Yemi vunna lekunna yevaru naku lekunna ఏమివున్న లేకున్నా ఎవరు నాకు లేకున్నా

Song no:
HD
    ఏమివున్న లేకున్నా
    ఎవరు నాకు లేకున్నా } 2

    యేసునందే ఆనందింతును
    యేసయ్యనే ఆరాధింతును } 2
    ఆనందింతును ఆరాధింతును } 2

    యేసునందే ఆనందింతును
    యేసయ్యనే ఆరాధింతును } 2

  1. మందలో గొర్రెలు లేకున్నను
    శాలలో పశువులు లేకున్నను } 2
    ఏమివున్న లేకున్నా
    కష్టకాలమందైన } 2

    యేసునందే ఆనందింతును
    యేసయ్యనే ఆరాధింతును } 2

  2. ద్రాక్షచెట్లు ఫలించ కున్నను
    అంజూరపు చెట్లు పూయ కున్నను } 2
    ఏమివున్న లేకున్నా
    నష్టసమయ మందైన } 2     

    యేసునందే ఆనందింతును
    యేసయ్యనే ఆరాధింతును } 2

    ఏమివున్న లేకున్నా
    ఎవరు నాకు లేకున్నా } 2

    యేసునందే ఆనందింతును
    యేసయ్యనే ఆరాధింతును } 2
    ఆనందింతును ఆరాధింతును } 2

    యేసునందే ఆనందింతును
    యేసయ్యనే ఆరాధింతును } 2

Punarudthanuda vijaya shiluda naa prana nadhuda పునరుత్థానుడా విజయశిలుడా నా ప్రాణనాధుడా


Song no:
పునరుత్థానుడా విజయశిలుడా నా ప్రాణనాధుడా   {2}
నా ప్రతి అవసరము తీర్చినట్టి యేసునాధుడా
నా అపజయములలో జయమునిచ్చిన కారుణశిలుడా    {2}      || పునరుత్థానుడా  ||

 కొండలు లోయలు ఎదురైన జడియాను యేసయ్య
శోధన వేధన భాదాలలో నిన్ను విడువను యేసయ్య    {2}
నాకున్న తోడు నీడ నేవే నాదు యేసయ్య    {2}
ప్రేమపూర్ణుడా నా స్తుతికి పాత్రుడా  {2}                         || పునరుత్థానుడా  ||

 మోడు బారిన నా జీవితం చిగురించేనయ్య
అంధకారం తొలగించే వెన్నెల నీవయ్యా  {2}
నా చేయి పట్టి నన్ను నడిపిన రాజువు నీవయ్యా    {2}
మహిమ నాధుడా నా ప్రేమపాత్రుడా     {2}                    || పునరుత్థానుడా  ||

చరణం:-నాదు యాత్ర ముగియగానే నిన్ను చేరేదానేసయ్య
కన్నులారా నా స్వామిని చూచెదా నేనయ్య      {2}
ఆ మహిమకు నన్ను పిలచుకున్న పరిశుద్దత్ముడా    {2}
నా ప్రాణం నీవయ్యా నా సర్వం నీకయ్య      {2}            || పునరుత్థానుడా  ||

Sthothramu seyare sodharulara స్తోత్రము సేయరే సోదరులార మన యాత్మలతో

Song no: 605

స్తోత్రము సేయరే సోదరులార మన యాత్మలతోఁ దండ్రిన్ ధాత్రిని మన పర మాత్ముని వాక్కులు స్తోత్రములోఁ గలిపి ||స్తోత్రము||

ఇచ్చట ప్రేమల కిదియే కడవరి వచ్చియున్న దేమో అచ్చట మన మం దఱముఁ గలిసికొని యానందింతుముగా ||స్తోత్రము||

ఎక్కువ ప్రేమలు చక్కని స్తోత్రము లక్కడ మన మంత మిక్కిలి ప్రియుడు దేవుని కిడుదుము ఒక్క మనసుతోను ||స్తోత్రము||

కన్నీ రుండదు చావు కష్టము లెన్నటి కుండవుగా కన్నను మన శృం గారపు బ్రతుకు లెన్నఁదరము గాదె ||స్తోత్రము||

వాగును వీణెలు సాగును పాటలు సతతముగా నచట రాగము లెంతో రమ్య మై యుండును బాగింతన లేము ||స్తోత్రము||

మరల నిచటఁ గూ డుదుమో లేదో మన మందరము త్వరలో మున పర లోకపు దండ్రి తోడ నుందు మేమో ||స్తోత్రము||

గొఱ్ఱెపిల్ల రక్తము విలువచ్చుట గొప్పది గాంతుముగా గురుతరమగు మన దేవుని ప్రేమను కూర్మితో జూతుముగా ||స్తోత్రము||

పరమ తండ్రితోఁ ప్రభుయేసునితోఁ బరిశుద్ధాత్మునితో స్థిరముగనుందుము మరి దూతలతోఁ బరలోకమునందున్ ||స్తోత్రము||

Sthuthiyinchu priyuda sadha yesuni స్తుతియించు ప్రియుడా సదా యేసుని ఓ ప్రియుడా


Song no: 175

స్తుతియించు ప్రియుడా - సదా యేసుని
... ప్రియుడా - సదా యేసుని

నరకము నుండి - నను రక్షించి
పరలోకములో - చేర్చుకున్నాడు
ఆనంద జలనిధి - నానందించి
కొనియాడు సదా యేసుని ||ఆనంద||

సార్వత్రికాధి - కారి యేసు
నా రక్షణకై నిరుపేద యాయె ||ఆనంద||

పాప దండన భయమును బాపి
పరమానందము మనకొసగెను ||ఆనంద||

మన ప్రియ యేసు - వచ్చుచున్నాడు
మహిమ శరీరము మనకొసగును ||ఆన||


Nuthana parachumu deva నూతన పరచుము దేవా నీ కార్యములు నా యెడల

Song no:
HD
    నూతన పరచుము దేవా
    నీ కార్యములు నా యెడల (2)
    సంవత్సరాలెన్నో జరుగుచున్నను
    నూతనపరచుము నా సమస్తము (2)

    పాతవి గతించిపోవును – సమస్తం నూతనమగును
    నీలో ఉత్సహించుచు – నీకై ఎదురు చూతును || నూతన ||

  1. శాశ్వతమైనది నీదు ప్రేమ
    ఎన్నడైన మారనిది నీదు ప్రేమ (2)
    దినములు గడచినా సంవత్సరాలెన్ని దొర్లినా
    నా యెడ నీదు ప్రేమ నిత్యం నూతనమే (2) || పాతవి ||

  2. ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో
    నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో (2)
    తరములలో ఇలా సంతోషకారణముగా
    నన్నిల చేసినావు నీకే స్తోత్రము (2) || పాతవి ||

Yentha manchi kapari yese naa oopiri ఎంత మంచి కాపరి యేసే నా ఊపిరి తప్పిపోయిన


Song no:
ఎంత మంచి కాపరి – యేసే నా ఊపిరి (2)
తప్పిపోయిన గొర్రె నేను
వెదకి కనుగొన్నావయ్యా
నీ ప్రేమ చూపినయ్య (2)           ||ఎంత||

సుఖములంటూ లోకమంటూ
నీదు భాగ్యం మరచితి
నీదు సన్నిధి విడచితి (2)
యేసయ్యా ప్రేమ మూర్తివయ్యా
నా అతిక్రమములు క్షమియించి
జాలి చూపితివి (2)         ||ఎంత||

నా తలంపులు నా క్రియలు
నీకు తెలిసేయున్నవి
నీవే నిర్మాణకుడవు (2)
యేసయ్యా ప్రేమ మూర్తివయ్యా
కృతజ్ఞతా స్తుతులు నీకు
సమర్పించెదను (2)         ||ఎంత||

Krupalanu thalanchuchu కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా

Song no:

    కృపలను తలంచుచు (2)
    ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్

  1. కన్నీటి లోయలలో నే క్రుంగిన వేళలో |2|
    నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం
    యేసు నింపెను నా హృదయం |2|…||కృపలను||

  2. రూపింపబడుచున్న ఏ అయుధముండినను |2|
    నాకు విరోధమై వర్దిల్లదుయని చెప్పిన మాట సత్యం
    ప్రభువు చెప్పిన మాట సత్యం |2|…||కృపలను||

  3. సర్వోన్నతుడైన నా దేవునితో చేరి |2|
    సతతము తన కృప వెల్లడి చేయ శుద్దులతో నిల్పెను
    ఇహలొ శుద్దులతో నిల్పెను |2|…||కృపలను||

  4. హల్లెలుయః ఆమెన్ అ..అ..అ..నాకెంతో ఆనందమే |2|
    సియోన్ నివాసం నాకెంతో ఆనందం
    ఆనందమానందమే ఆమెన్ ఆనందమానందమే |2|…||కృపలను||