Song no: 167
అల్ఫా ఒమేగా అయినా మహిమాన్వితుడా
అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రర్హుడా }2
రాత్రిలో కాంతి కిరణమా పగటి లో కృపానిలయమా
ముదిమి వరకు నన్నాదరించె సత్యవాక్యామా } 1
నాతో స్నేహామై నా సౌక్య మై నను నదిపించె నా ఏసయ్యా } 2 || అల్ఫా ||
- కనికర పూర్ణుడా నీ కృప బాహుల్యమే
ఉన్నతముగా నిను ఆరాదించుటకు
అనుక్షనమున నీ ముఖ కాంతిలో నిలిపి
నూతన వసంత ములో చేర్చెను } 2
జీవించెద నీ కొరకే హర్షించెద నీ లోనే } 2 || అల్ఫా ||
- తేజోమాయుడా నీదివ్య సంకల్పమే
ఆర్చర్యకమైన వెలుగు లో నడుపుటకు
ఆశ నిరాశ ల వలయాలు తప్పించి
అగ్నిజ్వాలగా ననుచేసెను } 2
నా స్తుతి కీర్తన నీవె స్తుతి ఆరాదన నీకే } 2 || అల్ఫా ||
- నిజ స్నేహితుడా నీ స్నేహ మాదుర్యమే
శుభ సూచనగా నను నిలుపుటకు
అంతు లేని ఆగాదాలు దాటింఛి
అందని శిఖరాలు ఎక్కించెను } 2
నా చెలిమి నీ తోనే నా కలిమి నీ లోనే } || అల్ఫా ||
Song no:
నీ కృప లేని క్షణమున ఏమౌదునో
నీ కృప విడిన క్షణమున ఏమౌదునో
ఏమౌదునో ఊహించలేనయ్య
నేనేమౌదునో తెలియదయ్య.
-
రక్షణ నావలో నేనుండగ
బాధలు పేనుగాలులై తాకినా
మరణపు భయములు అవరించిన
శ్రమలు సుడిగుండాలై నన్నుచుట్టిన
నీ ప్రేమ చూపితివి నన్ను బలపరచితివి
నీ కరములుచాపితివి నన్ను లేవనెత్తితివి
నీ నిత్య కృపలో నన్ను దాచితివి..ఇ..ఇ. || నీ కృప ||
-
సాతాను సింహం వలె గర్జించిన
హృదయమును గాయపరచి కృంగదిసిన
ఇహలోక మనుషులె నిందించిన
ఆత్మీయులె నాకు దూరమైన
నీ ప్రేమ చూపితివి నన్ను ఆదరించితివి
నీ కరములుచాపితివి నన్ను స్వస్థపరచితివి
నీ దివ్య కృపలో నన్ను దాచితివి...ఇ..ఇ... || నీ కృప ||
ఇమ్మానుయేలైన... నాదేవుడు నన్నుకాపాడువాడు
నాకోట నాశైలము నాదుర్గమై నన్ను రక్షించువాడు.
నేనెన్నడు భయపడను నాయేసు తోడుండగా...
నాకాపరి నాఊపిరి నాసర్వం నాయేసేగా..
- గాఢాంధకారపు లోయలలో - నేను సంచరించిన
శత్రృవుల చేతిలో నేఓడిన - శోధనలే చుట్టుముట్టిన
నేనెన్నడు భయపడను నాయేసు తోడుండగా..
నా కాపరి నాఊపిరి నాసర్వం నాయేసేగా || ఇమ్మాను ||
- దిక్కులేనివానిగ నేనుండిన - ఈలోకమే వెలివేసిన....
నమ్మినహితులెల్ల ద్వేషించిన – అవమానములే చేసిన
చింతించనూ దుఃఖించనూ నీస్నేహమేవుండగా…
నాఆశ్రయం నాకేడెము నాబలము నాయేసేగా || ఇమ్మాను ||
మధురాతి మధురం యేసు నీ నామం
నా అధరముల పలుకులలో నిత్యమూ నిలిచె నీ నామం } 2
|| మధురాతి ||
- అన్ని నామముల కన్నా పై నామం నీ నామం
మహిమ గల నీ నామం అతి శ్రేష్టము, అతి మధురం } 2
అద్భుతాలు చేయు నీ నామం అంధకారమును లయ పరచు నీ నామం } 2
|| మధురాతి ||
- విన్నపాలకు చెవి యొగ్గును విలాపములను పోగొట్టును
మహిమ గల నీ నామం మహిమకు చేర్చు నీ నామం } 2
మరణపు ముల్లును విరిచెను నీ నామం నిత్య జీవము నిచ్చు నీ నామం } 2
|| మధురాతి ||
నా కనుచూపు మేర యేసు నీ ప్రేమ
పొంగి పారెనే... పొంగి పారెనే (2)
నే ప్రేమింతును నా యేసుని మనసారా (2)
ఆరిపోవు లోక ప్రేమల కన్నా
ఆదరించు క్రీస్తు ప్రేమే మిన్న (2) || నా కనుచూపు ||
- నా కన్నీటిని తుడిచిన ప్రేమ
నలిగిన నా హృదయాన్ని కోరిన ప్రేమ
ఎన్నడూ ఎడబాయనిది ఆ ప్రేమ
నన్ను పరముకు చేర్చ దిగి వచ్చిన ప్రేమ || నా కనుచూపు ||
- నా దీన స్థితినీ చూచిన ప్రేమ
తన శాశ్వత ప్రేమతో నను పిలిచిన ప్రేమ
ఎన్నడూ ఎడబాయనిది ఆ ప్రేమ
నన్ను పరముకు చేర్చ దిగి వచ్చిన ప్రేమ || నా కనుచూపు ||
- నా భారంబును మోసిన ప్రేమ
సిలువలో నాకై చేతులు చాచిన ప్రేమ
ఎన్నడూ ఎడబాయనిది ఆ ప్రేమ
నన్ను పరముకు చేర్చ దిగి వచ్చిన ప్రేమ || నా కనుచూపు ||
NAA KANUCHOOPU MERA YESU NEE PREMA PONGI PAARENE .. PONGI PAARENE (2)
NE PREMINTHUNU NAA YESUNI MANASAARA (2)
AARIPOVU PREMALA KANNA ADARINCHU KREESTHU PREME MINNA (2)
1. NAA KANEETINI TUDICHINA PREMA - NALIGINA NAA HRUDAYANNI KORINA PREMA (2)
YENNADU YEDABAYANIDHI AA PREMA - NANNU PARAMUKU CHERCHA DIGI VACHHINA PREMA (2)
2. NAA DHEENA STHITHINEE CHOOCHINA PREMA - THANA SAASWATHA PREMATHO NANNU PILICHINA PREMA (2)
YENNADU YEDABAYANIDHI AA PREMA - NANNU PARAMUKU CHERCHA DIGI VACHHINA PREMA (2)
3. NAA BHARAMBUNU MOSINA PREMA - SILUVALO NAAKAI CHETHULU CHAACHINA PREMA (2)
YENNADU YEDABAYANIDHI AA PREMA - NANNU PARAMUKU CHERCHA DIGI VACHHINA PREMA (2)
|| నా కనుచూపు ||
చెప్పుకుంటే సిగ్గు చేటని
నేస్తమా చెప్పకుంటే గుండె కోతని } 2
నీలో నీవే క్రుంగిపోతున్నావా ?
అందరిలో ఒంటరివైపోయావా ? } 2
చేయి విడువని యేసు దేవుడు ఆదరించి ఓదార్చును
నీ చేయి విడువని యేసు దేవుడు - నిన్నాదరించి ఓదార్చును || చెప్పుకుంటే ||
- కసాయి గుండెలు దాడి చేసెనా?
విషపు చూపులే నీవైపువుంచెనా ? (2)
కన్నీటితో గడిపిన ఎన్నో రాత్రులు
చూడలేదా పొద్దు పొడుపులు.} 2 || చేయి విడువని ||
- పాపపు లోకము నిను వేధించెనా ?
నిందలు వేసి వెక్కిరించెనా ? (2)
కన్నీటితో గడిపిన ఎన్నో రాత్రులు
చూడలేదా పొద్దు పొడుపులు || చేయి విడువని ||
- నా అన్నవారే నిన్నవమానించెనా ?
అనాథను చేసి విడిచివెళ్లెనా ?(2)
కన్నీటితో గడిపిన ఎన్నో రాత్రులు
చూడలేదా పొద్దు పొడుపులు || చేయి విడువని ||
కన్నీరంతా నాట్యమాయెను
కష్టాలన్నీ మాయమాయెను } 2
యేసుని సన్నిధిలో రాజు నీ సముఖములో 2
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
- లోకమంతా నన్ను చూసి
బహుగా నన్ను ద్వేషించినా }2
కొంచెమైన దిగులు చెందను
ఇంచు కూడా నేను కదలను } 2
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
- ఎవరు నన్ను ఏమి చేయరు
దిగులు కూడా దిగులు చెందును 2
యేసు నేను ఒక్కటయ్యము
జీవితంతాము కలసి సాగేదం } 2
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
- అగ్నియైన కాల్చజాలదు
సంద్రాలైన పాయలాయెను } 2
తుఫానైన నిమ్మళించేను
నా నోటిలో శక్తి వున్నది } 2
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
- నేనాడిపాడి ఆరాదిస్తాను
నే నాట్యమాడి ఆరాదిస్తాను } 2 }
శ్రమయైన ఏమి చెయ్యదు
భయమైన దరికి చేరదు } 2
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన