Nithya prematho nannu preminchen నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్ తల్లి ప్రేమను మించినది


Song no:
నిత్య ప్రేమతో - నన్ను ప్రేమించెన్     "2"
తల్లి ప్రేమను మించినది (లోక)
నిన్ను నేను ఎన్నడు విడువను         "2"
నిత్యము నీతోనే జీవింతున్                               సత్య సాక్షిగా   
                           (1)
నిత్య రక్షణతో - నన్ను రక్షించెన్       "2"
ఏక రక్షకుడు యేసే లోక రక్షకుడు యేసే
నీ చిత్తమును చేయుటకై
నీ పోలికగా ఉండుటకై                   "2"
నా సర్వము నీకే అర్పింతున్
పూర్ణానందముతో నీకే అర్పింతున్  
                            (2)
నిత్య రాజ్యములో నన్ను చేర్పించన్ "2"
మేఘ రధములపై రానైయున్నాడు
యేసురాజుగా రానైయున్నాడు
ఆరాధింతును సాష్టాంగపడి            "2"
స్వర్గ రాజ్యములో యేసున్

సత్యదైవం యేసున్      "నిత్య ప్రేమతో"

Aradhana aradhana athmatho aradhana ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా


Song no:
ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా
 ఆరాధనా ఆరాధనా కృతజ్ఞత స్తుతి ప్రార్ధన ||2||
. నీకే నా దేవా.. తండ్రీ అందుకోవా ||2||

1. అన్నికి ఆధారమైనవాడా నీకే ఆరాధనా ||2||
 ఎన్నికి మారని మంచివాడా కృతజ్ఞత స్తుతి ప్రార్ధన ||2||

2. నోటను కపటము లేనివాడా నీకే ఆరాధనా ||2||
 మాటతొ మహిమలు చేయువాడా కృతజ్ఞత స్తుతి ప్రార్ధన ||2||

3. అంతయు వ్యాపించియున్నవాడా నీకే ఆరాధనా ||2||
 చింతలు తీర్చిే గొప్పవాడా కృతజ్ఞత స్తుతి ప్రార్ధన ||2||

Siluvapai o snehithuda ninnenthagano సిలువపై ఓ స్నేహితుడా నిన్నెంతగానో హింసించితిరా


Song no:


సిలువపై ఓ స్నేహితుడా
నిన్నెంతగానో హింసించితిరా || 2 ||
నా పాపముకై నా దోషముకై
బలియైన నా యేసయ్య || 2 ||

1 ) . నా కొరకు త్యాగమూర్తివై
బహు విలువైన నీ రక్తము || 2 ||
ధారలుగా నా భారముగా
చిందించావులే నా యెదుట || 12 ||
నాదెంత పాపము నీవు చేసే త్యాగము || 2 ||
||సిలువపై ||

2 ). కఠినముగా ఈ లోకము
నీదేహాన్ని దాహంతో నలిపారుగా || 2 ||
మౌనముగా మనసు గాయముతో
కరిగిపోయావులే నా యెదుట || 2 ||
నాదెంత పాపము నీవు చేసే త్యాగము || 2 ||కె
||సిలువపై ||

Aakashamandhu asinuda nee sannidhey ఆకాశమందు ఆసీనుడా నీ సన్నిధే మాకు ఆనందము


Song no:
ఆకాశమందు ఆసీనుడా - నీ సన్నిధే మాకు ఆనందము (2)
నీ రక్షణ చేపట్టి - నీ తట్టు కన్నులెత్తి (2)
సంతోష గానాలు, కృతజ్ఞత స్తుతులు, ఉత్సహించి ఆలపించెదం (2)

1. అలసి సొలసిపోయి, లోకములో పడిపోయి - నిన్నాశ్రయించిన మా ప్రాణములను బలపరిచినావయ్యా (2) కరుణించి ఆదరించి - హత్తుకున్నావు (2)
సంతోష గానాలు, కృతజ్ఞత స్తుతులు, ఉత్సహించి ఆలపించెదం (2)
ఆకాశమందు ఆసీనుడా - నీ సన్నిధే మాకు ఆనందము

2. నిన్న నేడు రేపు , సదా మాకు తోడై - ఉన్నతమైన నీ విశ్వాస్యతను కనపరిచినావయ్యా (2) కరుణించి ఆదరించి - హత్తుకున్నావు (2)
సంతోష గానాలు, కృతజ్ఞత స్తుతులు, ఉత్సహించి ఆలపించెదం (2)
ఆకాశమందు ఆసీనుడా - నీ సన్నిధే మాకు ఆనందము

Nuvve nuvve naa pranam నువ్వే నువ్వే నాప్రాణం నువ్వే నువ్వే నాధ్యానం


Song no:
నువ్వే నువ్వే నాప్రాణం
నువ్వే నువ్వే నాధ్యానం
నువ్వే నువ్వే నాసర్వం యేసయ్య " 2 "
కాచితివే గడచిన కాలం
చూపించితివే నీదు ప్రేమ

నను కన్నవారే నను మరచినా
నా బంధు స్నేహితులు నను విడచినా " 2 "
నాశ్రమల కాలంలో నను విడువక
నాచేయి పట్టుకొని నడిపించినావే

నా కొరకు నీవు పరము విడచినావు
పాపినైన నను రక్షింపన్ భువికేగినావు " 2 "
క్రయముగా ప్రాణాన్ని బలి పెట్టినావు
నీ మధుర ప్రేమను నే మరువలేను

Vandhanalu vandhanalayya yesayya వందనాలు వందనాలయ్య యేసయ్యా వందనాలు వందనలయ్య


Song no:

వందనాలు వందనాలయ్య  యేసయ్యా
వందనాలు వందనలయ్య

నీవంటివాడు ఒక్కడునులేరయ్యా
ఈ జగతిలోనానికు సాటి ఎవ్వరూలేరయ్యా

యేసయ్యా  యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా //2//



1 . తుఫానులూ ఎదురైనా భూకంపాలు ఎన్నివచ్చినా
విడనిది ఏసు కృప వేడబాయనిది ఏసు ప్రేమ
నన్ను విడువవయ్యా
నన్ను మరువవయ్యా
నన్ను ప్రేమించుచున్నావయ్యా  //2//


 2 . భాదలు క్రుంగదీసిన వ్యాధులు పడద్రోసిన
రక్షించును ఏసు కృప కాపాడును ఏసు ప్రేమ
నన్ను విడువవయ్యా
నన్ను మరువవయ్య
నన్ను ప్రేమిచుచున్నావయ్యా  //2//


3 . శాశ్వతమైనప్రేమతో నన్ను ప్రేమిచుచున్నావు
స్తుతించెదను ఏసు కీర్తించెదను ప్రభూ
నిన్ను స్తుతించెదను
నిన్ను కీర్తించెదను
నిన్ను మహిమపరచెదన్ యేసయ్యా  //2//

Prema premane kraisthavuda bodhakatayo ప్రేమ ప్రేమనే క్రైస్తవుడా బోధకటాయో నీ బ్రతుకొకటాయెను


Song no:

ప్రేమ ప్రేమనే క్రైస్తవుడా   బోధకటాయో నీ బ్రతుకొకటాయెను || 2 || 
ఏశావు  వేషమేసి    యాకోబు స్వరము చూపి 
ఎన్నాళ్ళు మోసగిస్తావు  నీ వెన్నాళ్లు మోసపోతావు 

దానిమ్మ చెట్టు చూడు  ద్రాక్ష పండు కాయునా 
అంజూరపు చెట్టు చూడు  అరటి పండు నీయునా 
క్రైస్తవుడా క్రైస్తవుడా || 2 || 
నీ విత్తేమిటో నీ కాపేమిటో ఫలమేమిటో చూసుకో || 2 || 

గురుగులు గోధుములు కలిసే పెరుగును 
గొర్రెలు మేకలు ఒక మేత మేయును 
న్యాయాధిపతి వచ్చువేళలో పెండ్లికుమారుని రాక సమయములో 
ఆరిపోదువేమో జారిపోదువేమో
సరిచూసుకో ఇప్పుడే  సరిచేసుకో 



Prema premane kraisthavuda bodhakatayo nee brathukokatayonu
Yesavu veshamesi yakobu swaramu chupi
Yennallu mosagisthavu nee vennallu mosapothavu 

Dhanimma chettu chudu dhraksha pandu kayuna
Anjurapu chettu chudu arati pandu neeyuna
Kraisthavuda oo  Kraisthavuda  ||2|| 
nee vitthemito nee kapemito palamemito chusuko  ||2|| 

Gurugulu godhamulu kalise  perugunu
Gorrelu mekaalu oka metha meyunu
Nyayadhipathi vacchuvelalo pendlikumaruni raka samayamlo 
Aripodhuvemo jaripodhuvemo 
Sari chusuko eppude sari chesuko