Yesayya nee namamlo sakthi vunnadhi యేసయ్య నీ నామంలో శక్తి ఉన్నది

Song no:
HD

    యేసయ్య నీ నామంలో శక్తి ఉన్నది
    అది నాకు అండగా నిలచి ఉన్నది " 2 "
    ఆదరించే నామం ఆశీర్వదించే నామం
    ఆదుకునే నామం యేసయ్య నామం " 2 " || యేసయ్య ||

  1. వేదనతో దుఃఖముతో ఉన్న వారిని
    జీవితమే వ్యర్ధమని ఎంచిన వారిని " 2 "
    ఆదరించే నామం ఆశీర్వదించే నామం
    ఆదుకునే నామం యేసయ్య నామం " 2 " || యేసయ్య ||

  2. వ్యాధితో బాధతో క్రుంగిన వారిని
    కన్నీటితో బ్రతుకును గడిపే వారిని " 2 "
    ఆదరించే నామం ఆశీర్వదించే నామం
    ఆదుకునే నామం యేసయ్య నామం " 2 " || యేసయ్య ||

  3. సమస్యతో శాంతియే లేని వారిని
    సంతోషమే ఎన్నడూ పొందని వారిని " 2 "
    ఆదరించే నామం ఆశీర్వదించే నామం
    ఆదుకునే నామం యేసయ్య నామం " 2 " || యేసయ్య ||

Neeve krupadharamu thiyeka deva నీవే కృపాదారము త్రియేక దేవా

Song no:
HD
    నీవే కృపాదారము త్రియేక దేవా
    నీవే క్షేమాదారము నా యేసయ్య } 2
    నూతన బలమును నవనూతన కృపను } 2
    నేటి వరకు దయచేయుచున్నావు
    నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా
    ఈ స్తోత్రగీతం నీకేనయ్యా || నీవే కృపాదారము ||

  1. ఆనందించితిని అనురాగబంధాల
    ఆశ్రయపురమైన నీలో నేను } 2
    ఆకర్షించితిని ఆకాశముకంటే
    ఉన్నతమైననీ ప్రేమను చూపి } 2
    ఆపదలెన్నో అలుముకున్నను అభయమునిచ్చితివి
    ఆవేదనల అగ్నిజ్వాలలో అండగానిలచితివి
    ఆలోచనవై ఆశ్రయమిచ్చి కాపాడుచున్నావు
    నీకే ఈ ప్రేమ గీతం అంకితమయ్యా
    ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా
    నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా
    ఈ స్తోత్రగీతం నీకేనయ్యా || నీవే కృపాదారము ||

  2. సర్వకృపానిధి సీయోను పురవాసి
    నీ స్వాస్థ్యముకై నన్ను పిలచితివి } 2
    సిలువను మోయుచు నీ చిత్తమును
    నెరవేర్చెదను సహనముకలిగి } 2
    శిధిలముకానీ సంపదలెన్నో నాకైదాచితివీ
    సాహసమైన గొప్ప కార్యములు నాకై చేసితివి
    సర్వశక్తిగల దేవుడవై నడిపించుచునావు
    నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా
    ఈ స్తోత్రగీతం నీకేనయ్యా || నీవే కృపాదారము ||

  3. ప్రాకారములను దాటించితివి
    ప్రార్థన వినెడి పావనమూర్తివి } 2
    పరిశుద్దులతో నన్ను నిలిపితివి
    నీ కార్యములను నూతన పరచి } 2
    పావనమైన జీవనయాత్రలో విజయము నిచ్చితివి
    పరమ రాజ్యమును నిలుపుట కొరకు అభిషేకించితివి
    పావనుడా నా అడుగులు జారక స్థిరపరచినావు
    నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా
    ఈ స్తోత్రగీతం నీకేనయ్యా || నీవే కృపాదారము ||   

Krotthyedu modhalu bettenu క్రొత్తయేడు మొదలు బెట్టెను

122 క్రీస్తుని మహిమ
రాగం - మధ్యమావతి తాళం - ఆట


Neeve krupadharamu thriyeka deva నీవే కృపాధారము త్రియేక దేవా

Song no:
no audio HD
    నీవే కృపాధారము త్రియేక దేవా - నీ వేక్షేమాధారము నా యేసయ్యా
    నూతన బలమును నవనూతన కృపను - 2
    నేటివరకు దయచేయుచున్నావు

    నుపల్లవి :- నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా
    ఈ స్తోత్రగీతం నీకేనయ్యా

  1. ఆనందించితి అనురాగబంధాన - ఆశ్రయపురమైన నీలో నేను -2
    ఆకర్షించితివి ఆకాశముకంటే ఉన్నతమైన నీ ప్రమనుచూపి - 2
    ఆపదలెన్నో అలుముకున్ననూ అభయమునిచ్చితివి
    ఆవేదనల అగ్నిజ్వాలలో అండగ నిలిచితివి
    ఆలోచనవై ఆశ్రయమిచ్చి కాపాడుచున్నావు
    నీకే ఈ ప్రేమగీతం అంకితమయ్యా - ఈ స్తోత్రగీతం నీకేనయ్యా || నీవే ||

  2. ప్రార్థించితిని ప్రాకారములను - దాటించగలిగిన ప్రభువే నీవని -2
    పరిశుద్ధతకై నియమించితివి - నీరూపమునాలో కనపరచుటకు 2
    పావనమైన జీవనయాత్రలో విజమునిచ్చితివి
    పరమరాజ్యములో చేర్చుటకొరకు అభిషేకించితివి
    పావనుడా నా అడుగులు జారక స్థిరపరచినావు
    నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా - ఈ స్తోత్రగీతం నీకేనయ్యా || నీవే ||

  3. సంపూర్ణతకై సంతృప్తి కలిగి - సిలువను మోయుచు నీతో నడిచెద - 2
    సుడివడిననా బ్రతుకును మార్చితివి - సింహాసనముకై నను పిలచితివి - 2
    శిధిలముకాని సంపదలెన్నో నాకైదాచితివి
    సాహసమైనమైన గొప్ప కార్యములు నాకై చేసితివి
    సర్వశక్తిగల దేవుడవైనాముందు నడచిన
    నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా - ఈ స్తోత్రగీతం నీకేనయ్యా || నీవే ||



Naa aathmatho anandhamutho sthuthiyinthunu నా ఆత్మతో ఆనందముతో స్తుతియింతును

Song no:
HD
    నా ఆత్మతో ఆనందముతో స్తుతియింతును (మార్కు 12:30,1కొరి 14:15)
    విరిగి నలిగిన హృదయము నీకే  అర్పింతును } 2 (కీర్తన 51:17)
    పరవశించి నే పాడగా నాలో నిన్నే నింపవా (అపో.కా 9:17)
    కరములెత్తి కీర్తించగా ఆత్మతో అభిషేకించవా } 2 (1యోహ 2:27)
    ఆరాధనా స్తుతి ఆరాధానా... ఆరాధనా స్తుతి ఆరాధానా... } 2(హెబ్రీ 13:15)  || నా ఆత్మతో ||

  1. ఆత్మ రూపుడవు అమరత్వుడవు ఆది అంతములు నీవే (యోహ 4:24, 1తిమో 6:16, ప్రక21:6)
    లేనివాటిని ఉన్నవాటిగా పిలిచే యెహోవా } 2 (రోమా 4:17)
    ఒక్కరైయున్న దేవుడవు నాపై వచియించవా (1తిమో 2:5,అపో.కా 2:17)
    నీలా నన్ను మార్చుటకు నాలో నివసించావా } 2(2కొరి 3:17,18)  || ఆరాధనా ||


  2. మహాదేవుడవు మృత్యుంజయుడవు మంచి కాపరివి నీవే (తీతు 2:13, లూకా 24:5,6, యోహా 10:11)
    మొదటివాడవు కడపటివాడవు నీవే యేసయా } 2 (ప్రక 1:18)
    ఒక్కరైయున్న దేవుడవు నాపై వచియించవా (1తిమో 2:5,అపో.కా 2:17)
    నీలా నన్ను మార్చుటకు నాలో నివసించావా } 2 (2కొరి 3:17,18)  || ఆరాధనా ||


  3. జీవదాతవు నిత్యుడవు మహిమ స్వరూపుడ నీవే (యోహా 7:38,హెబ్రీ 9:14,1పేతురు 4:14)
    సర్వసత్యమునకు మమ్ము నడుపునది నీవే పరిశుద్ధాత్ముడా } 2(యోహా 16:13)
    ఒక్కరైయున్న దేవుడవు నాపై వచియించవా (1తిమో 2:5,అపో.కా 2:17)
    నీలా నన్ను మార్చుటకు నాలో నివసించావా } 2(2కొరి 3:17,18)  || ఆరాధనా!! !! నా ఆత్మతో ||




Prema prema prema yekkada ni chirunama ప్రేమ ప్రేమ ఎక్కడ నీ చిరునామా

Song no:
HD
    ప్రేమ ప్రేమ ఎక్కడ - నీ చిరునామా
    ఈ లోకంలో లేనే లేదు - నిజ ప్రేమ } 2
    యేసు ప్రేమ - నిజమైన ప్రేమ
    యేసు ప్రెమ - విలువైన ప్రేమ } 2 || ప్రేమ ప్రేమ ||

  1. కన్న బిడ్డలే నిన్ను - మోసం చేసిరా
    కళ్ళనిండా కన్నీళ్ళు - నింపి వెళ్ళిరా
    యేసు ప్రేమ - నిజమైన ప్రేమ
    యేసు ప్రెమ - విలువైన ప్రేమ } 2 || ప్రేమ ప్రేమ ||

  2. కట్టుకున్న వాడు - బెట్టు చేసిన
    కర్మకు నిన్ను విడచి - ఒక మర్మమాయెనా 
    యేసు ప్రేమ - నిజమైన ప్రేమ
    యేసు ప్రెమ - విలువైన ప్రేమ } 2 || ప్రేమ ప్రేమ ||

  3. నమ్ముకున్నవారు ద్రోహం చేసిరా
    నయవంచనతో నిన్ను - నట్టేటముంచిరా } 2       
    యేసు ప్రేమ - నిజమైన ప్రేమ
    యేసు ప్రెమ - విలువైన ప్రేమ } 2 || ప్రేమ ప్రేమ ||

  4. సిలువలో యేసు చూపిన - కలువరి ప్రేమ
    నిజమైన ప్రేమకు - ఒక చిరునామా } 2
    యేసు ప్రేమ - నిజమైన ప్రేమ
    యేసు ప్రెమ - విలువైన ప్రేమ } 2 || ప్రేమ ప్రేమ ||



Bethlahemulo nanta sandhadi బెత్లహేములోనంటా సందడి

Song no:
HD
    బెత్లహేములోనంటా – సందడి
    పశువుల పాకలో – సందడి
    దూతలు వచ్చెనంటా – సందడి
    పాటలు పాడేనంటా – సందడి (2)
    రారాజు పుట్టెనని – సందడి
    మా రాజు పుట్టెనని – సందడి (2)
    చేసారంట సందడే సందడి
    చేయబోదాము సందడే సందడి (2)
    హ్యాప్పీ హ్యాప్పీ..
    హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ క్రిస్మస్
    విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్
    మెర్రీ మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్
    విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్

    అర్ధ రాత్రి వేళలో – సందడి
    దూతలు వచ్చెనంటా – సందడి
    రక్షకుడు పుట్టెనని – సందడి
    వార్తను తెలిపేనటా – సందడి (2)
    చేసారంట సందడే సందడి
    చెయ్యబోదాము సందడే సందడి
    చేసారంట సందడే సందడి
    చేయబోదాము సందడే సందడే సందడే సందడే సందడే
    హ్యాప్పీ హ్యాప్పీ..
    హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ క్రిస్మస్
    విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్
    మెర్రీ మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్
    విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్

    గొల్లలు వచ్చిరంటా – సందడి
    మనసారా మ్రొక్కిరంటా – సందడి
    అందాల బాలుడంటా – సందడి
    అందరి దేవుడని – సందడి (2)
    రారాజు పుట్టెనని – సందడి
    మా రాజు పుట్టెనని – సందడి (2)
    చేసారంట సందడే సందడి
    చేయబోదాము సందడే సందడి (2)
    హ్యాప్పీ హ్యాప్పీ..
    హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ క్రిస్మస్
    విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్
    మెర్రీ మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్
    విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్

    తారను చూచుకుంటూ – సందడి
    జ్ఞానులు వచ్చారంటా – సందడి
    పెట్టెలు తెచ్చారంటా – సందడి
    కానుకలిచ్చారంటా – సందడి (2)
    రారాజు పుట్టెనని – సందడి
    మా రాజు పుట్టెనని – సందడి (2)
    చేసారంట సందడే సందడి
    చేయబోదాము సందడే సందడి (2)
    హ్యాప్పీ హ్యాప్పీ..
    హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ క్రిస్మస్
    విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్
    మెర్రీ మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్
    విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్ (2)
    || goto ||