Sthuthiyinchedha nee namam deva anudhinam స్తుతియించెదా నీ నామం - దేవా అనుదినం


Song no:

స్తుతియించెదా నీ నామం - దేవా అనుదినం  (2)
దయతో కాపాడినావు - కృపనే చూపించినావు  (2)
నిను నే మరువనేసు - నిను నే విడువనేసు  (2)  స్తుతి

1.పాపినై యుండగ నేను - రక్షించి దరి చేర్చినావు (2)
నిను నే మరువనేసు - నిను నే విడువనేసు       స్తుతి

2.సిలువే నాదు శరణం - నీవే నాకు మార్గం  (2)
నిను నే మరువనేసు - నిను నే విడువనేసు       స్తుతి

Sthuthi naivedhyam andhuko yesayya sthuthi yagamu ne chesedha స్తుతి నైవేధ్యం - అందుకో యేసయ్య స్తుతి యాగము


Song no:

స్తుతి నైవేధ్యం - అందుకో యేసయ్య స్తుతి యాగము నే చేసెద నిరతం (2) 
"స్తుతికి పాత్రుడవు - స్తుతికి అర్హుడవు స్తుతికి యోగ్యుడవు - స్తుతికి అర్హుడవు నా స్తుతికి నీవే కారణభూతుడవు"
1.నా ప్రార్దన-దూపము వలే చేతులెత్తెదన్ నైవేద్యముగా (2) 
అంగీకరించుము యేసయ్య- నిన్నే స్తుతింతుము యేసయ్య (2) స్తుతి నైవేధ్యం||


2.స్తోత్రము చేయుట-శ్రేయస్కరమే స్తుతులు పాడుట-మనోహరమే(2) 
కృతజ్ణతతో పూజింతుము- కృపలో నిరతము పాడెదము (2) స్తుతి నైవేధ్యం

Sthuthi simhasana seenuda yesuraja dhivyatheja స్తుతి సింహాసనాసీనుడా యేసురాజా దివ్యతేజ


Song no:

స్తుతి సింహాసనాసీనుడా యేసురాజా దివ్యతేజ
1. అద్వితీయుడవు పరిశుద్ధుడవు అతి సుందరుడవు నీవె ప్రభునీతి న్యాయములు నీ సింహాసనాధారంకృపాసత్యములు నీ సన్నిధానవర్తులు


2. బలియు అర్పణ కోరవు నీవు, బలియైతివా నా దోషముకై నా హృదయమేనీ ప్రియమగు ఆలయం స్తుతియాగమునే చేసెద నిరతం . బూరధ్వనులే నింగిలో మ్రోగగ, రాజాధిరాజా నీవే వచ్చు వేళసంసిద్తతతో వెలిగే సిద్ధితో పెండ్లి కుమారుడా నిన్నెదుర్కొందును

Sthuthiyu mahima ganatha nike yugayugamula varaku స్తుతియు మహిమ ఘనత నీకేయుగయుగముల వరకు


Song no:

స్తుతియు మహిమ ఘనత నీకేయుగయుగముల వరకుఎంతో నమ్మదగిన దేవా (2)     స్తుతియు
1.మా దేవుడవై మాకిచ్చితివిఎంతో గొప్ప శుభ దినము (2)
   మేమందరము ఉత్సాహించి సంతోషించెదము (2)
   కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని (2)     స్తుతియు

2.నీవొక్కడవే గొప్ప దేవుడవుఘనకార్యములు చేయుదువు (2)
  నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా (2)
  నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము (2)       స్తుతియు

3.నీవే మాకు పరమ ప్రభుడవైనీ చిత్తము నెరవేర్చితివి (2)
  జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా (2)
  నడిపించెదవు సమ భూమిగల ప్రదేశములో నన్ను (2)   స్తుతియు

4.భరియించితివి శ్రమలు నిందలుఓర్చితివన్ని మా కొరకు (2)
 మరణము గెల్చి ఓడించితివి సాతాను బలమున్ (2)

పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము (2)   స్తుతియు

Sthuthinchi aradhinthunu ganaparachi keerthinthunu స్తుతించీ ఆరాధింతును - ఘనపరచి కీర్తింతును


Song no:

స్తుతించీ ఆరాధింతును - ఘనపరచి కీర్తింతును 2
నాస్తుతులకు అర్హుడవు ప్రియప్రభువా వందనమూ 2
రక్షకా నీకే స్తుతులూ -యేసయ్యా నీకే మహిమ 2స్తుతించి                      

1.నిర్మించితివీ రూపించితివీ - నీ స్వరూపమున  2
నీజీవము నాకిచ్చితివే నను జీవింపజేసితివే  2
నను జీవింపజేసితీవే           రక్షకా                   

2.పాపపు ఊబి నుండి నన్ను లేవనేత్తితివే   2
నీరక్తము నాకై చిందించి విడుదలనిచ్చితివే  2

విడుదలనిచ్చితివే                రక్షకా

Seeyonu patalu santhoshamuga paduchu siyonu velludhamu సీయోను పాటలు సంతోషముగా పాడుచు సీయోను వెల్లుదము


Song no:

సీయోను పాటలు సంతోషముగా పాడుచు సీయోను వెల్లుదము లోకాన శాశ్వతానందమేమియులేదని చెప్పెను ప్రియుడేసుపొందవలె నీ లోకమునందుకొంతకాలమెన్నో శ్రమలు       సీయోను
1.ఐగుప్తును విడచినట్టి మీరుఅరణ్యవాసులే  ధరలోనిత్యనివాసము లేదిలలోననేత్రాలు కానానుపై నిల్పుడి   సీయోను
2.మారాను పోలిన చేదైన స్థలములద్వారా పోవలసియున్ననేమినీ రక్షకుండగు యేసే నడుపునుమారని తనదు మాట నమ్ము సీయోను
3.ఐగుప్తు ఆశలనన్నియు విడిచిరంగుగ యేసుని వెంబడించిపాడైన కోరహు పాపంబుమానివిధేయులై విరాజిల్లుడి      సీయోను
4.ఆనందమయ పరలోకంబు మనదిఅక్కడనుండి వచ్చునేసుసీయోను గీతము సొంపుగ కలసిపాడెదము ప్రభుయేసుకు జై   సీయోను