Santhoshakaramagu varthamanamu panchuthu podham సంతోషకరమగు వర్తమానము పంచుతూ పోదాం

Song no: 332

    సంతోషకరమగు వర్తమానము
    పంచుతూ పోదాం సర్వలోకము } 2
    అందరికోసం యేసుపుట్టెను
    సందడి చేద్దాం సంగీతంతోను } 2

  1. మందలకాచే కాపరులకు దూత మంచి వార్త చెప్పిపోయెను } 2
    పామరులైనా - పండితులైనా } 2
    అందరికోసం యేసుపుట్టెను
    సందడి చేద్దాం సంగీతంతోను } 2

  2. తూర్పుదేశపు జ్ఞానులకును క్రీస్తు దర్శన భాగ్యమాయెను } 2
    శ్రీమంతులైనా - సామంతులైనా } 2
    అందరికోసం యేసుపుట్టెను
    సందడి చేద్దాం సంగీతంతోను } 2

  3. యూదయలోని చిన్నగ్రామం రాజు జన్మతో ధన్యమాయెను } 2
    చిన్నవారైనా - గొప్పవారైనా } 2
    అందరికోసం యేసుపుట్టెను
    సందడి చేద్దాం సంగీతంతోను } 2

Raju puttadu maha raju puttadu రాజు పుట్టాడు మహారాజు పుట్టాడు

Song no:
HD
    రాజు పుట్టాడు మహారాజు పుట్టాడు
    ఆడాలి ఆడాలి } 2

  1. ఆడాలి ఆడాలి ఆనందంగా ఆడాలీ
    పాడాలి పాడాలి ఆనందంతో పాడాలీ  } 2
    సంగీతనాధంతో చిందులెన్నో వెయ్యాలీ  } 2
    ఎందుకంటే?
    యేసు పుట్టాడు మహా రాజు వచ్చాడు } 4
    ఆడాలి ఆడాలి ఆనందంగా ఆడాలీ

  2. ఇశ్రాయేలు వారసుడు యుదా సింహం వచ్చాడు } 2
    అందరికీ ఆదర్శంగా అధికారంతో బోధించాడు } 2
    అందరివాడు మన అందరివాడు } 2
    యేసు పుట్టాడు మహా రాజు వచ్చాడు } 4
    ఆడాలి ఆడాలి ఆనందంగా ఆడాలీ
    పాడాలి పాడాలి ఆనందంతో పాడాలీ  } 2

  3. పుట్టుకలో పవిత్రుడు పవనమూర్తి అతడు
    పాపులను ప్రేమించి పరలోకం దిగి వచ్చాడు } 2
    అందరివాడు మన అందరివాడు } 2
    యేసు పుట్టాడు మహా రాజు వచ్చాడు } 4

Neelala ningilo oka thara velisindhi నీలాల నింగిలో ఒక తార వెలసింది

Song no:
HD
    నీలాల నింగిలో ఒక తార వెలసింది
    ఆ తార కాంతిలో తెలిసింది ఒక రూపం } 2

    We wish you Happy Christmas
    We wish you Merry Christmas } 2 || నీలాల నింగిలో ||

  1. ఆ రూపమే ఇమ్మానుయేలని
    ఆ రూపమే రక్షించు మార్గమని } 2
    We wish you Happy Christmas
    We wish you Marry Christmas } 2 || నీలాల నింగిలో ||

  2. ఆకాశంలో ఒక దూత గొల్లలకు వినిపించెను ఆ శుభవార్త } 2
    దావీదు పట్టణమందు రక్షకుడు ఉదయించాడని } 2
    ఆయనే ప్రభువైన క్రీస్తేసని
    ఆయనే ఇమ్మానియేల్ అని } 2
    We wish you Happy Christmas
    We wish you Marry Christmas } 2 || నీలాల నింగిలో ||

  3. ఆకాశంలో ఒక తార జ్ఞానులను నడిపించేను బెత్లెహేమునకు } 2
    బంగారాన్ని సాంబ్రాణి బోళమును అర్పించిరి } 2
    ఆయనే ప్రభువైన  క్రీస్తేసని
    ఆయనే రక్షించు రారాజు అని } 2
    We wish you Happy Christmas
    We wish you Marry Christmas } 2 || నీలాల నింగిలో ||

Kalavantidhi nee jeevitham kadu swalpa kalamu కలవంటిది నీ జీవితము కడు స్వల్ప కాలము

Song no:

    కలవంటిది నీ జీవితము
    కడు స్వల్ప కాలము
    యువకా అది ఎంతో స్వల్పము

  1. విలువైనది నీ జీవితం
    వ్యర్ధము చేయకుమా
    యువకా వ్యర్ధము చేయకుమా
    బహు విలువైనది నీ జీవితం
    వ్యర్ధము చేయకుమా
    యువతీ వ్యర్ధము చేయకుమా      
    కలవంటిది నీ జీవితము.......

  2. నిన్ను ఆకర్షించే ఈ లోకము
    కాటు వేసే విష సర్పము
    యువకా అది కాలు జారే స్థలము

    నిన్ను ఆకర్షించే ఈ లోకము
    కాటు వేసే విష సర్పము
    యువతీ అది కాలు జారే స్థలము

    ఉన్నావు పాపపు పడగ నీడలో
    నీ అంతము ఘోర నరకము
    యువకా అదియే నిత్య మరణము

    ఉన్నావు పాపపు పడగ నీడలో
    నీ అంతము ఘోర నరకము
    యువతీ అదియే నిత్య మరణము
    కలవంటిది నీ జీవితము.......

  3. నిన్ను ప్రేమించు యేసు నీ జీవితం
    నూతన సృష్టిగా మార్చును
    పాపం క్షమియించి రక్షించును } 2
    ఆ మోక్షమందు నీవుందువు
    యుగయుగములు జీవింతువు
    నీవు నిత్యము ఆనందింతువు } 2     
    కలవంటిది నీ జీవితము.......


Kalavantidi Nee Jeevithamu
Kadu Swalpa Kaalamu
Yuvakaa Adi Entho Swalpamu (2)
Viluvainadi Nee Jeevitham
Vyardhamu Cheyakumu
Yuvakaa Vyardhamu Cheyakumu
Bahu Viluvainadi Nee Jeevitham
Vyardhamu Cheyakumu
Yuvathi Vyardhamu Cheyakumu        ||Kalavantidi||

Ninnu Aakarshinche Ee Lokamu
Kaatu Vese Visha Sarpamu
Yuvakaa Adi Kaalu Jaare Sthalamu (2)
Unnaavu Paapapu Padaga Needalo
Nee Anthamu Ghora Narakamu
Yuvakaa Adiye Nithya Maranamu (2)        ||Kalavantidi||

Ninnu Preminchu Yesu Nee Jeevitham
Noothana Srushtigaa Maarchunu
Paapam Kshamiyinchi Rakshinchunu (2)
Aa Mokshamandu Neevunduvu
Yugayugamulu Jeevinthuvu
Neevu Nithyamu Aanandinthuvu (2)        ||Kalavantidi||

Iennellu ielalo vunnamu manamu ఇన్నేళ్లు ఇలలో ఉన్నాము మనము

Athma nimpuma jeevathma nimpuma ఆత్మ నింపుమా జీవాత్మ నింపుమా

Song no:

    ఆత్మ నింపుమా జీవాత్మ నింపుమా
    పరమ పావనాత్మ నీదు వరములీయుమా
    ఆత్మ నింపుమా..

  1. కలుష దోష భారములే బ్రతుకు క్రుంగ దీసినవి
    వ్యాధి బాధలేకములై కేదమాయెను – ఘన దైవమా… ఆఆ…..
    నీ దాపు చేర్చి ప్రాపు చూపుమా
    అనుదినము నీదు ఆశ్రయాన సేద తీర్చుమా || ఆత్మ నింపుమా ||

  2. అహము ఇహము పాశములై వ్యధల పాలు చేసినవి
    ఒడలు పాప పొడల చేత యేహ్యమాయెను – కరుణాత్మ శ్రీ… ఆఆ…..
    ఈ  కరుణ మెంచి శరణమీయుమా
    తృణమైన బ్రతుకు తూలిపోక జాలిచూపుమా || ఆత్మ నింపుమా ||

Paralokamandhunna devudu bhuvikai పరలోకమందున్న దేవుడు భువికై

Song no:

పరలోకమందున్న దేవుడు భువికై దిగివచ్చెను
పాపాత్ములందిరికై ఆయన ప్రాణాన్ని అర్పించెను

1. ప్రేమ జాలి నాకై చూపించెను
పాపం దోషం బాపి విడిపించెను
నాపాపం తీసెను నా భారం మోసెను
నను శుద్ధుని చేసెను

2 .దయను కరుణ నాపై కురిపించాడు
మదిలో ఎదలో నాలో నిలిచున్నాడు
నాకోసం వచ్చెను నను రక్షించెను నాకై మరణించెను