Ninnu veedi skhanamaina brathukalenayya నిను వీడి క్షణమైన బ్రతుకలేనయ్యా నేను బ్రతుకలేనయ్యా


Song no: 35
నిను వీడి క్షణమైన
బ్రతుకలేనయ్యా
నేను బ్రతుకలేనయ్యా

పడిపోతిని నేను చెడిపోతిని
నన్నునేను తెలిసి కొనగనలేక పోతిని

నమ్మానయ నేను ఈ లోకాన్ని
మోసపోతినా నేను ఓడిపోతినా

తండ్రిని నేను విడిచి దూరమైతిని
దూరమైతిని బహు బారమైతిని

నీవు లేనిదే నేను బ్రతుకలేనయ్యా
నీవుంటే నాకు చాలు నా యేసయ్యా

Unnaviyaina rabovuvu vaina ఉన్నవియైన రాబోవువు వైన నీదు ప్రేమ నుండి ఏది వేరు చేయదు


Song no: 34
ఉన్నవియైన రాబోవువు వైన
నీదు ప్రేమ నుండి ఏది వేరు చేయదు
లేదులే చేయలేదులే
నీదు ప్రేమ నుండి
ఏది వేరు చేయలేదులే

శ్రమయైన కరువైన ఖడ్గమైనను
ఆకలి దప్పులు వస్త్రహీనతైనను
లేదులే చేయలేదులే
నీదు ప్రేమ నుండి
ఏది వేరు చేయలేదులే

దృశ్యమైనను అదృశ్యమైనను
శక్తులైనను భక్తి హీనులైనను
లేరులే చేయలేరులే
నీదు ప్రేమ నుండి
ఏది వేరు చేయలేదులే

మరణమైనను జీవమైనను
ప్రదానులైనను అధికారులైనను
లేరులే చేయలేరులే
నీదు ప్రేమనుండి
ఏది వేరు చేయలేదులే

Vinuma o naeasthama yesuni swaramunu వినుమా ఓ నేస్తామా యేసుని స్వరమును వినుమా


Song no: 33
వినుమా ఓ నేస్తామా
యేసుని స్వరమును వినుమా
వినుట వలన నీకు
విశ్వాసం కలుగును
విశ్వాసము ద్వార రక్షణ కలుగును

ఆదియందు జలములపై
అల్లాడిన స్వరమే
అలనాడు ఆదామును
పిలిచిన స్వరమే
అబ్రామును అబ్రహాముగా
మార్చిన స్వరమే
అరణ్యములో హగరును
ఓదార్చిన స్వరమే

క్రుంగియున్న ఏలియాను
బలపరచిన స్వరమే
దాగియున్న గిద్యోనును
దర్శించిన స్వరమే
పాపియైన జక్కయ్యను
కరుణించిన స్వరమే
మరణించిన లాజరును
బ్రతికించిన స్వరమే

Ninnu vidachi nenu undalenayya నిన్ను విడచి నేను ఉండలేనయా ఒక నిమిషమైనను


Song no: 32
నిన్ను విడచి నేను ఉండలేనయా
ఒక నిమిషమైనను
నేను బ్రతుకలేనయా
యేసయ్యా నీవే ఆధారము
యేసయ్యా నీవే నా ప్రాణము
ఆధారము నా ప్రాణము

కన్నీరైన కలతలైన వేరు చేయున
కష్టమైన నష్టమైన దూరం చేయున

బంధువులైన బంధాలైన భయపెట్టిన
భారమైన బాధలైన నిన్ను విడువను

Yehova mandhiram thana janulaku యెహోవా మందిరం తన జనులకు సుందరం


Song no: 31
యెహోవా మందిరం
తన జనులకు సుందరం
తన మహిమ ప్రభావములు
దిగివచ్చు ప్రతి క్షణం
ఆనందమే ఆనందమే
సంతోషమే సమాధానమే

ప్రతివారి అవసరము
తీర్చును అనుక్షణం
ప్రతి వారి బాధలను
బాపును ప్రతి నిత్యం

నీ మందిరవరణము
కృపా క్షేమములకు నిలయము
నీ మందిరవరణము
నా కెంతో ప్రియమైనది

నీ ఆలయమునందున
ఒక దినము గడుపుట
వేయి దినముల కంటేను
ఎంతో శ్రేష్టము

Neevu naa thoduga undaga నీవు నా తోడుగా ఉండగా నాకు దిగులుండునా యేసయ్యా


Song no: 30
నీవు నా తోడుగా ఉండగా
నాకు దిగులుండునా యేసయ్యా
నీవు నాపక్షమై నిలువగా
నాకు భయముండునా యేసయ్యా
యేసయ్యా... యేసయ్యా...
యేసయ్యా... యేసయ్యా...

ఆదరణ చూపే నీ హస్తము
ఆశ్రయ మిచ్చే నీ నామము
ఆప్యాయత పంచే నీ త్యాగము
ఆనందము నిచ్చె నీ స్నేహము

నా రక్షణాధారం నీ కృపయే
నా జీవనాధారం నీ దయయే
నిరీక్షణ ఆనందం నీ ప్రేమయే
నిరతము నడిపించు నీ సన్నిదియే

Keerthaneeyuda ninu keerthinthunu కీర్తనీయుడా నిను కీర్తింతును అద్వితీయుడా ఆరాధింతును


Song no: 29
కీర్తనీయుడా నిను కీర్తింతును
అద్వితీయుడా ఆరాధింతును
కరుణామయుడా కరములు జోడించి
ప్రేమామయుడా నాశిరమును వంచి
నిన్నే స్తుతియించెదను
నా యేసయ్యా
నిన్నే ఘణపరచేదను

కానాను యాత్రలో తోడైయున్నావు
కనికరము చూపి నడిపించావు
ఆకలైన వేళ ఆహరమునిచ్చి
దప్పికైన వేళ వారి
దాహము తీర్చావు

నా బ్రతుకు బాటలో నాతో వున్నావు
నా బారమంతటిని భరియించావు
అడగకనే అక్కరలు తీర్చుచున్నావు
అడుగులు తడబడక
నను నడుపుచున్నావు

నా జీవిత నావకు చుక్కానివయ్యావు
చక్కగ నడిపించి దరి చేర్చావు
పెనుతుఫాను గాలులు నాపై లేచినా
అణచివేసి నాకు నెమ్మది నిచ్చావు