానుకలు ఇచ్చారంట సందడి‘’ రారాజు బుట్టేనని’
బెత్లేహేములోనంట  సందడి పశువుల పాకలో సందడిదూతలు వచ్చేనంట సందడి పాటలు పాడేనంటరారాజు బుట్టేనని సందడి మారాజు బుట్టేనని సందడి
చేసారంట సందడే సందడి చేయబోదాము సందడే సందడిHappy happy Christmas ChristmasWish you a happy ChristmasMerry merry Christmas ChristmasWish you a merry Christmas
అర్థరాత్రి వేళలో సందడి దూతాలు వచ్చెనంట సందడిరక్షకుడు బుట్టేనని సందడి  వార్తను  తెలిపేనంట  ‘’ రారాజు బుట్టేనని’’
గొల్లలు వచ్చిరంట సందడి మనసార మ్రొక్కిరంట సందడి
అందాల బాలుడంట సందడి అందరి అందరి దేవుడని సందడి‘’ రారాజు బుట్టేనని’’
తారను చూచుకుంటూ సందడి జ్ఞానులు వచ్చారంట సందడి
పెట్టెలు తెచ్చారంట సందడి కానుకలు ఇచ్చారంట సందడి‘’ రారాజు బుట్టేనని

Bethlehemu puramunandhuna kanya mariya బెత్లెహేమూ పురమునందున కన్య

బెత్లెహేమూ పురమునందున కన్య – మరియ గర్బమందున  “2”
రక్షకుడు యెసయ్యా మనుజునిగా అవతరించేను “2”
Happy happy happy happy happy Christmas happy happy happy Christmas “2”
Merry merry  merry  merry  merry Christmas  merry  merry  merry Christmas
పసిబాలుడై అవతరించేను – పశు శాలలో పవళించేను “2”
లోకాలనేలే రక్షకుడు – పరమును వీడెను భూవికరుదించేను “2”
happy happy Christmas merry  merry Christmas  “2”   ” బెత్లెహే”
దివియందున ధూతాళి  పాడెను
భూవియందున జనులు సంతసించేను “2”  
జ్ఞానులు గొల్లలు కానుకలర్పించెను “2”  
యేసుక్రీస్తు జన్మవార్త లోకానికి చాటేను “2”  
happy happy Christmas merry  merry Christmas  “2”   ” బెత్లెహే”

Bethlehem puramuna chithrambu kalige బేత్లేహేం పురమున చిత్రంబు కలిగె

బేత్లేహేం పురమున చిత్రంబు కలిగె
కర్తాది యేసు జన్మించినపుడు
అంధకారంపు పృథివి వీధులలో
మోదంపు మహిమ చోద్యంబుగానరే
1. ఉదయంపు తారల్ ముదమున బాడే
ఉదయించ యేసు ఈ పృథివిలోన
ముదమును గలిగె మరి సమాధానం
పదిలంబుతోడ పూజించ రండి            ||బేత్లేహేం||
2. పరమును విడచి నరరూపమెత్తి
అరుదెంచి యేసు పరమ వైద్యుండై
నరుల దుఃఖములన్ తొలగించివేసి
పరలోక శాంతి స్థిరపరచె ప్రభువు         ||బేత్లేహేం||
3. నీదు చిత్తమును నాదు హృదయమున
ముదమున జేయ మదినెంతో యాశ
నీదు పాలనము పరమందు వలెనె
ఈ ధరణియందు జరుగంగ జూడ       ||బేత్లేహేం||
4. దేవుని సన్నిధి దీనత నుండ
పావనయాత్మ పవిత్ర పరచున్
పావనుడేసు ప్రకాశమిచ్చి
జీవంబు నొసగి జీవించు నెదలో       ||బేత్లేహేం||
5. గతించె రాత్రి ప్రకాశించె కాంతి
వితానముగ వికసించె నెల్ల
దూతల ధ్వనితో పతి యేసు క్రీస్తు
అతి ప్రేమతోడ అరుదెంచె నోహో     ||బేత్లేహేం||