యేసయ్యా ....... } 4
ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను
ఎలా విడువగలనయ్యా నీ సేవను } 2 || ఎలా మరువగలనయ్యా ||
యేసయ్యా ....... } 4
- ఆత్మీయులే నన్ను ఆదరించలేదు
ప్రేమించువారే ప్రేమించలేదు } 2
ఆదరించావు ప్రేమించావు } 2
అన్ని వేళలా నాకు తోడు నీవయ్యావు } 2 అందుకే || ఎలా మరువగలనయ్యా ||
- అనాథగా నేను తిరుగుచున్నప్పుడు
ఆకలితో నేను అలమటించినప్పుడు } 2
ఆదరించావు ఆకలి తీర్చావు } 2
అన్ని వేళలా నాకు తోడు నీవయ్యావు } 2 అందుకే || ఎలా మరువగలనయ్యా ||
- బంధువులే నన్ను ద్వేషించినారు
సొంత తల్లిదండ్రులే వెలివేసినారు } 2
చేరదీసావు సేదదీర్చావు } 2
అన్ని వేళలా నాకు తోడు నీవయ్యావు } 2 అందుకే || ఎలా మరువగలనయ్యా ||
Song no: 109
నీతోనే నా నివాసము – నిత్యము ఆనందమే
సౌందర్య సీయోనులో
నీ మనోహరమైన ముఖము దర్శింతును
నీతోనే నా నివాసము – నిత్యము ఆనందమే
సీయోనులో స్థిరమైన పునాది నీవు
నీ మీదే నా జీవితము అమర్చుకున్నాను (2)
- సూర్యుడు లేని చంద్రుడు లేని
చీకటి రాత్రులు లేనే లేని (2)
ఆ దివ్య నగరిలో కాంతులను
విరజిమ్మెదవా నా యేసయ్యా (2) || సీయోనులో ||
- కడలి లేని కడగండ్లు లేని
కల్లోల స్థితి గతులు దరికే రాని (2)
సువర్ణ వీధులలో
నడిపించెదవా నా యేసయ్యా (2) || సీయోనులో ||
- సంఘ ప్రతిరూపము – పరమ యెరుషలేము (2)
సౌందర్య సీయోనులో
నీ మనోహరమైన ముఖము దర్శింతును (2)
నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే (3)
ఆనందమే పరమానందమే (10)
Song no: 119
ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తం
పాపములన్నియు కడుగుచున్నది } 2
పరమతండ్రితో సమాధానము కలిగించుచున్నది } 2
- దుర్ణీతి నుండి విడుదలచేసి
నీతిమార్గాన నిను నడిపించును } 2
యేసురక్తము క్రయధనమగును
నీవు ఆయన స్వస్థమౌదువు } 2 || ప్రవహించుచున్నది ||
- దురభిమానాలు దూరముచేసి
యథార్థ జీవితం నీకనుగ్రహించును } 2
యేసురక్తము నిర్దోషమైనది
నీవు ఆయన ఎదుటే నిలిచెదవు } 2 || ప్రవహించుచున్నది ||
- జీవజలముల నది తీరమున
సకలప్రాణులు బ్రతుకుచున్నవి } 2
యేసురక్తము జీవింపజేయును
నీవు ఆయన వారసత్వము పొందెదవు } 2 || ప్రవహించుచున్నది ||
Song no: 95
నా జీవిత భాగస్వామివి నీవు
నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు } 2
నాకే సమృద్దిగా నీ కృపను పంచావు
నా యేసురాజ కృపాసాగరా అనంతస్తోత్రార్హుడా } 2
- నీ దయగల కనుసైగలే ధైర్యపరచినవి
నీ అడుగుజాడలే నాకు త్రోవను చూపినవి } 2
నీ రాజ్య పౌరునిగా నన్ను మార్చితివి
నీ సైన్యములో నన్ను చేర్చితివి } 2 || నా జీవిత ||
- నీ దయగల మాటలే చేరదీసినవి
నీతి నియమాలలో నన్ను నడిపించుచున్నవి } 2
నీ కృపనే ధ్వజముగ నాపైన నిల్పితివి
నీ విందుశాలకు నను చేర్చితివి } 2 || నా జీవిత ||
- నీ దయగల తలంపులే రూపునిచ్చినవి
నీదు హస్తములే నన్ను నిర్మించుచున్నవి } 2
నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నావు
నీ అంతఃపురములో నను చేర్చుదువు || నా జీవిత ||
Song no: 91
పదివేలలోని అతికాంక్షణీయుడు
ఎంతో వికారుడాయెన్
- నా నిమిత్తమే శాపగ్రస్థుడై
ఘోరాసిలువను మోసి వహించెన్
ఈ గొప్పప్రేమ నేను మరువన్ జీవితకాలములో || పదివేలలోని ||
- గాయములను శిక్షనిందను
నా శాంతి నిమిత్తమే గదా
నీ శరీరములో పొందితిని నా ప్రియా యేసుదేవా || పదివేలలోని ||
- అన్యాయమైన తీర్పును పొంది
వ్రేలాడేను హీన దొంగల మధ్య
సింహాసనమున నీతో నేనుండి సదా పాలించుటకే || పదివేలలోని ||
- మరణము ద్వారా కృప నొసంగి
అక్షయజీవము నిచ్చితివి
మహిమనుండి అధిక మహిమపొంది
మార్పు నొందుటకేగా || పదివేలలోని ||
- నీ రూపం చూచి సిలువను మోసి
నీతో నడచి సేవను చేసి
నా ప్రాణము నీకే అర్పింతును
కడవరకు కాపాడుము || పదివేలలోని ||
Song no: 89
రక్తం యేసు రక్తం
ప్రతి పాపములను కడుగును
ప్రతి అవయవములను శుద్ధీకరించును
- ఆదికాలపు అద్బుతములతో
అన్ని వ్యాధులను స్వస్థ పరచితివి
ఆత్మలను రక్షించుమయ్యా
ఆత్మ నాథుడా యేసయ్య || రక్తం ||
- రోగ బాధలు వేదనలకు
లోనైయున్న మా శరీరములను
రోగం తీర్చి బాధలు బాపి
కార్చితివి నీ రక్తం ద్వారా || రక్తం ||
- రోగుల పరమ వైద్యుడనీవే
దివ్య ఔషధం నీవే గదయ్యా
రోగ శాంతి నియ్యుము దేవా
మారని యేసయ్య నీ శక్తి ద్వారా || రక్తం ||
దీవించుమో దేవా నా మంచి యేసు దేవా
ప్రియమైన క్రీస్తు ప్రభువా ప్రార్థింతు నిన్నేనయా
ఆలించు నా యేసయ్య ప్రార్థింతు నిన్నేనయా
ఆలించు నా యేసయ్య దీవించుమో దేవా
- నీ ప్రేమయే నీ కృపయే నాదు జీవము నొసగెను
నీ నామమే నీ వాక్యమే నాకు త్రోవను చూపెను } 2
పాపముతో శాపముతో నలిగాను నా బ్రతుకులో
కాపరివై దేవుడవై నిలిచావు నా మనసులో } 2
నా దాగు చోటు నీవే నా నీతి బాట నీవే
కీర్తింతు నీ నామము ప్రేమింతు నీ మార్గము } 2
- కృతజ్ఞత స్తుతులతో నిన్ను నేను స్తుతించెద
పాటలు పాడుచు నాట్యమాడుచు నీదు సన్నిధి చేరెద } 2
కష్టాలైనా కన్నీరైనా నిన్ను విడువలెనేసయ్య
కరువైనా భారమైనా నిన్ను మరువలేనేసయ్య } 2
నా దాగు చోటు నీవే నా నీతి బాట నీవే
కీర్తింతు నీ నామము ప్రేమింతు నీ మార్గము } 2
దీవించుమో దేవా నా మంచి యేసు దేవా
ప్రియమైన క్రీస్తు ప్రభువా ప్రార్థింతు నిన్నేనయా
ఆలించు నా యేసయ్య ప్రార్థింతు నిన్నేనయా
ఆలించు నా యేసయ్య దీవించుమో దేవా