Lokarakshakududhayinchenu yesu puttenu లోకరక్షకుడుదయుంచేను – యేసు పుట్టెను శుభము శుభము

లోకరక్షకుడుదయుంచేను – యేసు పుట్టెను శుభము శుభము
ఇమ్మనుయేలు దేవుడు మనకు
తోడుగా వచ్చేను – తోడుగావచ్చేను (2)
సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ
భూమి మీద తనకిష్టులకు సమాధానము సమాధానము(4)
దైవకుమారుడు శిశువుగా పుట్టెను – రక్షింపనీల కేతెయించను
లోకపాపము తన భుజములు పై –మోయుచు వచ్చెను - మోయుచు వచ్చెను “సర్వొ”
2. రాజాదిరాజు ప్రభువుల ప్రభువు – ప్రేమ స్వరూపిగా వచ్చెను దైవ వాక్యము మనల నడుపును
మనుజురూపిగా వచ్చెను - మనుజురూపిగా వచ్చెను “సర్వొ”
3. ఆశర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడగు దేవుడు
నిత్యుండగు తండ్రి సమదాన కర్త – అధిపతిగా వచ్చెను - అధిపతిగా వచ్చెను “సర్వొ”

Lokala nele loka rakshakudu bethlehemulo లోకాల నేలే లోక రక్షకుడు – బెత్లెహెములోన మన కొరకై పుట్టాడు

లోకాల నేలే లోక రక్షకుడు – బెత్లెహెములోన మన కొరకై పుట్టాడు “2” 
Happy happy happy Christmas - merry merry merry Christmas    “2” 
మహిమను వదలి – మరియ గర్బాన
నీతి సూర్యుడు ఉదయించేను “2”
ఆశర్యకరుడు, ఆలోచనకర్త
నిత్యుడగు తండ్రి సమాధాన కర్త “2”
మహిమ ఘనత ఆయనకే చెల్లును “2”
పరమున ధూతలు – స్తోత్రము చేయగ
పవళించేను ప్రభు పసిబాలుడై
ప్రభు జన్మము పరమార్దం పాపులకిది ఓ మార్గం
ప్రభు యేసుని నమ్మినచో కలుగును నీకు మోక్షం “2”
మహిమ ఘనత ఆయనకే చెల్లును

Sandhehamela samsayamadela prabhu yesu gayamulanu సందేహమేల సంశయమదేల ప్రభు యేసు గాయములను

సందేహమేల సంశయమదేల
ప్రభు యేసు గాయములను పరికించి చూడు
గాయాలలో నీ వ్రేలు తాకించి చూడు (2)      ||సందేహమేల||

ఆ ముళ్ల మకుటము నీకై – ధరియించెనే
నీ పాప శిక్షను తానే – భరియించెనే (2)
ప్రవహించె రక్త ధార నీ కోసమే
కడు ఘోర హింసనొందె నీ కోసమే (2)      ||సందేహమేల|| 

ఎందాక యేసుని నీవు – ఎరగనందువు
ఎందాక హృదయము బయట – నిలవమందువు (2)
యేసయ్య ప్రేమ నీకు లోకువాయెనా
యేసయ్య సిలువ సువార్త చులకనాయెనా (2)      ||సందేహమేల||

ఈ లోక భోగములను – వీడజాలవా
సాతాను బంధకమందు – సంతసింతువా (2)
యేసయ్య సహనముతోనే చెలగాటమా
ఈనాడు రక్షణ దినము గ్రహియించుమా (2)      ||సందేహమేల||

లోకాన ఎవ్వరు నీకై – మరణించరు
నీ శిక్షలను భరియింప – సహియించరు (2)
నీ తల్లియైన గాని నిన్ను మరచునే
ఆ ప్రేమ మూర్తి నిన్ను మరువజాలునా (2)      ||సందేహమేల||

Yese gappa devudu mana sakthi manthudu యేసే గొప్ప దేవుడు - మన శక్తిమంతుడు

యేసే గొప్ప దేవుడు - మన శక్తిమంతుడు
యేసే ప్రేమపూర్ణుడు - యుగయుగములు స్తుతిపాత్రుడు
స్తోత్రము మహిమా-జ్ఞానము శక్తి-ఘనతా బలము - కలుగును ఆమెన్‌
1. మహా శ్రమలలో - వ్యాధి బాధలలో
సహనము చూపి స్థిరముగ నిలిచిన - యోబు వలెనే జీవించెదను
అద్వితీయుడు ఆదిసంభూతుడు దీర్ఘశాంతుడు మనప్రభు యేసే ||స్తోత్రము||
  2. ప్రార్ధన శక్తితో - ఆత్మ బలముతో
లోకమునకు ప్రభువును చాిన - దానియేలు వలె జీవింతును
మహోన్నతుడు మన రక్షకుడు ఆశ్రయదుర్గము మనప్రభు యేసే ||స్తోత్రము||
3. జీవితమంతా - ప్రభుతో నడచి
ఎంతో ఇష్టుడై సాక్ష్యము పొందిన - హనోకు వలెనే జీవించెదను
అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు నీతిసూర్యుడు మనప్రభు యేసే ||స్తోత్రము||

Anuvantha papamaina nanu antani nee vanti parishuddhatha అణువంత పాపమైన నను అంటనీ నీ వంటి పరిశుద్ధత

అణువంత పాపమైన నను అంటనీ
నీ వంటి పరిశుద్ధత నా ప్రభువా నాకియ్యవా
నాకియ్యవా నాకియ్యవా ||2||
అణువంత పాపమైన నను అంటనీ
నీ వంటి పరిశుద్ధత నా ప్రభువా నాకియ్యవా
నాకియ్యవా నాకియ్యవా ||4||
అణువంత పాపమైన నను అంటనీ
నీ వంటి పరిశుద్ధత నా ప్రభువా నాకియ్యవా
నాకియ్యవా నాకియ్యవా ||2||
చిన్నపాపమేనని మిన్నకుంటిని
కొంచెమగ్ని కాల్చెను అడవి అంతయు
చిన్నపాపమేనని మిన్నకుంటిని
కొంచెమగ్ని కాల్చెను అడవి అంతయు
పాపము పరిపక్వమాయెను
విడుదలనీయవ ఈ ఘోరపాపికి
పాపము పరిపక్వమాయెను
విడుదలనీయవ ఈ ఘోరపాపికి
అణువంత పాపమైన నను అంటనీ
నీ వంటి పరిశుద్ధత నా ప్రభువా నాకియ్యవా
నాకియ్యవా నాకియ్యవా ||2||
త్రోవ తప్పిపోతిని మార్గమెరుగక
పడిన స్థితి నుండి లేవలేకుంటిని
త్రోవ తప్పిపోతిని మార్గమెరుగక
పడిన స్థితి నుండి లేవలేకుంటిని
పాపపు ఊబిలో పడియుంటిని
నీ చేయి చాచి విమోచించవా
పాపపు ఊబిలో పడియుంటిని
నీ చేయి చాచి విమోచించవా
అణువంత పాపమైన నను అంటనీ
నీ వంటి పరిశుద్ధత నా ప్రభువా నాకియ్యవా
నాకియ్యవా నాకియ్యవా ||4||
అణువంత పాపమైన నను అంటనీ
నీ వంటి పరిశుద్ధత నా ప్రభువా నాకియ్యవా
నాకియ్యవా నాకియ్యవా ||2||

Paralokamu naa dheshamu paradesi nenila mayalokamega పరలోకము నా దేశము పరదేశి నేనిల మాయలోకమేగ

Song no: 607
పరలోకము నా దేశము
పరదేశి నేనిల మాయలోకమేగ
నేను యాత్రికుడను (2)
ఎంతో అందమైనది పరలోకము
అసమానమైనది నా దేశము (2)
ఎల్లప్పుడు విశ్వాసముతో యాత్రను సాగింతును (2)          ||పరలోకము||
దూతలు పాడుచుందురు పరమందున
దీవా రాత్రమునందు పాడుచుందురు (2)
పావనుని చూచి నేను హర్షింతును నిత్యము (2)          ||పరలోకము||
రక్షకుని చెంతకు ఎప్పుడేగెదన్
వీక్షించెద నెప్పుడు నాదు ప్రియుని (2)
కాంక్షించెద నా మదిలో ఆయన చెంతనుండ (2)          ||పరలోకము||
అద్దరికి ఎప్పుడు నేను వెళ్లెదన్
అగుపడుచున్నది గమ్యస్థానము (2)
అచ్చటనే చూచెదను పరిశుద్ధులెల్లరున్ (2)          ||పరలోకము||
నిత్యానందముండును పరమందున
నీతి సమాధానము ఉండునచ్చట (2)
పొందెదను విశ్రాంతిని శ్రమలన్నియు వీడి (2)          ||పరలోకము||
Paralokamu Naa Deshamu
Paradeshi Nenila Maayalokamega
Nenu Yaathrikudanu (2)
Entho Andamainadi Paralokamu
Asamaanamainadi Naa Deshamu (2)
Ellappudu Vishwaasamutho Yaathranu Saaginthunu (2)         ||Paralokamu||
Doothalu Paaduchunduru Paramanduna
Deevaa Raathramunandu Paaduchunduru (2)
Paavanuni Choochi Nenu Harshinthunu Nithyamu (2)         ||Paralokamu||
Rakshakuni Chenthaku Eppudegedan
Veekshincheda Neppudu Naadu Priyuni (2)
Kaankshincheda Naa Madilo Aayana Chenthanunda (2)         ||Paralokamu||
Addariki Eppudu Nenu Velledan
Agupaduchunnadi Gamyasthaanamu (2)
Achchatane Choochedanu Parishuddhulellarin (2)         ||Paralokamu||
Nithyaanandamundunu Paramanduna
Neethi Samaadhaanamu Undu Nachchata (2)
Pondedanu Vishraanthini Shramalanniyu Veedi (2)         ||Paralokamu||

Vintimayya nee swaramu kantimayya nee rupamunu వింటిమయ్యా నీ స్వరము కంటిమయ్యా నీ రూపమును

వింటిమయ్యా నీ స్వరము కంటిమయ్యా నీ రూపమును
ప్రియప్రభూ నిన్ను గాక వేరెవరిని చూడము వినము
భక్తి మర్మము గొప్పది యెంతో - శరీరుడుగా మారిన దేవా,
దూతలకు కనబడితివి లోకమందు నమ్మబడియున్న దేవా ||వింటి|| 

భయపడవలదని దూతలు తెల్పె - మహా సంతోషకరమైన వార్త,
రక్షకుడు పుట్టెనని - పరమందు మహిమ భువికి శాంతియనిరి ||వింటి|| 

నరరూపధారివి యైతివి ప్రభువా - అద్భుతములు చేసి యున్నావు,
వేరెవ్వరు చేయలేరు - అద్భుతకరుడ ఘనత కలుగును గాక ||వింటి|| 

మూగవారికి మాటలిచ్చితివి గ్రుడ్డి కుంటిని బాగు జేసితివి - మృతులను లేపితివి
పరాక్రమ శాలివి నీవే ఓ ప్రభువా ||వింటి|| 

ప్రేమించి ప్రభువా ప్రాణమిచ్చితివి - అధికారముతో తిరిగి లేచితివి మరణపు ముల్లు విరిచితివి -
సమాధి నిన్ను గెలువక పోయెను ||వింటి|| 

ఇహము నుండి పరమున కేగి - మా కొరకై నీవు రానైయున్నావు ఆనందముతో కనిపెట్టెదము -
మదియందే నిరీక్షణ కలిగి స్తుతింతుం||వింటి||