Siddhapadudham siddhapadudham mana devuni sannidhiki సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై   

సిద్ధపడుదాం సిద్ధపడుదాం         }
మన దేవుని సన్నిధికై                 }
సిద్ధపరుచుదాం సిద్ధపరుచుదాం }॥2॥
మన హృదయము ప్రభు కొరకై   }
సిద్ధమనస్సను జోడు తొడిగి  }
సమాధాన సువార్త చాటెదం  }॥2॥
సమాధాన సువార్త చాటెదం ......
                                     ॥సిద్ధపడుదాం॥
హల్లెలూయ ....॥4॥
హోసన్నా.... హోసన్నా....
హల్లెలూయ.... హోసన్నా

           
ప్రతి ఉదయమున ప్రార్ధనతో  }
నీ సన్నిధికి సిద్ధమవుదును    }
జీవము కలిగిన వాక్కులకై     }॥2॥
నీ సన్నిధిలో వేచియుందును }
॥సిద్ధమనస్సను॥           ॥సిద్ధపడుదాం॥

           
సత్కార్యముకై సిద్ధపడి               }
పరిశుద్ధతతోనుందును               }
అన్నివేళలయందు ప్రభుయేసుని }॥2॥
ఘనపరచి కీర్తింతును                 }
॥సిద్ధమనస్సను॥           ॥సిద్ధపడుదాం॥
           
బుద్ధిని కలిగి నీ రాకడకై           }
మెలకువతో నేనుందును         }
నీ రాజ్య సువార్తను ప్రకటించి  }॥2॥
ప్రతివారిని సిద్ధపరతును         }
॥సిద్ధమనస్సను॥           ॥సిద్ధపడుదాం॥

Nee krupaye nannu kachenu ni dhayayenannu dhachenu నీ కృపయే నన్ను కాచెను నీ దయయే నన్ను దాచెను

నీ కృపయే నన్ను కాచెను నీ దయయే నన్ను దాచెను
నీ కృపయే నన్ను కాచెను    }
నీ దయయే నన్ను దాచెను  }
నీ క్షమయే నన్ను ఓర్చెను    }॥2॥
నీ వాక్యమె ఓదార్చెను        }
చాలీనయ్య నీకృప చాలునయ్య ॥4॥
                                         ॥నీ కృపయే॥

            
గాడాంధకారములో నేనుండగా
నీ సన్నిధియే నాకు వెలుగాయెగా
నా శత్రువులే నన్ను తరుముచుండగా
నా స్థానములో నిలిచి పోరాడెగా
భయభీతులలో నేనుండగా }
అవమానముతో అల్లాడగా  }॥2॥
నా కాపరివై నన్ను చేరెగా
నా వైరులను వెళ్ళగొట్టెగా
॥చాలునయ్య॥                  ॥నీ కృపయే॥

           
నా వారే నన్ను గెంటివేయగా
మరణాభయమే నన్ను ఆవరింపగా
నా చెంతచేరి నన్ను స్వస్థపరిచెగా
నీ చేయి చాచి నన్ను చేరదీసెగా
అపజయమే నన్ను కృంగదీయగా }
అంటరానిదాననని  గేలిచేయగా   }॥2॥
నా పక్షమునా చేరి జయమిచ్చెగా
నాతో ఉంటానని మాట ఇచ్చెగా
॥చాలీనయ్య॥  ఐ             ॥నీ కృపయే॥

Yesayya ninnu chupa ashayya యేసయ్యా నిన్ను చూప ఆశయ్యా

Song no:
    యేసయ్యా నిన్ను చూప ఆశయ్యా
    నీ ప్రేమ నాలో ఉంది ఎంతో మేలయ్యా} 2
    నా యేసయ్యా నా యేసయ్యా } 4

  1. లోకమును ప్రేమించావు మనిషికై మరణించావు
    మరణాన్ని గెలిచావు పరలోకమిచ్చావు } 2
    నీ మరణములో జీవము ఉందయ్యా
    ఆ జీవమే మనిషికి ఆధారము } 2
    ఆధారము నీ మరణమే
    నిత్యజీవ మార్గము ఓ యేసయ్యా! || యేసయ్యా ||

  2. పాపమును త్రుంచావు దేవుడనిపించావు
    కీర్తింపబడుచున్నావు నా యేసు నా రాజా} 2
    నీ మాటలో జీవము ఉందయ్యా
    ఆ వాక్యమే మమ్ము వెలిగించిందయ్యా } 2
    ఆధారము నీ వాక్యమే
    నిత్యజీవ మార్గము నా యేసయ్యా! || యేసయ్యా ||



Arambhimchedha yesu nilo prathi dhinam ఆరంభించెద యేసు నీలో ప్రతీదినం

ఆరంభించెద యేసు నీలో ప్రతీదినం
ఆనందించెద యేసు నీలో ప్రతీక్షణం
ఆస్వాదించెద నీ మాటలమాధుర్యం ॥2॥
ఆరాధించెద నిన్నే నిత్యం ॥2॥ ॥ఆరంభించెద॥
            
నీ సన్నిధిలో ప్రతి ఉదయం
ఆలించెద నీ మధుర స్వరం
అరుణోదయమున నీ సహవాసం ॥2॥
నింపును నాలో నూతన ధైర్యం ॥2॥
                                             ॥ఆరంభించెద॥
            
నీ చిత్తముకై ప్రతి విషయం
అర్పించెద నీ కృపకోసం
వేకువ జామున నీ ముఖదర్శనం ॥2॥
పెంచును నాలో ఆత్మవిశ్వాసం ॥2॥
                                            ॥ఆరంభించెద॥

నా పెదవులతో ప్రతినిమిషం
స్తుతియించెద నీ ఘననామం
దిన ప్రారంభమున నీ ప్రియజ్ఞానం ॥2॥
కాల్చును నాలో అహం సర్వం ॥2॥
                                             ॥ఆరంభించెద॥

Uhalu nadhu utalu naa yesu raja nilone yunnavi ఊహలు నాదు ఊటలునా యేసురాజా నీలోనే యున్నవి

Song no: 53

    ఊహలు - నాదు ఊటలు
    నా యేసురాజా - నీలోనే యున్నవి -2
    ఊహకందవే - నీదు ఆశ్యర్యక్రియలు -2

  1. నీదు కుడి చేతిలోన నిత్యము వెలుగు తారగా -2
    నిత్య సంకల్పము నాలో నెరవేర్చుచున్నావు -2  ||ఊహలు||

  2. శత్రువులు పూడ్చినా ఊటలన్నియు త్రవ్వగా  -2
    జలలు గల ఊటలు ఇస్సాకునకు ఇచ్చినావు -2  ||ఊహలు||

  3. ఊరు మంచిదే గాని ఊటలన్నియు చెడిపొయెనే -2
    ఉప్పు వేసిన వెంటనే ఊట అక్షయతా నొందెనే -2  ||ఊహలు||

Rajadhi raja ravaa rajullaku rajuvai ravaa రాజాధిరాజా రావారాజులకురాజువై రావా

Song no:

    రాజాధిరాజా రావా
    రాజులకురాజువై రావా
    రాజు యేసు రాజ్య మేలరావా రవి కోటి తేజ యేసు రావా (2)
    రాజాధిరాజా రావే

  1. ఓ...........
    భూజనంబులెల్ల తేరి చూడగా
    ఓ....
    నీజనంబు స్వాగతంబు నియ్యగా
    నీ రాజ్యస్థాపనంబుసేయ
    భూరాజులెల్ల కూలిపోవ
    భూమిఆకాశంబుమారిపోవ
    నీ మహాప్రభావమున వేగ
    రాజాధిరాజరావా రాజులకురాజువై రావా

  2. ఆ............
    ఆ ఆకాశమున దూత లార్బటింపగా
    ఆ........
    ఆది భక్త సంఘ సమేతంబుగా
    ఆకసంబు మధ్య వీధిలోన
    ఏకమై మహాసభ సేయ
    లోకనాథ నీదు మహిమ లోన
    మాకదే మహానంద మౌగ
    రాజాధిరాజా రావే
    రాజులకు రాజు వై రావే

  3. ఓ................
    పరమ యెరూషలేమ పుణ్య సంగమా
    ఓ.......
    గొర్రె పిల్ల క్రీస్తుపుణ్య సంఘమా
    పరమ దూతలారా భక్తులారా
    పౌలపోస్తులా రా పెద్దలారా
    గొర్రె పిల్ల యేసు రాజు పేరా
    క్రొత్త గీత మెత్తి పాడ రావా
    రాజాధిరాజా రావా
    రాజులకు రాజువైరావా

Kanipettu chuntini prabhuva nee sannidhini కనిపెట్టు చుంటినీ.. ప్రభువా నీ సన్నిధిన

కనిపెట్టు చుంటినీ.. ప్రభువా నీ సన్నిధినీ....
నిన్ను ఆశ్రయించితినీ .. శరణము నీ వనీ....|2|
దాసి కన్నులు చుస్తున్నట్లుగా నా కన్నులు నిన్ను చూచుచుండగా
దాసుడు ఆశతో నిలుచునట్లుగా
నీ యెదుట నేను నిలచి యుంటిని ...

ప౹౹ నా కన్నీరు కాదనకూ...నన్నుచూడు ఈ క్షణం
నీ ఎన్నికను కృప నిలుపూ కీడు నుండి తప్పించూ ౹2౹ "కనిపెట్టు"

నీవు నాటిన మొక్కను నేను కాయుమూ క్షామము నుండి
నీకై పూసిన పువ్వును నేను దాయుమూ సుడిగాలులనుండి ... (2)
ప్రార్థన వినవయ్యా ప్రాణేశ్వరుండా....
కనికర పడవయ్యా.... కారుణామయుండా... ౹నా కన్నీరు౹

నీవు రాసిన రాతను నేను  నిలుపుమూ నీ రాకడవరకు
నీకై కూసిన కోయిల నేను  చూడుమూ ఆశతో ఉన్నా (2)
నిందలచేత  నిష్టురమయ్యా ఆదరణ చూపవా ఆరాదనీయుడా  ౹నా కన్నీరు౹