Sageti e jeeva yathralo regeti సాగేటి ఈ జీవయాత్రలో రేగేటి



Na prana priyudu yesayya నా ప్రాణ ప్రియుడు యేసయ్య

Song no: 110

    నా ప్రాణ ప్రియుడు యేసయ్య - కరుణా హృదయుడు యేసయ్య } 2
    పరలోకసుతుడు - నాకెంతోహితుడు - నమ్మదగిన నా స్నేహితుడు

  1. అతిసుందరుడు - ధవళవర్ణుడు
    స్తుతియింపదగిన ఘననామధేయుడు } 2
    నను ప్రేమించిన నజరేతువాడు } 2
    నాకు చాలినదేవుడు - నా హృదయపు నాధుడు

    యేసయ్య నా యేసయ్య (4) || నా ప్రాణ ప్రియుడు ||

  2. ఐశ్వర్యవంతుడు - దీర్ఘ శాంతుడు
    ఆశ్చర్యకరుడు - బహుబలవంతుడు } 2
    రుధిరము కార్చిన నిజమైన ఱేడు } 2
    ప్రాణమిచ్చిన దేవుడు - నా హృదయపు నాధుడు

    యేసయ్య నా యేసయ్య (4) || నా ప్రాణ ప్రియుడు ||

Yerigi yunnanaya neekedhiyu asadhyamu kadhani ఎరిగియున్నానయా నీకేదీ అసాధ్యము కాదని

Song no: 109

    ఎరిగియున్నానయా నీకేదీ అసాధ్యము కాదని
    తెలుసుకున్నానయా నీవెపుడూ మేలు చేస్తావని

    మార్పులేని దేవుడ నీవని - మాట ఇచ్చి నెరవేర్చుతావని } 2
    మారని వాగ్దానములు మాకొరకు దాచి ఉంచినావని

  1. నను చుట్టుముట్టిన బాధలతో నాహృదయం కలవరపడగా
    నా స్వంత జనుల నిందలతో నా గుండె నాలో నీరైపోగా } 2
    అక్కున నన్ను చేర్చుకుంటివే - భయపడకంటివే
    మిక్కుట ప్రేమను చూపితివే నను ఓదార్చితివే } 2 || ఎరిగియున్నానయా ||

  2. మించిన బలవంతుల చేతి నుండి తప్పించిన యేసు దేవుడా
    వంచనకారుల వలల నుండి రక్షించిన హృదయనాధుడా } 2
    నిరాశలో నన్ను దర్శించితివే - ఆదరించితివే
    సజీవునిగా నన్నుంచితివే - కృపను పంచితివే || ఎరిగియున్నానయా ||


Mahonnathuda ma deva sahayakuda మహోన్నతుడా మా దేవా సహయకుడా

Song no: 107

మహోన్నతుడా మా దేవా
సహయకుడా యెహోవా } 2
ఉదయకాలపు నైవేధ్యము
హృదయ పూర్వక అర్పణము } 2
నా స్తుతి నీకేనయ్యా........ ఆరాధింతునయ్యా } 2

అగ్నిని పోలిన నేత్రములు
అపరంజి వంటి పాదములు } 2
అసమానమైన తేజోమహిమ
కలిగిన ఓ ప్రభువా
నా స్తుతి నీకేనయ్యా........ ఆరాధింతునయ్యా } 2

జలముల ధ్వని వంటి కంఠః స్వరం
నోటను రెండంచుల ఖఢ్గం } 2
ఏడు నక్షత్రములు ఏడాత్మలు
చేత కలిగిన ఓ ప్రభువా
నా స్తుతి నీకేనయ్యా........ ఆరాధింతునయ్యా } 2

ఆదియు అంతము లేనివాడా
యుగయుగములు జీవించువాడా } 2
పాతాళ లోకపు తాళపుచెవులు
కలిగిన ఓ ప్రభువా..
నా స్తుతి నీకేనయ్యా........ ఆరాధింతునయ్యా } 2

మహోన్నతుడా మా దేవా
సహయకుడా యెహోవా } 2
ఉదయకాలపు నైవేధ్యము
హృదయ పూర్వక అర్పణము } 2
నా స్తుతి నీకేనయ్యా........ ఆరాధింతునయ్యా } 2
హల్లేలుయా హల్లేలుయా హల్లేలుయా ఆమేన్ } 2

yentha goppa devude yenni sithralu ఎంత గొప్ప దేవుడే ఎన్ని సిత్రాలు

Song no: 52

    ఎంత గొప్ప దేవుడే ఎన్ని సిత్రాలు సేసినాడే } 2

    ఇంత ఇంతని ఆయన వింతలు సాటలేను } 2 || ఎంత గొప్ప ||

  1. నీళ్లను ద్రాక్షారసముగ మార్చినాడే
    వేలమందికాహారం కూర్చినాడే } 2
    నీటి పైన తాను నడచినాడే } 2
    గాలి సముద్రమును అణచినాడే } 2 || ఎంత గొప్ప ||

  2. గుడ్డోళ్ళు కళ్ళను తెరచినాడే
    పక్షవాయువును బాగుపరచినాడే } 2
    కుంటోళ్ళను సక్కగ నడిపించినాడే } 2
    దయ్యాలనుండి విడిపించినాడే } 2 || ఎంత గొప్ప ||

  3. చనిపోయిన లాజరును లేపినాడే
    సమరయ స్త్రీ పాపమును బాపినాడే } 2
    సిలువపై ప్రాణమును విడిచినాడే } 2
    సమాధిని గెలిచి మరల లేచినాడే } 2 || ఎంత గొప్ప ||

Jeeva nadhini naa hrudhayamulo జీవనదిని నా హృదయములో

Song no:
HD
    జీవనదిని నా హృదయములో
    ప్రవహింప చేయుమయ్యా (2)

  1. శరీర క్రియలన్నియు
    నాలో నశియింప చేయుమయ్యా (2) || జీవ నదిని ||

  2. బలహీన సమయములో
    నీ బలము ప్రసాదించుము (2) || జీవ నదిని ||

  3. ఆత్మీయ వరములతో
    నన్ను అభిషేకం చేయుమయ్యా (2) || జీవ నదిని ||


    Jeevanadini Naa Hrudayamulo
    Pravahimpa Cheyumayyaa (2)

    Shareera Kriyalanniyu
    Naalo Nashiyimpa Cheyumayyaa (2) || Jeeva Nadini ||

    Balaheena Samayamulo
    Nee Balamu Prasaadinchumu (2) || Jeeva Nadini ||

    Aathmeeya Varamulatho
    Nannu Abhishekam Cheyumayyaa (2) || Jeeva Nadini ||

Nee krupa nanu veedanannadhi nee krupa నీ కృప నను వీడనన్నది నీ కృప ఎడబాయనన్నది

Song no:
HD
    నీ కృప నను వీడనన్నది
    నీ కృప ఎడబాయనన్నది } 2
    పర్వతములు తొలగినను మెట్టెలు దద్ధరిల్లినను
    సముద్రము ఘోషించిన లోకమంతా లయమైనను
    యేసయ్య నీ కృప నను వీడనన్నది
    యేసయ్య కృప ఎడబాయనన్నది

  1. క్రుంగియున్న సమయాన అలసిసొలసిన తరుణనా
    విరిగినలిగిన స్థితిలోనా విఫలమైన నా బ్రతుకులోనా } 2
    ఎవరికోసమో పరుగిడితిని ఎవరి ప్రేమనో పొందనైతిని } 2
    నాదరికి చేరిన నీ కృప నన్నాదరించిన నీ కృప
    నను నడిపించిన నీ కృప ( నను స్థిరపరచిన నీ కృప } 2 )
    యేసయ్య నీ కృప నను వీడనన్నది
    యేసయ్య కృప ఎడబాయనన్నది || నీ కృప నను ||

  2. పాపమేలిన నా హృదిలోన శాపినైనా నా జీవితాన
    మాలిననమైన నా మదిలోనా శాంతిలేని నా బ్రతుకున } 2
    లోకమే నాకు శాశ్వతమని లోకాశాలలో మునిగిపోతిని } 2
    నను ఎరుగ వచ్చిన నీ కృప నను రక్షించిన నీ కృప
    నను చేరదీసిన నీ కృప ( నను లేవనెత్తిన నీ కృప } 2 )
    యేసయ్య నీ కృప నను వీడనన్నది
    యేసయ్య కృప ఎడబాయనన్నది || నీ కృప నను ||