MangalaSthothrarpanalu mahaneeya devunuki మంగళస్తోత్రార్పణలు మహనీయ దేవునికి అంగున్న లేకున్న

Song no: 6

    మంగళస్తోత్రార్పణలు -మహనీయ దేవునికి - అంగున్న లేకున్న - అంతములేని స్తుతులు మంగళార్చ

  1. ఎట్టివారినైన-ఏస్థలమునందైన - పట్టి రక్షించుటకై పాట్లొందు తండ్రికి మంగళార్చ ||మంగళ||

  2. యేసుక్రీస్తై వచ్చి - యిల మానవుల మధ్య - వాసంబు జేసిన పరమ దేవునికి మంగళార్చ ||మంగళ||

  3. నరులకు తండ్రిగా -నరరక్షపుత్రుడుగా - పరిశుద్ధాత్ముండుగా బైలైన దేవునికి మంగళార్చ ||మంగళ||



6. rakshakuni stuti 



    maMgaLastOtraarpaNalu -mahaneeya daevuniki - aMgunna laekunna - aMtamulaeni stutulu maMgaLaarcha

  1. eTTivaarinaina-aesthalamunaMdaina - paTTi rakshiMchuTakai paaTloMdu taMDriki maMgaLaarcha ||maMgaLa||

  2. yaesukreestai vachchi - yila maanavula madhya - vaasaMbu jaesina parama daevuniki maMgaLaarcha ||maMgaLa||

  3. narulaku taMDrigaa -nararakshaputruDugaa - pariSuddhaatmuMDugaa bailaina daevuniki maMgaLaarcha ||maMgaLa||

Sthothramu cheyumu srusthi karthaku స్తొత్రము చేయుము సృష్టికర్తకు ఓ దేవ నరుడా

Song no: 5

    స్తొత్రము చేయుము సృష్టికర్తకు-ఓ దేవ నరుడా - స్తొత్రము చేయుము సృష్ట్టికర్తకు - స్తొత్రము చేయుము శుభకర మతితో = ధాత్రికి గడువిడు - దయగల తండ్రికి

  1. పాపపు బ్రతుకెడబాయు నిమిత్తమె ఆపదవేళల కడ్డము బెట్టక ఆపద మ్రొక్కులు - అవిగైచేయక = నీపై సత్కృప జూపెడు తండ్రికి ||స్తొత్రము||

  2. యేసుప్రభువుతో నెగిరిపోవభూ - వాసులు సిద్దపడునిమిత్తమై - ఈ సమయంబున - ఎంతయు ఆత్మను - పోసి ఉద్రేకము పొడమించు తండ్రికి ||స్తొత్రము||



5.sRshTikartaku stuti


raagaM: mehana        (chaaya : yaesuni-saeviMpa) taaLaM: aadi



    stotramu chaeyumu sRshTTikartaku -O daeva naruDaa - stotramu chaeyumu sRshTTikartaku - stotramu chaeyumu Subhakara matitO = dhaatriki gaDuviDu - dayagala taMDriki

  1. paapapu bratukeDabaayu nimittame aapadavaeLala kaDDamu beTTaka aapada mrokkulu - avigaichaeyaka = neepai satkRpa joopeDu taMDriki ||stotramu||

  2. yaesuprabhuvutO negiripOvabhoo - vaasulu siddapaDunimittamai - ee samayaMbuna - eMtayu aatmanu - pOsi udraekamu poDamiMchu taMDriki ||stotramu||

Deva thandri neeku dhina dhina sthuthulu దేవా తండ్రీ నీకు దిన దిన స్తుతులు నావిన్నపము విన్న నాధా

Song no: 3

    దేవా తండ్రీ నీకు - దిన దినము స్తుతులు = నావిన్నపము విన్న నాధా సంస్తుతులు

  1. అపవిత్రాత్మల దర్శన - మాపియున్నావు = ఎపుడైన అవి నా - కేసి రానీయవు || దేవా ||

  2. చెడ్డ ఆత్మల మాటల్ - చెవిని బడనీయవు = గడ్డు పలుకుల నోళ్ళు - గట్టియున్నావు || దేవా ||

  3. చెడు తలంపులు పుట్టిం - చెడి దుష్టాత్మలను నా = కడకు రానీయవు - కదలనీయవు || దేవా ||

  4. పాపంబులను దూర - పరచి యున్నావు = పాపంబులను గెల్చు - బలమిచ్చినావు || దేవా ||

  5. పాప ఫలితములెల్ల - పారదోలితివి = శాపసాధనములు - ఆపివేసితివి || దేవా ||

  6. దురిత నైజపు వేరు - పెరికి యున్నావు = పరిశుద్ధ నైజ సం -పద యిచ్చినావు || దేవా ||

  7. ప్రతి వ్యాధినిన్ స్వస్థ - పరచి యున్నావు = మతికి ఆత్మకును నె - మ్మది యిచ్చినావు || దేవా ||

  8. అన్న వస్త్రాదుల - కాధార మీవె = అన్ని చిక్కులలో స - హాయుండ నీవే || దేవా ||

  9. ననుగావ గల దూత - లను నుంచినావు = నిను నమ్ము విశ్వాస - మును నిచ్చినావు || దేవా ||

  10. సైతాను క్రియలకు - సర్వ నాశనము = నీ తలంపులకెల్ల - నెరవేర్పు నిజము || దేవా ||

  11. సాతాను ఆటలిక - సాగనియ్యవు = పాతాళాగ్ని కతని పంపివేసెదవు || దేవా ||

  12. అన్ని ప్రార్థనలు నీ - వాలించి యున్నావు - అన్నిటిలో మహిమ అందుకొన్నావు || దేవా ||

  13. సర్వంబులో నీవు - సర్వమై యున్నావు = నిర్వహించితివి నా - నిఖిల కార్యములు || దేవా ||

  14. హల్లెలుయ హల్లెలుయ - హల్లెలుయ తండ్రీ = కలకాల మున్నట్టి హల్లెలుయ తండ్రీ || దేవా ||

  15. జనక కుమారాత్మ - లను త్రైకుడొందు = ఘనత కీర్తి మహిమ చనువు నాయందు || దేవా ||






raagaM: siMhaeMdriya madhyamamu taaLaM: aaTa



    daevaa taMDree neeku - dina dina stutulu = naavinnapamu vinna naadhaa saMstutulu

  1. apavitraatmala darSana - maapiyunnaavu = epuDaina avi naa - kaesi raaneeyavu || daevaa ||

  2. cheDDa aatmala maaTal^ - chevini baDaneeyavu = gaDDu palukula nOLLu - gaTTiyunnaavu || daevaa ||

  3. cheDu talaMpulu puTTiM - cheDi dushTaatmalanu naa = kaDaku raaneeyavu - kadalaneeyavu || daevaa ||

  4. paapaMbulanu doora - parachi yunnaavu = paapaMbulanu gelchu - balamichchinaavu || daevaa ||

  5. paapa phalitamulella - paaradOlitivi = Saapasaadhanamulu - aapivaesitivi || daevaa ||

  6. durita naijapu vaeru - periki yunnaavu = pariSuddha naija saM -pada yichchinaavu || daevaa ||

  7. prati vyaadhinin^ svastha - parachi yunnaavu = matiki aatmakunu ne - mmadi yichchinaavu || daevaa ||

  8. anna vastraadula - kaadhaara meeve = anni chikkulalO sa - haayuMDa neevae || daevaa ||

  9. nanugaava gala doota - lanu nuMchinaavu = ninu nammu viSvaasa - munu nichchinaavu || daevaa ||

  10. saitaanu kriyalaku - sarva naaSanamu = nee talaMpulakella - neravaerpu nijamu || daevaa ||

  11. saataanu aaTalika - saaganiyyavu = paataaLaagni katani paMpivaesedavu || daevaa ||

  12. anni praarthanalu nee - vaaliMchi yunnaavu - anniTilO mahima aMdukonnaavu || daevaa ||

  13. sarvaMbulO neevu - sarvamai yunnaavu = nirvahiMchitivi naa - nikhila kaaryamulu || daevaa ||

  14. halleluya halleluya - halleluya taMDree = kalakaala munnaTTi halleluya taMDree || daevaa ||

  15. janaka kumaaraatma - lanu traikuDoMdu = ghanata keerti mahima chanuvu naayaMdu || daevaa ||

Anadhi purushumdaina devuni aradhinchandi అనాధి పురుషుండైన దేవుని ఆరాధించండి

Song no: 2
    అనాధి పురుషుండైన దేవుని - ఆరాధించండి = అనాది
    దేవుండే అనంత దేవుడైయుండె = అనాదిని

  1. ఒక్కండే దేవుండు ఒంటరిగానే యుండె - అనాదిని = ఎక్కువ
    మందియైన ఎవరిని గొల్వవలెనో తెలియదు - ఆందోళం ||అనాది||

  2. పాపంబు నరులకు - పరమాత్ముని మరుగుచేసెను - అయ్యయ్యో
    పాపులందుచేత - పలువిధ దేవుండ్లను కల్పించిరి - విచారం ||అనాది||

  3. గనుక సర్వంబునకు - కర్తయైన ఏకదేవున్ - కనుగొనుడి = కనుగొని
    మ్రొక్కండి - అని బోధించుచున్నాము - శుభవార్త ||అనాది||

  4. ఆకాశము భూమియు - లేక ముందే కాలము - దూతలు = లేకముందే
    దేవుడు - ఏక దేవుండై యుండె - గంభీరం! ||అనాది||


2. daevuDu


    anaadhi purushuMDaina daevuni - aaraadhiMchaMDi = anaadi
    daevuMDae anaMta daevuDaiyuMDe = anaadini

  1. okkaMDae daevuMDu oMTarigaanae yuMDe - anaadini = ekkuva
    maMdiyaina evarini golvavalenO teliyadu - aaMdOLaM ||anaadi||

  2. paapaMbu narulaku - paramaatmuni maruguchaesenu - ayyayyO
    paapulaMduchaeta - paluvidha daevuMDlanu kalpiMchiri - vichaaraM ||anaadi||

  3. ganuka sarvaMbunaku - kartayaina aekadaevun^ - kanugonuDi = kanugoni
    mrokkaMDi - ani bOdhiMchuchunnaamu - Subhavaarta ||anaadi||

  4. aakaaSamu bhoomiyu - laeka muMdae kaalamu - dootalu = laekamuMdae
    daevuDu - aeka daevuMDai yuMDe - gaMbheeraM! ||anaadi||

Shubhakara shuddhakara vishuddha vandhanam శుభాకరా శుద్దాకరా విశుద్ధ వందనం నభా నభూమి

Song no: 1

    శుభాకరా! శుద్దాకరా! విశుద్ధ వందనం
    నభా నభూమి సర్వౌ - న్నత్య వందనం

  1. యెహొవ! స్రష్ట! జనక! నీకు-నెంతయు బ్రణుతి
    మహొన్నతుండ!దివ్యుడా! ఘన-మహిమ సంస్తుతి||శుభా||

  2. విమోచకా! పిత్రాత్మజుండ! - విజయమంగళం
    సమస్త సృష్టి సాధనంబ! సవ్యమంగళం||శుభా||

  3. వరాత్మ! పితాపుత్ర నిర్గమపరుడ! స్తొత్రము
    వరప్రదుండ! భక్త హృదయ - వాస! స్తొత్రము||శుభా

raagaM: jaMjhaaT    taaLaM:aeka



    Subhaakaraa! Suddaakaraa! viSuddha vaMdanaM
    nabhaa nabhoomi sarvau - nnatya vaMdanaM

  1. yehova! srashTa! janaka! neeku-neMtayu braNuti
    mahonnatuMDa!divyuDaa! ghana-mahima saMstuti ||Subhaa||

  2. vimOchakaa! pitraatmajuMDa! - vijayamaMgaLaM
    samasta sRshTi saadhanaMba! savyamaMgaLaM ||Subhaa||

  3. varaatma! pitaaputra nirgamaparuDa! stotramu
    varapraduMDa! bhakta hRdaya - vaasa! stotramu ||Subhaa||

Vijaya geethamu manasara nenu padadha విజయగీతము మనసార నేను పాడెద నా విజయముకై


Song no: 142
విజయగీతము మనసార నేను పాడెద
నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు
పునరుత్థానుడా నీవే నా ఆలాపన నీకే నా ఆరాధన

1. ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్యజీవముకే
   పుటమువేసితివే నీ రూపము చూడ నాలో
   యేసయ్యా నీ తీర్మానమే
   నను నిలిపినది నీ ఉత్తమమైన సంఘములో    ||పునరు||

2. ఒకని ఆయుష్షు ఆశీర్వాదము నీ వశమైయున్నవి
   నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో
   యేసయ్యా నీ సంకల్పమే
   మహిమైశ్వర్యము నీ పరిశుద్ధులలో చూపినది   ||పునరు||

3. నూతన యెరూషలేం సీయోను నాకై నిర్మించుచున్నావు నీవు
    నిరీక్షణయే రగులుచున్నది నాలో
   యేసయ్యా నీ ఆధిపత్యమే

   అర్హత కలిగించే నీ ప్రసన్న వదనమును ఆరాధించ       ||పునరు||

Mahima neeke prabhu ganatha neeke మహిమ నీకే ప్రభు ఘనత నీకే ప్రభు స్తుతియు మహిమ


Song no:
మహిమ నీకే ప్రభు ఘనత నీకే ప్రభు ||2||
స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకె ప్రభూ ||2||
ఆరాధన  ఆరాధన  ఆరాధన ఆరాధన
ప్రియ యేసు ప్ర్రభునికే నా యేసు ప్రభునికే

 1. సమీపించరాని తేజస్సునందు వశియించు అమరుండవే
 శ్రీమంతుడవే సర్వాధిపతివే నీ సర్వము నాకిచ్చితివే 

 2. ఎంతో ప్రేమించి నాకై ఏతెంచి ప్రాణమునర్పించితివే
 విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే 

3. ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నను పిలిచి వెలిగించితివే
 నీ గుణాతిశయములు ధర నే ప్రచురింప ఏర్పరచుకొంటివే

4. రాజులైన యాజక సమూహముగా ఏర్పచబడిన వంశమై
 పరిశుద్ధ జనమై నీ సొత్తైన ప్రజగా నన్ను చేసితివే