Santho geethamu padedhanu Lyrics


సంతోషగీతము పాడెదను
యేసు నీ ఘనతను చాటెదను
స్తోత్రము చెల్లింతును నీ కీర్తి వివరింతును
1 నా ప్రార్ధన నీవెపుడా త్రోసివేయలేదు
నాయోద్దనుండి నీ కృపను తీసివేయలేదు
నా విజ్ఞాపన ఆలించావు నా మనవి అంగీకరించావు
2 సమృద్ధి ఉన్న ప్రాంతానికి నన్ను చేర్చినావు
తోట్రిల్లకుండా స్థిరముగను నిలువబెట్టినావు
నను బాగుగ పరిశీలించావు నిర్మలునిగ రుపొందించావు


Naa pranama dhigulendhuku Lyrics


నా ప్రాణమా దిగులెందుకు
నాలోపల వ్యధ చెందకు
ఎత్తైన నీ కోటగా సర్వాధిపతి ఉండగా
భయపడక నిలుచుండుమా
జయకరుని స్తుతియుంచుమా
1. చెఱలో నిను వేయాలని చెలికాండ్రు నీకై ఉరులొగ్గినా
అపహాస్యము చేయాలని తమ నాలుకలకు పదునెట్టిన
దేవుడు వారిని కూల్చివేయును
ఆకస్మికముగ పడద్రోయును
సంతోషించుము విశ్వసించుము
2. ఎటునైనను మ్రింగాలని అపవాది నిన్ను వెంటాడిన
తనవైపుకు లాగాలని పలుశోధనలను పంపించినా
దేవుని హస్తము నీతో ఉండును
సైతానే అపజయమొందును
స్థిరముగనుండుము శాంతినొందుము
3. కలనైనను ఊహించని కడగండ్లు నీకు ప్రాప్తించినా
ఎవరూ నిను ప్రేమించని కడు ఘోరస్థితిలో నీవుండగా
దేవుని ద్వారము నీకై తెరచును
మేలులతో నిను బలపరచును
యేసుని చూడుము చింతవీడుము


Nee nama sankeerthana yesayya Lyrics


నీనామ సంకీర్తన యేసయ్యా నానోట ఆలాపన
నా గుండె లయలో ప్రభవించిన
నా గొంతునుండి ప్రవహించిన
అ.ప: నీపాటే ఆలంబన నా బ్రతుకులో సాంత్వన
1 పాటైన నీ మాట ఓదార్చును
వేదనలో ఆదరణ చేకూర్చును
కన్నీటిని తొలగించును కష్టాలను మరిపించును
నా జీవన రాగమా నా గాన మాధుర్యమా
2 వేకువనే నిను గూర్చిన ధ్యానము
నా యింట ఉత్సాహ స్తుతినాదము
ప్రతిరోజున వినిపించును కార్యములను జరిగించును
నా జీవన రాగమా నా గాన మాధుర్యమా
3 ఆరాధనా స్తోత్ర సంగీతము
ఆర్భాటముతో మ్రోగు వాయిద్యము
నీ కొట్లను తెరిపించును దీవెనలను కురిపించును
నా జీవన రాగమా నా గాన మాధుర్యమా


Stuthulandhuko Stuthiki pathruda Lyrics


స్తుతులనందుకో - స్తుతికి పాత్రుడా
ఘనతపొందుకో - స్తోత్రాహుడా
అప: నీకే నా ఆరాధనా - నీ కోసమే ఆలాపనా
నీకే నీకే నా హృదయార్పణ
1. నీవంటి దేవుడె లేడు - నీకెవ్వడు సాటిరాడు
2. నీలాంటి ఘనుడెవ్వడు - నీతోటి సముడెవ్వడు


Naa jeevitha navanu Lyrics


నా జీవిత నావను నాకై నేను నడుపలేను
అ.ప: అయినా తీరం చేరగలను యేసుతో కలిసి నేను
1 ఎగిరిపడుతున్న కెరటాలతో సాగకున్నది పయనం
సఫలమవదు నా ప్రయత్నం
2 కమ్ముకొచ్చిన పొగమంచుతో మూసుకున్నది మార్గం
కానరాదు ఏ సహాయం
3 కటిక చీకటి బెదిరింపుతో ఆవిరైనది ధైర్యం
జాడలేదు ఆశాకిరణం


Ullasimchuma bhuloka janama Lyrics


ఉల్లసించుమా భూలోక జనమా శ్రీయేసు నామమందు
పల్లవించగా పరలోక ఆనందం హృదయ సీమయందు
సృష్టి యంత స్తుతులు పాడగా ఓ మనవా
సృష్టికర్తను స్తుతించవా
1. ఊగేటి పైరులన్ని - సాగేటి ఏరులన్ని
మంద్రమైన స్తుతులను వినిపించుచున్నవి
పూచేటి పూవులన్నీ - వీచేటి గాలులన్నీ
చెప్పలేని ఆహ్లాదం పంచుచున్నవి
సృష్టి యంత స్తుతులు పాడగా ఓ మనవా
సృష్టికర్తను స్తుతించవా
2. ఎగిరేటి పక్షులన్ని - తిరిగేటి జీవులన్నీ
రారాజు మహిమను వివరించుచున్నవి
చల్లటి వాగులన్నీ - పచ్చటి తీగెలన్ని
ఆ యేసు పనులను ప్రచురించుచున్నవి
సృష్టి యంత స్తుతులు పాడగా ఓ మనవా
సృష్టికర్తను స్తుతించవా


Naayande nee balamu Lyrics


నాయందే నీ బలము చూపను
నీ నామం ఇల ప్రచురపరచను
అ.ప: నను నియమించిన దేవా స్తోత్రం
నను కరుణించిన దేవా స్తోత్రం
1.మర్త్యమైన లోకములో జ్యోతిగా ప్రకాశించను
నిత్యమైన రాజ్యములో నీతిగా ప్రవెశించను
2.తేనెకన్నా తీయనైన నీ మాటలు ప్రకటించను
జీవమైన శ్రేష్టమైన నీ బాటను పయనించను
3. మలినమైన నా దేహం మహిమతో పల్లవించను
మధురమైన నీ నామం మనసారా ప్రస్తుతించను