Song no: 14
యేసు రాజు రాజుల రాజై
త్వరగా వచ్చుచుండె – త్వరగా వచ్చుచుండె
హోసన్నా జయమే – హోసన్నా జయమే
హోసన్నా జయం మనకే – హోసన్నా జయం మనకే ॥యేసు॥
- యోర్దాను ఎదురైనా ఎర్ర సంద్రము పొంగిపొర్లినా (2)
భయము లేదు జయము మనదే (2)
విజయ గీతము పాడెదము (2) ॥హోసన్నా॥
- శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధియైనా (2)
యేసు గాయముల్ స్వస్థపరచున్ (2)
రక్తమే రక్షణ నిచ్చున్ (2) ॥హోసన్నా॥
- హల్లెలూయ స్తుతి మహిమ
ఎల్లప్పుడు హల్లెలూయ స్తుతి మహిమ (2)
యేసు రాజు మనకు ప్రభువై (2)
త్వరగా వచ్చుచుండె (2) ॥హోసన్నా॥
Song no: 09
యేసయ్యా నా ప్రియా !
ఎపుడో నీ రాకడ సమయం -2 || యేసయ్యా ||
- దురవస్థలలో ఒంటరినై -దుమికి ధూళిగా మారినను -2
దూరాన నీ ముఖ దర్శనము -ధృవతారగ నాలో వెలిగెనే -2 || యేసయ్యా ||
- మరపురాని నిందలలో - మనసున మండే మంటలలో -2
మమతను చూపిన నీ శిలువను - మరచిపోదునా నీ రాకను -2 || యేసయ్యా ||
- ప్రియుడా నిన్ను చూడాలని - ప్రియ నీవలెనే మారాలని -2
ప్రియతమా నాకాంక్ష తీరాలని -ప్రియమార నామది కోరెనే -2 || యేసయ్యా ||
Song no:
రాకడ సమయంలో – కడబూర శబ్ధంతో
యేసుని చేరుకునే – విశ్వాసం నీకుందా? (2)
రావయ్య యేసయ్య – వేగరావయ్యా
రావయ్య యేసునాథా – వేగమెరావయ్యా (2) ॥రాకడ॥
- యేసయ్య రాకడ సమయంలోఎదురేగె రక్షణ నీకుందా? (2)
లోకాశలపై విజయం నీకుందా? (2) ॥రావయ్య॥
- ఇంపైన ధూపవేదికగాఏకాంత ప్రార్థన నీకుందా? (2)
యేసు ఆశించే దీన మనస్సుందా? (2) ॥రావయ్య॥
- దినమంతా దేవుని సన్నధిలోవాక్యం కొరకు ఆకలి నీకుందా? (2)
యేసునాథునితో సహవాసం నీకుందా? (2) ॥రావయ్య॥
- శ్రమలోన సహనం నీకుందా?స్తుతియించే నాలుక నీకుందా? (2)
ఆత్మలకొరకైన భారం నీకుందా? (2) ॥రావయ్య॥
- నీ పాత రోత జీవితమునీ పాప హృదయం మారిందా? (2)
నూతన హృదయంతో ఆరాధన నీకుందా? (2) ॥రావయ్య॥
- అన్నీటికన్నా మిన్నగనుకన్నీటి ప్రార్థన నీకుందా? (2)
ఎల్లవేళలలో స్తుతియాగం నీకుందా? (2) ॥రావయ్య॥
Song no: 08
నేను వెళ్ళేమార్గము - నా యేసుకే తెలియును -2
శోదింప బడిన మీదట - నేను సువర్ణమై మారెదను -2
- కడలేని కడలి తీరము - ఎడమాయె కడకు నా బ్రతుకున -2
గురిలేని తరుణాన వెరవగ - నా దరినే నిలిచేవా నా ప్రభు -2
నేను వెళ్ళేమార్గము - నాయేసుకే తెలియును
- జలములలో బడి నే వెళ్లినా - అవి నా మీద పారవు -2
అగ్నిలో నేను నడచినా - జ్వాలలు నను కాల్చజాలవు -2
నేను వెళ్ళేమార్గము - నాయేసుకే తెలియును
- విశ్వాస నావ సాగుచు - పయనించు సమయాన నా ప్రభు -2
సాతాను సుడిగాలి రేపగా - నాయెదుటేనిలిచేవా నా ప్రభు -2
నేను వెళ్ళేమార్గము - నాయేసుకే తెలియును
Song no: 06
నా ప్రియుడా యెసయ్యా - నీ కృప లేనిదే నే బ్రతుకలేను
క్షణమైనా -నే బ్రతుకలేను - 2 నా ప్రియుడా.... ఆ ఆ అ అ -
- నీ చేతితోనే నను లేపినావు - నీ చేతిలోనే నను చెక్కుకొంటివి -2
నీ చేతి నీడలో నను దాచుకొంటివి -2 ॥ నా ప్రియుడా ॥
- నీ వాక్కులన్ని వాగ్దానములై - నా వాక్కు పంపి స్వస్థత నిచ్చితివి -2
నీ వాగ్దానములు మార్పులేనివి -2 ॥ నా ప్రియుడా ॥
- ముందెన్నడూ నేను వెళ్ళనీ - నూతనమైన మార్గములన్నిటిలో 2
నా తోడు నీవై నన్ను నడిపినావు -2 ॥ నా ప్రియుడా ॥
- సర్వోన్నతుడా సర్వకృపానిధి - సర్వసంపదలు నీలోనే యున్నవి2
నీవు నా పక్షమై నిలిచి యున్నావు -2 ॥ నా ప్రియుడా ॥
Song no:
హల్లో హల్లో హల్లోసిబిసి వచ్చింది
చల్లో చల్లో చల్లో (2)
హల్లో నాచో , గావో
2019లో ఏప్రెల్ మే లో లో లో
సిబిసి వచ్చింది.
సిబిసి వచ్చింది జామ్ జామ్ జామ్
ఉల్లాసం తెచ్చింది
గ్యాప్ గ్యాప్ గ్యాప్ (2)
హల్లో హల్లో హల్లో
సిబిసి వచ్చింది
చల్లో చల్లో చల్లో
హల్లో నాచో , గావో
2019లో ఏప్రెల్ మే లో లో లో
- కంఠత వాక్యం
కమ్మని పాటలూ
పప్పెట్ బొమ్మలా
టక్కరి మాటలూ....(2)
క్షణక్షణం ఆనందం...
నవ్వులన్నీ మా స్వంతం(2)
సిబిసి వచ్చింది జామ్ జామ్ జామ్ జామ్
ఉల్లాసం తెచ్చింది గ్యాప్
గ్యాప్ గ్యాప్
హల్లో హల్లో హల్లో
సిబిసి వచ్చింది
హల్లో హల్లో హల్లో
సిబిసి వచ్చింది
చల్లో చల్లో చల్లో
హల్లో నాచో , గావో
2019లో ఏప్రెల్ మే లో లో లో
- చిట్టీ కథలూ
చక్కని డ్యాన్సులూ(2)
లిటిల్ బ్రేకులూ లాలిపపాలు(2)
క్షణక్షణం ఆనందం
నవ్వులన్నీ మా స్వంతం(2)
బసిబిసి వచ్చింది
జామ్ జామ్ జామ్
ఉల్లాసం తెచ్చింది
గ్యాప్ గ్యాప్ గ్యాప్
హల్లో హల్లో హల్లో
సిబిసి వచ్చింది
చల్లో చల్లో చల్లో
హల్లో నాచో , గావో
2019లో ఏప్రెల్ మే లో లో లో
- బైబిల్ క్విజ్ లూ
బలే స్కిట్ రూ
ఆటలు పాటలూ
అలుపే వుండదూ. (2)
క్షణ క్షణం ఆనందం..
నవ్వులన్నీ మా సొంతం(2)
సిబిసి వచ్చింది జామ్ జామ్ జామ్
ఉల్లాసం తెచ్చింది
గ్యాప్ గ్యాప్ గ్యాప్
హల్లో హల్లో హల్లో
సిబిసి వచ్చింది
చల్లో చల్లో చల్లో
హల్లో నాచో , గావో
2019లో ఏప్రెల్ మే లో లో లో
Song no: 88
అనురాగ వల్లీ మా ఇంటి జాబిల్లి (2)
మధురమైన నీపెళ్ళి మా కంటివెలుగు ఓ తల్లి (2) అనురాగ
-
ఆదర్శగృహినివై నీ ఇంటినే ఆనంద గృహముగ తీర్చాలి (2)
ఆత్మీయ వరములు మెండుగా నీ ముంగిట వర్శించాలి (2)
నీ అక్కర లన్నితీరాలి | అనురాగ|
- కలిమి లేములలొ కృంగక కరములు జోడించి వేడాలి
కరుణామయుని కనికరం కలకాలం నీకుండాలి (2)
కన్నవారింటి గౌరవం కలకాలం కాపాడాలి (2)
నీ ఇంటి పేరు నిలపాలి |అనురాగ|