Song no:
దేవుడు మాపక్షమున ఉండగా మాకు విరోది ఎవడు జీవము గల దేవుని సైన్యముగా శాతానుని ఓడింతుము "2"
యుద్ధం యెహోవాదే రక్షణా యెహోవాదేవిజయం యెహోవాదే ఘనతా యెహోవాదే " దేవుడు "
- మా దేవునీ భాహువే తన ధక్షిణా హస్తమేఆయన ముఖ కాంతియే మాకు జయమిచ్చును "2"
తనదగు ప్రజగా మము రూపించి - నిరతము మాపై కృపచూపించితన మహిమకై మము పంపించి - ప్రభావమును కనబరుచును " యుద్ధం"
- మా దేవునీ ఎరిగినా జనులుగా మేమందరంభలముతో ఘన కార్యముల్ చేసి చూపింతుము "2"
దేవుని చేసుర క్రియలు చేసి - భూమిని తల క్రిందులుగా చేసిఆయన నామము పైకెత్తి - ప్రభు ద్వజము స్తాపింతుము "యుద్ధం
Song no:
ఇదిగో వినుమా ఓ లోకమా..త్వరలో ప్రభువు రానుండెను..(2)
సిధపడుమా ఓ లోకమా..సిధపడుమా ఓ సంఘమా..(2)మరనాతా..॥ఇదిగో॥
మహా మహా ఆర్భాటముతో..ప్రధాన దూత శబ్దంతో..దేవుని భూరతో..
ప్రభువు వేగమే దిగివచును ..(2)ప్రభునందు మృతులు లేతురు..సమాధులు తెరువగా..విశ్వసులంతధాల్తురు..మహిమ రూపును వింతగా..ఎత్తబాడును సంఘమూ..అయ్యో విడువబడుట మహా ఘోరము..॥సిధపడుమా॥
ఏడేండ్లు భూమిపై శ్రమకాలం..ప్రాణాలు జారే భయకాలం..ఊరలు,తెగుళ్ళు ..
దైవ ఊగ్రత పాత్రలు..(2)
ఆకాశ శక్తులు కదలును..గతి తప్పును ప్రకృతి..కల్లోలమౌను లోకము..
రాజ్యమేలును వికృతి..సంఘమేంతో హాయిరా...మధ్యకాశాన విందురా...॥సిధపడుమా||
అన్యాయం చేయువాడు చేయనిమ్ము..అపవిత్రుడు అట్లే ఉండనిమ్ము..
పరిశుధుడు ఇంకను పరిశుదుడుగా ఉండనిమ్ము..(2)
ప్రతివాని క్రియల జీతము..ప్రభు తేచును ఒకదినం..రాహస్య క్రియలన్నియి భయల్పడునులే ఆ దినం..లొకథనము గుడిరా..
నికుందా ఫై సంపదా.. ..॥సిధపడుమా॥
Song no:
ఇశ్రాయేలును కాపాడు దేవుడు కునుకడు నిద్రపోడెన్నడు -2
భూమి మారినా జలములు పొంగినా కొండలు కదిలినా భయము లేదుగా
మారని దేవుడు విడువని నాధుడు యేసు ప్రభువె మాకు తోడుగుండగా
ఇశ్రాయేలును కాపాడు దేవుడు కునుకడు నిద్రపోడెన్నడు -2
ఇత్తడి తలుపులను ఇనుప గడియలను–మాదేవుడేపగులగొట్టును
మా ముందర ఆయన నడుచును - ఈ భూమిని మేంస్వతంత్రించను
రహస్యమందలి ఆత్మల ధనము - ప్రపంచపు కోట్లాది జనము -2
మాకు సొత్తుగా స్వాస్థ్యధనముగా-ఇచ్చెను ప్రభువు ఇదిసత్యంఆమెన్
భూమి మారినా జలములు పొంగినా కొండలుకదిలినా భయములేదుగా
మారని దేవుడు విడువని నాధుడు యేసు ప్రభువె మాకు తోడుగుండగా
ఇశ్రాయేలును కాపాడు దేవుడు కునుకడు నిద్రపోడెన్నడు -2
జలములలో బడి మేము దాటిన - అగ్నిలో బడి మేం నడచినా
ఏ అపాయము మా దరి చేరదు - యేసు రక్తపు కవచముండగా -2
ఎడారి నేలను సెలయేళ్ళుగా - అరణ్య భూమిని నీటి మడుగుగా -2
చేయును ప్రభువు కుమ్మరించి - కడవరి వర్షము ఇది సత్యం ఆమెన్“భూమి మారినా జలములు”
పగలు ఎండైనా రాత్రి వెన్నెలైన - ఏ దెబ్బైన తగులనియ్యడు
చీకటి బాణమైనా ఏ తెగులైనా - మా గు-డారమును చేరనీయడు -2
మా పాదములకు రాయి తగులకుండగా - మా మార్గములలో మాకు తోడుండగా
మా పాదములకు రాయి తగులకుండగా - మా మార్గమంతటిలో తోడుండగా
తన దూతలకు ఆజ్ఞాపించును - మాకై ప్రభువు ఇది సత్యం ఆమెన్
“భూమి మారినా జలములు”
మాకు విరోధముగా రూపింపబడిన - ఏ ఆయుధము వర్ధిల్లదు
మా మార్గము అంతకంతకు - దైవ మహిమతో వర్ధిల్లును -2
మా తలలపై నిత్యానందము - మా నోటిలోను తన గీతము -2
ఉంచెను ప్రభువు అభిషేకించి - తన మహిమార్ధం ఇది సత్యం ఆమెన్
“భూమి మారినా జలములు”
సడలిన చేతులను తొట్రిల్లు మోకాళ్ళను-యేసుని పేరిట బలపరచెదం
తత్తరిల్లు హృదయాలను మీ ప్రభు వచ్చెనని-ధైర్యముగుండమని దృడపరిచెదం -2
సాతాను కాడిని విరగగొట్టెదం - దుర్మార్గ కట్లను మేం విప్పేదం -2
అగ్ని నుండి జనముల లాగి - ప్రభువును చూపెదం ఇది సత్యం ఆమెన్ “భూమి మారినా జలములు”
Song no:
జయ పతాకం ఎగరాలి - ఈ దేశం సొంతం కావాలి
ప్రతి మోకాలు వంగాలి - క్రీస్తు రాజ్యం కావాలి
హల్లెలూయ ఓ హల్లెలూయ - 4
జయ పతాకం ఎగరాలి - ఈ దేశం సొంతం కావాలి
ప్రతి మోకాలు వంగాలి - క్రీస్తు రాజ్యం కావాలి
- ప్రతి జాతీయు ప్రతి జనమును - క్రీస్తు ప్రభువని ఒప్పుకోవాలి
ప్రతి గోత్రము ప్రతి వంశము - క్రీస్తు ప్రభువు ఎదుట మోకరించాలి
ఈ కనులతో నేను చూడాలి - క్రీస్తు రాజ్యాన్ని ......
జయ పతాకం ఎగరాలి - ఈ దేశం సొంతం కావాలి
ప్రతి మోకాలు వంగాలి - క్రీస్తు రాజ్యం కావాలి
హల్లెలూయ ఓ హల్లెలూయ - 4
- జీసస్ లవ్స్ ఇండియా - జీసస్ సేవ్స్ ఇండియా
జీసస్ హీల్స్ ఇండియా - జీసస్ బ్లెస్స్ ఇండియా -2
ఈ దేశంలో ప్రభుని పాలన - ఈ జీవితంలోనే చూడాలి
యేసు నామమే జయజయమని - ప్రతి స్వరము ప్రభుని స్తుతియించాలి -2
ఈ దేశాన్ని ప్రభుకు బహుమతిగా నేను ఇవ్వాలి .....
జయ పతాకం ఎగరాలి - ఈ దేశం సొంతం కావాలి
ప్రతి మోకాలు వంగాలి - క్రీస్తు రాజ్యం కావాలి
హల్లెలూయ ఓ హల్లెలూయ - 4
Song no:
జయహే.....
జయహే జయహే - క్రీస్తేసు ప్రభువుకే జయహే
జయహే జయహే - రారాజు ప్రభువుకే జయహే } 2
నరులను చేసిన దేవునికి - జయహే జయహే
మరణము గెలిచిన వీరునికి - జయహే జయహే
త్రిత్వ దేవునికి జయహే - తండ్రి దేవునికి - జయహే
ఆత్మనాదునికి - జయహే - మన అన్న యేసునకు -జయహే - జయహే
జయహే జయహే - క్రీస్తేసు ప్రభువుకే జయహే
జయహే జయహే - రారాజు ప్రభువుకే జయహే
- తన మాటతో ఈ సృష్టిని - చేసిన దేవునికి జయహే
తన రూపుతో మానవులను - సృజించిన ప్రభువునకు జయహే } 2
ఆది అంతముకు - జయహే - అద్వితీయునకు - జయహే
అత్యున్నతునకు - జయహే - అనాది దేవునికి -జయహే - జయహే
జయహే జయహే - క్రీస్తేసు ప్రభువుకే జయహే
జయహే జయహే - రారాజు ప్రభువుకే జయహే
- దహించేడి మహిమన్వితో వసించేడి రాజునకు - జయహే
పరిశుద్దుడు పరిశుద్దుడని దూతలు పొగడే ప్రభువుకు జయహే } 2
అగ్ని నేత్రునకు -జయహే - ఆత్మ రూపునకు - జయహే
అమరత్వునకు - జయహే అనంతదేవునకు -జయహే - జయహే
జయహే జయహే - క్రీస్తేసు ప్రభువుకే జయహే
జయహే జయహే - రారాజు ప్రభువుకే జయహే
- తన రక్తమున్ మానవులకై కార్చిన యేసునకు -జయహే
తన బలముతో మరణంబును జయించిన వీరునకు - జయహే } 2
సిల్వదారునకు -జయహే - త్యాగసీలునకు -జయహే
మరణ విజయునకు -జయహే - జీవించు దేవునకు -జయహే - జయహే
జయహే జయహే - క్రీస్తేసు ప్రభువుకే జయహే
జయహే జయహే - రారాజు ప్రభువుకే జయహే
- తన మహిమతో మేఘాలపై వచ్చెడి యేసునకు - జయహే
తనుండేడి స్థలమందున మనలను ఉంచెడిప్రభువుకు - జయహే
న్యాయ తీర్పరికి - జయహే - సర్వశక్తునకు - జయహే
సర్వోన్నతునకు – జయహే - సైన్యముల అధిపతికి -జయహే - జయహే {జయహే}
Song no: 43
ప్రభువా - నీ సముఖము నందు
సంతోషము - కలదు
హల్లెలూయా సదా - పాడెదన్
హల్లెలూయా సదా - పాడెదన్
ప్రభువా - నీ సముఖము నందు
- పాపపు ఊబిలో - నేనుండగా
ప్రేమతో - నన్నాకర్షించితిరే -2
కల్వారి రక్తంతో - శుద్ధి చేసి -2
రక్షించి పరిశుద్ధులతో - నిల్పి ॥ ప్రభువా ॥
- సముద్ర - తరంగముల వలె
శోధనలెన్నో- ఎదురైనను -2
ఆదరణ కర్తచే - ఆదరించి -2
నీ నిత్య కృపలో - భద్రపరచి ॥ ప్రభువా ॥
3. సౌందర్య సీయోన్ని - తలంచగా
ఉప్పొంగుచున్న - హృదయముతో -2
ఆనందమానంద - మానందమాని -2
ప్రియునితో నేను పాడెదను ॥ ప్రభువా ॥
Song no:
యేసుని రాకడలో ఆయన ముఖం చూడగా
హా! ఎంతో ఆనందమే (2)
- అవనిలో జరుగు క్రియలన్ని - హా ఎంతో సత్యమేగా (2)
వేదవాక్యం నేరవేరు చుండ - యిక మీకు చింతయే లేదా (2)
2. లోకజ్ఞానం పెరుగుచుండె - అనుదినం జనములలో (2)
అది ప్రేమ చల్లారేనుగా - యివే రాకడ సూచనల్గా (2)
3. విన్నవాక్యం నీలో ఫలింపచేసి–సిద్దపడుము(2)
ప్రాణాత్మ దేహం సమర్పించుము - ప్రార్ధనలో మేల్కొనుము (2)
4. త్వరపడుము రాకడకై - అలస్యము చేయక (2)
దేవుని బూరధ్వనించు వేళ - ఎంతో ఆసన్న మాయెనుగా (2)