Sajeevudesuni rakthamlo Lyrics


సజీవుడేసుని రక్తంలో కడుగబడిన జనమా
సమాధి గెలిచిన దేవునిచే నాటబడిన వనమా
అప: యువజనమా - యేసులో బలపడుమా
జడియకుమా - యేసుకై పరుగిడుమా
1. జీవితకాలం స్వల్పం - యవ్వనమెంతో శ్రేష్టం
నీ యవనబలం యేసుకై వాడిన జీవితమే ఫలవంతం
2. ఆకర్షించే లోకం ఆశల నాశనకూపం
లోకాశలను జయుంచుచు సాగిన చేరెదవు పరలోకం
3. దేవుని తోటయే సంఘం - పనిచేయుట నీ ధర్మం
నీ వరములను రెట్టింపు చేసిన పొందెదవు బహుమానం


Premaku prathirupama Lyrics


ప్రేమకు ప్రతిరూపమా - ప్రేమించే దైవమా
తండ్రియైనవాడా వందనం - మాతో ఉన్నవాడా వందనం
1. ప్రియమైన కుమారుని మాకొరకు పంపినావు
సిలువకప్పగించావు వందనం
శిక్షను తొలగించావు వందనం
2. ఆదరణకర్తను లోకంలో ఉంచినావు
జ్ఞానమిచ్చుచున్నావు వందనం
మమ్ము నడుపుచున్నావు వందనం


Ruchi chuchi ttelusuko Lyrics


రుచిచూచి తెలుసుకో హృదయాన చేర్చుకో
ఎంతో ఉత్తముడైన యేసు దేవుని
అ.ప: వేదపురుషుడు దేవా తనయుడు
రక్షించగల సమర్ధుడు
1 కానివాటికొరకెందుకు రూకలను ఖర్చుచేతువు
మాటవినని వారికెందుకు విన్నపాలు వినిపింతువు
మొర్రపెట్టిన వినే దేవుడు
సమాధానమీయగల ఆత్మరూపుడు
2 నీలాంటి సామాన్యునికి నీవెందుకు పుజచేతువు
స్వీకరించలేనివానికి నైవేద్యములర్పింతువు
పాపమేదియు లేని దేవుడు
క్షమించే మనసుగల కరుణశీలుడు
3 మరణమైన బలహీనునికి నీవేల భక్తిచేతువు
చేయ శక్తిలేనివానిని ఎట్లు ఉద్ధరించమందువు
మృతినిగెల్చిన ఒకే దేవుడు
నిత్యజీవమీయగల విజయవీరుడు


Athisrestuda adhvithiyuda Lyrics


అతిశ్రేష్టుడా - అద్వితీయుడా నిన్నెవరితో పోల్చిచూతును
అసమానమైన నీదు ప్రేమను ఇలదేనితో సరిచూతును
నా ప్రేమమూర్తి యేసు నీవుండగా
నేనింక వేరేమి కోరుకుందును
1. నా కోసమే ఆ సిలువలో - ఎన్నెన్ని బాధలు అనుభవించినావు
మరణంబునొందునంతగా - నీ ప్రేమ చూపినావుగా
2. ఇహలోకపు మమతలన్నియు - నీ ప్రేమముందు బహుస్వల్పమే
ఇలలోని సంపదలన్నియు - నీ ఎదుట చూడ అల్పమే
3. ఇల నన్ను కన్నతల్లికన్ననూ - విలువైన ప్రేమ చూపించితివే
వెలలేని మంచిమిత్రుడా - బలమైన నా దేవుడా


Vedhanatho gunde raguluchunnadhi Lyrics


వేదనతో గుండె రగులుచున్నది
 ఆదరణే లేక కుములుచున్నది
బాధల వలయాన చిక్కి - రోదనచే బహుగా సొక్కి
మనసు మూగగా మూల్గుచున్నది
అప: న్యాయాధిపతి యేసయ్యా - న్యాయము తీర్చగ రావయ్యా
1. పగవారిముందు ఘనమైన విందు సిద్ధము చేసేదనంటివే
పొగలా నను కమ్మిన నా శత్రువు క్రియలు చూచియు మిన్నకుంటివే
నా పక్షమందు నిలిచి పగతీర్చుము
నెమ్మది కలిగించి నా స్థితిమార్చుము
2. నీ సేవకులను ప్రత్యేకించితివే వారిని హెచ్చించెదనంటివే
నీ సేవకులనే వేదించువారిని వర్దిల్లనిచ్చుచుంటివే
అవమానమునే వారికి కలుగజేయుము
నీ ప్రజలను ధైర్యముతో బ్రతుకనీయుము
3. అరచేతియందు నను చెక్కుకుంటివే కీడేమి రానీయనంటివే
చెరపట్టగా నన్ను చెలరేగిన వారిని ఆటంకపరచకుంటివే
నమ్మదగిన దేవా నను ఎడబాయకము
విరోధుల చేతిలో నను పడనియ్యకుము


Naa janulainavarevaru Lyrics


నా జనులైనవారెవరూ నాశనమునకు పోవలదు
భారతదేశ ప్రజలెవరు ఉగ్రతబారిన పడవలదు
అ.ప: దీవించుము దీవించుము భారతదేశాన్ని
రక్షించుము రక్షించుము నాదేశ జనాంగాన్ని
1 నా రక్తసంబంధులు ఇంటను ప్రేమపంచువారు
నేడు నాలో భాగమైయున్నవారు
ఆరని అగ్నిలో వేదనపడుట నేనెట్లు భరించను
రేపు ఆరని అగ్నిలో వేదనపడుట నేనెట్లు భరించను
2 నాకున్న స్నేహితులు బాధలో ఆదరించువారు
నేడు వెంటే ఆప్తులైయున్నవారు
ఆ నరకములో ప్రలాపించుట నేనెట్లు సహించను
రేపు ఆ నరకములో ప్రలాపించుట నేనెట్లు సహించను
3 నా చుట్టుఉన్నవారు నవ్వుతూ పలకరించువారు
నేడు ఎంతో సాయమైయున్నవారు
పాతాళములో పండ్లుకొరుకుట నేనెట్లు ఊహించాను
రేపు పాతాళములో పండ్లుకొరుకుట నేనెట్లు ఊహించాను


Uruko hrudhayama Lyrics


ఊరుకో హృదయమా - నీలో మత్సరమా
దేవునివైపు చూడుమా - ఆ చూపులో శాంతి గ్రోలుమా
1. దుర్జనులను చూచి కలవరమేల
దుష్టులు వృద్ధిచెందగా ఆయాసమేల
నమ్మికతో ప్రభుని చిత్తముకై వేడు
తగినకాలములో నిను హెచ్చించును చూడు
2. విశ్రమించు ఆయన ఒడిలో హాయుగా
ధైర్యము వీడక కనిపెట్టు ఆశగా
ఆయన చల్లనిచూపే ప్రసాదించు శాంతి
కలిగించు సహనము తొలగించు బ్రాంతి