Vidanada vadavukavu Lyrics


విడనాడు వాడవుకావు పరలోకతండ్రి నీవు
నను గూర్చి చింతిస్తావు జాగ్రత్త వహియుస్తావు
నీకొరకు కనిపెట్టుకొని నిబ్బరముగ ఉందును
నీ దయను పొందుకొని ఇలలో జీవించెదను
1. నా పాదము నీవు తోట్రిల్లనీయవు
ఏ నిమిషమైనను కునుకు తీయవు
స్థిరమైన వాక్యమందు నను పెంచు బోధకుడవు
2. నా ప్రక్కలో నీవు నీడగా ఉందువు
ఏ ఎండదెబ్బయైన తగులనీయడు
బలమైన రెక్కలందు ననుదాచు స్నేహితుడవు
3. నా రాకపోకలో కాపాడుచుందువు
ఏ ఆపద నాకు కలుగనీయవు
స్థిరమైన మార్గమందు నను నడుపు నావికుడవు


Sthothramu sthothramani Lyrics


స్తోత్రము స్తోత్రమని కీర్తనపాడెదము
హల్లెలూయ హల్లెలూయని నిను కొనియాడెదను
అ.ప: ఉల్లసించెదనయ్యా నీ సన్నిధిని
సన్నుతింతుతును నిన్నే రారాజువని
1 స్వస్థపరచు దేవుడవు నీవేయని కీర్తనపాడెదము
తృప్తిపరచగలిగిన రారాజువని నిను కొనియాడెదను
2 శక్తినీయు దేవుడవు నీవేయని కీర్తనపాడెదము
గొప్పచేయగలిగిన రారాజువని నిను కొనియాడెదను
3 ఉద్ధరించు దేవుడవు నీవేయని కీర్తనపాడెదము
ఆలకించ గలిగిన రారాజువని నిను కొనియాడెదను


Korukunna revuku nadipinchava Lyrics


కోరుకున్న రేవుకు నడిపించావా
కోరికలు తీర్చి కరుణింవా
కొట్టుకొనిపోకుండా - ముక్కలే కాకుండా
చిట్టచివరివరకు కాచిన దేవా
1 ఆకాశము తెరచి మన్న కురిపించి
బండలను చీల్చి నీటిని రప్పించి
ఆహరమిచ్చావు దాహాన్ని తీర్చావు
కష్టకాలమునందు మూళ్ళత్రోవలయందు విడువక తోడున్నావు
మోఱ్ఱ విన్నావు దారి చూపావు నివాసపురము చేర్చావు
2 చీకటిచెరనుండి విడుదల కలిగించి
మరణములో నుండి బయటకు రప్పించి
గడియలు విరిచావు కట్లను తెంచావు
గొప్ప ఆపదరాగా దిక్కు తోచకపోగా వాక్కును పంపించావు
చేయి చాపావు పైకి లేపావు ఆశ్చర్యక్రియలు చేశావు


Avarinchuna athma shakthitho Lyrics


ఆవరించుమా ఆత్మ శక్తితో
ఆదరించుమా నీదు వాక్కుతో
అ.ప: ప్రేమ రూపమా నన్ను నింపుమా
ఉజ్జీవము నాలో రగిలించుమా
1. నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన
సంగతులను చూచునట్లు కనులు తెరువుమా
2. నీ ఆగమనంకొరకు సిద్ధము చేసే
వాక్యమును ఆలకించు చెవులనీయుమా
3. నే నడుచు త్రోవలందు క్షేమమునిచ్చే
కట్టడలు గ్రహించే మనసు నిలుపుమా
4. నా దీనశరీరమును పాపమునుండి
కాపాడుకొనునట్టు భయము నేర్పుమా


Anni velala adharinchedi athma rupi Lyrics


అన్నివేళలా ఆదరించెడి ఆత్మరూపీ నీకే వందనం
ఎన్ని తీరుల నిన్ను కొలిచినా తీర్చలేను నేను నీ ఋణం
1. పడిపోయుయుండగా నను తిరిగి లేపితివి
స్థిరపరచి దీవించగా నీ కరము చాపితివి
పోగొట్టుకున్నదంత ఇచ్చితివి
రెట్టింపు శోభ మరల తెచ్చితివి
2. నిను వెంబడించగా శ్రమలెన్నో కలిగినా
సువార్త చాటించగా ఉన్నవన్నీ పోయునా
నూరంతల దీవెనలు పంపెదవు
సమృద్ధితో నను నింపెదవు


Anudhinamu naa bharam Lyrics


అనుదినము నా భారం భరియుంచే యేసయ్యా
నీ మేలులతో సంతృప్తిపరచే
అ.ప: ఆశ్చర్యకరుడవయ్యా - ఐశ్వర్యము నీవయ్యా
1. నీలో దొరకనిది లేదుగా - ఎంత తీసుకున్నా తరగదుగా
నింపెదవు గిన్నె పొర్లునట్టుగా
2. నాకు కలిగినవి నీవెగా - ఏమీ పొందలేను నీకు వేరుగా
ఇచ్చెదవు నిద్రించుచుండగా
3. నీపై నమ్మికతో స్తుతియుంచగా - అన్ని అక్కరలు తీరిపొవుగా
పూడ్చెదవు లోటు లేకుండా


Prayasatho paruguletthina pondhalani ashinchina ప్రయాసతో పరుగులెత్తినా పొందాలని ఆశించినా

Song no: 132
    ప్రయాసతో పరుగులెత్తినా - పొందాలని ఆశించినా } 2
    కరుణించు దేవా నీ కృపచేతనే } 2
    కార్యాలు నెరవేరను - కోరికలన్నీ తీరును } 2

  1. కన్నీటితో నీకు మొరపెట్టినా
    ఉపవాసపు దీక్షపట్టి కనిపెట్టినా } 2
    ప్రార్ధన విను దేవా నీ కృపచేతనే } 2
    మనవులు సన్నిధిని చేరును - త్వరగా జవాబు దొరుకును {ప్రయాసతో}

  2. కుడి ప్రక్కన పదివేలమంది కూలినా
    హతమార్చాను శత్రువులు చుట్టు చేరినా } 2
    రక్షించు దేవా నీకృపచేతనే } 2
    అపాయములు తొలగిపోవును - క్షేమము నెమ్మదియు కలుగును {ప్రయాసతో}

  3. తెలివితేటలెన్నో ఉపయోగించినా
    బలశౌర్యములన్నీ ప్రయోగించినా } 2
    దీవించు దేవా నీ కృపచేతనే } 2
    చేతిపనుల ఫలితముండును - ధ్యానముతో కొట్లు నిండును {ప్రయాసతో}