Song no:
యేసయ్య నిను చూడాలని యేసయ్య నిను చేరాలని
యేసయ్యనీతో ఉండాలని యేసయ్య నీలా నిలవాలని
ఆశగొనియున్నది నా మనస్సు
తృష్ణగొనియున్నది నా హృదయం || యేసయ్య ||
ఎటు చూసిన పాపమే చీకటి కమ్మిన లోకములో
ఎటుపోయిన వేదనే పాపము నిండిన పుడమిలో
నీలా బ్రతకాలని నీతో ఉండాలని
ఆశగొనియున్నది నా మనస్సు
తృష్ణగొనియున్నది నా హృదయం || యేసయ్య ||
యదవాకిట శోదనే ద్వేషము నిండినా మనుషులతో
హృదిలోపట శోకమే కపటమైన మనస్సులతో
నీలా బ్రతకాలని నీతో ఉండాలని
ఆశగొనియున్నది నా మనస్సు
తృష్ణగినియున్నది నా హృదయం || యేసయ్య ||
Song no: 112
రాజ జగమెరిగిన నా యేసు రాజా
రాగాలలో అనురాగాలు కురిపించిన
మనబంధము అనుబంధము } 2
విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను? || రాజ || } 2
దీన స్థితియందున సంపన్న స్థితియందున
నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి యుందునే } 2
నిత్యము ఆరాధనకు నా ఆధారమా
స్తోత్రబలులు నీకే అర్పించెద యేసయ్యా } 2 || రాజ ||
బలహీనతలయందున అవమానములయందున
పడినను కృంగినను నీకృప కలిగియుందునే } 2
నిత్యము ఆరాధనకు నా ఆధారమా
స్తోత్రబలులు నీకే అర్పించెద యేసయ్యా } 2 || రాజ ||
సీయోను షాలేము మన నిత్య నివాసము
చేరుటయే నా ధ్యానము ఈ ఆశ కలిగి యుందునే } 2
నిత్యము ఆరాధనకు నా ఆధారమా
స్తోత్రబలులు నీకే అర్పించెద యేసయ్యా } 2 || రాజ ||
Telugu
English
Song no: 101
కలువరిగిరిలో సిలువధారియై
వ్రేలాడితివా నా యేసయ్యా } 2
అన్యాయపు తీర్పునొంది ఘోరమైన శిక్షను
ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా } 2
నా దోషక్రియలకై సిలువలో బలి అయితివా
నీ ప్రాణ క్రయ ధనముతో రక్షించితివా } 2 || కలువరిగిరిలో ||
దారి తప్పిపోయిన గోర్రెనై తిరిగాను
ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను } 2
ఆకరి రక్తపు బొట్టును నా కొరకై ధారపోసి
నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా } 2 || కలువరిగిరిలో ||
Song no: 101
Kaluvarigirilo Siluvadhaariyai
Vrelaadithivaa Naa Yesayyaa } 2
Anyaayapu Theerpunondi Ghoramaina Shikshanu
Dveshaagni Jwaalalo Doshivai Nilichaavaa } 2
Naa Doshakriyalakai Siluvalo Bali Aithivaa
Nee Praana Kraya Dhanamutho Rakshinchithivaa } 2 || Kaluvarigirilo ||
Daari Thappipoyina Gorrenai Thirigaanu
Ae Daari Kaanaraaka Siluva Dariki Cheraanu } 2
Aakari Rakthapu Bottunu Naakorakai Dhaaraposi
Nee Praana Thyaagamutho Vidipinchithivaa } 2
|| Kaluvarigirilo ||