Nee rupulo nannu marchu నీ రూపులో నన్ను మార్చు యేసయ్య నీ రూపమే నాకు


Song no: o
నీ రూపులో నన్ను
మార్చు యేసయ్య
నీ రూపమే నాకు దయచేయుమయా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా

అబ్రామును అబ్రహముగా మార్చితివే
జనములకు తండ్రిగా నియమించితివే
ఐశ్వర్యమునే ఇచ్చితివే

యాకోబును ఇశ్రాయేలుగా మార్చితివే
గోత్రకర్తలకు తండ్రిగా చేసితివే
ఆశీర్వాదమును ఇచ్చితివే

సౌలును పౌలుగా మార్చితివే
మహిమ గల పాత్రగ మలచితివే
జీవకిరీటము నిచ్చితివే

Okka mata palikina chalunu ఒక్కమాట పలికిన చాలును యేసయ్యా


Song no:
ఒక్కమాట పలికిన
చాలును యేసయ్యా
ఆ మాటే నాకు జీవము నిచ్చె గదా
ఆ మాటే నాకు ఆదరణ నిచ్చె గదా
నా నేస్తామా నాప్రాణమా
నాజీవమా నా స్వాస్ధ్యమా

ఎండిన ఎముకలకు
జీవము నిచ్చినది
ఎడారిలో వర్షమును కురిపించినది
తండ్రియైన దేవా నీ మాటేనయా
ఆ ఓక్క మాటే నాకు చాలయా

శూన్యములో నుండి సృష్టినే చేసినది
చీకటి లో నుండి వెలుగును చేసినది
తండ్రింయైమ దేవా నీ మాటేనయా
ఆ ఒక్క మాటే నాకు చాలయా

Mahima ganathaku arhuda neeve మహిమా ఘనతకు అర్హుడ నీవే ఘనత ప్రభావము


Song no: 50
మహిమా ఘనతకు అర్హుడ నీవే
ఘనత ప్రభావము కలుగును నీకే
యేసయ్యా నీ సన్నిధిలో
పరవశించి నే పాడానా
యేసయ్యా నీ సన్నిధిలో
ప్రహర్షించి నే పాడనా
మహిమ మహిమ యేసుకే మహిమ
ఘనత ఘనత యేసుకే ఘనత

ఆకాశములు నీదు మహిమను అంతరిక్షము నీ నామమును
సమస్తము ఏకమై ప్రకటించగా
సర్వోన్నత స్థలములలో
స్తుతి ఘనత ప్రభావమని

నదులు కొండలు ధ్వని చేయగా
పొలములోని చెట్లు చప్పట్లు కొట్టగా
సమస్తము ఏకమై స్తుతియించగా
సర్వోన్నత స్థలములలో
స్తుతి ఘనత ప్రభావమని

ప్రకృతి అంతా పరవశంబుతో
నీ నామమును ప్రణుతించుచుండగా
సమస్తము ఏకమై ప్రస్తుతించగా
సర్వోన్నత స్థలములలో
స్తుతి ఘనత ప్రభావమని

Nannu yeppudu vidichi pettaledhu నన్నుఎప్పుడు విడిచి పెట్టలేదు ఎన్నడైనను మరచి పోలేదు


Song no: 49
నన్నుఎప్పుడు విడిచి పెట్టలేదు
ఎన్నడైనను మరచి పోలేదు
పరిశుద్ధుడవు పరిపూర్ణుడవు
తేజోమయుడవు నా యేసయ్యా

ఐశ్వర్య ఘణతలు
స్థిరమైన కలిమియు
నీతియు పరిశుద్ధత
నీయందే యున్నవి
శ్రీమంతుడవు బలవంతుడవు
బహు ప్రియుడవు నీవు
నా యేసయ్యా

జ్ఞానము నీవె పరాక్రమము నీవె
శాశ్వత ప్రేమ జీవము నీవె
దీర్గాశాంతుడవు నీతి మంతుడవు

షాలేము రాజువు నా యేసయ్య

Saranam deva saranam deva శరణం దేవా శరణం దేవా శరణంటు వేడితి నిన్నే దేవా


Song no: 48
శరణం దేవా శరణం దేవా
శరణంటు వేడితి నిన్నే దేవా
శరణు శరణు అని చేరితి నీకడ
విడువక మరువక నను బ్రోవరావె

నీ శరణు జొచ్చిన వారినెవ్వరిని అపరాధులుగా ఎంచననియు
నీతి మంతులుగా చేయుటకొరకై
దోషిగ దోషమే మోసితివయా

నీ శరణు జొచ్చిన వారికందరికి
కేడెముగా నీవె ఉండెదననియు
మా చేతులకు యుద్ధము నేర్పి
రక్షణ కేడెము అందించితివె

Kaluvari girilo chupina premanu కలువరి గిరిలో చూపిన ప్రేమను మరువగలనా యేసయ్యా


Song no: 47
కలువరి గిరిలో చూపిన ప్రేమను
మరువగలనా యేసయ్యా
మరువలేను నీదు ప్రేమను
మరపురాని దివ్య ప్రేమ

నా దోషముకై దోషిగ మారి
శాపమైన సిలువను నీవుమోసి
తీర్చితివి నా వేదనను
మోసితివి నా భారమును
విమోచకుడా నా యేసయ్యా

కపటము లేని కరుణా హృదయుడా
దోషములేని దోషరహితుడా
నీచమైన పాపుల కొరకై
నీ శిరమనె వంచితివా

Iemmanuyelu devuda iesrayelu kapari ఇమ్మానుయేలు దేవుడా ఇశ్రాయేలు కాపరి


Song no: 46
ఇమ్మానుయేలు దేవుడా
ఇశ్రాయేలు కాపరి
కునుకని నిద్రించని
కన్నతండ్రివి నీవేనయా
నీవేనయా యేసయ్యా
నీవేనయా యేసయ్యా

కలతతో కన్నీటితో కృంగి నేనుండగా
నాదరి చేరి నన్నాదరించిన
నాదు కాపరి

దోషములో చిక్కుబడి తొట్రిల్లుచుండగా
హస్తము చాపి నను బలపరచిన
నాదు కాపరి