- ఎక్కరా ఓరన్నారక్షణ పడవ - చక్కగా మోక్షానికి చేర్చేటి నావ } 2
- తండ్రియైున దేవుడు నిర్మించినాడురా
యేసుక్రీస్తు దేహాన్ని మలిచి కట్టినాడురా } 2
పరిశుద్ద రక్తంతో సిద్దామైన పడవరా } 2
దరిచేర్చగలిగిన ఏకైక నావరా } 2 {ఎక్కరా}
- ఎందరెక్కినా దానిలో చోటుంటుందిరా
అందారిని ప్రేమతో రమ్మంటుందిరా } 2
నిత్యజీవాన్నిచ్చే నిజమైన పడవరా } 2
సత్యమైన మార్గాన సాగేటి నావరా } 2 {ఎక్కరా}
- శాపాలు పాపాలు దానిలోకి చేరవురా
చావు భయమే అందు మరి ఉండబోదురా } 2
శిక్ష నుండి తప్పించే మహిమగల పడవరా } 2
అక్షయ భాగ్యమిచ్చే అనురాగ నావరా } 2 {ఎక్కరా}
Yekkara oranna rakshana padava chakkaga mokshaniki cherccheti nava ఎక్కరా ఓరన్నారక్షణ పడవ చక్కగా మోక్షానికి చేర్చేటి నావ
Song no: 122
Yesula jeevisthey yesula prarthisthey yesula premisthey యేసులా జీవిస్తే యేసులా ప్రార్ధిస్తే యేసులా ప్రేమిస్తే యేసులా ప్రకటిస్తే
Song no:
- యేసులా జీవిస్తే యేసులా ప్రార్ధిస్తే
- క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించినా॥2॥
సౌలును మార్చలేదా పౌలుగా తీర్చలేదా ॥2॥ ॥యేసులా॥
- పాపికై పాపముకై ఆ శాప భారముకై ॥2॥
యేసు మరణించలేదా పాపిని రక్షించలేదా ॥2॥ ॥యేసులా॥
- తనువును తన పరువును అమ్మిన సమరయ స్త్రీనీ }॥2॥
యేసయ్య మార్చలేదా సాక్షిగా తీర్చలేదా ॥2॥ ॥యేసులా॥
యేసులా ప్రేమిస్తే యేసులా ప్రకటిస్తే
లోకమే మారిపోదా పాపమే పారిపోదా ॥2॥ ॥యేసులా॥
Nirasapadakuma nesthama nirikshanennedu viduvakuma నిరాశపడకుమా నేస్తమా నిరీక్షణెన్నడు విడువకుమా
lyMay 01, 2019A.R Stevenson, Jeeva swaralu, Keerthinchedhanu-Poojinchedhanu, Surekha Murthy
No comments
Song no: 26
- నిరాశపడకుమా నేస్తమా - నిరీక్షణెన్నడు విడువకుమా
- నీటిపై నడచిన నిజమైన దేవుడు
నరునికి తనవలె అధికారమీయ
అటు ఇటు చూసి - అలలకు జడిసి
మునిగిన పేతురును మరువకుమా
- సృష్టినిజేసిన సత్యస్వరూపి
అపవాదిసేనపై అధికారమీయ
ప్రార్థన కరువై - విశ్వాసమల్పమై
ఓడిన శిష్యులను మరువకుమా
అ.ప. : లోకమువైపు చూడకుమా
యేసే నీ గురి మరువకుమా
Keerthinchedhanu keerthaneeyuda na prana priyuda కీర్తించెదను కీర్తనీయుడా నా ప్రాణప్రియుడా నాస్నేహితుడా
Song no: 25
- కీర్తించెదను కీర్తనీయుడా
- నీ ప్రియ పిల్లలు నిద్రించుచుండగ
నీవే వారికి కృప చూపుచుంటివి
అడగకముందే అక్కరనెరిగి
అత్యధికముగా దయచేయుచుంటివి
సనిదప నిదపమ | దపమగ పమగరి|సా, గా, మా|పా, నీ, గరి |స
- నీ అరచేతిలోమముచెక్కుకుంటివి
తొట్రిల్లనీయకనడిపించుచుంటివి
పగలు వేడిమి రాతిరి వెన్నెల
మమునంటకుండా కాపాడుచుంటివి
ససస గాగగా | రిరిరి నీనినీ | ససస నీని దద |ద పాప గమపని | స
- రాకపోకలలో తోడనగనుంటివి
రాతిరిజామైనా కునుకకయుంటింవి
శోధనసమయమున వేదన చెందినా
కన్నిటిబిందువులన్నీ తుడుచుచుంటివి
సాస నీనిదా | పాప మామగరి |సగా గమా మప| , పనీ గరిసని | స
నా ప్రాణప్రియుడా నాస్నేహితుడా
ఆశ్చర్యకార్యములు చేసినవాడా
అద్భుత మేళ్ళతో నింపిన నావిభుడా
సా ; ; నిదా | పా ; ; గమ | పా ; ; గరి | సాగామాపని | స
Vacche vacche thammudo yesu samy వచ్చె వచ్చె తమ్ముడో యేసు సామి
Song no: 24
- వచ్చె వచ్చె తమ్ముడో - యేసు సామి వచ్చే వేళాయె సూడరో "2"
- ఆళ్ళీళ్ళని లేకుండ ఆయనొంక చూస్తరు "2"
భూజనులేసుని చూసి రొమ్ము కొట్టుకుంటరు "2" {వచ్చె వచ్చె}
- రెక్కల దూతలతో సక్కగ దిగివస్తడు "2"
టక్కరోడు సాతాను కొమ్ములిరగదీస్తడు "2" {వచ్చె వచ్చె}
- భూతాలే కరిగిపోయి భూమి కాలిపోవును "2"
ఆకాశం అంతలోనే ఆవిరిగా మారును "2" {వచ్చె వచ్చె}
- నమ్మి బతికున్నోళ్ళు నింగికెగిరిపోతరు "2"
నమ్మి చనిపోయినోళ్ళు లేచి బయటికొస్తరు "2" {వచ్చె వచ్చె}
మేఘాల పీఠమెక్కి - మెరుపోలె నింగికి "2" {వచ్చె వచ్చె}
Jeevamugala deva jeevinchuchunnavada జీవముగల దేవా జీవించుచున్నవాడా
Song no: 23
- జీవముగల దేవా జీవించుచున్నవాడా "2"
- నను రక్షించిన నిన్ను మరువను
నా శిక్షబాపిన నిన్ను విడువను "2"
నిన్న నేడు మారనిదేవా - కన్నుల నిన్నే నిలుపు కొంటిని "2" {జీవనరాగం}
- నను మార్చిన నిను ఘనపరచెదను
ప్రాణమిచ్చిన నిను కొనియాడెదను
సత్యము నీవే శాంతి ప్రదాతా - నిత్యము నా హృది నీదు నివాసం "2" {జీవనరాగం}
జీవనరాగం జీవితగమ్యం "2"
జీవనజ్యోతివయా యేసయ్యా - పావనమూర్తివయా "2"
Throvalo neevuntivo throvapakka padiyuntivo త్రోవలో నీవుంటివో త్రోవప్రక్క పడియుటింవో
Song no: 22
- త్రోవలో నీవుంటివో - త్రోవప్రక్క పడియుటింవో "2"
- చెరిపివేసుకున్నావు నీదు మార్గమును
చెదిరి ఎన్నుకున్నావు స్వంత మార్గమును "2"
పాపపు అంధకారంతో మార్గం కనరాకయుంటివే
చీటికి దారిన పయనంతో మరణం కొనితెచ్చుకుటింవే {జీవితపు}
- సిద్ధపరచెను యేసు నూతన మార్గమును
బలిగ అర్పణగ చేసి శరీరరక్తమును "2"
సత్యమైన ఆమార్గంలో జీవం క్షేమం ఉందిలే
నిత్యుడు ఆ దేవునిచేరే ధైర్యం కలిగించిందిలే {జీవితపు}
- నడచి వెళ్ళుచున్నావా అరణ్యమార్గమున
గమ్యమెరుగకున్నావా జీవనగమనమున "2"
పర్వతములు త్రోవగ చేసి నీటియొద్దకు చేర్చులే
త్రోవలను తిన్నగ చేసి ఆత్మదాహమును తీర్చులే {జీవితపు}
త్రోవ చూపిన నజరేయుని కనలేని అంధుడవైయుంటింవో "2"
అ.ప. : జీవితపు ఈ యాత్రలో నీ పరిస్థితి తెలుసుకో
జీవమార్గం క్రీస్తులో నిన్ను నీవు నిలుపుకో {త్రోవలో}











