Matlade yesayya natho matladuchunnadu మాట్లాడే యేసయ్యా నాతో మాట్లాడుచున్నాడు

Song no:

    మాట్లాడే యేసయ్యా
    నాతో మాట్లాడుచున్నాడు (2)
    (నన్ను) మోకాళ్ళ పైన ఆడించుచూ (2)
    చంటి బిడ్డలాగ కాయుచున్నాడు (4) || మాట్లాడే ||

  1. వెన్నలాంటి కన్నులలో
    కురిసే తన ప్రేమను పంచాలని (3)
    వేకువనే తట్టుచున్నాడు
    కునుకని నిద్రపోని నా యేసయ్యా (2)
    తల్లిదండ్రి కన్న మిన్న అయిన దేవుడు
    లోకాన నా యేసుకు సాటి లేరెవ్వరు (2) || మాట్లాడే ||

  2. అరుణోదయమున నేను లేచి
    కృతజ్ఞతా స్తుతులను చెల్లించెదను (3)
    ఉత్సాహగానముతో యేసయ్యను
    సంగీత స్వరములతో ఘనపరచెదను (2)
    ప్రతి క్షణము నన్ను నడిపించే దేవుడు
    ప్రతి ఉదయం తన కృపతో నింపే నా దేవుడు (2) || మాట్లాడే ||

  3. లోకము నుండి నన్ను ప్రత్యేకించి
    మైమరిపించాడు మహనీయుడు (3)
    ఉపదేశముతో నన్ను నడుపుచున్నాడు
    జీవముగల సంఘములో నిలిపియున్నాడు (2)
    తన మాటతో నన్ను బలపరచాడు
    కృప వెంబడి కృపతో నను నింపుచున్నాడు (2) || మాట్లాడే ||

Ninnu chudalani neetho nadavalani నిన్ను చూడాలని నీతో నడవాలని

నిన్ను చూడాలని నీతో నడవాలని
నీకై నేను  జీవించాలని   " 2 "
ఆశతో  నీదరి  చేరితిని 
నీ మహిమను  చూడగొరితిని
ని మహిమని నే చూడగొరితిని !!నిన్ను!!

1) దేవదేవుని సన్నిధిలో నా యేసుని
సముఖములో  " 2
అనుదినము ప్రార్ధించేదను 
ఆత్మతో  ఆరాదించెదను 
నేను అనుదినము ప్రార్ధించేదను 
ఆత్మతో ఆరాదించెదను !!నిన్ను!!

2 ) నా అంతరంగములో  సత్యము కోరుచున్నావు" 2 "
అంతర్యమున  నాకు  జ్ఞానము   తెలియజెయుదువు 
నా అంతర్యమున  నాకు  జ్ఞానము   తెలియజెయుదువు  !!నిన్ను!!

3) ఆశపడిన  హృదయమును
తృప్తిపరిచే దేవుడవు " 2 "
ఆరాదనకు పాత్రుడవు  అందరిలో  శ్రేష్ఠుడవు
నా  ఆరాదనకు   పాత్రుడవు 
అందరిలో  శ్రేష్ఠుడవు     " 2 "!!నిన్ను!!

Nee sneha bamdhavyamulo premanuragale నీ స్నేహ బాంధవ్యములో ప్రేమానురాగాలే

నీ స్నేహ బాంధవ్యములో ప్రేమానురాగాలే
నీ దివ్య సహవాసములో నిత్యం సంతోసమే "2"
నీ కరుణావాత్సల్యమే..నా జీవనాధారమే"2"

1. ఒంటరినైయున్న వేళా..ఏ తోడు లేని వేళా..క్రుంగియున్నవేళా"2"
కన్నీరు తుడిచి నీ కౌగిట దాచి నీ హస్తముతో నన్ను లేపావయ్యా"2" "నీ స్నేహ "

2. లోకములో వున్నవేళా..దారి తొలగిన వేళా పాపినైయున్న వేళా "2"
నీ ప్రేమతో పిలిచి నీ సన్నిధిలో నిలిపి నీ వారసునిగా చేసుకున్నావయ్యా"2" "నీ స్నేహ"

Srungara nagarama maharaju pattanama శృంగార నగరమా మహరాజు పట్టణమ

శృంగార నగరమా - మహరాజు పట్టణమ
పరిపూర్ణ సౌందర్య - యేరుషలేము  నగరమా ''2''
నీ రాజు నిన్ను కోరుకొనెను సకల దేశముల ఆభరణమా"2"
ఎటుల వర్ణింతును  నీ సౌందర్యము..? ఎటుల వివరింతును నీ ఔన్నత్యము..? "2"

1. మేలిమి బంగారుతో పోల్చదగినవారు సీయోను నీ ప్రియ కుమారులు "2"
హిమము కంటే శుద్దమైన వారు..పాలుకంటే తెల్లని వారు నీ జనులు
వారి దేహ కాంతి నీలము..పగడముల కంటే తెల్లని వారు   "శృంగార "

2. యేరుషలేమ నీచుట్టు కట్టని గోడ వలే పర్వతములు నిలిచియున్నట్టే
నీ ప్రజల చుట్టు నీ రాజు..బలమైన ప్రాకారముగా నిలిచియున్నాడు
నీ క్షేమము కోరి ప్రార్ధించు వారిని..వర్దిల్లనిచ్చుచున్నాడ  యేసు       "శృంగార "

Yordhanu yedhuraina nenu krungiponu యోర్ధాను ఎదురైనా నేను కృంగిపోను

Song no:

    యోర్ధాను ఎదురైనా - నేను కృంగిపోను
    యెరికో గోడలైనా - నేను జడియను ||2||

    నా బలమే యేసని - నిత్యము తలచెదను
    నా ఘనతయు యేసేయని - నిత్యము పాడెదను ||2||
    హల్లేలూయా ఆమెన్ - హల్లెలూయా ఆమెన్
    హల్లేలూయా ఆమెన్ ||2||
    నీకే ఆరాధనా - యేసయ్యా నీకే ఆరాధన ||2||


  1. సితారతో పాడెదను - నాట్యముతో స్తుతించెదను ||2||
    ప్రభు యేసు నామము ఆధారము - ఎంతో ఆశ్రయము ||2|| || నా బలము ||

  2. ఆత్మతో పాడెదను - సత్యముతో స్తుతించెదను ||2||
    పరిశుద్ధాత్ముని ఆరాధన -
     ఎంతో ఆనందము ||2|| || నా బలము ||

  3. ఏక స్వరముతో పాడెదము - ఏక మనస్సుతో స్తుతించెదము ||2||
    యెహోవాయే మన ధ్వజముగా
    నిలచి - ఎంతో ధైర్యపర్చెను ||2|| || నా బలము ||

Manchi manassu kalavadu yesayya మంచి మనస్సు కలవాడు యేసయ్య

Song no:

    మంచి మనస్సు కలవాడు యేసయ్య
    గొప్పమనసు కలవాడు  మెస్సయ్య " 2 "
    పాపుల కొరకై ప్రాణ మిచ్చినవాడు
    దోషులకొరకై   ప్రార్థించినవాడు          " 2 "
    నీతిమంతుడు శక్తిమంతుడు దయామయుడు ప్రేమ పూర్ణుడేసయ్యా
    హలే హల్లేలూయ హలే హల్లేలూయ "4" || మంచి మనస్సు ||

  1. చనిపోయిన  లాజరును లేపినవాడు
    శక్తిమంతుడు మహా శక్తిమంతుడు
    సమరియ స్త్రీ ని కాచినవాడు   నీతిమంతుడు మహా నీతిమంతుడు
    గుడ్డివారికి కన్నులను ఇచ్చినవాడు
    కుంటి వారికి నడకను తెచ్చినవాడు " 2 "
    నీతిమంతుడు శక్తిమంతుడు దయామయుడు ప్రేమ పూర్ణుడేసయ్యా
    హలే హల్లేలూయ హలే హల్లేలూయ "4" || మంచి మనస్సు ||

  2. నీటిని ద్రాక్షారసముగా మార్చినవాడు
    శక్తిమంతుడు మహా శక్తిమంతుడు
    నీటి పైన నడచిన నజరేయుడు నీతిమంతుడు మహా నీతిమంతుడు
    మూగవారికి మాటలను తెచ్చినవాడు
    చెవిటి వారికి వినికిడిని ఇచ్చినవాడు"2"
    నీతిమంతుడు శక్తిమంతుడు దయామయుడు ప్రేమ పూర్ణుడేసయ్యా
    హలే హల్లేలూయ హలే హల్లేలూయ "4" || మంచి మనస్సు ||

Nalona anuvanuvuna neevani నాలోన అణువణువున నీవని

Song no: 164

    నాలోన అణువణువున నీవని
    నీలోన నన్ను దాచినది శాశ్వతమైన కృపయేనని
    యేసయ్యా నీ అపురూపమైన
    ప్రతిరూపమునై ఆరాదించెదను

  1. అరుణోదయ దర్శనమిచ్చి
    ఆవేదనలు తొలగించితివి } 2
    అమృతజల్లులు కురిపించించే - అనందగానాలు పాడుచునే
    కలిగియుందునే - నీ దైవత్వమే || నాలోన ||

  2. ఇమ్మానుయేలుగా తొడైయుండి
    ఇంపైన నైవెద్యముగ మర్చితివే } 2
    ఈ పరిచర్యలో నేను - వాగ్దానఫలములు పొందుకుని
    ధరించుకుందునే - నీ దీనత్వమే || నాలోన ||

  3. వివేక హృదయము - అనుగ్రహించి
    విజయపధములో నడిపించెదవు } 2
    వినయభయభక్తితో నేను - నిశ్చల రాజ్యము పొందుటకు
    స్మరించుకుందునే - నీ ఆమరత్వమే || నాలోన ||