• This is default featured slide 1 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 2 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 3 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 4 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 5 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

Aarbatamutho pradhana dhutha sabbhamutho ఆర్భాటముతో ప్రధాన దూత శబ్ధముతో

Song no: 171

    ఆర్భాటముతో ప్రధాన దూత శబ్ధముతో దేవుని బూరతో  } 2
    మహిమతో ప్రభువు తన స్వాస్త్యముకై త్వరగా రానైయున్నాడు } 2

  1. అరుదెంచెను నవ వసంతము చిగురించుచున్నది అంజూరము } 2
    అనుకొనని గడియలో ప్రత్యక్షమగును మేఘాలపై మన ప్రియుడు ఓపిక కలిగి ఆత్మ ఫలమును ఫలించెదము ప్రభు కొరకే } 2 || ఆర్భాటముతో ||

  2. పరిశుద్ధతలో సంపూర్ణులమై ప్రభువు వలె మార్పునొందెదము } 2
    సూర్య చంద్రులు అక్కర లేని సీయోను నగరము నందు గొర్రె పిల్ల దీపకాంతిలో ప్రకాశించెదము } 2 || ఆర్భాటముతో ||

  3. వధువు సంఘముగా ప్రభువుతో కలిసి నిత్యము నివాసముండెదము } 2
    ఆహా ఎంతో సొగసైన వైభవమైన పన్నెండు గుమ్మముల నగరములో యుగయుగాలు మన ప్రాణ ప్రియునితో లీనమై పోదుము } 2 || ఆర్భాటముతో ||

Share:

Naa kentho anandham nee sannidhi prabhuvaa నా కెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా

Song no: 85

    నా కెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా
    నీలో నేనుండుటే అదే నా ధన్యతయే

  1. ఏ అపాయము నను సమీపించక
    ఏ రోగమైనను నా దరికి చేరక } 2
    నీవు నడువు మార్గములో నా పాదము జారక
    నీ దూతలే నన్ను కాపాడితిరా || నా కెంతో ||

  2. నా వేదనలో నిన్ను వేడుకొంటిని
    నా రోదనలో నీకు మొఱ్ఱ పెట్టితిని } 2
    నా కన్నీటిని తుడిచి నీ కౌగిట చేర్చితివా
    నా కన్న తండ్రివై కాపాడుచుంటివా || నా కెంతో ||
Share:

Naa vimochakuda yesayya nee jivana ragalalo నా విమోచకుడా యేసయ్యా నీ జీవన రాగాలలో

Song no: 87

    నా విమోచకుడా యేసయ్యా నీ జీవన రాగాలలో....
    నీ నామమే ప్రతిధ్వనించెనే నీ జీవన రాగాలలో....
    నీ నామమే ప్రతిధ్వనించెనే నా విమోచకుడా యేసయ్యా....

  1. నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నను నింపినందునా } 2
    నీవు చూపిన నీ కృప నేమరువలేను } 2 || నా విమోచకుడా ||

  2. జీవ వాక్యము నాలోన నిలిపి జీవమార్గమలో నడిపించి నందునా } 2
    జీవాధిపతి నిన్ను నేవిడువలేను } 2 || నా విమోచకుడా ||

  3. మమతలూరించె వారెవరు లేరని నిరాశల చెరనుండి విడిపించినందునా } 2
    నిన్ను స్తుతించకుండా నేనుండలేను } 2 || నా విమోచకుడా ||
Share:

Naa marghamu naku dhipamaina na yesunitho sadha నా మార్గము నకు దీపమైన నా యేసుతో సదా సాగెద

Song no: 90
    నా మార్గము నకు దీపమైన
    నా యేసుతో సదా సాగెద

  1. గాఢాంధకారపు లోయలలో మరణ భయము నన్ను కమ్మినను } 2
    ఆత్మయందు నే కృంగిపోవక అనుదినం ఆనందింపజేయునట్టి
    ఆత్మనాధునితో సాగెదను } 2 || నా మార్గ ||

  2. నాయొక్క ప్రయత్నములన్నియును నిష్పలముగ అవి మారినను } 2
    నా యొక్క ఆశలు అన్నియును నిరాశలుగా మారిపోయినను
    నిరీక్షణతో నే సాగెదను } 2 || నా మార్గ ||

  3. సమస్తమైన  నా భారములు సంపూర్ణముగా ప్రభు తీర్చునుగా } 2
    నా సన్నిధి నీకు తోడుగా వచ్చునని సెలవిచ్చిన
    నా దేవునితో సాగెదను } 2 || నా మార్గ ||

  4. ప్రతి ఫలము నేను పొందుటకు నిరీక్షణతో నున్న ధైర్యమును
    పలు శ్రమలందును విడవకుండ ప్రాణాత్మ దేహము సమర్పించి
    ప్రియుని ముఖము చూచి సాగెదను || నా మార్గ || 
Share:

Halleluya prabhu yesuke sadhakalamu padedhanu హల్లెలూయా ప్రభు యేసుకే సదాకాలము పాడెదను

Song no: 79

    హల్లెలూయా ప్రభు యేసుకే సదాకాలము పాడెదను... హల్లెలూయా....

  1. ఆనందం మానంద మానందమే శాశ్వత ప్రేమచే నన్ను ప్రేమించి !!2!!
    సొంత పుత్రునిగా మార్చినది నా జీవిత భాగ్యమే. . . . || హల్లెలూయా ప్రభు యేసుకే ||

  2. ఆనందం మానంద మానందమే ఆనంద తైలంతో అభిషేకించి !!2!!
    అతి పరిశుద్ధ స్థల ప్రవేశమిచ్చే నా జీవిత భాగ్యమే. . . . || హల్లెలూయా ప్రభు యేసుకే ||


  3. ఆనందం మానంద మానందమే జ్యోతియైన సీయోన్ నివాసమే } 2
    తండ్రి కుడిపార్స్య నిరీక్షణయే నా జీవిత భాగ్యమే. . . . } 2 || హల్లెలూయా ప్రభు యేసుకే ||
Share:

Naa hithuda snehithuda na apthuda na aathmiyuda నా హితుడా స్నేహితుడా నా ఆప్తుడా నా ఆత్మీయుడా

Song no:

    నా హితుడా - స్నేహితుడా
    నా ఆప్తుడా - నా ఆత్మీయుడా నీ కంటే సన్నిహితులు
    నాకెవరున్నారయ్యా నీ వంటీ ఉత్తములు
    వేరెవరున్నారయ్యా

  1. నేను ఆశపడ్డప్పుడు
    నన్ను తృప్తి పరిచావు నేను అలసి ఉన్నప్పుడు
    నన్ను సేదదీర్చావు నేను ఆపదలో
    చిక్కుకున్నప్పుడు నన్ను ఆదుకొని
    ఎత్తుకున్నావు. / నీ కంటే /

  2. నేను బాధ పడ్డప్పుడు
    నన్ను ఓదార్చినావు నేను కష్టాల్లో ఉన్నప్పుడు
    నన్ను చేరదీశావు నేను అనాధనై
    దిక్కు లేనప్పుడు నన్ను ఆదరించి
    హత్తుకున్నావు. / నీ కంటే /
Share:

Snehithuda naa snehithuda na prana snehithuda స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా

Song no:

    స్నేహితుడా నా స్నేహితుడా
    నా ప్రాణ స్నేహితుడా
    ఆపదలో నన్నాదుకొనే
    నిజమైన స్నేహితుడా (2)

  1. నన్నెంతో ప్రేమించినావు
    నాకోసం మరణించినావు (2)
    మరువగలనా నీ స్నేహము
    మరచి ఇల నే మనగలనా (2) ||స్నేహితుడా||

  2. నా ప్రాణ ప్రియుడా నీ కోసమే
    నే వేచానే నిరతం నీ తోడుకై (2)
    ఇచ్చెదన్ నా సర్వస్వము
    నాకున్న ఆశలు ఈడేర్చుము (2) ||స్నేహితుడా||

  3. కన్నీటితో ఉన్న నన్ను
    కరుణించి నను పలుకరించావు (2)
    మండిన ఎడారిలోన
    మమత వెల్లువ కురిపించినావు (2) ||స్నేహితుడా||
Share:

Popular Products

Labels

Recent Posts

Unordered List

  • Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit.
  • Aliquam tincidunt mauris eu risus.
  • Vestibulum auctor dapibus neque.

Pages