Kanu reppa pataina kanu muyaledhu prema prema కనురెప్ప పాటైన కను మూయలేదు – ప్రేమ ప్రేమ ప్రేమ

కనురెప్ప పాటైన కను మూయలేదు – ప్రేమ ప్రేమ ప్రేమ
నిరుపేద స్థితిలోను నను దాటిపోలేదు – ప్రేమ ప్రేమ ప్రేమ (2)
పగలూ రేయి పలకరిస్తుంది
పరమును విడిచి నను వరియించింది (2)
కలవరిస్తుంది ప్రేమా
ప్రాణమిచ్చిన కలువరి ప్రేమ        ||కనురెప్ప||
ప్రేమ చేతిలో నను చెక్కుకున్నది
ప్రేమ రూపుతో నన్ను మార్చియున్నది (2)
ప్రేమను మించిన దైవము లేదని
ప్రేమను కలిగి జీవించమని (2)
ఎదురు చూస్తుంది ప్రేమా
కలవరిస్తుంది క్రీస్తు ప్రేమ      ||కనురెప్ప||
ప్రేమ లోగిలికి నన్ను పిలుచుచున్నది
ప్రేమ కౌగిలిలో బంధించుచున్నది (2)
ప్రేమకు ప్రేమే తోడవుతుందని
ప్రేమకు సాటి లేనే లేదని (2)
పరవసిస్తుంది ప్రేమా
కలవరిస్తుంది  క్రీస్తు ప్రేమ         ||కనురెప్ప||

Krupa vembadi krupatho nanu preminchina na yesayya కృప వెంబడి కృపతో నను ప్రేమించిన నా యేసయ్యా

కృప వెంబడి కృపతో
నను ప్రేమించిన నా యేసయ్యా
నను ప్రేమించిన నా యేసయ్యా (2)
నను కరుణించిన నా యేసయ్యా (2)         ||కృప||
నా యెడల నీకున్న తలంపులు
బహు విస్తారముగా ఉన్నవి నీలో దేవా (2)
అవి వర్ణించలేను నా యేసయ్యా
అవి వివరింపలేను నా యేసయ్యా (2)
నా యెడల నీకున్న వాంఛలన్నియు            ||కృప||
ఎన్నో దినములు నిన్ను నే విడచితిని
ఎన్నో దినములు నిన్ను నే మరచితిని (2)
విడువని ఎడబాయని నా యేసయ్యా
మరువక ప్రేమించిన నా యేసయ్యా (2)
ఏమిచ్చి నీ ఋణము తీర్చెదనయ్యా           ||కృప||
Krupa Vembadi Krupatho
Nanu Preminchina Naa Yesayyaa
Nanu Preminchina Naa Yesayyaa (2)
Nanu Karuninchina Naa Yesayyaa (2)         ||Krupa||
Naa Yedala Neekunna Thalampulu
Bahu Visthaaramugaa Unnavi Neelo Devaa (2)
Avi Varninchalenu Naa Yesayyaa
Avi Vivarimpalenu Naa Yesayyaa (2)
Naa Yedala Neekunna Vaanchalanniyu            ||Krupa||
Enno Dinamulu Ninnu Ne Vidachithini
Enno Dinamulu Ninnu Ne Marachithini (2)
Viduvani Edabaayani Naa Yesayyaa
Maruvaka Preminchina Naa Yesayyaa (2)
Aemichchi Nee Runamu Theerchedanayyaa         ||Krupa||

Akashamulo neevu thappa inkevarunnarayya ఆకాశములో నీవు తప్ప ఇంకెవ్వరున్నారయ్యా

ఆకాశములో నీవు తప్ప
ఇంకెవ్వరున్నారయ్యా
భూలోకములో నీవుగాక
మాకెవ్వరున్నారయ్యా
నీ కృపయే మాకు ధన్యకరము }
నీ ప్రేమే మాకు జీవాహరం        }॥2॥
యేసయ్యా యేసయ్యా ॥2॥
            1॰
నా బలము నా శరీరము          }
క్షీణించియున్నను                    }
నా హృదయం నా ఆలోచనలు }॥2॥
కృంగియున్నను                       }
నీవు నాకు తోడుండగ
లోకములో ఏది నాకు
అవసరము లేదయ్యా
యేసయ్యా నీ కృప మాకు చాలునయ్యా
యేసయ్యా నీ ప్రేమా మాకు చాలునయ్యా
                                                      ॥2॥
యేసయ్యా యేసయ్యా ॥2॥
            2॰
లోకములో మరణపు ఉరులు   }
ఆవరించినను                          }
పెను తుఫాను భూకంపాలు       }॥2॥
చుట్టుకొనినను                          }
నీవు నాకు తోడుండగ
లోకములో ఏది నాకు
అవసరము లేదయ్యా
యేసయ్యా నీ కృప మాకు చాలునయ్యా
యేసయ్యా నీ ప్రేమా మాకు చాలునయ్యా
                                                      ॥2॥
యేసయ్యా యేసయ్యా ॥2॥

Thvaraga vasthadu yesayya tharunam neekika ledhayya త్వరగా వస్తాడుయేసయ్యా తరుణం నీకిక లేదయ్యా

త్వరగా వస్తాడుయేసయ్యా
తరుణం నీకిక లేదయ్యా
కృపాకాలం దాటిపోతే...
కఠిన శ్రమలే ఎదురౌను
రేపు అన్నది నీదికాదు
రక్షణ నొందుము నేడేనీవూ
రక్షనొందుము నేడేనీవూ
రక్షనొందుము నేడేనీవూ
కరుణ మూర్తియై వచ్చెన్
           మొదటి సా..రీ..
మహోగ్రుడై వచ్చున్
                 రెండవసా..రీ..
యూదాగోత్రపు సింహమై
తీర్పుచేయ దిగి వచ్చున్
రాజులూ రణధీరులు
              భూప్రజలందరూ..
భయపడి వణికెదరూ...
తాళగలవా తీర్పునూ..
        ఓర్చగలవా ఉగ్రతనూ
తాళగలవా తీర్పునూ
సృష్టిలయమై పోవునూ
         ఉగ్రతదినమందూ..
భూమి దద్దరిల్లుచూ
                స్థానముతప్పగా
అయ్యోఅయ్యో శ్రమ
                         యనుచూ
గుండె బాదుచు ఏడ్చినా
దొరకదు నీ కాశ్రయం
                 ఎందుబోయినా
‍దుఖఃమే సుమా....       
ప్రభుని నమ్ముము
                    ఈ దినమే
తొలగిపోవును ఆ ప్రళయం
త్వరగ వస్తాడు యేసయ్యా
తరుణంనీకిక లేదయ్యా..

Naa yesayya naa sthuthi yagamu naivedhyamu nai నా యేసయ్యా నా స్తుతియాగము నైవేద్యమునై

Song no: 96

    నా యేసయ్యా నా స్తుతియాగము
    నైవేద్యమునై ధూపము వోలె
    నీ సన్నిధానము చేరును నిత్యము
    చేతువు నాకు సహాయము వెనువెంటనే – వెనువెంటనే (2)

  1. ఆత్మతోను మనసుతోను
    నేను చేయు విన్నపములు (2)
    ఆలకించి తండ్రి సన్నిధిలో నాకై
    విజ్ఞాపన చేయుచున్నావా (2)
    విజ్ఞాపన చేయుచున్నావా || నా యేసయ్యా ||

  2. ప్రార్థన చేసి యాచించగానే
    నీ బాహు బలము చూపించినావు (2)
    మరణపు ముల్లును విరిచితివా నాకై
    మరణ భయము తొలగించితివా (2)
    మరణ భయము తొలగించితివా || నా యేసయ్యా ||

  3. మెలకువ కలిగి ప్రార్థన చేసిన
    శోధనలన్నియు తప్పించెదవు (2)
    నీ ప్రత్యక్షత నే చూచుటకే నాకై
    రారాజుగా దిగి వచ్చెదవు (2)
    రారాజుగా దిగి వచ్చెదవు || నా యేసయ్యా ||

Pavurama nee prema yentha madhuramu pavurama పావురమా నీ ప్రేమ ఎంత మధురము పావురమా నీ మనసు ఎంత నిర్మలము

పావురమా నీ ప్రేమ ఎంత మధురము
పావురమా నీ మనసు ఎంత నిర్మలము
జుంటి తేనె ధార కన్నా
మంచి గోధుమ పంట కన్నా (2)
ప్రేమ మధురము – నీ మనసు నిర్మలము (2)
నా యేసయ్యా నీ ప్రేమ ఎంత మధురము
నా యేసయ్యా నీ మనసు ఎంత నిర్మలము
కొండల్లోన కోనల్లోనే నిన్నే వెదికాను
ఊరు వాడా వీధుల్లోన నిన్నే అడిగాను (2)
ఎటు చూసిననూ ఎం చేసిననూ
మదిలో నిన్నే తలంచుచున్నాను (2)
ఒకసారి కనిపించి
నీ దారి చూపించవా (2) ||నా యేసయ్యా||
దవళవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రాణ ప్రియుడు
పది వేళ మంది పురుషుల్లోన పోల్చదగినవాడు (2)
నా వాడు నా ప్రియుడు
మదిలో నిన్నే తలంచుచున్నాడు (2)
ఒకసారి కనిపించి
నీ దారి చూపించవా (2) ||నా యేసయ్యా||

Yesayya ninu chudalani yesayya ninu cheralani యేసయ్య నిను చూడాలని యేసయ్య నిను చేరాలని

యేసయ్య నిను చూడాలని యేసయ్య నిను చేరాలని
యేసయ్యనీతో ఉండాలని యేసయ్య నీలా నిలవాలని
ఆశగొనియున్నది నా మనస్సు
తృష్ణగొనియున్నది నా హృదయం

ఎటు చూసిన పాపమే చీకటి కమ్మిన లోకములో
ఎటుపోయిన వేదనే పాపము నిండిన పుడమిలో
నీలా బ్రతకాలని నీతో ఉండాలని
ఆశగొనియున్నది నా మనస్సు
తృష్ణగొనియున్నది నా హృదయం

యదవాకిట శోదనే ద్వేషము నిండినా మనుషులతో
హృదిలోపట శోకమే కపటమైన మనస్సులతో
నీలా బ్రతకాలని నీతో ఉండాలని
ఆశగొనియున్నది నా మనస్సు
తృష్ణగినియున్నది నా హృదయం