-->

Naa vedhanalo na badhalo ne krungina velalo నా వేదనలో నా బాధలోనే కృంగిన వేళలో

Song no:
    నా వేదనలో నా బాధలో- నే కృంగిన వేళలో నా తోడై యున్నావు"2"
    నన్ను నడిపించు నా యేసయ్య - నాకు తోడైయుండు నా ప్రభువా
    నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా.... || నా వేదనలో ||

  1. నా అన్నవారే నను మరిచారయ్యా - అయినవారే నన్ను అపహసించినారయ్యా
    నా కన్నవారిని నే కోల్పోయినా - నా స్వంతజనులే నన్ను నిందించినా....
    కన్నీటిని తుడిచి కౌగలించినావూ - కృపచూపి నన్ను రక్షించినావు
    నన్ను నడిపించు నా యేసయ్య - నాకు తోడైయుండు నా ప్రభువా
    నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా.... || నా వేదనలో ||
     
  2. ఇహలోక శ్రమలన్ని ఎన్నదగినవికావని - ప్రభునందు నా ప్రయాస వ్యర్థమే కాదని
    నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తేనని - చావైతే నాకది ఎంతో మేలని //2//
    నా కన్నులెత్తి నేవైపుకే నీరీక్షనతో చూచుచున్నాను //2//
    నీ యందే నే బ్రతుకుచున్నాను..... || నా వేదనలో ||
Share:

Matallo cheppalenidhi swaramulatho padalenidhi మాటల్లో చెప్పలేనిది స్వరములతో పాడలేనిది

Song no:

    పల్లవి: మాటల్లో చెప్పలేనిది - స్వరములతో పాడలేనిది
    కవితలలో  వ్రాయలేనిది - ఎవరూ వర్ణించలేనిది

    అ. ప:  యేసూ  నీప్రేమఒక్కటే... యేసూ నీ ప్రేమ ఒక్కటే } 2|| మాటల్లో ||

  1. స్వార్థంతో నిండినా ఈలోక  ప్రేమాలోనా
    మోసముతో కూడినా  ఈ మనుషుల ప్రేమ మధ్య } 2
    కల్మషమేలేనిది కరుణతో నిండినది } 2
    కలవరమే తీసినది - కన్నీటిని తుడిచినది } 2  || యేసూ నీ ప్రేమ ||

  2. పాపముతో నిండినా ఈ లోకప్రేమాలోన
    శాపముతో కూడిన - ఈ మనుష్యుల ప్రేమమధ్య } 2
    లోకాన్ని ప్రేమించి - రక్తాన్ని చిందించి
    సిలువలో మరణించినది -  శిక్షను భరియించినది } 2  || యేసూ నీ ప్రేమ ||
Share:

Krungipoku nesthama manchiroju neekundhi suma కృంగిపోకు నేస్తమా మంచిరోజు నీకుంది సుమా

Song no:

    కృంగిపోకు నేస్తమా
    మంచిరోజు నీకుంది సుమా
    మారదీ తలరాతని మనసు రానీకుమా
    మంచిరోజులోస్తాయమ్మా
    మరువనీడు నీదేవుడమ్మా
    ప్రాణమిచ్చి నిన్ను కొన్నాడమ్మా
    తన ప్రాణమిచ్చి నిన్ను కొన్నాడమ్మా || కృంగిపోకు ||

  1. శూన్యమైన సృష్ఠినే చూడకుండెనా
    ఆకారం లేనిదనీ ఆదమరిచెనా
    చీకటి కమ్మెననీ చూడకుండెనా
    వెలుగు కలుగుగాక అనీ పలుకకుండెనా
    మరిచెనా లేక మంచిదిగా మలిచెనా ॥2॥
    మరచునా నీకు మంచి చేయకుండునా ॥2॥
    అందుకే || కృంగిపోకు ||

  2. యేసేపు అన్నలే తోసేసినా
    బాషరాని దేశానికి అమ్మేసినా
    బానిసైన బాధ్యతగా పనిచేసినా
    బాధితునిగా చేసి బంధించినా
    మరిచెనా లేక మంత్రినే చేసెనా ॥2॥
    మరచునా నీకు మంచి చేయకుండునా ॥2॥
    అందుకే || కృంగిపోకు ||

Share:

Matlade yesayya natho matladuchunnadu మాట్లాడే యేసయ్యా నాతో మాట్లాడుచున్నాడు

Song no:

    మాట్లాడే యేసయ్యా
    నాతో మాట్లాడుచున్నాడు (2)
    (నన్ను) మోకాళ్ళ పైన ఆడించుచూ (2)
    చంటి బిడ్డలాగ కాయుచున్నాడు (4) || మాట్లాడే ||

  1. వెన్నలాంటి కన్నులలో
    కురిసే తన ప్రేమను పంచాలని (3)
    వేకువనే తట్టుచున్నాడు
    కునుకని నిద్రపోని నా యేసయ్యా (2)
    తల్లిదండ్రి కన్న మిన్న అయిన దేవుడు
    లోకాన నా యేసుకు సాటి లేరెవ్వరు (2) || మాట్లాడే ||

  2. అరుణోదయమున నేను లేచి
    కృతజ్ఞతా స్తుతులను చెల్లించెదను (3)
    ఉత్సాహగానముతో యేసయ్యను
    సంగీత స్వరములతో ఘనపరచెదను (2)
    ప్రతి క్షణము నన్ను నడిపించే దేవుడు
    ప్రతి ఉదయం తన కృపతో నింపే నా దేవుడు (2) || మాట్లాడే ||

  3. లోకము నుండి నన్ను ప్రత్యేకించి
    మైమరిపించాడు మహనీయుడు (3)
    ఉపదేశముతో నన్ను నడుపుచున్నాడు
    జీవముగల సంఘములో నిలిపియున్నాడు (2)
    తన మాటతో నన్ను బలపరచాడు
    కృప వెంబడి కృపతో నను నింపుచున్నాడు (2) || మాట్లాడే ||
Share:

Ninnu chudalani neetho nadavalani నిన్ను చూడాలని నీతో నడవాలని

నిన్ను చూడాలని నీతో నడవాలని
నీకై నేను  జీవించాలని   " 2 "
ఆశతో  నీదరి  చేరితిని 
నీ మహిమను  చూడగొరితిని
ని మహిమని నే చూడగొరితిని !!నిన్ను!!

1) దేవదేవుని సన్నిధిలో నా యేసుని
సముఖములో  " 2
అనుదినము ప్రార్ధించేదను 
ఆత్మతో  ఆరాదించెదను 
నేను అనుదినము ప్రార్ధించేదను 
ఆత్మతో ఆరాదించెదను !!నిన్ను!!

2 ) నా అంతరంగములో  సత్యము కోరుచున్నావు" 2 "
అంతర్యమున  నాకు  జ్ఞానము   తెలియజెయుదువు 
నా అంతర్యమున  నాకు  జ్ఞానము   తెలియజెయుదువు  !!నిన్ను!!

3) ఆశపడిన  హృదయమును
తృప్తిపరిచే దేవుడవు " 2 "
ఆరాదనకు పాత్రుడవు  అందరిలో  శ్రేష్ఠుడవు
నా  ఆరాదనకు   పాత్రుడవు 
అందరిలో  శ్రేష్ఠుడవు     " 2 "!!నిన్ను!!

Share:

Nee sneha bamdhavyamulo premanuragale నీ స్నేహ బాంధవ్యములో ప్రేమానురాగాలే

నీ స్నేహ బాంధవ్యములో ప్రేమానురాగాలే
నీ దివ్య సహవాసములో నిత్యం సంతోసమే "2"
నీ కరుణావాత్సల్యమే..నా జీవనాధారమే"2"

1. ఒంటరినైయున్న వేళా..ఏ తోడు లేని వేళా..క్రుంగియున్నవేళా"2"
కన్నీరు తుడిచి నీ కౌగిట దాచి నీ హస్తముతో నన్ను లేపావయ్యా"2" "నీ స్నేహ "

2. లోకములో వున్నవేళా..దారి తొలగిన వేళా పాపినైయున్న వేళా "2"
నీ ప్రేమతో పిలిచి నీ సన్నిధిలో నిలిపి నీ వారసునిగా చేసుకున్నావయ్యా"2" "నీ స్నేహ"

Share:

Srungara nagarama maharaju pattanama శృంగార నగరమా మహరాజు పట్టణమ

శృంగార నగరమా - మహరాజు పట్టణమ
పరిపూర్ణ సౌందర్య - యేరుషలేము  నగరమా ''2''
నీ రాజు నిన్ను కోరుకొనెను సకల దేశముల ఆభరణమా"2"
ఎటుల వర్ణింతును  నీ సౌందర్యము..? ఎటుల వివరింతును నీ ఔన్నత్యము..? "2"

1. మేలిమి బంగారుతో పోల్చదగినవారు సీయోను నీ ప్రియ కుమారులు "2"
హిమము కంటే శుద్దమైన వారు..పాలుకంటే తెల్లని వారు నీ జనులు
వారి దేహ కాంతి నీలము..పగడముల కంటే తెల్లని వారు   "శృంగార "

2. యేరుషలేమ నీచుట్టు కట్టని గోడ వలే పర్వతములు నిలిచియున్నట్టే
నీ ప్రజల చుట్టు నీ రాజు..బలమైన ప్రాకారముగా నిలిచియున్నాడు
నీ క్షేమము కోరి ప్రార్ధించు వారిని..వర్దిల్లనిచ్చుచున్నాడ  యేసు       "శృంగార "

Share:

Facebook

lent

Good friday

Powered by Blogger.


123

1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట అన్ని కాలంబుల నున్న యెహోవా ని నెన్నదరంబయో కన్న ...

Search This Blog

3/related/default

Text Widget

Contributors

Categories

Pages

No Thumbnail

No Thumbnail
50

Most Recent

Subscribe Us

Comments

Technology

Latest Posts

Recent Posts