Song no: 119
ఎంత సుందరమో అ పరలోకము అంతా సువర్ణమే } 2
ఏమి చిత్రముచేరాలనుకుంటే ఆ పట్టణము } 2
యేసయ్యకివ్వాలి నీ హృదయము } 2 {ఎంత సుందరమో}
- కాంతినిచ్చుటకు సూర్యుడు అవసరమేలేదు
వెన్నలిచ్చుటకు చంద్రుడు అవసరమే లేదు } 2
దేవుని మహిమయె అచట ప్రకాశించుచుండెను } 2
జనములుఆ వెలుగునందు సంచరించుచుందురు } 2 {ఎంత సుందరమో}
- ఆకలి దాహము ఉండనే ఉండవు చీకటి రోగము ఉండనే ఉండవు } 2
ప్రభువైన దేవుడే వారితో నివసించును } 2
కన్నీటి బిందువులను తానే తుడిచివేయును } 2 {ఎంత సుందరమో}
- శాపగ్రస్తమైనడదేది అందులో ఉండదు
అసహ్యమైనది ఏది అందులో ఉండదు } 2
జీవగ్రంధమందు రాయబడినవారే ఉందురు } 2
ఆయననుసేవించుచు రాజ్యమే చేతురు } 2 {ఎంత సుందరమో}
Song no: 122
ఎక్కరా ఓరన్నారక్షణ పడవ - చక్కగా మోక్షానికి చేర్చేటి నావ } 2
- తండ్రియైున దేవుడు నిర్మించినాడురా
యేసుక్రీస్తు దేహాన్ని మలిచి కట్టినాడురా } 2
పరిశుద్ద రక్తంతో సిద్దామైన పడవరా } 2
దరిచేర్చగలిగిన ఏకైక నావరా } 2 {ఎక్కరా}
- ఎందరెక్కినా దానిలో చోటుంటుందిరా
అందారిని ప్రేమతో రమ్మంటుందిరా } 2
నిత్యజీవాన్నిచ్చే నిజమైన పడవరా } 2
సత్యమైన మార్గాన సాగేటి నావరా } 2 {ఎక్కరా}
- శాపాలు పాపాలు దానిలోకి చేరవురా
చావు భయమే అందు మరి ఉండబోదురా } 2
శిక్ష నుండి తప్పించే మహిమగల పడవరా } 2
అక్షయ భాగ్యమిచ్చే అనురాగ నావరా } 2 {ఎక్కరా}
Song no:
యేసులా జీవిస్తే యేసులా ప్రార్ధిస్తే
యేసులా ప్రేమిస్తే యేసులా ప్రకటిస్తే
లోకమే మారిపోదా పాపమే పారిపోదా ॥2॥ ॥యేసులా॥
- క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించినా॥2॥
సౌలును మార్చలేదా పౌలుగా తీర్చలేదా ॥2॥ ॥యేసులా॥
- పాపికై పాపముకై ఆ శాప భారముకై ॥2॥
యేసు మరణించలేదా పాపిని రక్షించలేదా ॥2॥ ॥యేసులా॥
- తనువును తన పరువును అమ్మిన సమరయ స్త్రీనీ }॥2॥
యేసయ్య మార్చలేదా సాక్షిగా తీర్చలేదా ॥2॥ ॥యేసులా॥
Song no: 26
నిరాశపడకుమా నేస్తమా - నిరీక్షణెన్నడు విడువకుమా
అ.ప. : లోకమువైపు చూడకుమా
యేసే నీ గురి మరువకుమా
- నీటిపై నడచిన నిజమైన దేవుడు
నరునికి తనవలె అధికారమీయ
అటు ఇటు చూసి - అలలకు జడిసి
మునిగిన పేతురును మరువకుమా
- సృష్టినిజేసిన సత్యస్వరూపి
అపవాదిసేనపై అధికారమీయ
ప్రార్థన కరువై - విశ్వాసమల్పమై
ఓడిన శిష్యులను మరువకుమా
Song no: 25
కీర్తించెదను కీర్తనీయుడా
నా ప్రాణప్రియుడా నాస్నేహితుడా
ఆశ్చర్యకార్యములు చేసినవాడా
అద్భుత మేళ్ళతో నింపిన నావిభుడా
సా ; ; నిదా | పా ; ; గమ | పా ; ; గరి | సాగామాపని | స
- నీ ప్రియ పిల్లలు నిద్రించుచుండగ
నీవే వారికి కృప చూపుచుంటివి
అడగకముందే అక్కరనెరిగి
అత్యధికముగా దయచేయుచుంటివి
సనిదప నిదపమ | దపమగ పమగరి|సా, గా, మా|పా, నీ, గరి |స
- నీ అరచేతిలోమముచెక్కుకుంటివి
తొట్రిల్లనీయకనడిపించుచుంటివి
పగలు వేడిమి రాతిరి వెన్నెల
మమునంటకుండా కాపాడుచుంటివి
ససస గాగగా | రిరిరి నీనినీ | ససస నీని దద |ద పాప గమపని | స
- రాకపోకలలో తోడనగనుంటివి
రాతిరిజామైనా కునుకకయుంటింవి
శోధనసమయమున వేదన చెందినా
కన్నిటిబిందువులన్నీ తుడుచుచుంటివి
సాస నీనిదా | పాప మామగరి |సగా గమా మప| , పనీ గరిసని | స
Song no: 24
వచ్చె వచ్చె తమ్ముడో - యేసు సామి వచ్చే వేళాయె సూడరో "2"
మేఘాల పీఠమెక్కి - మెరుపోలె నింగికి "2" {వచ్చె వచ్చె}
- ఆళ్ళీళ్ళని లేకుండ ఆయనొంక చూస్తరు "2"
భూజనులేసుని చూసి రొమ్ము కొట్టుకుంటరు "2" {వచ్చె వచ్చె}
- రెక్కల దూతలతో సక్కగ దిగివస్తడు "2"
టక్కరోడు సాతాను కొమ్ములిరగదీస్తడు "2" {వచ్చె వచ్చె}
- భూతాలే కరిగిపోయి భూమి కాలిపోవును "2"
ఆకాశం అంతలోనే ఆవిరిగా మారును "2" {వచ్చె వచ్చె}
- నమ్మి బతికున్నోళ్ళు నింగికెగిరిపోతరు "2"
నమ్మి చనిపోయినోళ్ళు లేచి బయటికొస్తరు "2" {వచ్చె వచ్చె}
Song no: 23
జీవముగల దేవా జీవించుచున్నవాడా "2"
జీవనరాగం జీవితగమ్యం "2"
జీవనజ్యోతివయా
యేసయ్యా - పావనమూర్తివయా "2"
- నను రక్షించిన నిన్ను మరువను
నా శిక్షబాపిన నిన్ను విడువను "2"
నిన్న నేడు మారనిదేవా - కన్నుల నిన్నే నిలుపు కొంటిని "2" {జీవనరాగం}
- నను మార్చిన నిను ఘనపరచెదను
ప్రాణమిచ్చిన నిను కొనియాడెదను
సత్యము నీవే శాంతి ప్రదాతా - నిత్యము నా హృది నీదు నివాసం "2" {జీవనరాగం}