Song no: 217
|
||||
రాగం- బిలహరి
|
ఛాయ: గీతములు
పాడుడి |
తాళం- త్రిపుట
|
||
హలెలూయ యని పాడుఁడీ సమాధిపై వెలుఁ గేమొ పరికించుఁడీ కలఁడు యేసు సజీవుఁడయి, లే ఖనముల లవి నెరవేరెను కలిమి మోదము గులగ, దివి నుతి సలువ మహిమను వచ్చును ||హలెలూయ||
1. హలెలూయ యని పాఁడుడీ యీ జగతికిఁ కలిగె రక్షణ చూడుఁడీ శిలఁ దొలంగెను, ముద్ర విడె, కా వలి సమాజము దేవుని బలిమి కాగక పారిపోయెను గలిబి లాయెను నరకము ||హలెలూయ|| 2. హలెలూయ యని పాడుఁడీ చీఁకటిపైని వెలుఁగే జయ మొందుసుండీ యిలను మృత్యువు గూలె, బ్రతికెఁగా యల విశ్వాసము మరలను బలనిరీక్షణ మనకుఁ గలిగెను బ్రతిహృదయము బలపడెన్ ||హలెలూయ|| 3. హలెలూయ యని పాడుఁడీ దుఃఖించు నో చెలియలారా వినుఁడీ సొలయకుండఁగ మీర లటునిటు చూచుచుండుట యెవరిని ఫలము లేదిఁక బ్రతుకు యేసు ప్రభుని వెదకుట మృతులలో ||హలెలూయ|| 4. హలెలూయ యని పాడుఁడీ యేసు ప్రభుని వలననే గలిగెఁగనుఁడీ యిలయుఁ బరమును సఖ్యపడియెను గలిగె హర్షము చావుచే సిలువ చింతలు మాని, పొందుఁడి కలకలంబగు మోదము ||హలెలూయ|| 5. హలెలూయ యని పాడుఁడీ మీ భూరి చిం తలుతీరె మది నమ్ముఁడీ బలహీనపు చిన్న మందా! ప్రభుని చెంతకు మరలుము కలుగు జీవము మిమ్ము నాయన కరుణతో నడుపును సదా ||హలెలూయ|| 6. హలెలూయ యని పాడుఁడీ సంఘము సదా నిలిచి యుండును సుమండీ పలు తెరంగుల రిపుల వలనను బాధ లెన్నియుఁ గలిగినన్ దొలఁగ కేమియు నన్ని యడ్డుల గెలిచి వర్ధిల్లుచుండును ||హలెలూయ|| 7. హలెలూయ యని పాడుఁడీ దేవుని బోధ కులు సర్వరాష్ట్రంబుల నెలమి మహిమకుఁ బ్రథమ ఫలమగు యేసు రక్షణ వార్తను వెలుఁ గువలెఁ బ్రసరింపఁ జేయుదు రిలను ధృతితో నేర్పుతో ||హలెలూయ|| 8. హలెలూయ యని పాడుఁడీ భక్తులారా విలపింపవలదు సుండీ కలుగకుండుఁడి సందియంబులు గడుచు కాలము శీఘ్రమే కలుగు మీకు సమాధి మిమ్మును గౌఁగిలింప నెమ్మది ||హలెలూయ|| 9. హలెలూయ యని పాడుఁడీ గోధుమ గింజ వలె బ్రతుకుదురు మీరల ఇల ప్రభువు తన పంటఁ గూర్పను నేగుదెంచును జివరను తొలఁగఁ జేయును గురుగులను గో ధుమలనుండి నిజంబుగా ||హలెలూయ|| | ||||
Halleluya yani padudi samaadhipai vellugemu parikinchudi హలెలూయ యని పాడుఁడీ సమాధిపై వెలుఁ గేమొ పరికించుఁడీ
Maranamun jayinchi lechenu mana prabhuvu nendu మరణమున్ జయించి లేచెను మన ప్రభువు నేఁడు
Song no: 213
మరణమున్ జయించి లేచెను మన ప్రభువు నేఁడు మహిమ దేహ మొనరఁ దాల్చెను ధర సమాధి బంధములను ధన్యముగను త్రెంచి లేచి కొఱత లన్ని తీర్చి జీవ వరము లియ్య వసుధపైని ||మరణమున్||
1. మరియయును సలోమి మొదలగు మగువలు సబాతు మరు దినోదయమునఁ బ్రియ మగు గురుని దేహమునకుఁ బూయఁ బరిమళంపుఁ దైలములను సరగఁ దీసికొని సమాధి కరుగుదెంచి కనులఁజూడ ||మరణమున్||
2. నేఁడు ప్రభుసమాధి ముఖముపై నున్న రాయి నెవఁడు దీయు కరుణను మనకై చేడియ లిట్లనుచు వేగఁ జేరి యా సమాధి మూఁత వీడి యుంటఁ జూచి మిగుల విస్మయమ్ము నంది రపుడు ||మరణమున్||
3. వారు తెల్ల నిలువుటంగిఁతో గూర్చున్న పడుచు వానిఁ జూచి మిగుల భయముతోఁ జేరరాక నిలిచియున్న వారి నతడుగాంచి యమ్మ లార భయపడకు డటంచు నూరడించె నుచితముగను ||మరణమున్||
4. కొరత పైని మరణ మొందిన నజరేయుఁ డేసు కొరకు మిగుల వెదకు చుండిన తరుణులార మీ ప్రభుండు తిరిగి బ్రతికె నిక్క మిద్ది సరగపేతు రాది శిష్య సమితితోడఁ జెప్పుడనియె ||మరణమున్||
5. మానితముగ మీకిట ముందు ప్రభు వనిన యట్లు కానఁబడును గలిలైయ మందుఁ గాన వెళ్లుడంచు భాసి తానరుండు పల్క వినుచు దీన జనులు జడిసి మిగుల దిగులు నొంది వణకి రపుడు ||మరణమున్||
6. మొదట మగ్దలేనే మరియకుఁ గనఁబడె నటంచు సుదతి దెల్పె శిష్య వరులకు కొదువలేని సంతసమునఁ గోర్కె దీరఁ బ్రభునిఁ జూడఁ బదిలమైన యత్నములకుఁ బరఁగఁ జేసి చూచి రపుడు ||మరణమున్||
7. అంతఃశత్రు వైన మరణమును ప్రభువు గెల్చె సంతసించి సన్నుతింతము వంత లేల భక్తులార వాస్తవముగ మనల నిటుల నంత్య దినము నందు లేపు నమల దేహముల నొసంగు ||మరణమున్||
maraNamun jayiMchi laechenu mana prabhuvu naeAOdu mahima dhaeha
monarAO dhaalchenu Dhara samaaDhi bMDhamulanu Dhanyamuganu threMchi laechi
koRatha lanni theerchi jeeva varamu liyya vasuDhapaini ||maraNamun||
1. mariyayunu saloami modhalagu maguvalu sabaathu maru
dhinoadhayamunAO briya magu guruni dhaehamunakuAO booyAO barimaLMpuAO
dhailamulanu saragAO dheesikoni samaaDhi karugudheMchi kanulAOjooda
||maraNamun||
2. naeAOdu prabhusamaaDhi mukhamupai nunna raayi nevAOdu dheeyu karuNanu
manakai chaediya litlanuchu vaegAO jaeri yaa samaaDhi mooAOtha veedi yuMtAO
joochi migula vismayammu nMdhi rapudu ||maraNamun||
3. vaaru thella niluvutMgiAOthoa goorchunna paduchu vaaniAO joochi migula
bhayamuthoaAO jaeraraaka nilichiyunna vaari nathadugaaMchi yamma laara
bhayapadaku datMchu nooradiMche nuchithamuganu ||maraNamun||
4. koratha paini maraNa moMdhina najaraeyuAO daesu koraku migula vedhaku
chuMdina tharuNulaara mee prabhuMdu thirigi brathike nikka midhdhi saragapaethu
raadhi shiShya samithithoadAO jeppudaniye ||maraNamun||
5. maanithamuga meekita muMdhu prabhu vanina yatlu kaanAObadunu
galilaiya mMdhuAO gaana veLludMchu bhaasi thaanaruMdu palka vinuchu
dheena janulu jadisi migula dhigulu noMdhi vaNaki rapudu ||maraNamun||
6. modhata magdhalaenae mariyakuAO ganAObade natMchu sudhathi dhelpe shiShya
varulaku kodhuvalaeni sMthasamunAO goarke dheerAO brabhuniAO joodAO
badhilamaina yathnamulakuAO barAOgAO jaesi choochi rapudu ||maraNamun||
7. aMthHshathru vaina maraNamunu prabhuvu gelche sMthasiMchi sannuthiMthamu
vMtha laela bhakthulaara vaasthavamuga manala nitula nMthya dhinamu nMdhu
laepu namala dhaehamula nosMgu ||maraNamun||

Kaluvarikondalona yesu nadha ninu katinule kottinara prana nadha కలువరి కొండలోన యేసునాధా -నిన్నుకటినులే కొట్టినారా ప్రాణనాధా
Song no:
కలువరి కొండలోన యేసునాధా -నిన్నుకటినులే
కొట్టినారా ప్రాణనాధాఆహ........ఓ...........ఓ
ముఖముపై కొట్టిరా ఉమ్మేసి నెట్టిరా
అకటనా బాధచూడ ప్రాణమిచ్చిన ప్రాణనాధ
1.రంగైన అంగినివేసి - సింగారించారా
నిన్నురాజులరాజువంటూగేలిచేసిరా
అయ్యెకొరడాతో వీపునుదున్నిదయలేని
రాజులంతా-కడవంతాగాయమవ్వ-
తరలిపోతివాకలువరినాధా
2.సుకుమారమైనచేతులుసీలలుకొట్టిరా
నీదుచరణాలనోర్వ్వలేక -మేకులుకొట్టిరా
అయ్యౌభటుడొక్కబల్లెంతో -ప్రక్కబొడిచెనా
నీరుదారైకారంగా-వానికోధమినిగెనాజీవనాధ
Jayaprabhu yesune vembadinchuchu jayamuga nadachedhamu జయప్రభు యేసునె వెంబడించుచు – జయముగ నడచెదము
Song no: 462
జయప్రభు యేసునె వెంబడించుచు – జయముగ నడచెదము – యేసుతో జయముగ వెడలెదము = ప్రియుడగు యేసుని ప్రేమను చవిగొని – పయనము జేసెద మా ప్రభు వెంబడి
1. ఆదరణయు
అధికబలమును ఆత్మఖడ్గమును – అవనిలో రక్షయును = ఆదర్శంబౌ ఆయన వాక్యమే – అనిశము మనకిల మార్గము చూపగ
2. ధర
విరోధులు మమ్ము జుట్టగ – దరి జేరెద మేసున్ – ప్రభుని దరిజేరెద మేము = ధాత్రి దురాశల డుంబములన్నిటి – మైత్రిని వీడి నడచెద మేసుతో
3. మా
ప్రభు జూముము నీదు మార్గపు – మాదిరి జాడలను – నీ దగు = మాదిరి జాడలను = మా పాదములను తొట్రిలకుండగ – మా కిడు బలమును యీ క్రుపాదినమున
4. మా
కొరకై నీవు నడచిన – మార్గము జూడగను – మేము మార్గము జూడగను = మా రక్షక నీ అడుగుజాడలు – మరువక విడువక నడువగ కృపనిడు
5. ఇహపరముల
నినుగాక ప్రేమతో – ఎవరిని గొలిచెదము ? – ఎవరిని ప్రేమింప వశమె ? = విహరించెదము యేసుని వెంబడి – మహిమ రాజ్యమున యేసుని గొలువగ
Yesu swamy neeku nenu naa samastha mitthunu యేసు సామి నీకు నేను నా సమస్త మిత్తును
Song no: 455
యేసుసామి నీకు నేను నా సమస్త మిత్తును నీ సన్నిధిలో వసించి ఆశతో సేవింతును ||నా సమస్తము నా సమస్తము నా సురక్షకా నీ కిత్తు నా సమస్తము||
యేసుసామి నీకె నేను దోసి లొగ్గి మ్రొక్కెదన్ తీసివేతు లోకయాశల్ యేసు చేర్చుమిప్పుడే.
నేను నీవాడను యేసు నీవును నావాడవు నీవు నేను నేకమాయె నీ శుద్ధాత్మ సాక్ష్యము.
నీకు నన్ను యేసు ప్రభూ ఈయనేనె యేగితి నీదు ప్రేమశక్తి నింపు నీదుదీవె నియ్యవే.
యేసు నీదె నా సర్వాస్తి హా సుజ్వాలన్ బొందితి హా సురక్షణానందమా హల్లెలూయా స్తోత్రము.

Sarva chitthambbu nidhenayya swarupamicchu kummarive సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమ్మరివే
Song no: 451
సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమ్మరివే సారెపై నున్న మాంటినయ్యా సరియైన పాత్రన్ జేయుమయ్యా సర్వేశ్వరా నేరిక్తుండను సర్వదా నిన్నే సేవింతును ||సర్వ||
ప్రభూ! సిద్ధించు నీ చిత్తమే ప్రార్థించుచుంటి నీ సన్నిధి పరికింపు నన్నీదివసంబున పరిశుభ్రమైన హిమముకున్న పరిశుద్ధున్ జేసి పాలింపుమా పాపంబుబోవ నను గడుగుమా ||సర్వ||
నీ చిత్తమే సిద్ధించు ప్రభూ నిన్నే ప్రార్థింతు నా రక్షకా నీచమౌ గాయముల చేతను నిత్యంబు కృంగి అలసియుండ నిజమైన సర్వశక్తుండవే నీ చేతబట్టినన్ రక్షింపుమా ||సర్వ||
ఆత్మస్వరూప నీ చిత్తమే అనిశంబు చెల్లు ఇహపరమున అధికంబుగా నన్నీ యాత్మతో ఆవరింపుమో నా రక్షకా అందరూ నాలో క్రీస్తుని జూడ ఆత్మతో నన్ను నింపుము దేవా ||సర్వ||

Ghanudavu nivayya niku sati yevarayya prabhudavu nivayya ఘనుడవు నీవయ్య – నీకు సాటి ఎవరయ్యా
Song no:
ఘనుడవు నీవయ్య – నీకు
సాటి ఎవరయ్యా
ప్రభుడవు నీవయ్యా – సర్వ స్రుస్టికి యేసయ్యా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
1,ఎర్ర
సముద్రమును రె౦డు పాయలు చేసావు
బ౦డలో
ను౦డి జీవ
జలములు నిచ్చావు
గాలిలో ను౦డి
పూరేళ్ళూనిచ్చావు
ఆకాశములో ను౦డి
మన్నాను నిచ్చావు.
2,కానా వి౦దులో
నీరును - ద్రాక్షరసముగా మార్చావు
కుళ్ళిన లాజరును
తిరిగి జీవి౦పజేసావు
పాపిని నాకొరకై
పాప భార౦
మోసావు
నీ
హస్తములోనే నన్ను దాచుకున్నావు.
హల్లెలూయా హల్లెలూయా