దేవా దృష్ఠించు మా దేశం
నశించు దానిని బాగుచేయుము
పాపము క్షమియించి స్వస్థపరచుము
శాపము తొలగించి దీవించుము
దేశాధికారులను దీవించుము
తగిన జ్ఞానము వారికీయుము
స్వార్ధము నుండి దూరపరచుము
మంచి ఆలోచనలు వారికీయుము
మంచి సహకారులను దయచేయుముదేవా(2)
నీతి న్యాయములు వారిలో పెట్టుము తండ్రి || దేవా ||
తుఫానులెన్నో మాపై కొట్టగా
వరదలెన్నో ముంచి వేయగా
పంటలన్నీ పాడైపోయే
కఠిన కరువు ఆసన్నమాయే
దేశపు నిధులే కాలీయాయే (2)
బీదరికమూ నాట్యం చేయుచుండె || దేవా ||
మతము అంటూ కలహాలే రేగగా
నీది నాదని బేధం చూపగా
నీ మార్గములో ప్రేమ నిండివుందని
ఈ దేశమునకు క్షేమమునిచ్చునని
క్రైస్తవ్యము ఒక మతమే కాదని(2)
రక్షణ మార్గమని జనులకు తెలుపుము తండ్రీ || దేవా ||
Deva dhrushtinchu Maa desam
Nasinchu danini baagucheyumu - 2
దివ్య తార! దివ్య తార!
దివినుండి దిగి వచ్చిన తార } 2
వెలుగైన యేసయ్యను వేనోళ్ళ చాటినది } 2
పశుల పాకచేరినది క్రిస్మస్ తార } 2
దివ్య తార! దివ్య తార!
దివినుండి దిగి వచ్చిన తార
జన్మించే యేసు రాజు పరవశించె పరలోకం } 2
మధురమైన పాటలతో మారు మ్రోగెను....
క్రీస్తు జన్మమే పరమ మర్మమే
కారు చీకట్లో అరుణోదయమే
క్రీస్తు జన్మమే పరమ మర్మమే
కారు చీకట్లో అరుణోదయమే
తార తార క్రిస్మస్ తార
తార తార దివ్య తార
తార తార క్రిస్మస్ తార
తార తార దివ్య తార
దివ్య తార! దివ్య తార!
దివినుండి దిగి వచ్చిన తార
ప్రభు యేసు నామం ప్రజా సంఖ్యలో నున్నది } 2
అవనిలో క్రీస్తు శకము అవతరించినది...
క్రీస్తు జన్మమే మధురమాయెనే
శాంతిలేని జీవితాన కాంతి పుంజమే
క్రీస్తు జన్మమే మధురమాయెనే
శాంతిలేని జీవితాన కాంతి పుంజమే
తార తార క్రిస్మస్ తార
తార తార దివ్య తార
తార తార క్రిస్మస్ తార
తార తార దివ్య తార
దివ్య తార! దివ్య తార!
దివినుండి దిగి వచ్చిన తార
పాప లోక జీవితం పటాపంచెలైనది } 2
నీతియై లోకములో వికసించినదీ...
క్రీస్తు జన్మమే ప్రేమామయమై
చీకటి హృదయాలలో వెలుగు తేజమే
క్రీస్తు జన్మమే ప్రేమామయమై
చీకటి హృదయాలలో వెలుగు తేజమే
తార తార క్రిస్మస్ తార
తార తార దివ్య తార
తార తార క్రిస్మస్ తార
తార తార దివ్య తార
దివ్య తార! దివ్య తార!
దివినుండి దిగి వచ్చిన తార
దివ్య తార! దివ్య తార!
దివినుండి దిగి వచ్చిన తార
వెలుగైన యేసయ్యను వేనోళ్ళ చాటినది
వెలుగైన యేసయ్యను వేనోళ్ళ చాటినది
పశుల పాకచేరినది క్రిస్మస్ తార
పశుల పాకచేరినది క్రిస్మస్ తార
తారను చూచి తరలి వచ్చాము
తూర్పు దేశ జ్ఞానులము
తన భుజముల మీద రాజ్య భారమున్న
తనయుడెవరో చూడ వచ్చామమ్మా (2)
బంగారు సాంబ్రాణి బోళములు – బాలునికి మేము అర్పించాము
మా గుండెల్లో నీకేనయ్యా ఆలయం – మా మదిలో నీకేనయ్యా సింహాసనం
ఈ బాలుడే మా రాజు – రాజులకు రారాజు
ఇహం పరం అందరము
జగమంతా సందడి చేద్దాం