Naakasrayamu mahathisayamu నాకాశ్రయము మహాతిశయము మహోన్నతము నాయేసు నామము


Song no: 23
నాకాశ్రయము మహాతిశయము
మహోన్నతము నాయేసు నామము
నాకు జీవము కృపాతిశయము
మహిమైశ్వర్యము నాయేసువాక్యము
నా యేసు నామము
నా యేసు వాక్యము

1.  అందరిలో   అతి
     శ్రేష్టమైన నామము
     అన్నిటి కన్న పై నామమీ
     హెచ్చయిన నామము
     నా యేసు నామము
     శ్రేష్టమైన నామము
     నా యేసు నామము

2. ప్రాణాత్మ దేహమును
    శుద్ధి చేయు  వాక్యము
    పరిశుద్ధ పరచును
    ప్రభు వాక్యము
   బలమైన వాక్యము
   నా యేసు వాక్యము
   పరిశుద్ధ వాక్యము
   నా యేసు వాక్యము

Nannu srujiyinchina naa thandrike నను సృజియించిన నాతండ్రికే ఆరాధన నను రక్షించిన


Song no: 21
నను సృజియించిన
నాతండ్రికే ఆరాధన
నను రక్షించిన
యేసయ్యాకే ఆరాధన
నను నడిపించే
పరిశుద్ధాత్మునికే ఆరాధన
నను పాలించే
త్రియేక దేవునికే ఆరాధన
ఆరాధన ఆరాధన
ఆరాధన ఆరాధన

1. మట్టిని తీసాడు
    తన రూపును చేశాడు
    ప్రాణం పోసాడు
    జీవించ మన్నాడు
    ఆ తండ్రికే ఆరాధన...

2. మహిమను విడిచాడు
    మంటి దేహము దాల్చాడు
    ప్రాణం పెట్టాడు
    నిత్య జీవము నిచ్చాడు
    యేసయ్యా కే ఆరాధన...

3. పరిపూర్ణుని చేయుటకై 
    పరిశుద్ధాత్ముడు వచ్చాడు
    అభిషేకించాడు
    నను నడిపించు చున్నాడు
    ఆత్మ దేవునికే ఆరాధన...

Naa pranama naa yesuni నా ప్రాణమా నా యేసుని మరువక స్తుతియించుమా


Song no:
నా ప్రాణమా నా యేసుని
మరువక స్తుతియించుమా
ఆయన చేసిన ఉపకారములను
ఆయన చేసిన మేలులన్నియు
మరువక స్తుతియించుమా
మనసున ధ్యానించుమా

మరణము నుండి నీ ప్రాణమును
విమోచించినాడు
కరుణ కటాక్షమును కిరీటముగా
నీపై యుంచినాడు
మేలులతోను నీ హృదయమును
తృప్తి పరచుచున్నాడు

నీ పాపమునకు ప్రతికారము
నీకు చేయలేదు
నీ దోషమునకు ప్రతిఫలమును
నీకు ఇయ్యలేదు
ఉన్నతమైన ఆయన కృపను
అధికముగా ఉంచినాడు

Nee kosame ne brathukuthanayya నీ కోసమే నే బ్రతుకుతానయా నా జీవితం నీ కోసమేనయా


Song no:
నీ కోసమే నే బ్రతుకుతానయా
నా జీవితం నీ కోసమేనయా
నా జీవితం నీకాకింతం
నీ సాక్షిగా ఇలలో జీవింతునయా

శోధన వేదనలు నన్ను చుట్టిన
వ్యాధులు బాధలు ఎదురొచ్చినా
విజయ శీలుడా నీవుండగా
నిరిక్షణతోనె ఇలసాగెదా

ఆత్మీయులే నన్ను అవమానించిన
అన్యులే నన్ను అపహసించిన
ఆదరణ కర్త నీవుండగా
ఆనందముతో నే సాగెదా

నా వారే నన్ను నిందించినా
బంధువులే నన్ను వెలివేసినా
నా పక్షమున నీవుండగా
సహనముతోనే ఇల సాగెదా

Sthuthinthunu nee namamun keerthinthunu స్తుతియింతును నీ నామమున్ కీర్తింతును యేసయ్యా


Song no: 27
స్తుతియింతును నీ నామమున్ కీర్తింతును యేసయ్యా
ప్రతి ఉదయమున నీ కృపను
ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను
ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన

ఆకాశ పక్షులు స్తుతియించగా
సముద్ర జలచరములు సంతోషించగా
భూమి ఆకాశము ఆలకించగా
నదులు కొండలు ధ్వని చేయగా

పరమందు దూతలు ప్రస్తుతించగా
ఇహమందు భక్తులు ఆరాధించగా
నాదు హృదయము ఉల్లసించగా
నిండు మనసుతో స్తుతియింతును

Rammanu chunnadamma yesayya రమ్మనుచున్నాడమ్మా యేసయ్యా త్వరలో రానైయున్నాడమ్మా


Song no: 16
రమ్మనుచున్నాడమ్మా యేసయ్యా
త్వరలో రానైయున్నాడమ్మా మేస్సయ్యా
ఏలో ఏలో ఎన్నియలో
హల్లేలూయా హల్లేలూయా

1. మేఘమునె తన వాహనంబుగా
    దూతలనె తన స్తెన్యంబుగా
    కడబూర శబ్ధము
    మ్రోగుచుండగానే
    ప్రతి నేత్రము చూచుచుండగానె

2. ఆర్భాటముతోను
    ప్రధాన దూత శబ్ధముతోను
    దేవుని బూరతోను
    ప్రభువు దిగివచ్చును
    క్రీస్తులో మృతులు
    మొదట లేతురండి
    అపై సజీవులైన
    మనము  లేతుమండి

Neeve neeve neeve naa asraya dhurgam నీవె నీవె నీవె నా ఆశ్రయ దుర్గం నీవె నీవె నీవె


Song no: 24
నీవె నీవె నీవె నా ఆశ్రయ దుర్గం
నీవె నీవె నీవె నా రక్షణా శృంగం
నీవే నీవే నీవే నీవే
నీవే నా యేసయ్యా
నీవే నా యేసయ్యా

వేటకాని ఉరిలో నే చిక్కుకున్నా
నీవు వచ్చి నన్ను విడిపించావు
విడిపించి గొప్ప చేశావు
విడిపించి గొప్ప చేశావు

కొండల తట్టు కన్నులెత్తుచున్న
ఎక్కడ నుండి సహాయం వచ్చునని
నీవె నా కొండవు నీవే నా అండవు

శత్రువు వడిగా ననుతరుముచున్నా
నలు దిక్కుల భయము
ఆవరించియున్నా
నీవే నా జయము నీవే నా ధైర్యము