-->

Ningilo devudu ninu chuda vacchadu నింగిలో దేవుడు నిను చూడ వచ్చాడు

Song no:
HD
    నింగిలో దేవుడు నిను చూడ వచ్చాడు
    ఆ నీతి సూర్యుడు శ్రీ యేసు నాధుడు (2)
    చెంత చేరి సంతసించుమా (2)
    స్వంతమైన క్రీస్తు సంఘమా  || నింగిలో ||

  1. పాపాల పంకిలమై శోకాలకంకితమై
    మరణించి మన కోసం కరుణించి ఆ దైవం (2)
    దీన జన రక్షకుడై దేవ దేవుని సుతుడై (2)
    జన్మించె నీ కోసం ధన్యము చేయగా (2) || నింగిలో ||

  2. సాతాను శోధనలే శాపాల వేదనలై
    విలపించే దీనులకై అలరించు దీవెనలై (2)
    శరణమై ఉదయించే తరుణమౌ ఈ వేళ (2)
    గుండె గుడి పానుపులో చేర్చుకొన రావేల (2) || నింగిలో ||

    Ningilo Devudu Ninu Chooda Vachchaadu
    Aa Neethi Sooryudu Shree Yesu Naadhudu (2)
    Chentha Cheri Santhasinchumaa (2)
    Swanthamaina Kreesthu Sanghamaa        ||Ningilo||

    Paapaala Pankilamai Shokaalakankithamai
    Maraninchi Mana Kosam Karuninchi Aa Daivam (2)
    Deena Jana Rakshakudai Deva Devuni Suthudai (2)
    Janminche Nee Kosam Dhanyamu Cheyagaa (2)      ||Ningilo||

    Saathaanu Shodhanale Shaapaala Vedanalai
    Vilapinche Deenulakai Alarinchu Deevenalai (2)
    Sharanamai Udayinche Tharunamau Ee Vela (2)
    Gunde Gudi Paanupulo Cherchukona Raavela (2)      ||Ningilo||
Share:

Chali chali galulu veeche vela thala thala merisindhi చలి చలి గాలులు వీచే వేళ తళ తళ మెరిసింది

Song no:
HD
    చలి చలి గాలులు వీచే వేళ
    తళ తళ మెరిసింది ఓ నవ్యతార ఆ....... ఓ...... } 2

  1. యూదయు దేశాన బేత్లెహేములో
    ఆ ప్రభు జన్మించే పశుశాలలోన } 2
    కన్య ఒడియే ఉయ్యాలా
    ఆమె లాలనే జంపాలా } 2|| చలి చలి గాలులు ||

  2. తురుపు జ్ఞానులు బంగరు సాంబ్రాణి
    బోళంబులతో ఎతించిరి నాడు } 2
    రాజాధి రాజా హోసన్నా
    రవికోటి తేజ ఏసన్న } 2|| చలి చలి గాలులు ||




Share:

Bethlehemu gramamulona kreesthu yesu బెత్లెహేము గ్రామములోన క్రీస్తు యేసు

Song no:
HD
    బెత్లెహేము గ్రామములోన
    క్రీస్తు యేసు జన్మించినాడే
    ఆ పశువుల పాకలోన
    ప్రభు యేసు జన్మించినాడే } 2
    సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ
    ఆయన కీష్టులైన మనషులకు భూమి మీద సమాదానం } 2

  1. దేవుని స్వరూపము కలిగినవాడై
    దాసుని స్వరూపము ధరించుకొని
    తన్నుతాను రిక్తునిగా చేసుకొని
    ఆకారమందు మనుషుడాయేనే } 2
    సిల్వ మరణం పొందినంతగా
    - తన్నుతాను తగ్గిచ్చుకొనెను } 2
    మరణమొంది మూడవ దినమునాడు
    -మృత్యుజయుడై తిరిగి లేచినాడే} 2 || బెత్లెహేము ||

  2. ఆయన ఎదుట ప్రతి మోకాళ్లు వంగున్
    ప్రతి నాలుక యేసు ప్రభుని ఒప్పుకొనును
    అధికంగా ఆయనను హెచ్చించేదం
    యేసు నామమునే గొప్ప చేసెదాము } 2
    పరలోకమునకు వెళ్ళి దూతల మీదను
    -అధికారుల మీదను శక్తుల మీదను } 2
    అధికారం పొందినవాడై
     -దేవుని కుడి పార్శమున ఉన్నాడు } 2 || బెత్లెహేము ||
Share:

Janulara sthuthiyinchudi iedhi yesukreesthuni జనులారా స్తుతియించుడి ఇది యేసుక్రీస్తుని

Song no:
HD
    జనులారా స్తుతియించుడి
    ఇది యేసుక్రీస్తుని జన్మదినం
    ప్రజలారా సేవించుడి
    ఇది రక్షకుడు వెలసిన పర్వదినం } 2

  1. పాపుల శాపపు భారముకై
    దేవుడు వెలసిన దివ్యదినం
    పాప శాప విమోచనకై
    దైవము వెలసిన మహాదినం } 2 || జనులారా ||

  2. ఆశ నిరాశలలో కృంగిన లోకములో
    ఆశ నిరాశలతో కృంగిన లోకములో

    ఆధరణకర్తగా
    ప్రభు వెలసిన దివ్యదినం } 2 || జనులారా ||

  3. రాజుల రాజునిగా
    ప్రభువుల ప్రభువునిగా } 2
    భువినేలు రారాజుగా
    ప్రభు వెలసిన పర్వదినం } 2 || జనులారా ||
Share:

Rarandoi rarandoi janulara meerantha రారండోయ్ రారండోయ్ జనులారా మీరంతా

Song no:
HD
    రారండోయ్ రారండోయ్ జనులారా..
    మీరంతా ఈ వార్తను విన్నారా...  } 2
    దేవదూత వచ్చింది శుభవార్త తెచ్చింది } 2
           ఏమని.....
    లోకానికి రక్షకుడే వచ్చాడని
    ఈ లోకానికి రక్షకుడే వచ్చాడని } 2
    క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ } 2

  1. బెత్లెహేము పురముకు ఆ గొర్రెల కాపరులు
    పరుగు పరుగునెల్లి ఆ శిశువును పూజించె } 2
    బ్రతుకుల్లో సంబరాలే ఆ రోజుతొ వచ్చాయిలే
    ప్రకటించె ఈ వార్తని మన యేసు పుట్టాడని } 2
    క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ } 2
     
  2. తార చూపు దారిలో ఆ శిశువును చూడాలని
    తూర్పు దేశ జ్ఞానులు తరలి తరలి వెళ్లారు } 2
    పశువుల పాకలోనే ఆ శిశువును చూశారులే
    బంగారము బోళము సాంబ్రాణులనర్పించెను } 2
    క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ } 2 || రారండోయ్ ||

Share:

Vacchadu vacchadu raraju paralokalo nundi వచ్చాడు వచ్చాడు రారాజు పరలోకంలో నుండి

Song no:
HD
    వచ్చాడు వచ్చాడు రారాజు
    పరలోకంలో నుండి వచ్చాడు
    తెచ్చాడు తెచ్చాడు రక్షణ
    పాపుల కొరకై తెచ్చాడు } 2
    ఆనందమే ఆనందమే
    క్రిస్మస్ ఆనందమే
    సంతోషమే సంతోషమే
    మన బ్రతుకుల్లో సంతోషమే } 2 || వచ్చాడు ||

  1. చలి చలిగా ఉన్న ఆ రాత్రి వేళలో
    దేవదూత వచ్చి శుభవార్త చెప్పెను } 2
    మీ కొరకు రక్షకుడు
    లోకానికి ఉదయించేనూ } 2
    దూతలేమొ సందడి
    గొల్లలేమొ సందడి
    యేసయ్య పుట్టాడని } 2 || వచ్చాడు ||

  2. పశువుల పాకలో పరిశుధ్దుడు
    మనమెట్టి వారమైన త్రోసివేయడు } 2
    మన దోషం తొలగించే
    యేసు క్రీస్తు జన్మించెను } 2
    దాసులేమొ సందడి
    దేశమేమొ సందడి
    యేసయ్య పుట్టాడని } 2 || వచ్చాడు ||

Share:

Nee chethitho nannu pattuko నీ చేతితో నన్ను పట్టుకో

Song no:

    నీ చేతితో నన్ను పట్టుకో
    నీ ఆత్మతో నన్ను నడుపు
    శిల్పి చేతిలో శిలను నేను
    అనుక్షణము నన్ను చెక్కుము } 2

  1. అంధకార లోయలోన
    సంచరించినా భయములేదు
    నీ వాక్యం శక్తిగలది
    నా త్రోవకు నిత్యవెలుగు } 2

  2. ఘోరపాపిని నేను తండ్రి
    పాప ఊభిలో పడియుంటిని
    లేవనెత్తుము శుద్దిచేయుము
    పొందనిమ్ము నీదు ప్రేమను } 2

  3. ఈ భువిలో రాజు నీవే
    నా హృదిలో శాంతి నీవే
    కుమ్మరించుము నీదు ఆత్మను
    జీవితాంతము సేవ చేసెదన్ } 2 || నీ చేతితో ||


Nee Chethitho Nannu Pattuko
Nee Aathmatho Nannu Nadupu
Shilpi Chethilo Shilanu Nenu
Anukshanamu Nannu Chekkumu (2)

Andhakaara Loyalona
Sancharinchinaa Bhayamu Ledu
Nee Vaakyam Shakthigaladi
Naa Throvaku Nithya Velugu (2)

Ghorapaapini Nenu Thandri
Paapa Oobhilo Padiyuntini
Levaneththumu Shudhdhi Cheyumu
Pondanimmu Needu Premanu (2)

Ee Bhuvilo Raaju Neeve
Naa Hrudilo Shaanthi Neeve
Kummarinchumu Needu Aathmanu
Jeevithaanthamu Seva Chesedan (2)        ||Nee Chethitho||
Share:

Facebook

lent

Good friday

Powered by Blogger.


123

1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట అన్ని కాలంబుల నున్న యెహోవా ని నెన్నదరంబయో కన్న ...

Search This Blog

3/related/default

Text Widget

Contributors

Categories

Pages

No Thumbnail

No Thumbnail
50

Most Recent

Subscribe Us

Comments

Technology

Latest Posts

Recent Posts