Home Prabhu Pammi 🎤 Pasuvula paakalo deva kumaarudu పశువుల పాకలో దేవ కుమారుడు Pasuvula paakalo deva kumaarudu పశువుల పాకలో దేవ కుమారుడు personly December 23, 2021 0 share పశువుల పాకలో దేవ కుమారుడు దీనుడై పుట్టెను మానవాళికి ఆకాశాన దూతలు పాడి స్తుతించిరి గొల్లలు జ్ఞానులు, పూజించిరి మనసే పులకించెను క్రీస్తు జన్మతో తనువే తరియించెను రాజు రాకతో కొనియాడి కీర్తించెదము పరవశించి ఆరాధించెదం } 2 యుదయ దేశమున, దావీదు పురమందు శ్రీయేసు జనియించే దీన గర్భమున పరలోకనాధుండు ధరణుద్భవించాడు ఇమ్మానుయేలుగ నేడు తోడుగా ఉన్నాడు రండి చూడగా వెళ్ళెదం, రక్షకుని భజియించెదం కనరండి తనయుని కొలిచెదం ఉల్లాసముతో పాడెదం, ఆనందముతో మ్రోక్కెదం ఆదిసంభుతుని అర్భాటించెదం || పశువుల పాకలో || భోళము సాంబ్రాణి బంగారు కానుకలు సరిరావు ఎన్నటికీ అర్పించు నీ హృదయం అక్షయుడు దేవుడు, రక్షకుడు వచ్చాడు మోక్షాన్ని తెచ్చాడు ఈ మానవమనుగడకు ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచనకర్త క్రీస్తు బలవంతుడు అయినవాడు మారాజు ఉల్లాసముతో పాడెదం, ఆనందముతో మ్రోక్కెదం ఆదిసంభుతుని అర్భాటించెదం || పశువుల పాకలో || Pasuvula paakalo deva kumaarudu dheenudai puttenu maanavaaliki aakaasaana dhoothalu paadi sthuthinchiri gollalu gnaanulu poojinchiri manasey pulakinchenu kreesthu janmatho thanuvey tharinchenu raaju raakatho Koniyaadi keerthinchedhamu paravasinchi aaradhinchedham Yudhaya dheshamuna, dhaaveedhu puramandhu sri yesu janiyinche dheena garbhamuna paraloka naadhundu dharanudhbavinchaadu immaanuyeluga nedu thodugaa unnaadu randi choodagaa velledam, rakshakuni bhajiyinchedam kanarandi thanyuni kolichedam ullaasamutho paadedham, aanandhamutho mrokkedham aadhisambhoothuni aarbhaatinchedam || Pasuvula paakalo || Bholamu saambraani bangaaru kaanukalu sariraavu ennatiki arpinchu nee hrudhayam akshayudu dhevudu, rakshakudu vachaadu mokshaanni thechaadu ee maanava manugadaku aascharyakarudu yesu, aalochana kartha kreesthu balavanthudu ayinavaadu maaraaju ullaasamutho paadedham, aanandhamutho mrokkedham aadhisambhoothuni aarbhaatinchedam || Pasuvula paakalo || పశువుల పాకలో దేవ కుమారుడు Pasuvula paakalo deva kumaarudu Tags Christmas ▤Pammi Daniel ✍Prabhu Pammi 🎤 Facebook Twitter Whatsapp Newer Older