Neevu naa thoduga undaga నీవు నా తోడుగా ఉండగా నాకు దిగులుండునా యేసయ్యా


Song no: 30
నీవు నా తోడుగా ఉండగా
నాకు దిగులుండునా యేసయ్యా
నీవు నాపక్షమై నిలువగా
నాకు భయముండునా యేసయ్యా
యేసయ్యా... యేసయ్యా...
యేసయ్యా... యేసయ్యా...

ఆదరణ చూపే నీ హస్తము
ఆశ్రయ మిచ్చే నీ నామము
ఆప్యాయత పంచే నీ త్యాగము
ఆనందము నిచ్చె నీ స్నేహము

నా రక్షణాధారం నీ కృపయే
నా జీవనాధారం నీ దయయే
నిరీక్షణ ఆనందం నీ ప్రేమయే
నిరతము నడిపించు నీ సన్నిదియే

Keerthaneeyuda ninu keerthinthunu కీర్తనీయుడా నిను కీర్తింతును అద్వితీయుడా ఆరాధింతును


Song no: 29
కీర్తనీయుడా నిను కీర్తింతును
అద్వితీయుడా ఆరాధింతును
కరుణామయుడా కరములు జోడించి
ప్రేమామయుడా నాశిరమును వంచి
నిన్నే స్తుతియించెదను
నా యేసయ్యా
నిన్నే ఘణపరచేదను

కానాను యాత్రలో తోడైయున్నావు
కనికరము చూపి నడిపించావు
ఆకలైన వేళ ఆహరమునిచ్చి
దప్పికైన వేళ వారి
దాహము తీర్చావు

నా బ్రతుకు బాటలో నాతో వున్నావు
నా బారమంతటిని భరియించావు
అడగకనే అక్కరలు తీర్చుచున్నావు
అడుగులు తడబడక
నను నడుపుచున్నావు

నా జీవిత నావకు చుక్కానివయ్యావు
చక్కగ నడిపించి దరి చేర్చావు
పెనుతుఫాను గాలులు నాపై లేచినా
అణచివేసి నాకు నెమ్మది నిచ్చావు

Jyothirmayuda jagadhiswaruda జ్వోతిర్మయుడా జగదీశ్వరుడా ఆరాధనకు యోగ్యుడ నీవే


Song no: 28
జ్వోతిర్మయుడా జగదీశ్వరుడా
ఆరాధనకు యోగ్యుడ నీవే

శ్రీమంతుడవు సృజనాత్ముడవు
సృష్టి స్థితిలయ కారకుడవు నీవు
ఆదియు అంతము లేనివాడవు
ఆరాధనకు యోగ్యుడ నీవే

సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా
సమస్తమునకు కారణ భూతుడా
అల్పా ఓ మేగా అయిన వాడవు
ఆరాధనకు యోగ్యుడ నీవే

Margamu chupumu intiki మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి


Song no:
మార్గము చూపుము ఇంటికి –
నా తండ్రి ఇంటికి
మాధుర్య ప్రేమా ప్రపంచమో –
చూపించు కంటికి (2)

పాప మమతల చేత –
పారిపోయిన నాకు
ప్రాప్తించె క్షామము
పశ్చాత్తాప్పమునొంది –
తండ్రి క్షమ కోరుచు
పంపుము క్షేమము (2)
ప్రభు నీదు సిలువ –
ముఖము చెల్లని నాకు
పుట్టించె ధైర్యము (2) ||మార్గము||

ధనమే సర్వంబనుచు-
సుఖమే స్వర్గంబనుచు
తండ్రిని వీడితి
ధరణి భోగములెల్ల –
బ్రతుకు ధ్వంసము జేయ
దేహీ నిను చేరితి (2)
దేహీ అని నీ వైపు – చేతులెత్తిన నాకు
దారిని జూపుము (2)||మార్గము||

దూర దేశములోన –
బాగుందుననుకొనుచు
తప్పితి మార్గము
తరలిపోయిరి నేను –
నమ్మిన హితులెల్ల
తరిమే దారిద్య్రము (2)
దాక్షిణ్య మూర్తి నీ –
దయ నాపై కురిపించి
ధన్యుని చేయుము (2) ||మార్గము||

అమ్ముకొంటిని నేను –
అధముడొకనికి నాడు
ఆకలి బాధలో
అన్యాయమయి పోయే –
పందులు సహ వెలివేయ
అలవడెను వేదన (2)
అడుగంటె అవినీతి –
మేల్కొనియె మానవత
ఆశ్రయము గూర్చుము (2) ||మార్గము||

కొడుకునే కాదనుచు –
గృహమే చెరసాలనుచు
కోపించి వెళ్ళితి
కూలివానిగనైన –
నీ యింట పని చేసి
కనికరమే కోరుదు (2)
కాదనకు నా తండ్రి –
దిక్కెవ్వరును లేరు
క్షమియించి బ్రోవుము (2) ||మార్గము||

నా తండ్రి నను జూచి –
పరుగిడిచూ ఏతెంచి
నాపైబడి ఏడ్చెను
నవ జీవమును గూర్చి –
ఇంటికి తోడ్కొని వెళ్లి
నన్నూ దీవించెను (2)
నా జీవిత కథయంత –
యేసు ప్రేమకు ధరలో
సాక్ష్యమై యుండును (2) ||మార్గము||

Yesu puttadani rakshana thecchadani యేసు పుట్టాడని రక్షణ తెచ్చాడని క్రీస్తు పుట్టాడని శాంతిని


Song no:
యేసు పుట్టాడని రక్షణ తెచ్చాడని
క్రీస్తు పుట్టాడని శాంతిని ఇచ్చువాడని
మేము వచ్చాము చూడటానికి
మేము వచ్చాము పూజించడానికి

ఇది మా క్రిస్మస్ ఆరాధన
ఇది మా క్రిస్మస్ ఆనందము

చుక్కని చూసి మేము వచ్చాము రాజుల రాజుని పూజించాము
బంగారు సాంబ్రాణి
బోళము అర్పించాము
అత్యానందముతో
తిరిగి మేము వెళ్ళాము     "ఇది"

దూత వార్త విని మేము వచ్చాము
రక్షకుడేసుని మేము చూశాము
పసిబాలుడు కాదు
పరమాత్ముడు అని
అందరికి మేము చాటించాము "ఇది"

Yesayya nee krupa naku chalayya యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా కష్టమైనను నష్టమైనను


Song no: 82
యేసయ్యా నీ కృప
నాకు చాలయ్యా
కష్టమైనను నష్టమైనను
వెదనైనను శోధనైనను
చాలయా నీ కృప నాకు చాలయ్యా

ఒక్క నిమిషమైన నను వీడకున్నది
వెన్ను తట్టి చేయి పట్టి నడుపుచున్నది
నేను మరచిన మరువకున్నది
నేను విడచిన నను వీడకున్నది

ఎన్నెన్నో మేలులు చేసినావయా
సమస్తమును నా కొరకు
దాచినావయా
అడుగకనే అక్కరలు తీర్చినావయా
నా హృదయ వాంఛను
తృఫ్తి పరచినావయ్యా

తండ్రీ నీ సన్నిధిలో నిలిపినావయా
వింతైన ప్రేమను చూపినావయా
విలువైన ప్రాణమును ఇచ్చినావయా
రక్షణ ఆనందముతో నింపినావయ్యా

E ontari payanamlo thodu neeve yesayya ఈ ఒంటరి పయాణంలో తోడు నీవే యేసయ్యా


Song no: 131
ఈ ఒంటరి పయాణంలో
తోడు నీవే యేసయ్యా
ఈ ఒంటరి జీవితంలో
నీవే నాకు చాలయ్యా
1. అమ్మా నాన్న లేకున్న
    అమ్మ నాన్న వైనావు
    అప్తులంత దూరమైన
    ఆదారించినావయా
    వెను తిరిగి చూచిన వెంట
    ఎవ్వరు లేరయ్యా
    ముందు తిరిగి చూచిన
    ముందు ఎవ్వరు లేరయ్యా
2. కృంగియున్న వేళలో
     బలపరచినావయా
    నా తోడు నీవై నడిపించినావయా
    నాలోనే ఉన్నావు
    నాతోనే ఉన్నావు 
    నేనున్నానని చెప్పి
    నను నడుపుచున్నావు
3. నాకు ఎవరు లేరని
    నే దిగులు చెందగా
    నాచెంతచెరి ధైర్యపరచినావయా
    నా ప్రాణా ప్రియుడా
    నాయేసురాజ నీవు లేనిదే
    నేను బ్రతుకలేనయా