నీ కృప నను వీడనన్నది
నీ కృప ఎడబాయనన్నది } 2
పర్వతములు తొలగినను మెట్టెలు దద్ధరిల్లినను
సముద్రము ఘోషించిన లోకమంతా లయమైనను
యేసయ్య నీ కృప నను వీడనన్నది
యేసయ్య కృప ఎడబాయనన్నది
- క్రుంగియున్న సమయాన అలసిసొలసిన తరుణనా
విరిగినలిగిన స్థితిలోనా విఫలమైన నా బ్రతుకులోనా } 2
ఎవరికోసమో పరుగిడితిని ఎవరి ప్రేమనో పొందనైతిని } 2
నాదరికి చేరిన నీ కృప నన్నాదరించిన నీ కృప
నను నడిపించిన నీ కృప ( నను స్థిరపరచిన నీ కృప } 2 )
యేసయ్య నీ కృప నను వీడనన్నది
యేసయ్య కృప ఎడబాయనన్నది || నీ కృప నను ||
- పాపమేలిన నా హృదిలోన శాపినైనా నా జీవితాన
మాలిననమైన నా మదిలోనా శాంతిలేని నా బ్రతుకున } 2
లోకమే నాకు శాశ్వతమని లోకాశాలలో మునిగిపోతిని } 2
నను ఎరుగ వచ్చిన నీ కృప నను రక్షించిన నీ కృప
నను చేరదీసిన నీ కృప ( నను లేవనెత్తిన నీ కృప } 2 )
యేసయ్య నీ కృప నను వీడనన్నది
యేసయ్య కృప ఎడబాయనన్నది || నీ కృప నను ||
దేవా నా ఆర్థధ్వని వినవా
నేనేల దూరమైతిని - కృప చూపవా నీ దరికి చేర్చుకొనవా
- గాలివాన హోరులో - గమ్యమెటో కానరాక
గురియైన నిను చేర - పరితపించుచున్నాను
ఆదరణయైనను- ఆరోగ్యమైనను - ఆనందమైనను నీవేగదా || దేవా ||
- అంతరంగ సమరములో - ఆశలెన్నో విఫలముకాగ
శరణుకోర నినుచేర - తల్లుడిల్లుచున్నాను
ఆధారమైనను - ఆశ్రయమైనను - ఆరాధనైనను నీవేగదా || దేవా ||
Song no: 146
సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపివి నీవు } 2
దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప
మహిమాత్మతో నను నింపితివా } 2
- అతీసుందరుడా నా స్తుతి సదయుడ
కోటి సూర్య కాంతులైనా నీతో సమమగునా } 2
ఎనలేనే నీ ఘనకార్యములు తలచి
స్తుతించుచు నిను నే మహిమపరతును } 2 || సర్వాధికారివి ||
- బలశౌర్యములుగల నా యేసయ్యా
శతకోటి సైన్యములైనా నీకు సాటి అగుదురా
మారవే నీ సాహసకార్యములు యెన్నడు
ధైర్యముగా నిను వెంబడింతును } 2 || సర్వాధికారివి ||
- సర్వజగద్రక్షకూడా - లోకరాజ్యపాలక
భూరాజులెవ్వరినైన నీతో పోల్చగలనా } 2
బలమైన నీ రాజ్యస్థాపనకై నిలిచి
నిరీక్షణతో నే సాగిపోదును } 2 || సర్వాధికారివి ||
త్రియేక దేవుడైన యెహోవాను
కెరూబులు సెరావులు నిత్యము ఆరాధించుదురు
పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని
గాన ప్రతి గానములు చేయుచు ఉండును
- నా శాపము బాపిన రక్షణతో
నా రోగాల పర్వము ముగిసేనే
వైద్య శాస్త్రములు గ్రహించలేని
ఆశ్చర్యములెన్నో చేసినావే || త్రియేక ||
- నా నిర్జీవ క్రియలను రూపు మాపిన
పరిశుద్ధాత్మలో ఫలించెదనే
మేఘ మధనములు చేయలేని
దీవెన వర్షము కురిపించినావే || త్రియేక ||
- నా స్థితిని మార్చిన స్తుతులతో
నా హృదయము పొంగిపొర్లేనే
జలాశయములు భరించలేని
జలప్రళయములను స్తుతి ఆపెనే || త్రియేక ||
Song no: 135
సాగిపోదును నా విశ్వాసమునకు కర్తయైన యేసయ్యతో
సుళువుగా చిక్కులు పెట్టే పాపములు విడిచి
సాగిపోదును నా యేసయ్యతో
- ఆత్మీయ బలమును పొందుకొని
లౌకిక శక్తుల నెదురింతును - ఇంకా
దేవుని శక్తిసంపన్నతతో ప్రకారములను దాటెదను
నిశ్చయముగా శత్రుకోటలు నేను జయించెదను || సాగిపోదును ||
- నూతనమైన మార్గములో
తొట్రిల్లకుండ నడిపించును - నవ
దేవుని కరుణాహస్తము నాచేయి పట్టుకొని
నిశ్చయముగా మహిమలోనికి నన్ను చేర్చునే || సాగిపోదును ||
- శ్రేష్ఠమైన బహుమానముకై
సమర్పణ కలిగి జీవింతును - మరి
దేవుని సన్నిధిప్రభావము నాపై ప్రసరించెను
నిశ్చయముగా మరి శ్రేష్ఠమైన సీయోనులో నిలుపును || సాగిపోదును ||
Song no: 144
శాశ్వతమైనదీ నీతో నాకున్న అనుబంధము
మరువలేనదీ నాపై నీకున్న అనురాగము ||2||
యేసయ్యా నీ నామ స్మరణయే
నీ శ్వాస నిశ్వాసవాయెను ||2|| || శాశ్వత ||
- సంధ్యారాగము వినిపించినావు
నా హృదయ వీణను సవరించినావు ||2||
నా చీకటి బ్రతుకును వెలిగించినావు ||2||
నా నోట మృదువైన మాటలు పలికించినావు || శాశ్వత ||
- నా విలాప రాగాలు నీవు విన్నావు
వేకువ చుక్కవై దర్శించినావు
అపవాది ఉరుల నుండి విడిపించినావు ||2||
శత్రువులను మిత్రులుగా నీవు మార్చియున్నావు || శాశ్వత ||
shaashvathamainadhee neethoa naakunna anubMDhamu
maruvalaenadhee naapai neekunna anuraagamu ||2||
yaesayyaa nee naama smaraNayae
nee shvaasa nishvaasavaayenu ||2|| ||shaashvatha||
1.sMDhyaaraagamu vinipiMchinaavu
naa hrudhaya veeNanu savariMchinaavu ||2||
naa cheekati brathukunu veligiMchinaavu ||2||
naa noata mrudhuvaina maatalu palikiMchinaavu ||shaashvatha||
2.naa vilaapa raagaalu neevu vinnaavu
vaekuva chukkavai dharshiMchinaavu
apavaadhi urula nuMdi vidipiMchinaavu ||2||
shathruvulanu mithrulugaa neevu maarchiyunnaavu||shaashvatha||
Song no: 152
సర్వలోక నివాసులారా - సర్వాధికారిని కీర్తించెదము రారండి
యెహోవా ఏతెంచెను- తన పరిశుద్ధ ఆలయములో
మన సంతోషము - పరిపూర్ణము చేయు
శాంతి సదనములో నివసింతుము
- కరుణా కటాక్షము పాప విమోచన
యేసయ్యలోనే ఉన్నవి
విలువైన రక్షణ అలంకారముతో
దేదీప్యమానమై ప్రకాశించెదము || సర్వలోక ||
- ఘనతా ప్రభావము విజ్ఞాన సంపదలు
మన దేవుని సన్నిధిలో ఉన్నవి
పరిశుద్ధమైన అలంకారముతో
కృతజ్ఞత స్తుతులతో ప్రవేశించెదము || సర్వలోక ||
- సమృద్ధి జీవము సమైక్య సునాదము
జ్యేష్ఠుల సంఘములో ఉన్నవి
మృదువైన అక్షయ అలంకారముతో
సద్భక్తితో సాగిపోదము || సర్వలోక ||