Na jeevitha bagaswamivi neevu na pranamutho నా జీవిత భాగస్వామివి నీవు నా ప్రాణముతో

Song no: 95

    నా జీవిత భాగస్వామివి నీవు
    నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు } 2
    నాకే సమృద్దిగా నీ కృపను పంచావు
    నా యేసురాజ కృపాసాగరా అనంతస్తోత్రార్హుడా } 2

  1. నీ దయగల కనుసైగలే ధైర్యపరచినవి
    నీ అడుగుజాడలే నాకు త్రోవను చూపినవి } 2
    నీ రాజ్య పౌరునిగా నన్ను మార్చితివి
    నీ సైన్యములో నన్ను చేర్చితివి } 2 || నా జీవిత ||

  2. నీ దయగల మాటలే చేరదీసినవి
    నీతి నియమాలలో నన్ను నడిపించుచున్నవి } 2
    నీ కృపనే ధ్వజముగ నాపైన నిల్పితివి
    నీ విందుశాలకు నను చేర్చితివి } 2 || నా జీవిత ||

  3. నీ దయగల తలంపులే రూపునిచ్చినవి
    నీదు హస్తములే నన్ను నిర్మించుచున్నవి } 2
    నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నావు
    నీ అంతఃపురములో నను చేర్చుదువు || నా జీవిత ||

Padhivelalo athikamkshaneeyudu entho vikarudayen పదివేలలోని అతికాంక్షణీయుడు ఎంతో వికారుడాయెన్

Song no: 91

    పదివేలలోని అతికాంక్షణీయుడు
    ఎంతో వికారుడాయెన్

  1. నా నిమిత్తమే శాపగ్రస్థుడై
    ఘోరాసిలువను మోసి వహించెన్
    ఈ గొప్పప్రేమ నేను మరువన్ జీవితకాలములో || పదివేలలోని ||

  2. గాయములను శిక్షనిందను
    నా శాంతి నిమిత్తమే గదా
    నీ శరీరములో పొందితిని నా ప్రియా యేసుదేవా || పదివేలలోని ||

  3. అన్యాయమైన తీర్పును పొంది
    వ్రేలాడేను హీన దొంగల మధ్య
    సింహాసనమున నీతో నేనుండి సదా పాలించుటకే || పదివేలలోని ||

  4. మరణము ద్వారా కృప నొసంగి
    అక్షయజీవము నిచ్చితివి
    మహిమనుండి అధిక మహిమపొంది
    మార్పు నొందుటకేగా || పదివేలలోని ||

  5. నీ రూపం చూచి సిలువను మోసి
    నీతో నడచి సేవను చేసి
    నా ప్రాణము  నీకే  అర్పింతును
    కడవరకు కాపాడుము || పదివేలలోని ||

Raktham yesu raktham prathi papamulanu రక్తం యేసు రక్తం ప్రతి పాపములను కడుగును

Song no: 89
    రక్తం యేసు రక్తం
    ప్రతి పాపములను కడుగును
    ప్రతి అవయవములను శుద్ధీకరించును

  1. ఆదికాలపు అద్బుతములతో
    అన్ని వ్యాధులను స్వస్థ పరచితివి
    ఆత్మలను రక్షించుమయ్యా
    ఆత్మ నాథుడా యేసయ్య || రక్తం ||

  2. రోగ బాధలు వేదనలకు
    లోనైయున్న మా శరీరములను
    రోగం తీర్చి బాధలు బాపి
    కార్చితివి నీ రక్తం ద్వారా || రక్తం ||

  3. రోగుల పరమ వైద్యుడనీవే
    దివ్య ఔషధం నీవే గదయ్యా
    రోగ శాంతి నియ్యుము దేవా
    మారని యేసయ్య నీ శక్తి ద్వారా || రక్తం ||

Dheevinchumo deva na manchi yesu deva దీవించుమో దేవా నా మంచి యేసు దేవా

Song no:
HD
    దీవించుమో దేవా నా మంచి యేసు దేవా
    ప్రియమైన క్రీస్తు ప్రభువా ప్రార్థింతు నిన్నేనయా
    ఆలించు నా యేసయ్య ప్రార్థింతు నిన్నేనయా
    ఆలించు నా యేసయ్య దీవించుమో దేవా

  1. నీ ప్రేమయే నీ కృపయే నాదు జీవము నొసగెను
    నీ నామమే నీ వాక్యమే నాకు త్రోవను చూపెను } 2
    పాపముతో శాపముతో నలిగాను నా బ్రతుకులో
    కాపరివై దేవుడవై నిలిచావు నా మనసులో } 2
    నా దాగు చోటు నీవే నా నీతి బాట నీవే

    కీర్తింతు నీ నామము ప్రేమింతు నీ మార్గము } 2

  2. కృతజ్ఞత స్తుతులతో నిన్ను నేను స్తుతించెద
    పాటలు పాడుచు నాట్యమాడుచు నీదు సన్నిధి చేరెద } 2
    కష్టాలైనా కన్నీరైనా నిన్ను విడువలెనేసయ్య
    కరువైనా భారమైనా నిన్ను మరువలేనేసయ్య } 2
    నా దాగు చోటు నీవే నా నీతి బాట నీవే

    కీర్తింతు నీ నామము ప్రేమింతు నీ మార్గము } 2

    దీవించుమో దేవా నా మంచి యేసు దేవా
    ప్రియమైన క్రీస్తు ప్రభువా ప్రార్థింతు నిన్నేనయా
    ఆలించు నా యేసయ్య ప్రార్థింతు నిన్నేనయా
    ఆలించు నా యేసయ్య దీవించుమో దేవా

Vinaledha neevu gethsemanelo vyakula rodhananu వినలేదా నీవు గెత్సేమనెలో వ్యాకుల రోదనను

Song no: 88
HD
    వినలేదా నీవు గెత్సేమనెలో
    వ్యాకుల రోదనను
    ప్రాణనాధుడు పాపులాకై
    విజ్ణాపన చేయుచుండె

  1. భరింపజాలని భారము వలన
    దేహము కృశించి క్షిణించెనుగా
    దాహము సహించి తండ్రి సన్నిధిలో
    బాధతో విలపించెగా || వినలేదా ||

  2. వచ్చితినే నీ చిత్తము చేయ
    ఇచ్చెదను నేను నా శరీరం
    నీ చిత్తమే సిద్ధించునుగాకని
    పలుకుచు ప్రార్థించెను || వినలేదా ||

  3. తొలగించు మీ గిన్నె నీ చిత్తమైతే
    తనయుడు తండ్రిని వేడిన వేళలో
    స్వేద బిందువులు రక్తమై మారి
    నేలను కారెనుగా || వినలేదా ||

Siluvalo nee rupame rakthamayamaye naakosame సిలువలో నీ రూపమే రక్తమయమాయె నాకోసమే

Song no: 84

సిలువలో నీ రూపమే
రక్తమయమాయె నాకోసమే
ఎందుకో ఎందుకో అంతులేదా నీ ప్రేమకు } 2

కపట ముద్దులు మోమున గుద్దులు
కఠినగాయాలు కందిన నీ ఒళ్లు } 2
కారినా రక్తం పారెను ఏరులై } 2
కలుషాత్ముడ నను కడుగ నేగా } 2 || సిలువలో ||

అన్నెం పున్నెం ఎరుగని నీవు
అక్రమ మన్యాయం అసలే ఎరుగవు } 2
అన్యాయము నీకు న్యాయము చెప్పేనా
అరుపుల కేకల అలజడిలోన } 2 || సిలువలో ||

Premamrutham nee sannidhi nithyamu naapennidhi ప్రేమామృతం నీ సన్నిధి నిత్యము నాపెన్నిధి

Song no: 74

    ప్రేమామృతం నీ సన్నిధి
    నిత్యము నాపెన్నిధి } 2

  1. నీ కృప నన్నాదరించెనులే
    భీకర తుపాను సుడిగాలిలో } 2
    కరములు చాచి ననుచేరదీసి
    పరిశుద్ధుడా నీ బసచేర్చినావు } 2 || ప్రేమామృతం ||

  2. కమ్మని వెలుగై నీవున్నావులే
    చిమ్మచీకటి కెరటాలతో } 2
    చీకటి తెరలు ఛేదించినావు
    నీతి భాస్కరుడా నీవు నాకున్నావు } 2 || ప్రేమామృతం ||