Ninnega puttuka nedantha nadaka repemo నిన్నేగ పుట్టుక నేడంత నడక రెపేమో చితిక


Song no:
నిన్నేగ పుట్టుక నేడంత నడక రెపేమో చితిక మూన్నాళ్ళ బ్రతుకా
భోగాలు కావాలంటు పాదం భూమిని చుట్టేసాక
ఆగాలి ఎదో చోట కాలం మొత్తం పూర్తయ్యాక
నాదంటే నాదనుకుంటు ఏంతో కోంత పోగేసాక
నావెంట వచ్చేదేంటని చూస్తే శున్యం అంతా వెనుక

 1 మంచుకు విరిసేటి పువ్వులు మాదిరి కదా ఎండకు వాడాలని అవి సూచించటం లేదా
తేనుందని మురిసే లోగా తుమ్మెద రాదా మాయగా మకరందం పువ్వును విడచిపోదా   //2//
బంధం అనుబంధం లోకంతో సంబంధం గాలికి రాలేటి పువ్వులదా ఈ చందం
 మాయగా మనిషి నేల రాలి వెళ్లి పోతుంటే             || నిన్నేగా ||


2 పువ్వుల సువాసనే మనిషికి పాఠం కాదా  నీతిని వెదజల్లాలని నేర్పించుట లేదా
పరిమళ వాసనగా క్రీస్తు బలి కాలేదా ఆ కరుణా హృదయం నీలో ఉందా లేదా ... ఓ ఒ    //2//
మాయను నమ్మొద్దు మాయచేసి బ్రతుకొద్దు నీ ప్రశ్నకు లొంగి నిన్ను పొడుచుకోవద్దు
లోతు భార్యవలె వెనుక తిరిగి చూడొద్దు




Gali samudhrapu alalaku nenu గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు

గాలి సముద్రపు అలలకు నేను
కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు (2)
ఆదరించెనూ నీ వాక్యము
లేవనెత్తెనూ నీ హస్తము (2)      ||గాలి||

శ్రమలలో నాకు తోడుంటివి
మొర్రపెట్టగా నా మొర్ర వింటివి (2)
ఆదుకొంటివి నన్నాదుకొంటివి (2)
నీ కృపలో నను బ్రోచితివి (2)      ||గాలి||

వ్యాధులలో నీకు మొర్రపెట్టగా
ఆపదలలో నిన్ను ఆశ్రయించగా (2)
చూపితివి నీ మహిమన్‌ (2)
కొనియాడెదను ప్రభుయేసుని (2)      ||గాలి||

Nivega yesu nivega nivega kreesthu nivega నీవేగా యేసు నీవేగా నీవేగా క్రీస్తు నీవేగా


Song no:


నీవేగా యేసు నీవేగా 
నీవేగా క్రీస్తు నీవేగా || నీవేగా ||

పాపమునుండి విడిపించింది నీవేగా 
పరిశుద్దునిగా మార్చినిది నీవేగా 
(నా) ఘోరపాపము మన్నించినిది
(నా) రోతబ్రతుకును మార్చినిది || నీవేగా ||

బలహీనతలో బలపరిచింది నీవేగా 
దుఃఖములో నను ఓదార్చినిది నీవేగా 
(నా) ఓటములను ఓడించింది 
(నా) బాధలన్నియు బాపినది


Ne pade prathi pata nee kosame yesayya నే పాడే ప్రతి పాట నీ కోసమే యేసయ్య


Song no:

నే పాడే ప్రతి పాట నీ కోసమే యేసయ్య
నే పలికే ప్రతి మాట నీ వాక్యమే యేసయ్య || 2 ||

నా గానం నీవే యేసవా   నా ప్రాణం  నీవే క్రీస్తువా  || 2 ||
ప్రతిచోటా నీ పాటలే పాడనా  బ్రతుకంతా నీ ప్రేమనే చాటానా  || 2 ||


నిన్ను గూర్చి నేను పల్లవించు పాట
నిత్యము హృదయములో ఆలకించు పాట || 2 ||
నేను క్షత్రములో కుడి పాడిన పాట       || 2 ||
ఉత్సహించు పెదవులతో పాడే స్తుతి పాట   || 2 ||


నా ఊటలన్నియు నీయందేయని
వాక్యములు వ్రాయించి పడుచున్న పాట   || 2 ||
యేయ్యేండ్ల పోరాటం కృతజ్ఞత పాట      || 2 ||
నీ మంచినీ సన్నుతించు పాట      || 2 ||


జనములలో నిన్ను ఘనపరిచే పాట
సమాజంలో నిన్ను చాటించే పాట    || 2 ||
వేదన శోధనలో నీ సిలువ పాట      || 2 ||
శోకాల సంద్రములో కన్నీటి పాట   || 2 ||


Ne pade prathi pata nee kosame yesayya
Ne palike prathi mata nee vakyame yesayya    || 2 ||

Naa ganam neeve yesuvaa naa pranam neeve kreesthuvaa     || 2 ||
Prathi chota nee patale padana brathukantha nee premane chatanaa    || 2 ||

Ninnu gurchi nenu pallivinchu pata
Nithyamu maa hrudhayamlo alakinnchu pata      || 2 ||
Nenu kshathramulo kudi padina pata     || 2 ||
Uthsahinhinchu pedhavulatho pade sthuthi pata    || 2 ||

Naa utalanniyu neeyandhenani vakyamulu vrayinchi paduchunna pata   || 2 ||
Veyyedla poram kruthagnyatha pata    || 2 ||
Nee manchi  _      sannuthincchu pata   || 2 ||

Janamulalo ninnu ganapariche pata
Samajamlo ninnu chatinche pata      || 2 ||
Vedhana shodhanalo nee siluva pata     || 2 ||
Sokala sandramlo kannita pata            || 2 ||











Veeche gaalullo prathi roopam neeve వీచే గాలుల్లో ప్రతి రూపం నీవే


Song no:
వీచే గాలుల్లో ప్రతి రూపం నీవే
నీవే నా మంచి యేసయ్యా
ప్రవహించే సెలయేరై రావా నీవు
జీవ నదిలా మము తాకు యేసయ్యా
నీవే నా ప్రాణము – నీవే నా సర్వము
నీతోనే కలిసుండాలి – నీలోనే నివసించాలి
నీలోనే తరియించాలి ప్రభు (2)
నా ప్రియ యేసు నా ప్రాణ నేస్తం
నీవు లేకుంటే నేను జీవించలేను (2)        ||వీచే గాలుల్లో||

ప్రేమించే నా ప్రాణం నీవే నా నేస్తం
కడవరకు కాపాడే నీవే నా దైవం
పోషించే నా తండ్రి నీవే ఆధారం
కరుణగల నీ మనసే నాకు చాలును
నీ మాటలే మాకు ఉజ్జీవం
నీ వాక్యమే జీవ చైతన్యం (2)        ||నా ప్రియ యేసు||

ప్రతి సమయం నే పాడే నీ ప్రేమ గీతం
ప్రతి హృదయం పాడాలి స్తుతి నైవేద్యమై
నే వెళ్ళే ప్రతి చోట చాటాలి నీ ప్రేమే
నీ సిలువ సాక్షినై నీ ప్రేమను చూపాలి
మా కోసమే నీవు మరణించి
పరలోకమే మాకు ఇచ్చావు (2)        ||నా ప్రియ యేసు||




Veeche Gaalullo Prathi Roopam Neeve
Neeve Naa Manchi Yesayyaa
Pravahinche Selayerai Raavaa Neevu
Jeeva Nadilaa Mamu Thaaku Yesayaa
Neeve Naa Praanamu – Neeve Naa Sarvamu
Neethone Kalisundaaali – Neelone Nivasinchaali
Neelone Thariyinchaali Prabhu (2)
Naa Priya Yesu Naa Praana Nestham
Neevu Lekunte Nenu Jeevinchalenu (2)         ||Veeche Gaalullo||

Preminche Naa Praanam Neeve Naa Nestham
Kadavaraku Kaapade Neeve Naa Daivam
Poshinche Naa Thandri Neeve Aadhaaram
Karunagala Nee Manase Naaku Chaalunu
Nee Maatale Maaku Ujjeevam
Nee Vaakyame Jeeva Chaithanyam (2)        ||Naa Priya Yesu||

Prathi Samayam Ne Paade Nee Prema Geetham
Prathi Hrudayam Paadaali Sthuthi Naivedyamai
Ne Velle Prathi Chota Chaataali Nee Preme
Nee Siluva Saakshinai Nee Premanu Choopaali
Maa Kosame Neevu Maraninchi
Paralokame Maaku Ichchaavu (2)     ||Naa Priya Yesu||

Lekkinchaleni sthothramul devaa yellappudu లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ

Song no:
    లెక్కించలేని స్తోత్రముల్
    దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్
    దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ } 2
    ఇంత వరకు నా బ్రతుకులో } 2
    నువ్వు చేసిన మేళ్ళకై || లెక్కించలేని ||

  1. ఆకాశ మహాకాశముల్
    వాటియందున్న సర్వంబును } 2
    భూమిలో కనబడునవన్ని } 2
    ప్రభువా నిన్నే కీర్తించున్ || లెక్కించలేని ||

  2. అడవిలో నివసించువన్ని
    సుడిగాలియు మంచును } 2
    భూమిపైనున్నవన్ని } 2
    దేవా నిన్నే పొగడును || లెక్కించలేని ||

  3. నీటిలో నివసించు ప్రాణుల్
    ఈ భువిలోన జీవ రాసులు } 2
    ఆకాశామున ఎగురునవన్ని } 2
    ప్రభువా నిన్నే కీర్తించున్ || లెక్కించలేని ||


Song no:
    Lekkinchaleni Sthothramul
    Devaa Ellappudu Ne Paadedan
    Devaa Ellappudu Ne Paadedan
    Intha Varaku Naa Brathukulo
    Nuvvu Chesina Mellakai || Lekkinchaleni ||

  1. Aakaasha Mahaakaashamul
    Vaatiyandunna Sarvambunu
    Bhoomilo Kanabadunavanni
    Prabhuvaa Ninne Keerthinchun || Lekkinchaleni ||

  2. Adavilo Nivasinchuvanni
    Sudigaaliyu Manchunu
    Bhoomipainunnavanni
    Devaa Ninne Pogadunu || Lekkinchaleni ||

  3. Neetilo Nivasinchu Praanul
    Ee Bhuvilona Jeeva Raasulu
    Aakaashamuna Egurunavanni
    Prabhuvaa Ninne Keerthinchun || Lekkinchaleni ||

Popove o sathana jagrattha suma nee guttu పోపోవె ఓ సాతానా జాగ్రత్త సుమా నీగుట్టు


Song no: 115

పోపోవె ఓ సాతానా - జాగ్రత్త సుమా నీగుట్టు మాకు చిక్కెను - నిన్ను చితుకగొట్టు ఘన సూత్రాలు మాకు - మాతండ్రి నేర్పించి మము స్థిరపరచెను || పోపో ||

ఆదికాలము మొదలుకొని నేటివరకు ఆడితి బహు నేర్పుగా - అద్భుత రీతిగా ఆత్మతండ్రి నీదు - ఆయువుపట్టును అందించెనుమాకు|| పోపో ||

మట్టులేని గొయ్యేగా - నీ కష్టమెల్లా గట్టేక్కేపని లేదుగా సమయము లేదని - సన్నిధి పరులను చెదరగొట్టుట కీవు - కనిపెట్టుచున్నావు|| పోపో ||

కరుణా సముద్రుండైన - త్రిత్వదేవుని - కృప మమ్ము వెంబడించు - ఏదో ఒక సూత్రాన - రక్షించుచుండును భక్షించు నీచేతికి - చిక్కనిచ్చునా మమ్ము|| పోపో ||