Song no: 21
మాధుర్యమే నా ప్రభుతో జీవితం
మహిమానందమే - మహా ఆశ్చర్యమే -2
మాధుర్యమే నా ప్రభుతో జీవితం
- సర్వ శరీరులు గడ్డిని పోలిన - వారై యున్నారు -2
వారి అందమంతయు -పువ్వువలె వాడిపోవును - వాడిపోవును ॥ మాధుర్యమే ॥
- నెమ్మది లేకుండ విస్తారమైన - ధనముండుట కంటె -2
దేవుని యందలి భయభక్తులతో ఉండుటే మేలు - ఉండుటే మేలు ॥ మాధుర్యమే ॥
- వాడబారని కిరీటమునకై - నన్ను పిలిచెను -2
తేజోవాసులైన పరిశుద్ధులతో ఎపుడు చేరెదనో - ఎపుడు చేరెదనో ॥ మాధుర్యమే
Song no: 03
నూతన - యెరూషలేము పట్టణము
పెండ్లికై- అలంకరింపబడుచున్నది
- దైవనివాసము మనుషులతో- కూడా ఉన్నది
వారాయనకు - ప్రజలై యుందురు
ఆనంద - ఆనంద - ఆనందమే
౹౹నూతన౹౹
- ఆదియు నేనే - అంతము నేనై యున్నాను
దుఃఖము లేదు - మరణము లేదు
ఆనంద - ఆనంద - ఆనందమే
౹౹నూతన౹౹
- అసహ్యమైనది - నిషిద్ధమైనది చేయువారు
ఎవ్వరు దానిలో - లేనేలేరు
ఆనంద - ఆనంద - ఆనందమే
౹౹నూతన ౹౹
- దేవుని దాసులు - ఆయనను సేవించుదురు
ముఖ దర్శనము - చేయుచునుందురు
ఆనంద - ఆనంద - ఆనందమే
౹౹ నూతన౹౹
- సీయోనులో - గొర్రెపిల్లయే మూలరాయి
సీయోను పర్వతము - మీదయు ఆయనే
ఆనంద - ఆనంద - ఆనందమే
౹౹నూతన౹౹
Song no: 14
యేసు రాజు రాజుల రాజై
త్వరగా వచ్చుచుండె – త్వరగా వచ్చుచుండె
హోసన్నా జయమే – హోసన్నా జయమే
హోసన్నా జయం మనకే – హోసన్నా జయం మనకే ॥యేసు॥
- యోర్దాను ఎదురైనా ఎర్ర సంద్రము పొంగిపొర్లినా (2)
భయము లేదు జయము మనదే (2)
విజయ గీతము పాడెదము (2) ॥హోసన్నా॥
- శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధియైనా (2)
యేసు గాయముల్ స్వస్థపరచున్ (2)
రక్తమే రక్షణ నిచ్చున్ (2) ॥హోసన్నా॥
- హల్లెలూయ స్తుతి మహిమ
ఎల్లప్పుడు హల్లెలూయ స్తుతి మహిమ (2)
యేసు రాజు మనకు ప్రభువై (2)
త్వరగా వచ్చుచుండె (2) ॥హోసన్నా॥
Song no: 09
యేసయ్యా నా ప్రియా !
ఎపుడో నీ రాకడ సమయం -2 || యేసయ్యా ||
- దురవస్థలలో ఒంటరినై -దుమికి ధూళిగా మారినను -2
దూరాన నీ ముఖ దర్శనము -ధృవతారగ నాలో వెలిగెనే -2 || యేసయ్యా ||
- మరపురాని నిందలలో - మనసున మండే మంటలలో -2
మమతను చూపిన నీ శిలువను - మరచిపోదునా నీ రాకను -2 || యేసయ్యా ||
- ప్రియుడా నిన్ను చూడాలని - ప్రియ నీవలెనే మారాలని -2
ప్రియతమా నాకాంక్ష తీరాలని -ప్రియమార నామది కోరెనే -2 || యేసయ్యా ||
Song no:
రాకడ సమయంలో – కడబూర శబ్ధంతో
యేసుని చేరుకునే – విశ్వాసం నీకుందా? (2)
రావయ్య యేసయ్య – వేగరావయ్యా
రావయ్య యేసునాథా – వేగమెరావయ్యా (2) ॥రాకడ॥
- యేసయ్య రాకడ సమయంలోఎదురేగె రక్షణ నీకుందా? (2)
లోకాశలపై విజయం నీకుందా? (2) ॥రావయ్య॥
- ఇంపైన ధూపవేదికగాఏకాంత ప్రార్థన నీకుందా? (2)
యేసు ఆశించే దీన మనస్సుందా? (2) ॥రావయ్య॥
- దినమంతా దేవుని సన్నధిలోవాక్యం కొరకు ఆకలి నీకుందా? (2)
యేసునాథునితో సహవాసం నీకుందా? (2) ॥రావయ్య॥
- శ్రమలోన సహనం నీకుందా?స్తుతియించే నాలుక నీకుందా? (2)
ఆత్మలకొరకైన భారం నీకుందా? (2) ॥రావయ్య॥
- నీ పాత రోత జీవితమునీ పాప హృదయం మారిందా? (2)
నూతన హృదయంతో ఆరాధన నీకుందా? (2) ॥రావయ్య॥
- అన్నీటికన్నా మిన్నగనుకన్నీటి ప్రార్థన నీకుందా? (2)
ఎల్లవేళలలో స్తుతియాగం నీకుందా? (2) ॥రావయ్య॥
Song no: 08
నేను వెళ్ళేమార్గము - నా యేసుకే తెలియును -2
శోదింప బడిన మీదట - నేను సువర్ణమై మారెదను -2
- కడలేని కడలి తీరము - ఎడమాయె కడకు నా బ్రతుకున -2
గురిలేని తరుణాన వెరవగ - నా దరినే నిలిచేవా నా ప్రభు -2
నేను వెళ్ళేమార్గము - నాయేసుకే తెలియును
- జలములలో బడి నే వెళ్లినా - అవి నా మీద పారవు -2
అగ్నిలో నేను నడచినా - జ్వాలలు నను కాల్చజాలవు -2
నేను వెళ్ళేమార్గము - నాయేసుకే తెలియును
- విశ్వాస నావ సాగుచు - పయనించు సమయాన నా ప్రభు -2
సాతాను సుడిగాలి రేపగా - నాయెదుటేనిలిచేవా నా ప్రభు -2
నేను వెళ్ళేమార్గము - నాయేసుకే తెలియును
Song no: 06
నా ప్రియుడా యెసయ్యా - నీ కృప లేనిదే నే బ్రతుకలేను
క్షణమైనా -నే బ్రతుకలేను - 2 నా ప్రియుడా.... ఆ ఆ అ అ -
- నీ చేతితోనే నను లేపినావు - నీ చేతిలోనే నను చెక్కుకొంటివి -2
నీ చేతి నీడలో నను దాచుకొంటివి -2 ॥ నా ప్రియుడా ॥
- నీ వాక్కులన్ని వాగ్దానములై - నా వాక్కు పంపి స్వస్థత నిచ్చితివి -2
నీ వాగ్దానములు మార్పులేనివి -2 ॥ నా ప్రియుడా ॥
- ముందెన్నడూ నేను వెళ్ళనీ - నూతనమైన మార్గములన్నిటిలో 2
నా తోడు నీవై నన్ను నడిపినావు -2 ॥ నా ప్రియుడా ॥
- సర్వోన్నతుడా సర్వకృపానిధి - సర్వసంపదలు నీలోనే యున్నవి2
నీవు నా పక్షమై నిలిచి యున్నావు -2 ॥ నా ప్రియుడా ॥