122
క్రీస్తుని మహిమ
రాగం - మధ్యమావతి
తాళం - ఆట
Naa aathmatho anandhamutho sthuthiyinthunu నా ఆత్మతో ఆనందముతో స్తుతియింతును
- నా ఆత్మతో ఆనందముతో స్తుతియింతును (మార్కు 12:30,1కొరి 14:15)
- ఆత్మ రూపుడవు అమరత్వుడవు ఆది అంతములు నీవే (యోహ 4:24, 1తిమో 6:16, ప్రక21:6)
లేనివాటిని ఉన్నవాటిగా పిలిచే యెహోవా } 2 (రోమా 4:17)
ఒక్కరైయున్న దేవుడవు నాపై వచియించవా (1తిమో 2:5,అపో.కా 2:17)
నీలా నన్ను మార్చుటకు నాలో నివసించావా } 2(2కొరి 3:17,18) || ఆరాధనా ||
- మహాదేవుడవు మృత్యుంజయుడవు మంచి కాపరివి నీవే (తీతు 2:13, లూకా 24:5,6, యోహా 10:11)
మొదటివాడవు కడపటివాడవు నీవే యేసయా } 2 (ప్రక 1:18)
ఒక్కరైయున్న దేవుడవు నాపై వచియించవా (1తిమో 2:5,అపో.కా 2:17)
నీలా నన్ను మార్చుటకు నాలో నివసించావా } 2 (2కొరి 3:17,18) || ఆరాధనా ||
- జీవదాతవు నిత్యుడవు మహిమ స్వరూపుడ నీవే (యోహా 7:38,హెబ్రీ 9:14,1పేతురు 4:14)
సర్వసత్యమునకు మమ్ము నడుపునది నీవే పరిశుద్ధాత్ముడా } 2(యోహా 16:13)
ఒక్కరైయున్న దేవుడవు నాపై వచియించవా (1తిమో 2:5,అపో.కా 2:17)
నీలా నన్ను మార్చుటకు నాలో నివసించావా } 2(2కొరి 3:17,18) || ఆరాధనా!! !! నా ఆత్మతో ||
విరిగి నలిగిన హృదయము నీకే అర్పింతును } 2 (కీర్తన 51:17)
పరవశించి నే పాడగా నాలో నిన్నే నింపవా (అపో.కా 9:17)
కరములెత్తి కీర్తించగా ఆత్మతో అభిషేకించవా } 2 (1యోహ 2:27)
ఆరాధనా స్తుతి ఆరాధానా... ఆరాధనా స్తుతి ఆరాధానా... } 2(హెబ్రీ 13:15) || నా ఆత్మతో ||
Prema prema prema yekkada ni chirunama ప్రేమ ప్రేమ ఎక్కడ నీ చిరునామా
- ప్రేమ ప్రేమ ఎక్కడ - నీ చిరునామా
- కన్న బిడ్డలే నిన్ను - మోసం చేసిరా
కళ్ళనిండా కన్నీళ్ళు - నింపి వెళ్ళిరా
యేసు ప్రేమ - నిజమైన ప్రేమ
యేసు ప్రెమ - విలువైన ప్రేమ } 2 || ప్రేమ ప్రేమ ||
- కట్టుకున్న వాడు - బెట్టు చేసిన
కర్మకు నిన్ను విడచి - ఒక మర్మమాయెనా
యేసు ప్రేమ - నిజమైన ప్రేమ
యేసు ప్రెమ - విలువైన ప్రేమ } 2 || ప్రేమ ప్రేమ ||
- నమ్ముకున్నవారు ద్రోహం చేసిరా
నయవంచనతో నిన్ను - నట్టేటముంచిరా } 2
యేసు ప్రేమ - నిజమైన ప్రేమ
యేసు ప్రెమ - విలువైన ప్రేమ } 2 || ప్రేమ ప్రేమ ||
- సిలువలో యేసు చూపిన - కలువరి ప్రేమ
నిజమైన ప్రేమకు - ఒక చిరునామా } 2
యేసు ప్రేమ - నిజమైన ప్రేమ
యేసు ప్రెమ - విలువైన ప్రేమ } 2 || ప్రేమ ప్రేమ ||
ఈ లోకంలో లేనే లేదు - నిజ ప్రేమ } 2
యేసు ప్రేమ - నిజమైన ప్రేమ
యేసు ప్రెమ - విలువైన ప్రేమ } 2 || ప్రేమ ప్రేమ ||

Bethlahemulo nanta sandhadi బెత్లహేములోనంటా సందడి
- బెత్లహేములోనంటా – సందడి
పశువుల పాకలో – సందడి
దూతలు వచ్చెనంటా – సందడి
పాటలు పాడేనంటా – సందడి (2)
రారాజు పుట్టెనని – సందడి
మా రాజు పుట్టెనని – సందడి (2)
చేసారంట సందడే సందడి
చేయబోదాము సందడే సందడి (2)
హ్యాప్పీ హ్యాప్పీ..
హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ క్రిస్మస్
విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్
మెర్రీ మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్
విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్
అర్ధ రాత్రి వేళలో – సందడి
దూతలు వచ్చెనంటా – సందడి
రక్షకుడు పుట్టెనని – సందడి
వార్తను తెలిపేనటా – సందడి (2)
చేసారంట సందడే సందడి
చెయ్యబోదాము సందడే సందడి
చేసారంట సందడే సందడి
చేయబోదాము సందడే సందడే సందడే సందడే సందడే
హ్యాప్పీ హ్యాప్పీ..
హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ క్రిస్మస్
విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్
మెర్రీ మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్
విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్
గొల్లలు వచ్చిరంటా – సందడి
మనసారా మ్రొక్కిరంటా – సందడి
అందాల బాలుడంటా – సందడి
అందరి దేవుడని – సందడి (2)
రారాజు పుట్టెనని – సందడి
మా రాజు పుట్టెనని – సందడి (2)
చేసారంట సందడే సందడి
చేయబోదాము సందడే సందడి (2)
హ్యాప్పీ హ్యాప్పీ..
హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ క్రిస్మస్
విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్
మెర్రీ మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్
విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్
తారను చూచుకుంటూ – సందడి
జ్ఞానులు వచ్చారంటా – సందడి
పెట్టెలు తెచ్చారంటా – సందడి
కానుకలిచ్చారంటా – సందడి (2)
రారాజు పుట్టెనని – సందడి
మా రాజు పుట్టెనని – సందడి (2)
చేసారంట సందడే సందడి
చేయబోదాము సందడే సందడి (2)
హ్యాప్పీ హ్యాప్పీ..
హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ క్రిస్మస్
విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్
మెర్రీ మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్
విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్ (2)
|| goto ||
Nuthanamaina anandha ragalatho నూతనమైన ఆనంద రాగాలతో
- నూతనమైన ఆనంద రాగాలతో - క్రొత్త క్రొత్త ఊహల పల్లకిలో
- గడచిన వత్సరం సంతోషపురమోలే - క్రొత్త క్రొత్త అనుభవాలు నేర్పగా
పరిశుద్ధతలో సంపూర్ణమగుటకై - కృపలతో సిద్ధపరచబడెదను
మునుపటికంటే అధికమైన మేళ్ళను చేయు - సర్వశక్తుడు మన ముందు నడువగా
జయధ్వనితో సాగిపోదుము - సాతాను దుర్గములు కూల్చుచూ
- నూతన వత్సరం శ్రేయస్కరమైన - ఆశీర్వాదములు ఇవ్వనుండగా
నా తలపై అపరంజి కిరీటము - ప్రభావ గౌరవము నే పొందుకొనెదను
వినువీధిలో సూర్యునికే గుడారము వేసిన - శక్తిమంతుడు మన ముందు నడువగా
ఉత్సాహగానముతో సాగిపోదును - జనులలో ఘనత పొందుచూ
- నూతన వత్సరం వాగ్ధానములను - హృదయముపై ప్రభువు వ్రాయుచుండగా
ఖర్జూర వృక్షమునై మొవ్వువేయుటకు - మందిరములో నాటబడెదను
ఏ తెగులును నా ఇంటిని సమీపించదని - బలశూరుడే మన ముందు నడువగా
స్తుతి ధ్వనితో సాగిపోదును - దేవదారు వృక్షమోలే ఎదుగుచు
ప్రియుడైన యేసుతో విహారములో - ఉప్పొంగెను నా మానసవీణ
నూతన వత్సరము - మన ముందు ఉన్నది
నిత్య నూతన దీవెనలు - మెండుగ ఉన్నవి ఆయనలో
I wish you all - Happy happy new year
we welcome you - 2020
we welcome you - to 2020
|| goto ||
Adhigo kalvarilo yesu rakshakude అదిగో కల్వరిలో యేసు రక్షకుడే
- అదిగో కల్వరిలో యేసు రక్షకుడే } 1
- మహిమ ఘనతను మరచి వదిలెనే
కఠిన సిలువనే కోరుకొన్నాడే } 2
మాయ జగత్తులో నాశన మొందక } 2
కౌగలించెను కల్వరిలో ప్రేమన్ } 2 || అదిగో ||
- సురూపమైన సొగసైన లేదు
నన్ను రక్షించ వికారుండాయెన్ } 2
పలునిందలన్ భరించెను } 2
పదివేలలో నతి కాంక్షణీయుడే || అదిగో ||
- ముండ్ల మకుటం శోభిత వస్త్రమే
పాద హస్తములలో చీలలు కలవు } 2
రక్త డాగులతో వ్రేలాడెను } 2
మరణ దాసుల విమోచించెన్ || అదిగో ||
- యేసుని త్యాగం నా యాశ్రయమే
గొప్పసంతోషం ప్రియుని రాజ్యం } 2
పాద జాడలలో నడచుటయే } 2
నా జీవితమందలి యానందం || అదిగో ||
- సిలువ దృశ్యమును చూచి నే
ఉజ్జీవముతో సేవ చేయుదునే } 2
నిరీక్షణతో జీవించెదనే } 2
నన్ను చేర్చుకొను యేసు రాజ్యములో || అదిగో ||
దీనుడై వ్రేలాడుచున్నాడే } 2
- అదిగో! కల్వరిలో యేసు రక్షకుడు
- మహిమపరుడు - మహిమ లేనట్లు
ఘోర సిలువ - నెన్నుకొనెను } 2
మాయ లోకములో - నుండి నన్ను
శద్ధకల్వారి ప్రేమతో - దరిచేర్చను } 2 || అదిగో ||
- అందము లేదు - సౌందర్యము లేదు
వికారమైతిరి - నన్ను రక్షించను } 2
పలు నిందలు - భరించినను
పదివేలలో - అతి ప్రియుడవు } 2 || అదిగో ||
- ముండ్ల కిరీటమున్ - అంగీని తొడిగి
కాలు చేతులకు - మేకులు కొట్టిరి } 2
రక్తధారల్ తో - వేలాడుచుండె
నిత్యమహిమను - మనకిచ్చుటకు } 2 || అదిగో ||
- ఆశ్చర్యమే - యేసుని త్యాగం
అద్భుతమే - ప్రభుని ప్రేమ } 2
ఆ ధ్యానముతో - దినం జీవించి
ఆయన మార్గమే - వెంబడించెదను } 2 || అదిగో ||
- సిలువ దర్శనమొంది సాగెదను
సేవచేసెద - జీవము పెట్టి } 2
నన్ను - చేర్చెదనని చెప్పెను
నే న్నిరీక్షణతో - కనిపెట్టెదను } 2 || అదిగో ||
దీనుడై వేలాడు చున్నాడు } 2














