50
Pasuvula paakalo deva kumaarudu పశువుల పాకలో దేవ కుమారుడు
పశువుల పాకలో దేవ కుమారుడు
దీనుడై పుట్టెను మానవాళికి
ఆకాశాన దూతలు పాడి స్తుతించిరి
గొల్లలు జ్ఞానులు, పూజించిరి
మనసే పులకించెను క్రీస్తు జన్మతో
తనువే తరియించెను రాజు రాకతో
కొనియాడి కీర్తించెదము
పరవశించి ఆరాధించెదం } 2
యుదయ దేశమున, దావీదు పురమందు
శ్రీయేసు జనియించే దీన గర్భమున
పరలోకనాధుండు ధరణుద్భవించాడు
ఇమ్మానుయేలుగ నేడు తోడుగా ఉన్నాడు
రండి చూడగా వెళ్ళెదం, రక్షకుని భజియించెదం
కనరండి తనయుని కొలిచెదం
ఉల్లాసముతో పాడెదం, ఆనందముతో మ్రోక్కెదం
ఆదిసంభుతుని అర్భాటించెదం
|| పశువుల పాకలో ||
భోళము సాంబ్రాణి బంగారు కానుకలు
సరిరావు ఎన్నటికీ అర్పించు నీ హృదయం
అక్షయుడు దేవుడు, రక్షకుడు వచ్చాడు
మోక్షాన్ని తెచ్చాడు ఈ మానవమనుగడకు
ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచనకర్త క్రీస్తు
బలవంతుడు అయినవాడు మారాజు
ఉల్లాసముతో పాడెదం, ఆనందముతో మ్రోక్కెదం
ఆదిసంభుతుని అర్భాటించెదం
|| పశువుల పాకలో ||
Pasuvula paakalo deva kumaarudu
dheenudai puttenu maanavaaliki
aakaasaana dhoothalu paadi sthuthinchiri
gollalu gnaanulu poojinchiri
manasey pulakinchenu kreesthu janmatho
thanuvey tharinchenu raaju raakatho
Koniyaadi keerthinchedhamu
paravasinchi aaradhinchedham
Yudhaya dheshamuna, dhaaveedhu puramandhu
sri yesu janiyinche dheena garbhamuna
paraloka naadhundu dharanudhbavinchaadu
immaanuyeluga nedu thodugaa unnaadu
randi choodagaa velledam, rakshakuni bhajiyinchedam
kanarandi thanyuni kolichedam
ullaasamutho paadedham, aanandhamutho mrokkedham
aadhisambhoothuni aarbhaatinchedam
|| Pasuvula paakalo ||
Bholamu saambraani bangaaru kaanukalu
sariraavu ennatiki arpinchu nee hrudhayam
akshayudu dhevudu, rakshakudu vachaadu
mokshaanni thechaadu ee maanava manugadaku
aascharyakarudu yesu, aalochana kartha kreesthu
balavanthudu ayinavaadu maaraaju
ullaasamutho paadedham, aanandhamutho mrokkedham
aadhisambhoothuni aarbhaatinchedam
|| Pasuvula paakalo ||
పశువుల పాకలో దేవ కుమారుడు Pasuvula paakalo deva kumaarudu
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)