-->

Yesu namame saranamuraa o sodharaa యేసు నామమే శరణమురా ఓ సోదరా యేసు ధ్యానమే జీవమురా

Song no:

    యేసు నామమే శరణమురా ఓ సోదరా
    యేసు ధ్యానమే జీవమురా ఓ సోదరా } 2
    యేసే మార్గం యేసే సత్యం
    యేసే జీవం యేసే సర్వం
    యేసే మార్గం మార్గం యేసే సత్యం సత్యం
    యేసే జీవం జీవం యేసే సర్వం
    యేసు నామమే శరణమురా ఓ సోదరా
    యేసు ధ్యానమే జీవమురా ఓ సోదరా

  1. మనిషిని మార్చలేని మతాలెన్ని ఉన్న ఏమి ఫలితము రా.... } 2
    మతములతో మతిపోయిన నీకు యేసు శరణమురా... యేసు శరణమురా...
    యేసే మార్గం యేసే సత్యం
    యేసే జీవం యేసే సర్వం
    యేసే మార్గం మార్గం యేసే సత్యం సత్యం
    యేసే జీవం జీవం యేసే సర్వం

  2. మనిషిగా పుట్టిన నీకు మనశ్శాంతి లేకుంటే ఎన్నుంటే ఏమిటిరా? } 2
    శాంతిలేక సతమతపడితే యేసు శరణమురా... యేసు శరణమురా...
    యేసే మార్గం యేసే సత్యం
    యేసే జీవం యేసే సర్వం
    యేసే మార్గం మార్గం యేసే సత్యం సత్యం
    యేసే జీవం జీవం యేసే సర్వం

  3. ఆత్మశుద్ధి లేని ఆచారాలెన్నున్నా ఆ స్వర్గం చేర్చవురా } 2
    పరిశుద్ధునిగా మారాలంటే యేసే మార్గమురా... యేసే మార్గమురా...
    యేసే మార్గం యేసే సత్యం
    యేసే జీవం యేసే సర్వం
    యేసే మార్గం మార్గం యేసే సత్యం సత్యం
    యేసే జీవం జీవం యేసే సర్వం

    యేసు నామమే శరణమురా ఓ సోదరా
    యేసు ధ్యానమే జీవమురా ఓ సోదరా } 2
    యేసే మార్గం యేసే సత్యం
    యేసే జీవం యేసే సర్వం
    యేసే మార్గం మార్గం యేసే సత్యం సత్యం
    యేసే జీవం జీవం యేసే సర్వం
Share:

Rammanuchunnadu ninnu prabhu yesu రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు

Song no:

    రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు
    వాంఛతో తన కరము చాపి
    రమ్మనుచున్నాడు (2)

  1. ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని (2)
    గ్రహించి నీవు యేసుని చూచిన
    హద్దు లేని ఇంపు పొందెదవు (2) ||రమ్మను||

  2. కన్నీరంతా తుడుచును కనుపాపవలె కాపాడున్ (2)
    కారు మేఘమువలె కష్టములు వచ్చిననూ
    కనికరించి నిన్ను కాపాడును (2) ||రమ్మను||

  3. సోమ్మసిల్లు వేళలో బలమును నీకిచ్చును (2)
    ఆయన నీ వెలుగు రక్షణనై యుండును
    ఆలసింపక త్వరపడి రమ్ము (2) ||రమ్మను||

  4. సకల వ్యాధులను స్వస్థత పరచుటకు (2)
    శక్తిమంతుడగు ప్రభు యేసు ప్రేమతో
    అందరికి తన కృపలనిచ్చున్ (2) ||రమ్మను||
    1. Rammanuchunnaadu Ninnu Prabhu Yesu
      Vaanchatho Thana Karamu Chaapi
      Rammanuchunnaadu (2)

      Etuvanti Shramalandunu
      Aadarana Neekichchunani (2)
      Grahinchi Neevu Yesuni Choochina
      Hadhdhu Leni Impu Pondedavu (2) ||Rammanu||

      Kanneeranthaa Thuduchunu
      Kanupaapavale Kaapaadun (2)
      Kaaru Meghamuvale Kashtamulu Vachchinanoo
      Kanikarinchi Ninnu Kaapaadunu (2) ||Rammanu||

      Sommasillu Velalo
      Balamunu Neekichchunu (2)
      Aayana Nee Velugu Rakshananai Yundunu
      Aalasimpaka Thvarapadi Rammu (2) ||Rammanu||

      Sakala Vyaadhulanu
      Swasthatha Parachutaku (2)
      Shakthimanthudagu Prabhu Yesu Prematho
      Andariki Thana Krupalanichchun (2) ||Rammanu||
Share:

Sathakoti vandhanalu yesu swamy neeku karuninchi శతకోటి వందనాలు యేసు స్వామి నీకు కరుణించి కాపాడుమయ్య

Song no:

    శతకోటి వందనాలు యేసు స్వామి నీకు కరుణించి కాపాడుమయ్య (2)
    కాలాలన్నీ మారినట్టు మారిపోని నీకు మా నిండు వందనాలయ్య (2)

    అనుపల్లవి :ఆ చల్లని చూపు మాపై నిలుపు నీ కరుణ హస్తం మాపై చాపు (2)

    1 యేసేపు అన్నలంత తోసేసినా బానిసగా బైట అమ్మేసిన చేయ్యని నేరాలెన్నో మోపేసిన చెరసాలలో అతని పడేసిన చల్లంగా చూచినావు నీ చేయి చాచినావు బాధించిన దేశానికే ప్రధాని చేసినావు (2) (ఆ చల్లని)

    2 ఆరుమూరల జానేదైనా గొల్యాతు ఎంతో ధీరుడైనా దేవుని హృదయానుసారుడైనా దావీదును చిన్న చూపుచూసినా చల్లంగా చూచినావు నీ చేయి చాచినావు అభిషేకమిచ్చి నీవే రాజుగా చేసినావు (2) (ఆ చల్లని)

Share:

Prabhuvaa ani prarthisthey chaluna devaa ani arthisthey saripovuna ప్రభువా అని ప్రార్ధిస్తే చాలునా దేవా అని అర్ధిస్తే సరిపోవునా

Song no:

    ప్రభువా అని ప్రార్ధిస్తే చాలునా
    దేవా అని అర్ధిస్తే సరిపోవునా }2

  1. మనసు మార్చుకోకుండా ప్రార్థనలు చేసినా
    బ్రతుకు బాగుపడకుండా కన్నీళ్ళు కార్చినా }2
    ప్రభుని క్షమను పొందగలమా దీవెనల నొందగలమా }2
    ఆలోచించుమా ఓ నేస్తమా ఆలోచించుమా ప్రియ సంఘమా
    ప్రభువా అని ప్రార్ధిస్తే చాలునా
    దేవా అని అర్ధిస్తే సరిపోవునా

  2. పైకి భక్తి ఎంత ఉన్న లోన శక్తి లేకున్న
    కీడు చేయు మనసు ఉన్న కుటుంబాలు కూల్చుతున్న }2
    సుఖ సౌఖ్యమునొందగలమా సౌభాగ్యము పొందగలమూ }2
    ఆలోచించుమా ఓ నేస్తమా ఆలోచించుమా ప్రియ సంఘమా
    ప్రభువా అని ప్రార్ధిస్తే చాలునా
    దేవా అని అర్ధిస్తే సరిపోవునా

  3. మాటతీరు మారకుండా మనుష్యులను మార్చతరమా
    నోటినిండా బోధలున్నా గుండె నిండా పాపమున్నా }2
    ప్రభు రాజ్యం చేరగలమా ఆ మహిమను చూడగలమా }2
    ఆలోచించుమా ఓ సేవకా ఆలోచించుమా ప్రియ బోధకా
    ప్రభువా అని ప్రార్ధిస్తే చాలునా
    దేవా అని అర్ధిస్తే సరిపోవునా
Share:

Krupavembadi krupa pondhithini nee krupalo thaladhachithini కృపవెంబడి కృప పొందితిని నీ కృపలో తలదాచితిని

Song no:

    కృపవెంబడి కృప పొందితిని నీ కృపలో తలదాచితిని
    కృపవెంబడి కృప పొందితిని నీ కృపలో తలదాచితిని
    యేసయ్య హల్లేలూయా యేసయ్యా హల్లేలూయా
    క్షమవెంబడి క్షమ పొందితిని నీ క్షమలో కొనసాగితిని
    మెస్సియ్యా హల్లేలూయా మెస్సియ్యా హల్లేలూయా
    కృపా సత్య సంపూర్ణుడా – క్షమా ప్రేమ పరిపూర్ణుడా ||కృప||

  1. పాపములో పరి తాపమును – పరితాపములో పరివర్తనను
    పరివర్తనలో ప్రవర్తనను-ప్రవర్తనలో పరిశుద్దతను
    ప్రశవించెను పరిశుద్దాత్ముడు – ప్రశరించెను శిలువ శిక్షణలో ||2|| ||కృప||

  2. ఆత్మలో దీనత్వమును – దీనత్వములో సాత్వీకతను
    సాత్వీకతలో మానవత్వమును – మానవత్వములో దైవత్వమును
    ప్రసవించెను పరిశుద్దాత్ముడు – ప్రసరించెను దైవ రక్షణలో ||2|| ||కృప||
Share:

Naa pranam yehova ninne sannuthinchuchunnadhi నా ప్రాణం యెహోవా నిన్నే సన్నుతించుచున్నది

Song no:

    నా ప్రాణం యెహోవా(యేసయ్యా)
    నిన్నే సన్నుతించుచున్నది
    నా అంతరంగ సమస్తము
    సన్నుతించుచున్నది |2|
    నీవు చేసిన మేలులను
    మరువకున్నది|2|
    నా దేవా నా ఆత్మ
    కొనియాడుచున్నది|2|
    ||నా ప్రాణం||

    ఉత్తముడని నీవే అనుచు
    పూజ్యుడవు నీవే అనుచు|2|
    వేల్పులలోన ఉత్తముడవని
    ఉన్నవాడనను దేవుడనీ|2|
    నా దేవా నా ఆత్మ
    కొనియాడుచున్నది|2|
    ||నా ప్రాణం||

    ఆదిమధ్య అంతము నీవని
    నిన్న నేడు నిరతము కలవుఅని|2|
    నా పితరుల పెన్నిది నీవని
    పరము చేర్చు ప్రభుడవు నీవని|2|
    నా దేవా నా ఆత్మ
    కొనియాడుచున్నది|2|
    ||నా ప్రాణం||
Share:

Inthaga nannu preminchinadhi ఇంతగా నన్ను ప్రేమించినది నీ రుపమునాలొ

Song no: 65

    ఇంతగ నన్ను - ప్రేమించినది
    నీ రూపమునాలొ - రూపించుటకా -2
    ఇదియే - నాయెడ నీకున్న నిత్య సంకల్పమా
    నాయెడ నీకున్న నిత్య సంకల్పమా

  1. శ్రమలలో సిలువలో - నీ రూప నలిగినదా... -2
    శిలనైనా నన్ను- నీవలె మార్చుటకా

    శిల్పకారుడా - నా యేసయ్యా...
    మలుచుచుంటివా - నీ పొలికగా -2
    ఇదియే - నాయెడ నీకున్న నిత్య సంకల్పమా
    నాయెడ నీకున్న నిత్య సంకల్పమా

  2. తీగలు సడలి - అపస్వరములమయమై... -2
    ముగబోయెనే - నా స్వర్ణ మండలము

    అమరజీవ - స్వరకల్పనలు
    నా అణువణువునా  - పలికించితివా -2
    ఇదియే - నాయెడ నీకున్న నిత్య సంకల్పమా
    నాయెడ నీకున్న నిత్య సంకల్పమా   ||ఇంతగ నన్ను||
Share:

Facebook

lent

Good friday

Powered by Blogger.


123

1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట అన్ని కాలంబుల నున్న యెహోవా ని నెన్నదరంబయో కన్న ...

Search This Blog

3/related/default

Text Widget

Contributors

Categories

Pages

No Thumbnail

No Thumbnail
50

Most Recent

Subscribe Us

Comments

Technology

Latest Posts

Recent Posts