ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను
ఎలా విడువగలనయ్యా నీ సేవను } 2 || ఎలా మరువగలనయ్యా ||
యేసయ్యా ....... } 4
ఆత్మీయులే నన్ను ఆదరించలేదు
ప్రేమించువారే ప్రేమించలేదు } 2
ఆదరించావు ప్రేమించావు } 2
అన్ని వేళలా నాకు తోడు నీవయ్యావు } 2 అందుకే || ఎలా మరువగలనయ్యా ||
అనాథగా నేను తిరుగుచున్నప్పుడు
ఆకలితో నేను అలమటించినప్పుడు } 2
ఆదరించావు ఆకలి తీర్చావు } 2
అన్ని వేళలా నాకు తోడు నీవయ్యావు } 2 అందుకే || ఎలా మరువగలనయ్యా ||
బంధువులే నన్ను ద్వేషించినారు
సొంత తల్లిదండ్రులే వెలివేసినారు } 2
చేరదీసావు సేదదీర్చావు } 2
అన్ని వేళలా నాకు తోడు నీవయ్యావు } 2 అందుకే || ఎలా మరువగలనయ్యా ||
నా జీవిత భాగస్వామివి నీవు
నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు } 2
నాకే సమృద్దిగా నీ కృపను పంచావు
నా యేసురాజ కృపాసాగరా అనంతస్తోత్రార్హుడా } 2
నీ దయగల కనుసైగలే ధైర్యపరచినవి
నీ అడుగుజాడలే నాకు త్రోవను చూపినవి } 2
నీ రాజ్య పౌరునిగా నన్ను మార్చితివి
నీ సైన్యములో నన్ను చేర్చితివి } 2 || నా జీవిత ||
నీ దయగల మాటలే చేరదీసినవి
నీతి నియమాలలో నన్ను నడిపించుచున్నవి } 2
నీ కృపనే ధ్వజముగ నాపైన నిల్పితివి
నీ విందుశాలకు నను చేర్చితివి } 2 || నా జీవిత ||
నీ దయగల తలంపులే రూపునిచ్చినవి
నీదు హస్తములే నన్ను నిర్మించుచున్నవి } 2
నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నావు
నీ అంతఃపురములో నను చేర్చుదువు || నా జీవిత ||
దీవించుమో దేవా నా మంచి యేసు దేవా
ప్రియమైన క్రీస్తు ప్రభువా ప్రార్థింతు నిన్నేనయా
ఆలించు నా యేసయ్య ప్రార్థింతు నిన్నేనయా
ఆలించు నా యేసయ్య దీవించుమో దేవా
నీ ప్రేమయే నీ కృపయే నాదు జీవము నొసగెను
నీ నామమే నీ వాక్యమే నాకు త్రోవను చూపెను } 2
పాపముతో శాపముతో నలిగాను నా బ్రతుకులో
కాపరివై దేవుడవై నిలిచావు నా మనసులో } 2
నా దాగు చోటు నీవే నా నీతి బాట నీవే
కీర్తింతు నీ నామము ప్రేమింతు నీ మార్గము } 2
కృతజ్ఞత స్తుతులతో నిన్ను నేను స్తుతించెద
పాటలు పాడుచు నాట్యమాడుచు నీదు సన్నిధి చేరెద } 2
కష్టాలైనా కన్నీరైనా నిన్ను విడువలెనేసయ్య
కరువైనా భారమైనా నిన్ను మరువలేనేసయ్య } 2
నా దాగు చోటు నీవే నా నీతి బాట నీవే
కీర్తింతు నీ నామము ప్రేమింతు నీ మార్గము } 2
దీవించుమో దేవా నా మంచి యేసు దేవా
ప్రియమైన క్రీస్తు ప్రభువా ప్రార్థింతు నిన్నేనయా
ఆలించు నా యేసయ్య ప్రార్థింతు నిన్నేనయా
ఆలించు నా యేసయ్య దీవించుమో దేవా