Ninu thalachi nanu nenu marachi nee sakshigaa నిన్ను తలచి నను నేను మరచి నీ సాక్షిగా ఇల

Song no:
HD
    నిన్ను తలచి నను నేను మరచి
    నీ సాక్షిగా ఇల నే బ్రతుకుచుంటిని (2)
    యేసయ్యా.. నీ కృప లేక నే బ్రతుకలేను (2) || నిను తలచి ||

  1. జీవము లేని దైవారాధనలో
    నిర్జీవ క్రియలతో మృతుడనైతిని (2)
    జీవాధిపతివై నా జీవితానికి
    నిత్య జీవము నొసగిన యేసయ్యా (2) || నిను తలచి ||

  2. దారే తెలియని కారు చీకటిలో
    బ్రతుకే భారమై నలిగిపోతిని (2)
    నీతి సూర్యుడా ఎదలో ఉదయించి
    బ్రతుకే వెలుగుతో నింపిన యేసయ్యా (2) || నిను తలచి ||

  3. సద్గుణ శీలుడా సుగుణాలు చూచి
    హృదిలో నేను మురిసిపోతిని (2)
    సుగుణాలు చూచుటకే నీవు
    సిలువలో నాకై నలిగిన యేసయ్యా (2) || నిను తలచి ||



    Ninnu Thalachi Nanu Nenu Marachi
    Nee Saakshigaa Ila Ne Brathukuchuntini (2)
    Yesayyaa.. Nee Krupa Leka Ne Brathukalenu (2)    ||Ninu Thalachi||

    Jeevamu Leni Daivaaraadhanalo
    Nirjeeva Kriyalatho Mruthudanaithini (2)
    Jeevadhipathivai Naa Jeevithaaniki
    Nithya Jeevamu Nosagina Yesayyaa (2)       ||Ninu Thalachi||

    Daare Theliyani Kaaru Cheekatilo
    Brathuke Bhaaramai Naligipothini (2)
    Neethi Sooryudaa Edalo Udayinchi
    Brathuke Velugutho Nimpina Yesayyaa (2)      ||Ninu Thalachi||

    Sadguna Sheeluda Sugunaalu Choochi
    Hrudilo Nenu Murisipothini (2)
    Sugunaalu Choochutake Neevu
    Siluvalo Naakai Naligina Yesayyaa (2)       ||Ninu Thalachi||
    || నిను తలచి ||

Aarani prema iedhi arpajalani jwala iedhi ఆరని ప్రేమ ఇది ఆర్పజాలని జ్వాల ఇది

Song no: 87
HD
    ఆరని ప్రేమ ఇది - ఆర్పజాలని జ్వాల ఇది
    అతి శ్రేష్టమైనది - అంతమే లేనిది
    అవధులే లేనిది - అక్షయమైన ప్రేమ ఇది
    కలువరి ప్రేమ ఇది - క్రీస్తు కలువరి ప్రేమ ఇది } 2 || ఆరని ప్రేమ ||

  1. సింహాసనము నుండి - సిలువకు దిగి వచ్చినది
    బలమైనది మరణము కన్నా - మృతి ని గెల్చి లేచినది } 2
    ఇది సజీవమైనది - ఇదే సత్యమైనది
    ఇదే నిత్యమైనది - క్రీస్తు యేసు ప్రేమ ఇది } 2
    కలువరి ప్రేమ ఇది - క్రీస్తు కలువరి ప్రేమ ఇది } 2 || ఆరని ప్రేమ ||

  2. నా స్థాన మందు నిలిచి - నా శిక్ష నే బరియించి
    క్రయ ధనమును చెల్లించి - గొప్ప రక్షణ నిచ్చినది } 2
    నాకు విలువ నిచ్చినది - నన్ను వెలిగించినది
    ఆ ఉన్నత రాజ్య మందు - నాకు స్థాన మిచ్చినది } 2
    ఉన్నత ప్రేమ ఇది - అత్యున్నత ప్రేమ ఇది } 2 || ఆరని ప్రేమ ||

  3. భూ రాజులు అధిపతులు - రాజ్యాలు అధికారాలు
    చేరయైన ఖడ్గమైన - కరువైన ఎదురైనా } 2
    ఎవరు ఆర్పలేనిది - ఎవరు ఆపలేనిది
    ప్రవహించుచున్నది - ప్రతి పాపి చెంతకు } 2
    ప్రేమ ప్రవాహమిది - యేసు ప్రేమ ప్రవాహమిది } 2 || ఆరని ప్రేమ ||

Aanandhame paramanandhame asrayapuramaina yesaya ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో

Song no:114

    ఆనందమే పరమానందమే
    ఆశ్రయపురమైన యేసయ్యా నీలో (2)
    ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన
    అక్షయుడా నీకే స్తోత్రము (2) || ఆనందమే ||

  1. పచ్చిక గల చోట్ల పరుండ జేసితివే
    జీవ జలములు త్రాగనిచ్చితివే (2)
    నా ప్రాణమునకు సేదదీర్చితివి
    నీతియు శాంతియు నాకిచ్చితివే (2) || ఆనందమే ||

  2. గాఢాంధకారము లోయలలో నేను
    సంచరించినా దేనికి భయపడను (2)
    నీ దుడ్డు కఱ్ఱయు నీ దండమును
    అనుదినం అనుక్షణం కాపాడునే (2) || ఆనందమే ||

  3. నా శత్రువుల ఎదుటే నీవు
    నాకు విందును సిద్ధము చేసావు (2)
    నీతో నేను నీ మందిరములో
    నివాసము చేసెద చిరకాలము (2) || ఆనందమే ||


Aanandame Paramaanandame
Aashrayapuramaina Yesayyaa Neelo (2)
Aapathkaalamulannitilo Aadarinchina
Akshayudaa Neeke Sthothramu (2)      ||Aanandame||

Pachchika Gala Chotla Parunda Jesithive
Jeeva Jalamulu Thraaganichchithive (2)
Naa Praanamunaku Sedadeerchithive
Neethiyu Shaanthiyu Naakichchithive (2)      ||Aanandame||

Gaadaandhakaaramu Loyalalo Nenu
Sancharinchinaa Deniki Bhayapadanu (2)
Nee Duddu Karrayu Nee Dandamunu
Anudinam Anukshanam Kaapaadune (2)      ||Aanandame||

Naa Shathruvula Yedute Neevu
Naaku Vindunu Siddhamu Chesaavu (2)
Neetho Nenu Nee Mandiramulo
Nivaasamu Cheseda Chirakaalamu (2)      ||Aanandame||

Alpha omega ayina mahimanvithuda అల్ఫా ఒమేగా అయినా మహిమాన్వితుడా

Song no: 167

    అల్ఫా ఒమేగా అయినా మహిమాన్వితుడా
    అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రర్హుడా }2
    రాత్రిలో కాంతి కిరణమా పగటి లో కృపానిలయమా
    ముదిమి వరకు నన్నాదరించె సత్యవాక్యామా } 1
    నాతో స్నేహామై నా సౌక్య మై నను నదిపించె నా ఏసయ్యా } 2 || అల్ఫా ||

  1. కనికర పూర్ణుడా నీ కృప బాహుల్యమే
    ఉన్నతముగా నిను ఆరాదించుటకు
    అనుక్షనమున నీ ముఖ కాంతిలో నిలిపి
    నూతన వసంత ములో చేర్చెను } 2
    జీవించెద నీ కొరకే హర్షించెద నీ లోనే } 2 || అల్ఫా ||

  2. తేజోమాయుడా నీదివ్య సంకల్పమే
    ఆర్చర్యకమైన వెలుగు లో నడుపుటకు
    ఆశ నిరాశ ల వలయాలు తప్పించి
    అగ్నిజ్వాలగా ననుచేసెను } 2
    నా స్తుతి కీర్తన నీవె స్తుతి ఆరాదన నీకే } 2 || అల్ఫా ||

  3. నిజ స్నేహితుడా నీ స్నేహ మాదుర్యమే
    శుభ సూచనగా నను నిలుపుటకు
    అంతు లేని ఆగాదాలు దాటింఛి
    అందని శిఖరాలు ఎక్కించెను } 2
    నా చెలిమి నీ తోనే నా కలిమి నీ లోనే } || అల్ఫా ||

Nee krupa leni kshanamuna yemoudhuno నీ కృప లేని క్షణమున ఏమౌదునో

Song no:

    నీ కృప లేని క్షణమున ఏమౌదునో
    నీ కృప విడిన క్షణమున ఏమౌదునో
    ఏమౌదునో ఊహించలేనయ్య
    నేనేమౌదునో తెలియదయ్య.

  1. రక్షణ నావలో నేనుండగ
    బాధలు పేనుగాలులై తాకినా
    మరణపు భయములు అవరించిన
    శ్రమలు సుడిగుండాలై నన్నుచుట్టిన
    నీ ప్రేమ చూపితివి నన్ను బలపరచితివి
    నీ కరములుచాపితివి నన్ను లేవనెత్తితివి
    నీ నిత్య కృపలో నన్ను దాచితివి..ఇ..ఇ. || నీ కృప ||

  2. సాతాను సింహం వలె గర్జించిన
    హృదయమును గాయపరచి  కృంగదిసిన
    ఇహలోక మనుషులె నిందించిన
    ఆత్మీయులె నాకు దూరమైన
    నీ ప్రేమ చూపితివి నన్ను ఆదరించితివి
    నీ కరములుచాపితివి నన్ను స్వస్థపరచితివి
    నీ దివ్య కృపలో నన్ను దాచితివి...ఇ..ఇ... || నీ కృప ||

Iemmanuyelaina na devudu nannu kapaduvadu ఇమ్మానుయేలైన నాదేవుడు నన్నుకాపాడువాడు

Song no:
HD
    ఇమ్మానుయేలైన... నాదేవుడు నన్నుకాపాడువాడు
    నాకోట  నాశైలము  నాదుర్గమై నన్ను రక్షించువాడు.

    నేనెన్నడు  భయపడను నాయేసు తోడుండగా...
    నాకాపరి నాఊపిరి నాసర్వం  నాయేసేగా..

  1. గాఢాంధకారపు లోయలలో - నేను సంచరించిన
    శత్రృవుల చేతిలో నేఓడిన - శోధనలే చుట్టుముట్టిన
    నేనెన్నడు భయపడను నాయేసు తోడుండగా..
    నా  కాపరి నాఊపిరి నాసర్వం  నాయేసేగా || ఇమ్మాను ||

  2. దిక్కులేనివానిగ నేనుండిన - ఈలోకమే వెలివేసిన....
    నమ్మినహితులెల్ల ద్వేషించిన – అవమానములే చేసిన
    చింతించనూ దుఃఖించనూ నీస్నేహమేవుండగా…
    నాఆశ్రయం  నాకేడెము నాబలము నాయేసేగా || ఇమ్మాను ||

madhurathi madhuram yesu nee namam మధురాతి మధురం యేసు నీ నామం

Song no:
HD
    మధురాతి మధురం యేసు నీ నామం
    నా అధరముల పలుకులలో నిత్యమూ నిలిచె నీ నామం } 2 || మధురాతి ||

  1. అన్ని నామముల కన్నా పై నామం నీ నామం
    మహిమ గల నీ నామం అతి శ్రేష్టము, అతి మధురం } 2
    అద్భుతాలు చేయు నీ నామం అంధకారమును లయ పరచు నీ నామం } 2
    || మధురాతి ||

  2. విన్నపాలకు చెవి యొగ్గును విలాపములను పోగొట్టును
    మహిమ గల నీ నామం మహిమకు చేర్చు నీ నామం } 2
    మరణపు ముల్లును విరిచెను నీ నామం నిత్య జీవము నిచ్చు నీ నామం } 2
    || మధురాతి ||