-->
Song no: 120
హృదయ మర్పించెదము ప్రభునకు
స్తుతి ప్రశంసలతో పరిశుద్దులము చేరి } 2
- పాపభారము మోయన్ వచ్చె నేసు జగతిన్ } 2
పాపుల పాపము తొలగించుటకు } 2
నిత్యజీవము నిచ్చెన్ } 2
|| హృదయ ||
- సంకట క్లేశము భరించెన్ నమ్రతతో దీనుడై } 2
రక్షణ ద్వారము తెరచెను ప్రభువు } 2
నిత్య నిరీక్షణ నిచ్చెన్ } 2
|| హృదయ ||
- ఆశ్చర్య పరలోక ప్రేమ పాపులమగు మనకే } 2
తిరిగి వెళ్ళకు పాపమునకు } 2
నిలువకు పాపములో } 2
|| హృదయ ||
- అర్పించెదము ప్రభువా ఆత్మ ప్రాణ దేహం } 2
కాపాడు మా జీవితముల } 2
ఇదియే మా వినతి } 2
|| హృదయ ||
Song no: 202
స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయ
స్తుతి - చెల్లించి యుల్లసింతము హల్లెలూయ } 2
అనుపల్లవి : గడచిన కాలమెల్ల - కంటిపాపవలె } 2
కాచెను ప్రభువు మమ్ము హల్లెలూయ - ప్రభున్ } 2|| స్తోత్రించి ||
- పాపమును బాపినాడు హల్లెలూయ - మన
శాపమును మాపినాడు హల్లెలూయ } 2
కన్నతల్లివలెనె - కనికరించెను మమ్ము } 2
యెన్నతరమా ప్రేమ హల్లెలూయ - ప్రభున్
|| స్తోత్రించి ||
- తల్లియైన మరచినను హల్లెలూయ - తాను
ఎన్నడైన మరచిపోడు హల్లెలూయ } 2
ఎల్ల యీవుల నిచ్చి యుల్లాస మొసగును } 2
కొల్లగ మనల కోరి హల్లెలూయ - ప్రభున్
|| స్తోత్రించి ||
- శోధన కాలములందు హల్లెలూయ - మన
వేదన కాలములందు హల్లెలూయ } 2
నాథుడు యేసు మన చెంతనుండ నిల
} 2
చింత లేమియు రావు హల్లెలూయ - ప్రభున్
|| స్తోత్రించి ||
- ఘోర తుఫాను లెన్నెన్నో హల్లెలూయ - బహు
ఘోరముగ లేచినను హల్లెలూయ } 2
దోనెయందున్న యేసు - దివ్యముగను లేచి } 2
ధాటిగా వాటి నణచు హల్లెలూయ ప్రభున్
|| స్తోత్రించి ||
- సర్వలోకమునందున హల్లెలూయ - నన్ను
సాక్షిగ నుంచెను యేసు హల్లెలూయ } 2
చేరిన వారినెల్ల కోరి ప్రేమించు నేసు } 2
చేర్చును కౌగిటిలో హల్లెలూయ ప్రభున్
|| స్తోత్రించి ||
Song no: 171
యేసూ నన్ను ప్రేమించినావు పాపినైన నన్ను ప్రేమించినావు||
- నన్ను ప్రేమింపమా నవరూప మెత్తి దా నముగా జీవము సిల్వపై నిచ్చి కన్న తలిదండ్రుల యన్నదమ్ముల ప్రేమ కన్న మించిన ప్రేమతో ||యేసూ||
- తల్లి గర్భమున నే ధరియింపఁబడి నపుడే దురితుండనై యుంటిని నా వల్లజేఁయఁబడెడు నెల్ల కార్యము లెప్పు డేహ్యంబులై యుండఁగ ||యేసూ||
- మంచి నాలోఁ పుట్ట దంచు నీ వెరిఁగి నన్ మించఁ బ్రేమించి నావు ఆహా యెంచ శక్యముగాని మంచి నాలోఁ బెంచ నెంచి ప్రేమించినావు ||యేసూ||
- నన్నుఁ బ్రేమింప నీ కున్న కష్టము లన్ని మున్నై తెలిసియుంటివి తెలిసి నన్నుఁ బ్రేమింప నీ కున్న కారణమేమో యన్నా తెలియదు చిత్రము ||యేసూ||
- నా వంటి నరుఁ డొకఁడు నన్నుఁ ప్రేమించిన నావలన ఫలముఁ గోరు ఆహా నీవంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలంబేమి లేక ||యేసూ||
Song no: 144
క్రీస్తే సర్వాధికారి క్రీస్తే మోక్షాధికారి
క్రీస్తే మహోపకారి క్రీస్తే ఆ సిల్వధారి ||
- ముక్తి విధాతనేత శక్తి నొసంగుదాత
భక్తి విలాపశ్రోత పరమంబు వీడె గాన ||క్రీ||
- దివ్యపథంబురోసి దైవంబు తోడుబాసి
దాసుని రూపుదాల్చి ధరణి కేతెంచెగాన ||క్రీ||
- శాశ్వత లోకవాసి సత్యామృతంపురాశి
శాప భారంబు మోసి శ్రమల సహించెగాన ||క్రీ||
- సైతాను జనము గూల్పన్ పాతాళమునకు బంపన్
నీతి పథంబు బెంప రుధిరంబు గార్చెగాన ||క్రీ||
- మృత్యువు ముల్లు తృంపన్ నిత్యజీవంబు బెంపన్
మర్త్యాళిభయము దీర్పన్ మరణంబు గెలిచెగాన ||క్రీ||
- పరమందు దివిజులైన ధరయందు మనుజులైన
ప్రతి నాలుక మోకాలు ప్రభునే భజించుగాన ||క్రీ||
- ఈ నామమునకు మించు నామంబు లేదటంచు
యెహోవా తండ్రి యేసున్ హెచ్చించినాడు గాన ||క్రీ||
Song no: #87
సర్వ లోక సం పూజ్యా నమోనమో
సర్వ జ్ఞాన సంపూర్ణా నమోనమో
సర్వ సత్య సారాంశా నమోనమో
దేవా గావో || 4
-
దీన భక్త మందారా నమోనమో
దోష శక్తి సంహారా నమోనమో
దేవా యేసావతార నమోనమో
దేవా గావో || 4
-
దేవలోక ప్రదీపా నమోనమో
భావలోక ప్రతాపా నమోనమో
పావనాత్మ స్వరూపా నమోనమో
దేవా గావో || 4
-
వేదవాక్యాదర్శ మీవె నమోనమో
వేద జీవమార్గం బీవె నమోనమో
వేదవాక్కును నీవే నమోనమో
దేవా గావో || 4
-
శాపగ్రహివైతివి నాకై నమోనమో
ప్రాణత్యాగివైతివి. నాకై నమోనమో
ప్రాయశ్చిత్తమైతివి నాకై నమోనమో
దేవా గావో || 4
Song no:
హ్యాప్పీ క్రిస్మస్… మెర్రి క్రిస్మస్…
జై జై జై యేసయ్యాపూజ్యుడవు నీవయ్యా
ఈ లోకానికొచ్చావయ్యా సంతోషం తెచ్చావయ్యా
మాకు సంతోషం తెచ్చావయ్యా (2)
- కన్య గర్భమందు నీవు పుట్టావయ్యా
పరిశుద్దునిగా నీవు మా కొరకు వచ్చావయ్యా (2)
పశుల పాకలో పశుల తొట్టిలోపసి బాలుడుగా ఉన్నావయ్యా (2)
హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్మెర్రి మెర్రి క్రిస్మస్ (2) ॥జై జై జై॥
- దివినుండి దూత తెచ్చెను ఈ శుభవార్తను
నిశీధి రాత్రియందు ఆ గొల్లలకు (2)
లోక రక్షకుడు జన్మించెననిసంతోషముతో ఆనందముతో (2)
హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్మెర్రి మెర్రి క్రిస్మస్ (2) ॥జై జై జై|
Song no:
నీ ప్రేమా..... నీ కరుణా... చాలునయా నా జీవితానా
మరి దేనినీ ఆశించనూ నే కోరను ఈ జాగానా
చాలయ్య చాలీ దీవెనలు చాలు
మేలయ్యమేలు నీ సన్నిధి మేలు
- గురిలేని నన్ను గుర్తించినావే
ఎనలేని ప్రేమను చూపించినావే
వెలలేని నాకు విలువిచ్చినావే
విలువైన పాత్రగా నను మార్చినావే
- చేజారిన నాకై చేజాచినావే
చెదరిన నన్ను విడిపించినావే
చెరనుండి నన్ను విడిపించినావే
చెరగని నీ ప్రేమకు సాక్షిగా మార్చావే
- నరకపు పొలిమేరలో నను కనుగొన్నావే
కల్వరిలో ప్రాణమిచ్చి ననుకొన్నావే
నీప్రేమను ప్రకటింప నను ఎన్నుకొన్నావే
నీ కుమారునిగా నను మార్చినావే